కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను అందరి ఉపయోగానికి అనువుగా తీర్చిదిద్దడం జరుగుతోంది; ఇది ఏ దేశాల‌కైనా అందుబాటు లోకి వస్తుంది, దీనిని అన్ని దేశాల‌కు అందుబాటు లోకి తీసుకు రావ‌డం జ‌రుగుతుంది: ప్ర‌ధాన మంత్రి
దాదాపుగా 200 మిలియ‌న్ వినియోగ‌దారులు ఉన్న ‘ఆరోగ్య సేతు’ యాప్ డెవ‌ల‌ప‌ర్ల కు ఉపయోగించుకొనేందుకు సిద్ధం గా ఉన్న ఒక ప్యాకేజీ అని చెప్పాలి: ప్ర‌ధాన మంత్రి
అటువంటి మ‌హ‌మ్మారి కి సాటి రాగ‌లిగింది వంద సంవ‌త్స‌రాల కాలం లో లేనే లేదు; ఏ దేశం అయినా, ఎంత శ‌క్తివంత‌మైన‌ దేశం అయినా స‌రే, ఈ త‌ర‌హా స‌వాలు ను ఒంట‌రిగా ప‌రిష్క‌రించ జాల‌దు: ప్ర‌ధాన మంత్రి
మ‌నమంతా క‌ల‌సిక‌ట్టుగా కృషి చేయాలి, మనమందరం ఒక్క‌టై ముందుకు సాగాలి : ప్ర‌ధాన మంత్రి
భార‌త‌దేశం త‌న టీకాక‌ర‌ణ వ్యూహాన్ని సిద్ధం చేసుకొంటూనే, పూర్తి స్థాయి డిజ‌ిట‌ల్ విధానాన్ని అవలంబించింది: ప్ర‌ధాన మంత్రి
ఒక భ‌ద్ర‌మైన‌టువంటి, విశ్వాసనీయమైనటువంటి రుజువు అనేది ప్ర‌జ‌ల కు వారు ఎప్పుడు, ఎక్క‌డ, ఎవ‌రి ద్వారా టీకామందు ను తీసుకొన్నదీ చాటిచెప్పుకోవడం లో సాయ‌ప‌డుతుంది: ప్ర‌ధాన మంత్రి
టీకాకర‌ణ తాలూకు వినియోగాన్ని గురించి పసిగట్టడం లో
కోవిడ్-19 తో పోరాడ‌టం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ఒక డిజిట‌ల్ మాధ్యమ సార్వజనిక హితకారి రూపం లో ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న తరుణంలో, కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

కోవిడ్‌-19 తో పోరాడ‌టానికి ఒక డిజిట‌ల్ సార్వ‌జ‌నిక హిత‌కారి రూపం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న పూర్వరంగం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జ‌రిగిన కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి   ప్ర‌సంగించారు.

 మ‌హ‌మ్మారి కార‌ణం గా అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వారు అంద‌రికీ ప్ర‌ధాన మంత్రి సంతాపాన్ని వ్య‌క్తం చేస్తూ త‌న ప్ర‌సంగాన్ని మొదలుపెట్టారు.  వందేళ్ళ లో ఆ త‌ర‌హా మ‌హ‌మ్మారి కి సాటి రాగ‌లిగిన వ్యాధి అంటూ ఏదీ లేద‌ని, మ‌రి అలాగే ఏ దేశ‌ం అయినా గాని, ఎంత శ‌క్తివంత‌మైన‌ దేశ‌ం అయినా గాని, ఇటువంటి స‌వాలు ను ఒంట‌రిగా ఉంటూ ప‌రిష్క‌రించ‌ జాలదు అని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు.  ‘‘ కోవిడ్-19 మ‌హ‌మ్మారి నుంచి నేర్చుకోవ‌ల‌సిన అతి ప్ర‌ముఖ పాఠం ఏమిటి అంటే మ‌నం మాన‌వాళి శ్రేయం కోసం క‌ల‌సిక‌ట్టు గా, ఒక్కటై ముందుకు సాగాలి అనేదే.  ఒక దేశం నుంచి మ‌రొక దేశం నేర్చుకొంటూ,  అత్యుత్త‌మ అభ్యాసాల ను గురించి ఒక దేశాని కి మ‌రొక దేశం దారిని చూపుకొంటూ మ‌నం ముందుకు పోవ‌ల‌సి ఉంది’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

I convey my sincere condolences for all the lives lost to the pandemic, in all the countries.

There is no parallel to such a pandemic in a hundred years.

Experience shows that no nation, however powerful that nation is, can solve a challenge like this in isolation: PM

— PMO India (@PMOIndia) July 5, 2021


 
అనుభ‌వాల‌ ను, ప్రావీణ్యాన్ని, వ‌న‌రుల ను ప్ర‌పంచ స‌ముదాయం తో పంచుకొనే విష‌యం లో భార‌త‌దేశం తాలూకు వ‌చ‌న బ‌ద్ధ‌త ను గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్తూ, ప్ర‌పంచ అభ్యాసాల నుంచి నేర్చుకోవాల‌ని భార‌త‌దేశం త‌హతహలాడుతోంది అని పేర్కొన్నారు.  మ‌హ‌మ్మారి కి వ్య‌తిరేకం గా పోరాడ‌టం లో సాంకేతిక విజ్ఞానాని కి ఎంత‌యినా ప్రాముఖ్యం ఉంది అని శ్రీ న‌రేంద్ర‌ మోదీ స్ప‌ష్టం చేశారు.  వ‌న‌రుల కు లోటు అంటూ ఉండ‌ని ఒక రంగం ఏదైనా ఉంది అంటే అది సాఫ్ట్‌ వేర్‌ రంగం అని ఆయ‌న అన్నారు.  ఈ కార‌ణం గానే భార‌త‌దేశం కోవిడ్ ను ఆన‌వాలు ప‌ట్టి, ఆరా తీసేందుకు ఉద్దేశించిన ఒక అప్లికేష‌న్ (యాప్‌) ను అది సాంకేతిక ప‌రం గా ఉనికి లోకి వ‌చ్చిన వెనువెంట‌నే లోకాని కి వెల్ల‌డి చేసింది అని ఆయ‌న చెప్పారు.  సుమారు గా 200 మిలియ‌న్ మంది వినియోగదారుల తో ఈ ‘ఆరోగ్య సేతు’ యాప్ అనేది డెవ‌ల‌ప‌ర్ ల‌కు ఇట్టే అందుబాటు లోకి వ‌చ్చిన ప్యాకేజీ గా మారింది అని ఆయ‌న తెలిపారు.  భార‌త‌దేశం లో ఇప్ప‌టికే ఉప‌యోగించిన ఈ యాప్ ను వేగ‌వంత‌మైన ప‌ద్ధ‌తి లో, విస్తారం గా వాస్త‌వ ప్ర‌పంచం లో ప‌రీక్షించ‌డం జ‌రిగింద‌నే విష‌యం లో మీరు నిశ్చింత గా ఉండ‌వ‌చ్చు అని అన్ని దేశాల శ్రోత‌ల కు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

అనుభ‌వాల‌ ను, ప్రావీణ్యాన్ని, వ‌న‌రుల ను ప్ర‌పంచ స‌ముదాయం తో పంచుకొనే విష‌యం లో భార‌త‌దేశం తాలూకు వ‌చ‌న బ‌ద్ధ‌త ను గురించి ప్ర‌ధాన మంత్రి నొక్కి చెప్తూ, ప్ర‌పంచ అభ్యాసాల నుంచి నేర్చుకోవాల‌ని భార‌త‌దేశం త‌హతహలాడుతోంది అని పేర్కొన్నారు.  మ‌హ‌మ్మారి కి వ్య‌తిరేకం గా పోరాడ‌టం లో సాంకేతిక విజ్ఞానాని కి ఎంత‌యినా ప్రాముఖ్యం ఉంది అని శ్రీ న‌రేంద్ర‌ మోదీ స్ప‌ష్టం చేశారు.  వ‌న‌రుల కు లోటు అంటూ ఉండ‌ని ఒక రంగం ఏదైనా ఉంది అంటే అది సాఫ్ట్‌ వేర్‌ రంగం అని ఆయ‌న అన్నారు.  ఈ కార‌ణం గానే భార‌త‌దేశం కోవిడ్ ను ఆన‌వాలు ప‌ట్టి, ఆరా తీసేందుకు ఉద్దేశించిన ఒక అప్లికేష‌న్ (యాప్‌) ను అది సాంకేతిక ప‌రం గా ఉనికి లోకి వ‌చ్చిన వెనువెంట‌నే లోకాని కి వెల్ల‌డి చేసింది అని ఆయ‌న చెప్పారు.  సుమారు గా 200 మిలియ‌న్ మంది వినియోగదారుల తో ఈ ‘ఆరోగ్య సేతు’ యాప్ అనేది డెవ‌ల‌ప‌ర్ ల‌కు ఇట్టే అందుబాటు లోకి వ‌చ్చిన ప్యాకేజీ గా మారింది అని ఆయ‌న తెలిపారు.  భార‌త‌దేశం లో ఇప్ప‌టికే ఉప‌యోగించిన ఈ యాప్ ను వేగ‌వంత‌మైన ప‌ద్ధ‌తి లో, విస్తారం గా వాస్త‌వ ప్ర‌పంచం లో ప‌రీక్షించ‌డం జ‌రిగింద‌నే విష‌యం లో మీరు నిశ్చింత గా ఉండ‌వ‌చ్చు అని అన్ని దేశాల శ్రోత‌ల కు ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

 

Right from the beginning of the pandemic, India has been committed to sharing all our experiences, expertise and resources with the global community in this battle.

Despite all our constraints, we have tried to share as much as possible with the world: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 5, 2021

 

Technology is integral to our fight against COVID-19.

Luckily, software is one area in which there are no resource constraints.

That's why we made our Covid tracing and tracking App open source as soon as it was technically feasible: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 5, 2021


టీకామందు ను ప్రజల కు ఇప్పించే కార్య‌క్ర‌మానికి ఉన్న ప్రాముఖ్య‌ాన్ని దృష్టి లో పెట్టుకొని భార‌త‌దేశం ఈ టీకాక‌ర‌ణ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న ద‌శ లోనే దీని కోసం ఒక పూర్తి స్థాయి డిజిట‌ల్ విధానాన్ని అనుస‌రించాలి అని నిర్ణయం తీసుకొంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఇది ప్ర‌జ‌ల కు వారు టీకా ను తీసుకోవ‌డం జ‌రిగింద‌ని, మ‌హ‌మ్మారి ప్రాబ‌ల్యం క్ర‌మం గా త‌గ్గి ప్ర‌పంచం లో సాధార‌ణ స్థితి వేగం గా ఏర్ప‌డుతుంద‌ని నిరూపించ‌డం లో స‌హాయ‌కారి అవుతుంది అని ఆయన చెప్పారు.   ప్ర‌జల‌ కు వారు ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎవ‌రి ద్వారా టీకా వేయ‌డమైందో నిర్ధారణ చేసేందుకు సుర‌క్షిత‌ం, ప‌దిల‌ం, విశ్వ‌స‌నీయ‌ం అయిన‌టువంటి ఒక నిద‌ర్శ‌నం తోడ్పడుతుందని ఆయ‌న అన్నారు.   టీకామందు వినియోగాన్ని ప‌ర్య‌వేక్షించ‌డానికి, టీకా మందు వృథా ను వీలైనంత త‌గ్గించ‌డానికి కూడా డిజిట‌ల్ విధానం సహాయకారి కాగలుగుతుంది అని ఆయ‌న అన్నారు.

 

Vaccination is the best hope for humanity to emerge successfully from the pandemic.

And right from the beginning, we in India decided to adopt a completely digital approach while planning our vaccination strategy: PM @narendramodi

— PMO India (@PMOIndia) July 5, 2021


యావ‌త్తు ప్ర‌పంచాన్ని ఒక కుటుంబం అని భావన చేసే భార‌త‌దేశం త‌త్వాని కి త‌గిన‌ట్లుగానే కోవిడ్ టీకాక‌ర‌ణ సంబంధి ప్లాట్ ఫార్మ్ కోవిన్ ను ఎవ‌రైనా అందులోకి ప్ర‌వేశించేందుకు వీలు గా తీర్చిదిద్ద‌డం జ‌రుగుతోంది అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  త్వ‌ర‌లోనే, అది ప్ర‌పంచం లోని ఏ దేశాని కి అయినా గాని, అదే విధంగా అన్ని దేశాల‌ కు కూడాను అందుబాటు లోకి వ‌స్తుంది అని ఆయ‌న వెల్లడించారు.

 

 

Indian civilization considers the whole world as one family.

This pandemic has made many people realize the fundamental truth of this philosophy.

That's why, our technology platform for Covid vaccination - the platform we call CoWin- is being prepared to be made open source: PM

— PMO India (@PMOIndia) July 5, 2021


ఈ ప్లాట్ ఫార్మ్ ను ప్ర‌పంచ వ్యాప్తం గా ప‌రిచ‌యం చేయ‌డానికి నేటి కాన్‌క్లేవ్ ఒక ప్ర‌థ‌మ ప్ర‌య‌త్న‌ం అని శ్రీ న‌రేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు.  కోవిన్ ద్వారా భార‌త‌దేశం 350 మిలియ‌న్ డోసు ల కోవిడ్ టీకాల ను ఇప్పించింది అని ప్ర‌ధాన మంత్రి వెల్ల‌డించారు.  దీనిలో భాగం గా 9 మిలియ‌న్ మంది ప్ర‌జ‌ల‌ కు ఒకే రోజు లో టీకా మందును వేయ‌డ‌మైంద‌ని కూడా ఆయ‌న వివ‌రించారు.  పైపెచ్చు టీకా వేయించుకొన్న వ్య‌క్తులు ఏ స‌మాచారాన్ని అయినా రుజువు ప‌ర‌చ‌డం కోసం కాగితం ముక్క‌ల వంటి వాటిని వారి వెంట అట్టే పెట్టుకోవ‌ల‌సిన అవ‌స‌రం సైతం లేద‌ని ఆయ‌న అన్నారు.  త‌త్సంబంధి స‌మాచారం అంతా డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ల‌భ్యం అవుతుంది అని ఆయ‌న అన్నారు.  ఆస‌క్తి గ‌ల దేశాల స్థానిక అవ‌స‌రాల‌ కు త‌గ్గ‌ట్లుగా సాఫ్ట్ వేర్ లో మార్పు చేర్పుల ను చేసుకొనేందుకు వీలు ఉంది అని కూడా ప్ర‌ధాన మంత్రి ప్ర‌ముఖం గా ప్ర‌క‌టించారు.   ‘వ‌న్ అర్థ్, వ‌న్ హెల్థ్’ (‘ఒక‌ భూమి, ఒక ఆరోగ్యం’) విధానం తాలూకు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం లో మాన‌వ‌ జాతి ఈ విశ్వమారి పై పైచేయి ని సాధించ‌డం త‌థ్య‌ం అని ఆశాభావాన్ని వ్య‌క్తం చేస్తూ ప్ర‌ధాన మంత్రి త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.