కొచ్చి వాటర్ మెట్రో జాతికి అంకితం
తిరువనంతపురంలో వివిధ రైల్ ప్రాజెక్ట్ లకు, డిజిటల్ సైన్స్ పార్క్ కు శంకుస్థాపన
నేడు ప్రారంభించిన కేరళ తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్, కొచ్చి వాటర్ మెట్రో, ఇతర ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధి ప్రయాణానికి దారితీస్తాయి’
"కేరళ ప్రజల కఠోర శ్రమ, మర్యాద వారికి విలక్షణ గుర్తింపును ఇస్తాయి"
'ప్రపంచ పటంలో భారత్ ఒక ప్రకాశవంతమైన ప్రదేశం'
"ప్రభుత్వం సహకార సమాఖ్యవాదంపై దృష్టిపెడుతుంది; రాష్ట్రాల అభివృద్ధిని దేశ అభివృద్ధి వనరుగా పరిగణిస్తుంది’’
'భారత్ అసాధారణ వేగంతో, స్థాయిలో పురోగమిస్తోంది’
‘కనెక్టివిటీ కోసం పెట్టిన పెట్టుబడులు కేవలం సేవల పరిధిని విస్తరించడమే కాకుండాదూరాన్ని తగ్గిస్తాయి; కులం, మతం ,ధనిక - పేద తేడా లేకుండా విభిన్న సంస్కృతులను కలుపుతాయి’.
‘జీ-20 సమావేశాలు, ఈవెంట్లు కేరళకు మరింత అంతర్జాతీయగుర్తింపును ఇస్తున్నాయి’.
‘కేరళలో సంస్కృతి, వంటకాలు, మంచి వాతావరణం ఉన్నాయి; వాటిలో అంతర్లీనంగా సౌభాగ్యం ఉంది’
'మన్కీ బాత్ వందవ సంచిక జాతి నిర్మాణం కోసం, ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి కోసం దేశప్ర

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రూ.3200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

కొచ్చి వాటర్ మెట్రోను జాతికి అంకితం చేయడం, వివిధ రైల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, , తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్ కు శంకుస్థాపన ఈ ప్రాజెక్టులలో ఉన్నాయి. అంతకుముందు తిరువనంతపురం-కాసరగోడ్ మధ్య కేరళ తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి ప్రజలకు విషు శుభాకాంక్షలు తెలిపారు. నేటి ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, కేరళ అభివృద్ధి, కనెక్టివిటీకి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభించిన వాటిలో ఉన్నాయని, వీటిలో రాష్ట్ర తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ , కొచ్చి మొదటి వాటర్ మెట్రో , అనేక రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులు ఉన్నాయని ప్రధాని చెప్పారు. ఈ అభివృద్ధి పథకాలకు గానూ కేరళ

పౌరులను అభినందించారు.

 

కేరళ విద్య, అవగాహన స్థాయి గురించి ప్రస్తావిస్తూ, కేరళ ప్రజల కష్టపడి పని చేసే తత్వం , మర్యాద గుణం వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఇచ్చాయని ప్రధాన మంత్రి అన్నారు. కేరళ ప్రజలు ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోగల సమర్థులని, క్లిష్ట సమయాల్లో భారతదేశాన్ని అభివృద్ధి నిర్వహణకు శక్తివంతమైన ప్రదేశంగా ఎలా పరిగణిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోగలరని, భారతదేశ అభివృద్ధి వాగ్దానాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని ఆయన అన్నారు.

 

భారత్ పట్ల ప్రపంచం చూపిస్తున్న నమ్మకానికి కేంద్రం లో ఉన్న నిర్ణయాత్మక ప్రభుత్వానిదే ఘనత అని, దేశ సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం త్వరితగతిన, దృఢమైన నిర్ణయాలు తీసుకుంటోందని, భారతదేశ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ఆధునీకరించడానికి గతం లో ఎన్నడూ లేనంతగా. భారీ పెట్టుబడులు పెడుతోందని, యువత నైపుణ్యాలను పెంపొందించడానికి గణనీయంగా పెట్టుబడులు పెడుతోందని, సులభ జీవనం, సులభ వ్యాపారం

 

పట్ల నిబద్ధతతో ఉందని వివరించారు.

సహకార సమాఖ్య విధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, రాష్ట్రాల అభివృద్ధిని దేశాభివృద్ధిగా పరిగణిస్తుందని చెప్పారు. సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పారు. కేరళ పురోగమిస్తేనే దేశం వేగంగా పురోగమించగలదు. అని ప్రధాన మంత్రి అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న కేరళీయుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి వల్లనే దేశం అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. భారత్ ఎదుగుదల ప్రవాస భారతీయులకు ఎంతగానో ఉపయోగపడుతోంది అని ప్రధాని అన్నారు.

 

గత 9 సంవ త్సరాలుగా కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మునుపెన్నడూ లేని వేగం, స్థాయిలో జరిగాయని

ప్రధాన మంత్రి తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్ లో కూడా మౌలిక సదుపాయాల కోసం రూ.10 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. దేశంలో ప్రజారవాణా, లాజిస్టిక్స్ రంగం పూర్తిగా మారిపోతోందన్నారు. భారతీయ రైల్వేల స్వర్ణయుగం దిశగా మనం పయనిస్తున్నామని, 2014కు ముందు సగటు రైల్వే బడ్జెట్ ఇప్పుడు ఐదు రెట్లు పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

 

గత 9 సంవత్స రాలుగా కశ్మీర్ లో జరిగిన అభివృద్ధిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, గేజ్ మార్పిడి, డబ్లింగ్ , రైల్వే ట్రాక్ ల విద్యుదీకరణకు సంబంధించి చేసిన

పనులను వివరించారు. మల్టీమోడల్ ట్రాన్స్ పోర్ట్ హబ్ గా మార్చాలనే దార్శనికతతో కేరళలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణానికి ఈ రోజు పనులు ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆకాంక్షాత్మక భారతదేశ గుర్తింపు" అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశంలో మారుతున్న రైలు నెట్ వర్క్ ను గురించి వివరించారు, దీనితో సెమీ హైస్పీడ్ రైళ్లను నడపడంసాధ్యమవుతుందని చెప్పారు.

 

ఇప్పటి వరకు ప్రారంభించిన అన్ని వందే భారత్ రైళ్లు సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను అనుసంధానం చేశాయని ప్రధాని చెప్పారు. "కేరళ మొదటి వందే భారత్ రైలు ఉత్తర కేరళను దక్షిణ కేరళతో కలుపుతుంది" అన్నారు. కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూర్ వంటి పుణ్యక్షేత్రాలకు ఈ రైలు వెళ్తుందని తెలిపారు. ఆధునిక రైలు వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాల గురించి కూడా మాట్లాడారు. సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం తిరువనంతపురం-షోరనూర్ సెక్షన్ ను సిద్ధం చేసే పనులు ఈ రోజు ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి తెలియజేశారు. ఇది పూర్తయితే తిరువనంతపురం నుంచి మంగళూరు వరకు సెమీ హైస్పీడ్ రైళ్లను నడపడం సాధ్యమవుతుందన్నారు.

 

మౌలిక సదుపాయాలకు సంబంధించి మేడ్ ఇన్ ఇండియా సొల్యూషన్స్ తో పాటు స్థానిక అవసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నామని ప్రధాన మంత్రి తెలిపారు.సెమీ-హైబ్రిడ్ రైలు, ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ, రో-రో ఫెర్రీ , కనెక్టివిటీ కోసం పరిస్థితి-నిర్దిష్ట పరిష్కారాల కోసం రోప్ వే వంటి ప్రతిపాదనల గురించి తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా వందే భారత్, మెట్రో కోచ్ ల స్వదేశీ మూలాలను కూడా ఆయన వివరించారు. చిన్న నగరాల్లో మెట్రో-లైట్, అర్బన్ రోప్ వే ల వంటి ప్రాజెక్టలు గురించి కూడా ప్రస్తావించారు.

 

కొచ్చి వాటర్ మెట్రో మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్టు అని శ్రీ మోదీ తెలిపారు. ఓడరేవుల అభివృద్ధి కోసం కొచ్చి షిప్‌యార్డ్ కు అభినందనలు తెలిపారు.

 

కొచ్చి వాటర్ మెట్రో సమీప ద్వీపమైన కొచ్చి వీల్ లో నివసించే ప్రజలకు ఆధునిక , చౌక రవాణా మార్గాలను అందుబాటు లోకి తెస్తుందని, బస్ టెర్మినల్ ,మెట్రో నెట్ వర్క్ మధ్య ఇంటర్ మోడల్ కనెక్టివిటీని కూడా అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ద్వారా రాష్ట్రంలో బ్యాక్ వాటర్ టూరిజానికి ఇది ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని అన్నారు. కొచ్చి వాటర్ మెట్రో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

ఫిజికల్ కనెక్టివిటీతో పాటు డిజిటల్ కనెక్టివిటీ కూడా దేశ ప్రాధాన్యమని మోదీ పునరుద్ఘాటించారు. తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్క్ వంటి ప్రాజెక్టులు డిజిటల్ ఇండియాకు ఊతం ఇస్తాయని ఆయన అన్నారు. భారత డిజిటల్ వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని , స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 5జీ ఈ రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు.

 

కనెక్టివిటీ నోట్ కోసం పెట్టే పెట్టుబడులు సేవల పరిధిని విస్తరించడం మాత్రమే గాకుండా దూరాన్ని కూడా తగ్గించాయని, కుల, మత, ధనిక, పేద అనే తేడా లేకుండా విభిన్న సంస్కృతులను అనుసంధానించాయని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం అంతటా కనిపించే అభివృద్ధి కి సరైన నమూనా ఇదేనని, ఇది 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

 

దేశానికి, ప్రపంచానికి కేరళ అందించేది చాలా ఉందని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. "కేరళలో సంపన్నమైన సంస్కృతి, పసందైన వంటకాలు మంచి వాతావరణం ఉన్నాయని, అవి సంపదకు మూలం" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. కుమరకోమ్ లో ఇటీవల జరిగిన జి20 సమావేశాన్ని ప్రస్తావిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు కేరళకు మరింత అంతర్జాతీయ గుర్తింపును ఇస్తాయని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి కేరళకు చెందిన రాగి పట్టు వంటి ప్రముఖ శ్రీ అన్నాస్ (చిరుధాన్యాలు) గురించి పేర్కొన్నారు. స్థానిక పంటలు, ఉత్పత్తుల గురించి 'ప్రతిచోటా' గళం విప్పాలని మోదీ పిలుపుఇచ్చారు. "ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ కు చేరినప్పుడు, వికసిత భారతదేశ పథం మరింత బలపడుతుంది" అన్నారు.

 

మన్ కీ బాత్ కార్యక్రమంలో పౌరుల విజయాలు గురించి ప్రస్తావిస్తూ, 'వోకల్ ఫర్ లోకల్'ను ప్రోత్సహించే లక్ష్యంతో స్వయం సహాయక బృందాలు రూపొందించిన ఉత్పత్తులను తాను తరచూ ప్రస్తావించానని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఆదివారంతో 'మన్ కీ బాత్' శతాంతం పూర్తి చేసుకుంటోందని, దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేసిన పౌరులందరికీ, 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి ఇది అంకితమని తెలియజేశారు.

అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమను తాము అంకితం చేసుకోవాల్సి ఉంటుందని ప్రధాని అంగీకరించారు.

 

కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర సహాయ మంత్రి శ్రీ వి.మురళీధరన్, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు డాక్టర్ శశిథరూర్, కేరళ ప్రభుత్వ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం

 

రూ.3200 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. కొచ్చి వాటర్ మెట్రోను ప్రధాని జాతికి అంకితం చేశారు.

ఈ ప్రత్యేక తరహా ప్రాజెక్ట్ కింద బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ల ద్వారా కొచ్చి చుట్టూ ఉన్న 10 ద్వీపాలను కొచ్చి నగరానికి అంతరాయం లేని కనెక్టివిటీ అందిస్తుంది.

 

కొచ్చి వాటర్ మెట్రోతో పాటు దిండిగల్-పళని-పాలక్కాడ్ రైలు మార్గం విద్యుదీకరణను ప్రధాని అంకితం చేశారు.

ఈ సందర్భంగా తిరువనంతపురం, కోజికోడ్, వర్కల శివగిరి రైల్వే స్టేషన్ల రైల్వే స్టేషన్ ల పునరాభివృద్ది సహా వివిధ రైలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు.

నెమోన్, కొచువేలి సహా తిరువనంతపురం ప్రాంతం సమగ్ర అభివృద్ధి, తిరువనంతపురం-షోరనూర్ సెక్షన్ వేగాన్ని పెంచడం ఇందులో ఉన్నాయి.

 

అంతేకాకుండా తిరువనంతపురంలో డిజిటల్ సైన్స్ పార్కుకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. డిజిటల్ సైన్స్ పార్కు ను విద్యావేత్తల సహకారంతో పరిశ్రమలు,,వ్యాపార యూనిట్ల ద్వారా డిజిటల్ ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేసే పరిశోధనా కేంద్రంగా

రూపొందించారు. మూడవ తరం సైన్స్ పార్కుగా, డిజిటల్ సైన్స్ పార్కులో కృత్రిమ మేధ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, స్మార్ట్ మెటీరియల్స్ వంటి పరిశ్రమ 4.0 టెక్నాలజీల రంగంలో ఉత్పత్తుల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి ఉమ్మడి సౌకర్యాలు ఉంటాయి. అత్యాధునిక మౌలిక సదుపాయాలు పరిశ్రమల ఉన్నత స్థాయి అనువర్తిత పరిశోధనలకు, విశ్వవిద్యాలయాల సహకారంతో ఉత్పత్తుల సహ-అభివృద్ధికి తోడ్పడతాయి. ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభ పెట్టుబడి సుమారు రూ.200 కోట్లు కాగా, మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1515 కోట్లుగా అంచనా వేశారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi