అస్సాం లోని గువాహతి లో సారూసజయ్ స్టేడియం లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ రూ.10,900 కోట్లకు పైగా విలువచేసే ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో బ్రహ్మపుత్ర నాది మీద పాలాష్ బారి, సువాల్ కుచి మధ్య వంతెనకు శంకుస్థాపన, రంగ్ ఘర్, శివసాగర్ సుందరీకరణ పనుల శంకు స్థాపనలు, నామ్ రూప్ లో 500 టిపిడి మెంథాల్ ప్లాంట్ ఆవిష్కరణ, ఐదు రైల్వే ప్రాజెక్ట్ లు జాతికి అంకితం చేయటం ఉన్నాయి. పది వేల మందికి పైగా కళాకారులు ప్రదర్శించిన రంగురంగుల బిహు నాట్యాన్ని కూడా ప్రధాని తిలకించారు.
ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఈరోజు ఈ అద్భుత ప్రదర్శనను తిలకించినవారెవరూ జీవితకాలంలో దీన్ని మరచిపోరన్నారు. ఇది ఊహకు అందని అద్భుతంగా అభివర్ణించారు. ఈ వాద్య శబ్దాలు నేడు దేశమంతటా వినిపిస్తాయన్నారు. వేలాది మంది కళాకారుల కృషి, లయబద్ధత యావద్దేశంతో బాటు ప్రపంచం అంతా గర్వంతో చూస్తున్నదన్నారు. గతంలో విధానసభ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఎ ఫర్ అస్సాం అని నినదించటాన్ని ప్రధాని గుర్తు చేస్తూ, రాష్ట్రం ఎట్టకేలకు ఇప్పుడు ఏ వన్ అవుతోందన్నారు. బిహు పర్వదినం సందర్భంగా అస్సాం ప్రజలతోబాటు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈరోజు కొత్త ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు జరగటం సంతోషదాయకమన్నారు.
అస్సాం ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవటాన్ని ప్రధాని అభినందించారు.మన పండుగలు కేవలం ఆర్భాటాలు కావని, అందరినీ ఏకం చేసి ముందుకు నడిపే సారథులని ప్రధాని అభివర్ణించారు.రొంగలి బిహు పండుగ అస్సాం ప్రజల హృదయాలకు, ఆత్మకు సంబంధించినదని అన్నారు. ప్రకృతికీ, మనుషులకు మధ్య అంతరాన్ని తొలగించటం కూడా పండుగ ప్రత్యేకత అన్నారు.
ప్రముఖ సినీ రచయిత జ్యోతి ప్రసాద్ అగర్వాల్ రాసిన బిశ్వ బిజయ్ నవ్ జవాన్ రాసిన పాటను గుర్తు చేస్తూ, అది అస్సాం యువతతో బాటు యావద్దేశ యువతలో స్ఫూర్తి నింపిందన్నారు. ఆ పాట స్వయంగా మోదీ పాడినపుడు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. అస్సాం యువత వీక్షిత్ భారత్ కు ద్వారాలు తెరవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
గతంలో అనుసంధానత అనే పదాన్ని చాలా చిన్న అర్థంలో ఒక చోట నుంచి మరోచోటకు అనే అర్థంలో మాత్రమే వాడేవారని, కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయిందని అన్నారు. ఈరోజు అనుసంధానత అనేది నాలుగు విధాలుగా చూస్తున్నామని, ఈ మహాయజ్ఞంలో భౌతిక, డిజిటల్, సామాజిక, సాంస్కృతిక అనుసంధానతలు ఉన్నాయని గుర్తు చేశారు.
భారతదేశంలోని వివిధ సంస్కృతుల గురించి ప్రపంచమంతటా చర్చించుకుంటారని, అది పర్యాటక రంగం వల్లనే సాధ్యమైందని ప్రధాని గుర్తు చేశారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇక్కడి అనుభూతి కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టటానికి మాత్రమే పరిమితం కారని, ఇక్కడి సంస్కృతిని కూడా కొంత తమ వెంట జ్ఞాపకాలుగా తీసుకు పోతారని ప్రధాని అభిప్రాయపడ్డారు. అయితే, ఈశాన్య భారతదేశంలో భౌతిక అనుసంధానత లోపాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం ఆ లోపాన్ని దిద్దుతోందని చెప్పారు.రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం మీప్యా దృష్టి పెట్టిందన్నారు.
గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన పురోగతిని ప్రస్తావిస్తూ, దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించామన్నారు. కొత్త విమానాశ్రయాలు ప్రారంభించటంతో మొదటిసారిగా విమానాలు దిగిన ప్రదేశాలున్నాయని చెప్పారు. మణిపూర్, త్రిపురకు బ్రాడ్ గేజ్ రైళ్లు నడుస్తున్నాయని, ఈశాన్య ప్రాంతంలో ఇంతకుముందుకంటే మూడు రెట్ల వేగంతో రైలు మార్గాల నిర్మాణం జరుగుతోందని, డబ్లింగ్ పనులు పది రెట్ల వేగంతో సాగుతున్నాయని ప్రధాని చెప్పారు. ఈరోజు రూ. 6,000 కోట్లకు పైగా విలువచేసే ఐదు రైల్వే ప్రాజెక్ట్ లు ప్రారంభించామన్నారు. అస్సాం సహా అనేక ప్రాంతాలు వీటివలన లబ్దిపొందుతాయని ప్రధాని అన్నారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళటం ఇప్పుడు మరింత సులువుగా మారుతుందన్నారు. గతంలో బోగిబీల్ వంతెన, ధోలా సడియా - భూపేన్ హజారికా వంతెన ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో చేపట్టిన ప్రాజెక్ట్ ల పరిమాణం, వేగం ఎంత ఎక్కువగా ఉన్నదో ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. బ్రహ్మపుత్ర నదిమీద అనేక వంతెనలు వచ్చింది గత 9 సంవత్సరాలలోననే అని గుర్తు చేశారు. వీటితో బాటు ఈరోజు ప్రారంభించిన వంతెనలవలన అక్కడి పట్టు పరిశ్రమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.
అభివృద్ధితో బాటు ప్రజల్లో విశ్వాసం కలిగించటం కూడా ఎంతో ముఖ్యమని ప్రధాని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కృషి వలన ఈశాన్య ప్రాంతం అంతటా శాంతి నెలకొన్నదని చెప్పారు. యువత హింసామార్గం వదిలేసి అభివృద్ధి బాటలో నడుస్తున్నారని గుర్తు చేశారు. ఆపనమ్మక వాతావరణం మాయమై హృదయాల మధ్య దూరం తగ్గుతోందన్నారు. ప్రధాని తన ప్రసంగం ముగిస్తూ, అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణం జరగాలంటే స్వాతంత్ర్య అమృత కాలంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ ను అనుసరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా, ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ, రైల్వే శాఖమంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్, నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖా మంత్రి శ్రీ శర్బా నంద్ సోనోవాల్, పెట్రోలియం, సహజవాయు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి, అస్సాం రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
बीहू को सिर्फ शाब्दिक अर्थ से नहीं समझा जा सकता।
— PMO India (@PMOIndia) April 14, 2023
बल्कि इसे समझने के लिए भावनाओं की, ऐहसास की आवश्यकता होती है। pic.twitter.com/UiRMl1rdsW
भारत की विशेषता ही यही है, कि हमारी संस्कृति, हमारी परंपराएं हज़ारों-हज़ार वर्षों से हर भारतवासी को जोड़ती आई हैं। pic.twitter.com/yISbOsluDG
— PMO India (@PMOIndia) April 14, 2023
आज भारत आजाद है और आज विकसित भारत का निर्माण, हम सभी का सबसे बड़ा सपना है।
— PMO India (@PMOIndia) April 14, 2023
हमें देश के लिए जीने का सौभाग्य मिला है। pic.twitter.com/bMajpvGHvy
आज हमारे लिए कनेक्टिविटी, चार दिशाओ में एक साथ काम करने वाला महायज्ञ है। pic.twitter.com/fH4TA5YfYZ
— PMO India (@PMOIndia) April 14, 2023
नॉर्थ ईस्ट में अविश्वास का माहौल दूर हो रहा है, दिलों की दूरी मिट रही है। pic.twitter.com/SVhoyqNIyS
— PMO India (@PMOIndia) April 14, 2023