మేయర్ లు వారి నగరాల కు కొత్త శక్తి ని ఇవ్వడం కోసం తీసుకోదగ్గ అనేక చర్యలను గురించి ఆయన ప్రస్తావించారు
‘‘ఈ ఆధునికీకరణ యుగం లో మన నగరాల ప్రాచీనత కు సమానమైన ప్రాముఖ్యం ఉంది’’
‘‘మన నగరాల ను పరిశుభ్రమైనవి గాను, ఆరోగ్యదాయకమైనవి గాను ఉంచేందుకు మనంప్రయత్నాలు చేయాలి’’
‘‘నదుల ను నగర జీవనం యొక్క కేంద్ర స్థానం లోకి తీసుకు రావాలి. ఇది మీ నగరాల కు ఒక కొత్త జీవ శక్తి ని అందిస్తుంది’’
‘‘మన నగరాలు మన ఆర్థిక వ్యవస్థ కు చోదక శక్తి గా ఉన్నాయి. నగరాన్ని ఒకహుషారైన ఆర్థిక వ్యవస్థ కు నిలయం గా మనం మలచాలి’’
‘‘మన అభివృద్ధి నమూనా లో ఎమ్ఎస్ఎమ్ఇలను ఏ విధం గా బలపరచాలో పరిశీలించవలసినఅవసరం ఉంది’’
‘‘వీధి వ్యాపారుల కు ఉన్న ప్రాముఖ్యాన్ని మహమ్మారి చాటిచెప్పింది. వారు మన యాత్ర లోఒక భాగం గా ఉన్నారు. వారి ని మనం వెనుకపట్టునవదలివేయలేం’’
‘‘కాశీ కోసం మీరు ఇచ్చే సూచనల కు నేను కృతజ్ఞుడి నై ఉంటాను. మరి నేను మీకుతొలి విద్యార్థి ని అవుతాను’’
‘‘సర్ దార్ పటేల్ గారు అహమదాబాద్ కు మేయర్ గా పని చేశారు. మరి దేశం ఆయన ను ఈ నాటి కి కూడాను స్మరించుకొంటున్నది’’

ఆల్ ఇండియా మేయర్స్ కాన్ఫరెన్స్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో పాటు, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రాచీన నగరం అయిన వారాణసీ లో ఇటీవలి పరిణామాల ను గురించి ప్రస్తావించారు. కాశీ అభివృద్ధి యావత్తు దేశాని కి ఒక మార్గ సూచీ కాగలదు అంటూ తాను చేసిన ప్రకటన ను ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు. మన దేశం లో చాలా వరకు నగరాలు సాంప్రదాయక నగరాలు. అవి ఒక సంప్రదాయ పద్ధతి లో అభివృద్ధి జరిగిన నగరాలు అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఆధునికీకరణ యుగం లో ఈ నగరాల ప్రాచీనత కూడా అంతే ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఈ నగరాలు వారసత్వాన్ని, స్థానిక నైపుణ్యాల ను ఏ విధం గా పరిరక్షించుకోవాలో మనకు బోధించ గలుగుతాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఉన్న నిర్మాణాల ను నాశనం చేయడం ఒక మార్గం కాదు కానీ పరిరక్షణ, ఇంకా కొత్త బలాన్ని ఇచ్చే అంశాల పైన శ్రద్ధ వహించాలి అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఆధునిక కాలాల అవసరాల ప్రకారం ఇది జరగాలి అని ఆయన అన్నారు.

స్వచ్ఛత కోసం నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరం అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. స్వచ్ఛత ను సాధించడం కోసం శ్రేష్ఠ ప్రయాసల కు నడుంకడుతున్న నగరాల తో పాటు గా ఉత్తమ ప్రదర్శన ను నమోదు చేస్తున్న నగరాల ను గుర్తించడం కోసం కొత్త కేటగిరీల ను ఏర్పరచ గలమా ! అంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. స్వచ్ఛత కు తోడు గా నగరాల సుందరీకరణ గురించి సైతం ఆయన పట్టుబట్టారు. ఈ విషయం లో మేయర్ లు వారి వారి నగరాల లోని వార్డు ల మధ్య ఆరోగ్యకరమైన స్పర్ధ తాలూకు భావన ను రేకెత్తింప చేయాలి అని ఆయన కోరారు.

ప్రధాన  మంత్రి తన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం లో ఇచ్చిన ఉపన్యాసాల లో పదే పదే ప్రస్తావస్తూ వస్తున్నటువంటి స్వాతంత్య్ర సమరం ఇతివృత్తం గా సాగే ముగ్గు ల పోటీ లు, పాట ల పోటీ లు, లాలి పాట పోటీ ల వంటి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు సంబంధించిన కార్యక్రమాల ను కూడా నిర్వహించవలసింది గా మేయర్ లకు ఆయన సూచించారు. నగరాల జన్మ దినాల ను మేయర్ లు కనుగొని, వాటిని వేడుక గా నిర్వహించాలి అని కూడా మంత్రి సలహా ఇచ్చారు. నదులు ఉన్నటువంటి నగరాల లో నదీ ఉత్సవం జరపాలన్నారు. నదుల కీర్తి ని వ్యాప్తి చేయవలసిన అవసరం ఉంది. అలా చేస్తే ప్రజలు ఆయా నదుల పట్ల గర్వపడి మరి వాటి ని స్వచ్ఛం గా ఉంచుతారు అని ఆయన అన్నారు. ‘‘నదుల ను నగర జీవనాని కి కేంద్ర స్థానం లోకి తిరిగి తీసుకు రావాలి. ఇది మీ నగరాల కు ఒక కొత్త ప్రాణ శక్తి ని ప్రసాదిస్తుంది’’ అని మంత్రి అన్నారు. ఒకసారి వాడిన ప్లాస్టిక్ ను ఆ తరువాత నిర్మూలించడాని కి సంబంధించిన ప్రచార ఉద్యమాని కి నూతన చైతన్యాన్ని ఇవ్వండి అంటూ మేయర్ లకు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. వ్యర్థ: నుంచి సంపద ను సృష్టించే మార్గాల కోసం వెతకండి అని మేయర్ లకు ఆయన చెప్పారు. ‘‘మన నగరం స్వచ్ఛం గా, అదే జోరు లో ఆరోగ్యం గా కూడాను ఉండాలి, మన ప్రయాస కు ఇది కీలకం కావాలి’’ అని ఆయన అన్నారు.

మేయర్ లు వారి నగరాల లోని ఇళ్ళ లో, వీధుల లో ఎల్ఇడి బల్బుల ను విరివి గా వాడుక లోకి తీసుకు వచ్చేటట్లు చూడాలి అని ఆయన కోరారు. దీని ని ఒక ఉద్యమం తరహా లో చేపట్టండి అంటూ వారికి ఆయన సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్నటువంటి పథకాల ను కొత్త కొత్త ఉపయోగాల కోసం వాడుకొనేటట్లు గాను, ఆయా పథకాల ను ముందుకు తీసుకు పోయేటట్లు గాను మనం ఎల్లప్పుడూ ఆలోచన లు చేస్తూ ఉండాలి అని ఆయన అన్నారు. నగరం లోని ఎన్ సిసి విభాగాల ను సంప్రదించి, నగరాల లోని విగ్రహాల ను శుభ్రపరచడం కోసం బృందాల ను ఏర్పాటు చేయాలని, ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ స్ఫూర్తి తో మహనీయుల కు సంబంధించిన ఉపన్యాస కార్యక్రమాల ను ఏర్పాటు చేయాలని ఆయన మేయర్ ల కు సలహా ను ఇచ్చారు. అదే విధం గా, మేయర్ లు వారి నగరం లో ఒక ప్రదేశాన్ని గుర్తించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జ్ఞప్తి కి తెచ్చేటటువంటి ఒక కట్టడాన్ని పిపిపి పద్ధతి లో నిర్మించాలి అని ఆయన అన్నారు. ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, మేయర్ లు వారి నగరాల యొక్క విశిష్టమైన గుర్తింపు ప్రస్ఫుటం అయ్యేలా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్పాదన లేదా నగరం లోని ప్రదేశం వంటి వాటిని ప్రచారం లోకి తీసుకు రావడానికి యత్నించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. పట్టణ జీవనం తాలూకు వేరు వేరు అంశాల కు సంబంధించి ప్రజానుకూల ఆలోచనల ను అభివృద్ధి పరచవలసింది గా వారిని ప్రధాన మంత్రి కోరారు. సార్వజనిక రవాణా వినియోగాన్ని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. మేయర్ లు వారి నగరం లో ప్రతి ఒక్క సదుపాయాన్ని ‘సుగమ్య భారత అభియాన్’ లో భాగం గా దివ్యాంగుల కు అనుకూలమైనవి గా మలచేందుకు శ్రద్ధ తీసుకోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.

‘‘మన నగరాలు మన ఆర్థిక వ్యవస్థ కు చోదక శక్తి గా ఉన్నాయి. మనం ఒక చైతన్యభరితమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కు నిలయం గా నగరాన్ని తీర్చిదిద్దాలి’’ అని ఆయన అన్నారు. ఆర్థిక కార్యకలాపాల కు ఆహ్వానం పలికే మరియు అటువంటి కార్యకలాపాల ను ప్రోత్సహించే ఒక ఇకోసిస్టమ్ ను నిర్మించడం కోసం అన్ని సదుపాయాల ను ఏక కాలం లో అభివృద్ధి పరుస్తూ ఒక సంపూర్ణమైన వ్యవస్థ ను ఆవిష్కరించండి అని వారి కి ఆయన సూచించారు.

మన అభివృద్ధి నమూనా లో ఎమ్ఎస్ఎమ్ఇ లను బలపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘వీధి వ్యాపారస్తులు మన యాత్ర లో ఒక భాగం. మనం వారి కష్టాల ను అడుగడుగునా గమనించాలి. వారి కోసం మేం పిఎమ్ స్వనిధి యోజన ను ప్రవేశపెట్టాం. ఈ పథకం చాలా బాగుంది. మీ నగరం లో ఉన్న వీధి వ్యాపారుల జాబితా ను తయారు చేసి, మొబైల్ ఫోన్ ద్వారా లావాదేవీల ను జరపడాన్ని గురించి వారికి నేర్పించండి. ఇది మరింత ఉత్తమమైన విధానం లో బ్యాంకు ల నుంచి వారు ఆర్థిక సహాయం పొందేందుకు తోడ్పడుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. మహమ్మారి కాలం లో వీధి వ్యాపారుల కు ఉన్న ప్రాముఖ్యం ఏమిటన్నది చాలా స్పష్టం గా అగుపించింది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో, కాశీ అభివృద్ధి కోసం మేయర్ లను వారి వారి అనుభవాల నుంచి సూచనల ను, సలహాల ను ఇవ్వవలసిందని అభ్యర్ధించారు. ‘‘మీరు చేసే సూచనల కు నేను కృతజ్ఞుడినై ఉంటాను. అలాగే, నేను మీ తొలి విద్యార్థి ని అవుతాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సర్ దార్ పటేల్ గారు అహమదాబాద్ మేయర్ గా సేవల ను అందించారు. మరి దేశం ఆయన ను ఈనాటి కి కూడా ను గుర్తు కు తెచ్చుకొంటున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దేశ ప్రజల కు సేవ చేయగలిగే అవకాశాన్ని మీరు దక్కించుకొనే ఒక సార్ధక రాజకీయ జీవనం లోకి అడుగు పెట్టడానికి దోహదం చేసే ఒక మెట్టు గా మేయర్ పదవి కాగలుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi