బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్‌లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కేరికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. భారత- బార్బడోస్‌ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించడంతోపాటు ఆ సంబంధాలను బల పరచడానికి ఇద్దరు నేతలకు ఒక అవకాశాన్ని ఈ ఉన్నతస్థాయి సమావేశం అందించింది.
ఆరోగ్యం, ఔషధాలు, వాతావరణ మార్పులకు సంబంధించిన కార్యాచరణ, సంస్కృతి, ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక కీలక రంగాలలో ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న సహకారాన్ని నేతలు సమీక్షించారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశం అందిస్తున్న నాయకత్వాన్ని ప్రధాని మోట్‌లీ ప్రశంసించారు. ప్రపంచ సంస్థల్లో చేపట్టాల్సిన సంస్కరణల అంశంపై ఇద్దరు నేతలూ పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
Had a very good meeting with Prime Minister Mia Amor Mottley of Barbados. Our talks covered areas such as science and technology, healthcare, education, climate change and agriculture. I am grateful to the Government and people of Barbados for conferring the Honorary Order of… pic.twitter.com/zEVyKjTw2F
— Narendra Modi (@narendramodi) November 21, 2024