ఈస్టర్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రైస్తవ సమాజ మతపెద్దలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సేక్రెడ్ కెథడ్రల్‌ను తాను సందర్శించిన దృశ్యాలను ఆయన ప్రజలతో పంచుకున్నారు.
దీనిపై ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఈస్టర్ పర్వదినం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కెథడ్రల్‌ను సందర్శించే అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజ మతపెద్దలను కూడా కలుసుకున్నాను. ఆ క్షణాలకు సంబంధించిన దృశ్యాలను మీతో పంచుకుంటున్నాను. అలాగే ఈస్టర్ సందర్భంగా ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కెథడ్రల్ నుంచి మరికొన్ని చిత్రాలు చూడండి. ఈ ప్రత్యేక దినాన సమాజంలో మరింత సంతోషం-సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
Today, on the very special occasion of Easter, I had the opportunity to visit the Sacred Heart Cathedral in Delhi. I also met spiritual leaders from the Christian community.
— Narendra Modi (@narendramodi) April 9, 2023
Here are some glimpses. pic.twitter.com/7ig2Q4yHAT
Some more pictures from the Sacred Heart Cathedral, Delhi on Easter.
— Narendra Modi (@narendramodi) April 9, 2023
May this day further happiness and harmony in society. pic.twitter.com/970eHYmrAn