బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జి20 శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న సందర్భంగా నార్వే ప్రధాని శ్రీ జోనాస్ గహర్ స్టోర్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని ప్రధానులు ఇద్దరూ సమీక్షించారు. వివిధ రంగాల్లో సహకారాన్ని మరింత బలపరచుకోదగ్గ పద్ధతులపైనా వారు చర్చించారు. ఇండియా - యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ - ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ అగ్రిమెంట్ (ఇండియా-ఈఎఫ్‌టీఏ - టీఈపీఏ) కుదరడం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కీలక ఘట్టమని వారు అభిప్రాయపడ్డారు. నార్వే సహా ఈఎఫ్‌టీఏ సభ్య దేశాల నుంచి భారతదేశానికి పెట్టుబడులు అధిక స్థాయిలో తరలి రావాలంటే ఈ ఒప్పందం ఎంతైనా ప్రాముఖ్యం ఉందని నేతలిరువురూ పునరుద్ఘాటించారు.

 

నీలి ఆర్థిక వ్యవస్థ (బ్లూ ఎకానమీ), పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, సౌర శక్తి ప్రధాన ప్రాజెక్టులు, పవన శక్తి ప్రధాన ప్రాజెక్టులు, జియో-ధర్మల్ ఎనర్జీ, గ్రీన్ షిప్పింగ్, కార్బన్ కేప్చర్ యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సీసీయూఎస్), మత్య్స పరిశ్రమ, అంతరిక్ష రంగం, ఉత్తర ధ్రువ ప్రాంతీయ సహకారం వంటి రంగాలలో ఇప్పుడు అమలవుతున్న సహకారాన్ని మరింత పెంచుకోవడం కూడా ద్వైపాక్షిక చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది.

ఇరు దేశాల ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను గురించి కూడా నేతలు చర్చించారు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates

Media Coverage

Economic Survey: India leads in mobile data consumption/sub, offers world’s most affordable data rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 1 ఫెబ్రవరి 2025
February 01, 2025

Budget 2025-26 Viksit Bharat’s Foundation Stone: Inclusive, Innovative & India-First Policies under leadership of PM Modi