ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున డెలావేర్ లో జరిగే క్వాడ్ సమిట్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తో భేటీ అయ్యారు. శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం అధ్యక్షుడు శ్రీ బైడెన్ విల్మింటన్ లోని తన ఇంట్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
భారత్ అమెరికాల భాగస్వామ్యానికి ముందుకు తీసుకుపోవడంలో అధ్యక్షుడు శ్రీ బైడెన్ అసమానమైన సేవలను అందించారంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందలు తెలిపారు. అమెరికాలో 2023 జూన్ లో తాను పర్యటించడాన్ని, అదే సంవత్సరం సెప్టెంబరు నెలలో భారతదేశంలో జరిగిన జి-20 నేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అధ్యక్షుడు శ్రీ బైడెన్ భారత్ కు రావడాన్ని శ్రీ మోదీ ఆప్యాయంగా గుర్తు చేశారు. ఈ పర్యటనలు భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని ఉపయోగకరంగా మార్చాయనీ, తగిన వేగాన్నీ అందించాయనీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
మంచి కోసం జరిగే ప్రయత్నాలూ, ప్రజాస్వామ్య విలువలూ, పరస్పర ప్రయోజనాలూ కలగలిసిన భారత్- అమెరికాల భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యం పరిపూర్ణ దశకు చేరుకోవడాన్ని ఇరుదేశాలూ ఆస్వాదిస్తున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని ఇప్పటి కన్నా మరింత ఎక్కువగా పెంపొందింప చేసుకొనేందుకు ఏయే మార్గాలను అనుసరించాలన్నది నేతలిద్దరూ ఈ సమావేశంలో చర్చించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం, ఆ ప్రాంతానికి వెలుపల సైతం సహకరించుకోవడాన్ని గురించీ, భౌగోళిక అంశాలను గురించీ, ప్రాంతీయ అంశాలను గురించీ ఉభయులూ చర్చించారు. రెండు దేశాల సంబంధాలకు ఉన్న శక్తి, ప్రతికూలస్థితులను సైతం దీటుగా ఎదుర్కొంటూ ఈ సంబంధాలు పురోగమిస్తున్న తీరు, ఇతర రంగాలల్లో భారత- అమెరికా సంబంధాలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా నేతలిరువురూ పరస్పరం విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
I thank President Biden for hosting me at his residence in Greenville, Delaware. Our talks were extremely fruitful. We had the opportunity to discuss regional and global issues during the meeting. @JoeBiden pic.twitter.com/WzWW3fudTn
— Narendra Modi (@narendramodi) September 21, 2024