ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లావోస్ అధ్యక్షుడు, లావో పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ (ఎల్‌పీఆర్‌పీ) కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి థాంగ్లౌన్ సిసౌలిత్‌తో వియాంటియాన్‌లో సమావేశమయ్యారు. ఆసియాన్ సదస్సును, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించిన ఇరువురు నేతలు.. సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విషయంలో తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. భారత్‌-లావోస్ మధ్య ప్రస్తుత భాగస్వామ్యం పురాతన నాగరిక సంబంధాల్లో చాలా పటిష్ఠంగా ఉందని ఇద్దరు నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి విషయంలో భాగస్వామ్యం, వారసత్వ సంపద పునరుద్ధరణ, సాంస్కృతిక మార్పిడి వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకారంపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. భారత యాక్ట్ ఈస్ట్ పాలసీకి 2024తో దశాబ్దం నిండుతుందని తెలిపిన ప్రధాన మంత్రి... లావోస్‌తో భారత్ ‌సంబంధాలను మరింత వేగంగా మెరుగుపరచటంలో దాని ప్రాముఖ్యతను ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య నాగరిక సంబంధాలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ.. పునఃప్రారంభం చేసిన నలంద విశ్వవిద్యాలయం అందించే అవకాశాల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యాగీ తుఫాను వరదలకు సంబంధించి లావోస్‌కు భారత్‌ అందించిన మానవతా సహాయం పట్ల ప్రధాని మోదీకి ఆ దేశాధ్యక్షుడు సిసౌలిత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

భారత్‌-ఆసియాన్ సంబంధాల బలోపేతం విషయంలో లావోస్ అందించిన సహాయసహకారాలకు ఆ దేశ అధ్యక్షుడు సిసౌలిత్‌కు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

 

  • Vivek Kumar Gupta December 19, 2024

    नमो ..🙏🙏🙏🙏🙏
  • Vivek Kumar Gupta December 19, 2024

    नमो ................🙏🙏🙏🙏🙏
  • Mohan Singh Rawat Miyala December 19, 2024

    जय श्री राम
  • JYOTI KUMAR SINGH December 09, 2024

    🙏
  • Yogendra Nath Pandey Lucknow Uttar vidhansabha December 04, 2024

    जय श्री राम
  • Kushal shiyal November 22, 2024

    Jay shri krishna.🙏 .
  • Chandrabhushan Mishra Sonbhadra November 15, 2024

    1
  • Chandrabhushan Mishra Sonbhadra November 15, 2024

    2
  • Ramesh Prajapati Tikamgarh mp November 08, 2024

    भारतीय जनता पार्टी के बारिष्ठ नेता एवं पूर्व उपप्रधानमंत्री श्री लालकृष्ण आडवाणी जी को जन्म दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं । हम भगवान से उनके स्वास्थ्य जीवन के लिए प़थऀना करते हैं। #LalKrishnaAdvani #NarendraModiji #ramesh_prajapati
  • Ramesh Prajapati Tikamgarh mp November 08, 2024

    भारतीय जनता पार्टी के बारिष्ठ नेता एवं पूर्व उपप्रधानमंत्री श्री लालकृष्ण आडवाणी जी को जन्म दिवस की हार्दिक बधाई एवं शुभकामनाएं । हम भगवान से उनके स्वास्थ्य जीवन के लिए प़थऀना करते हैं। #LalKrishnaAdvani #NarendraModiji #ramesh_prajapati
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
The world is keenly watching the 21st-century India: PM Modi

Media Coverage

The world is keenly watching the 21st-century India: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi prays at Somnath Mandir
March 02, 2025

The Prime Minister Shri Narendra Modi today paid visit to Somnath Temple in Gujarat after conclusion of Maha Kumbh in Prayagraj.

|

In separate posts on X, he wrote:

“I had decided that after the Maha Kumbh at Prayagraj, I would go to Somnath, which is the first among the 12 Jyotirlingas.

Today, I felt blessed to have prayed at the Somnath Mandir. I prayed for the prosperity and good health of every Indian. This Temple manifests the timeless heritage and courage of our culture.”

|

“प्रयागराज में एकता का महाकुंभ, करोड़ों देशवासियों के प्रयास से संपन्न हुआ। मैंने एक सेवक की भांति अंतर्मन में संकल्प लिया था कि महाकुंभ के उपरांत द्वादश ज्योतिर्लिंग में से प्रथम ज्योतिर्लिंग श्री सोमनाथ का पूजन-अर्चन करूंगा।

आज सोमनाथ दादा की कृपा से वह संकल्प पूरा हुआ है। मैंने सभी देशवासियों की ओर से एकता के महाकुंभ की सफल सिद्धि को श्री सोमनाथ भगवान के चरणों में समर्पित किया। इस दौरान मैंने हर देशवासी के स्वास्थ्य एवं समृद्धि की कामना भी की।”