భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని తన నివాసం లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్ కు స్వాగతం పలికినందుకు నేను సంతోషిస్తున్నాను. మేం ఒక స్నేహపూర్ణమైనటువంటి ఫలప్రద సమావేశం లో పాలుపంచుకొన్నాం. భారతదేశం – భూటాన్ సంబంధాల ను నూతన శిఖరాల కు తీసుకుపోవడం కోసం మా యొక్క ప్రగాఢమైనటువంటి మిత్రత్వాన్ని మరియు ద్రూక్ గ్యాల్ పో యొక్క దార్శనికత కు మేం అత్యధిక ప్రాముఖ్యాన్ని కట్టబెడతాం.’’ అని పేర్కొన్నారు.
Pleased to receive His Majesty the King of Bhutan, Jigme Khesar Namgyel Wangchuck. We had a warm and productive meeting. Deeply value our close friendship and the vision of successive Druk Gyalpos in guiding India-Bhutan relations to new heights. pic.twitter.com/DD33W2LvjO
— Narendra Modi (@narendramodi) April 4, 2023