చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ పీటర్ ఫైలా వైబ్రెంట్ గుజరాత్ సదస్సు 2024లో పాల్గొనేందుకు 2024 జనవరి 9-11 తేదీల మధ్య భారతదేశంలో పర్యటిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఫైలాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకున్నారు. ద్వైపాక్షిక బంధాలను ప్రత్యేకించి మేధస్సు, టెక్నాలజీ, శాస్ర్తీయ రంగాల్లో సహకారం విస్తరణకు గల అవకాశాలపై ఉభయ నాయకులు చర్చించారు. పలు చెక్ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రక్షణ, రైల్వే, విమానయానం రంగాల్లో భారతీయ కంపెనీలతో భాగస్వాములయ్యాయని ప్రధానమంత్రి గుర్తు చేశారు. భారతదేశ వృద్ధి కథనం, చెక్ రిపబ్లిక్ కు గల శక్తివంతమైన పారిశ్రామిక పునాది రెండూ కలిస్తే ఉభయులను ప్రపంచ సరఫరా వ్యవస్థలో శక్తివంతులైన భాగస్వాములుగా నిలుపుతుందని ఆయన నొక్కి చెప్పారు.
ఇన్నోవేషన్ పై భారత-చెకియా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం ఆమోదించిన ఉమ్మడి ప్రకటన భారత-చెకియా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయి అని ఉభయ నాయకులు ఆహ్వానించారు. స్టార్టప్ లు, ఇన్నోవేషన్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ విభాగాలు, కృత్రిమ మేథ, రక్షణ, అణు ఇంధనం, సర్కులర్ ఎకానమీ వంటి రంగాల్లో ఉభయ దేశాల బలాలు పరస్పరం ఉపయోగించుకోవడం ఈ ఉమ్మడి ప్రకటన లక్ష్యం.
ప్రధానమంత్రి ఫైలా జైపూర్ లోని నిమ్స్ విశ్వవిద్యాలయాన్ని సందర్శిస్తారు. విశ్వవిద్యాలయం ఆయనను ఆనరిస్ కాసా డాక్టరేట్ డిగ్రీతో సత్కరిస్తోంది.