ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమీరు గారి తండ్రి గారైన శ్రీ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ తో ఈ రోజు న మధ్యాహ్న సమయం లో భేటీ అయ్యారు.
గత కొన్ని దశాబ్దాలు గా దూరదర్శి నాయకత్వం తో కతర్ యొక్క అభివృద్ధి కి బాట ను పరచారంటూ అమీరు గారి తండ్రి గారి కి ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. ఇద్దరు నేతలు భారతదేశం-కతర్ సంబంధాల పై చర్చించారు.
ప్రాంతీయ ఘటన క్రమాల ను గురించి మరియు ప్రపంచ ఘటన క్రమాల ను గురించి అమీరు గారి తండ్రి గారి అనుభవ పూర్వకమైన విశ్లేషణల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.
భారతదేశం మరియు కతర్ లు విడదీయరానటువంటి బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి, ఈ బంధం పరస్పర విశ్వాసం మరియు సహకారం ల ప్రతీక గా ఉంది అని అమీరు గారి తండ్రి గారు స్పష్టం చేశారు. ఆయన కతర్ యొక్క అభివృద్ధి లోను మరియు ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంచడం లోను భారతీయ సముదాయం పోషిస్తున్నటువంటి భూమిక ను కూడా ఆయన ప్రశంసించారు.