ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యనిర్వాహక వర్గంతో సమావేశమయ్యారు. అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్టాపన (ప్రాణ ప్రతిష్ఠ) నేపథ్యంలో వారు శ్రీ మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- “ఈ సమావేశంలో పాల్గొనడం నాకు శ్రీరాముని ఆశీర్వాదం లభించినట్లుగా అనిపిస్తోంది. నా జీవితంలో ఇదొక చారిత్రక సంఘటన.. ఇది నా అదృష్టం” అని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“శ్రీరామ జయం! ఇవాళ నా హృదయం భావోద్వేగంతో నిండిపోయింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యనిర్వాహక వర్గం కొద్దిసేపటి కిందట నా నివాసంలో నాతో సమావేశమయ్యేందుకు వచ్చింది. శ్రీరామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా వారు నన్ను ఆహ్వానించారు. ఈ చారిత్రక ఘట్టానికి నేను ప్రత్యక్ష సాక్షిని కావడం ఒక ఆశీర్వాదం… అదృష్టంగానే కాకుండా నా జీవితమే ధన్యమైనట్లుగా భావిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
जय सियाराम!
— Narendra Modi (@narendramodi) October 25, 2023
आज का दिन बहुत भावनाओं से भरा हुआ है। अभी श्रीराम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के पदाधिकारी मुझसे मेरे निवास स्थान पर मिलने आए थे। उन्होंने मुझे श्रीराम मंदिर में प्राण-प्रतिष्ठा के अवसर पर अयोध्या आने के लिए निमंत्रित किया है।
मैं खुद को बहुत धन्य महसूस कर रहा… pic.twitter.com/rc801AraIn