ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సంభాషించారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ సుపరిపాలన కార్యక్రమాలు, వాటిద్వారా అమలు చేస్తున్న పరివర్తనాత్మక పథకాలు ప్రజల జీవితాలలో ఎలాంటి సానుకూల మార్పు తెస్తున్నాయో ఆయనతో చర్చించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @చౌహాన్ శివరాజ్ జీతో సంభాషించాను. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సుపరిపాలన కార్యక్రమాలు, వాటిద్వారా అమలు చేస్తున్న పరివర్తనాత్మక పథకాలు ప్రజల జీవితాలలో ఎలాంటి సానుకూల మార్పు తెస్తున్నాయో ఈ సందర్భంగా ఆయనతో చర్చించాను." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Met MP CM Shri @ChouhanShivraj Ji, who discussed the good governance initiatives of the MP Government and how their transformative schemes are bringing a positive change in people’s lives. pic.twitter.com/o1q4WfRXTQ
— Narendra Modi (@narendramodi) April 23, 2022