‘భారత్ రత్న’ అవార్డు తో కర్పూరీ ఠాకుర్ గారి ని సమ్మానించడం జరుగుతుంది అంటూ ఇటీవల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్పూరీ ఠాకుర్ యొక్క కుటుంబ సభ్యులు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో బేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘జన్ నాయక్ కర్పూరీ ఠాకుర్ గారి ని ‘భారత్ రత్న’ తో సమ్మానించడం జరుగుతుంది అని ఇటీవల ప్రకటన వెలువడ్డ నేపథ్యం లో ఆయన యొక్క కుటుంబ సభ్యుల తో భేటీ కావడం చాలా సంతోషాన్ని కలిగించింది. సమాజం లో వెనుకబడిన వర్గాల మరియు వంచితులైన వర్గాల వారి కి రక్షకుని గా కర్పూరీ గారు మెలగారు. ఆయన యొక్క జీవనం మరియు ఆయన యొక్క ఆదర్శాలు దేశ ప్రజల కు ప్రేరణ ను నిరంతరం అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
भारत रत्न से सम्मानित जननायक कर्पूरी ठाकुर जी के परिजनों से मिलकर बहुत खुशी हुई। कर्पूरी जी समाज के पिछड़े और वंचित वर्गों के मसीहा रहे हैं, जिनका जीवन और आदर्श देशवासियों को निरंतर प्रेरित करता रहेगा। pic.twitter.com/Ihp7B08LXu
— Narendra Modi (@narendramodi) February 12, 2024