ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శ్రీ అల్తాఫ్ బుఖారీ నాయకత్వం లో జమ్ము & కశ్మీర్ లో గల అప్ నీ పార్టీ యొక్క 24 మంది సభ్యుల ప్రతినిధి వర్గం తో న్యూ ఢిల్లీ లోని లోక్ కల్యాణ్ మార్గ్ లో భేటీ అయ్యారు.
వారితో సంభాషణ సాగిన క్రమం లో, జమ్ము & కశ్మీర్ లో పరివర్తన ను తీసుకురావడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతయినా అవసరమంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల వాణి కి అనుకూలం గా ప్రతిస్పందించేటటువంటి పాలన నెలకొనడం ముఖ్యమని ఆయన నొక్కి పలికారు. ఈ ప్రాంతం లో రాజకీయ ఏకీకరణ ప్రక్రియ కు శీఘ్ర గతి న తావు కల్పించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలపరచవచ్చునని ప్రధాన మంత్రి అన్నారు.
యువత కు సాధికారిత కల్పన అంశం పై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, జమ్ము & కశ్మీర్ అభివృద్ధి కి యువత ఉత్ప్రేరక సాధనాల వంటి పాత్ర ను పోషించాలన్నారు. జమ్ము & కశ్మీర్ లో సమగ్ర పరివర్తన ను తీసుకు రావడం కోసం నైపుణ్యాల కు సాన పట్టడానికి, అలాగే యువతీయువకుల కు నూతన ఉద్యోగ అవకాశాల ను కల్పించడాని కి కూడా ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుందన్నారు.
ఈ ప్రాంతం లో మౌలిక వసతుల అభివృద్ధి పై వి స్తృత శ్రద్ధ వహిస్తూను, పర్యటన వంటి రంగాల లో నూతన పెట్టుబడి అవకాశాల ను విస్తరింపచేయడాని కి ప్రభుత్వం కట్టుబడివుందని ప్రధాన మంత్రి ప్రతినిధి వర్గం సభ్యుల కు భరోసా ను ఇచ్చారు. జమ్ము & కశ్మీర్ ఎదుర్కొంటున్న సమస్యల ను అన్నిటి ని పరిష్కరించడం కోసం పూర్తి స్థాయి లో మద్దతు ను అందించాలన్న సంకల్పం తో ప్రభుత్వం ఉందని కూడా ఆయన హామీ ని ఇచ్చారు.
జనాభా పరం గా చోటు చేసుకొంటున్న మార్పు లు, సరిహద్దుల నిర్ణయం తాలూకు కసరత్తు మరియు రాష్ట్రం లో స్థిర నివాసం ప్రదానం చేయడం వంటి వివిధ అం శాల పట్ల ప్రతినిధి వర్గం తో ప్రధాన మంత్రి తన ఆలోచనల ను వెల్లడించి వారి ఆలోచనల ను గురించి తెలుసుకొన్నారు. పార్లమెంట్ లో తాను చేసిన ప్రకటన ను గురించి ఆయన ఉద్ఘాటిస్తూ, జమ్ము & కశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి తాలూకు ఆశల ను సాకారం చేయడం లో జనాభా లోని అన్ని వర్గాల వారి తోను ప్రభుత్వం కలసి పనిచేస్తుందని తెలిపారు.
రాజ్యాంగం లోని 370 వ అధికరణాన్ని మరియు 35-ఎ అధికరణాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకొన్నటువంటి 2019వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ జమ్ము & కశ్మీర్ యొక్క చరిత్ర లో ఒక ఘనమైన సందర్భం అని అప్ నీ పార్టీ అధ్యక్షుడు శ్రీ అల్తాఫ్ బుఖారీ అన్నారు.
జమ్ము & కశ్మీర్ అభివృద్ధి పట్ల గొప్ప మద్దతు ను అందిస్తున్నందుకు గాను ప్రధాన మంత్రి కి ప్రతినిధి వర్గం ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రాంతం లో శాంతి భద్రత ల పరిరక్షణ దిశ గా ప్రభుత్వం, భద్రత సంస్థ లు మరియు జమ్ము & కశ్మీర్ ప్రజానీకం యొక్క ప్రయాసల ను కూడా ప్రతినిధి వర్గం ప్రశంసించింది.