భారత 75వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలకనున్నారు.
ఈ మేరకు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ‘ఎక్స్’ ద్వారా పోస్ట్ చేసిన సందేశంపై స్పందిస్తూ:
‘‘నా ప్రియ మిత్రులైన అధ్యక్షులు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గారూ... భారత 75వ గణతంత్ర దినోత్సవానికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు మేమెంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నాం. ఈ సందర్భంగా భారత-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణతోపాటు ప్రజాస్వామ్య విలువలపై విశ్వాసాన్ని కూడా మేం పంచుకుంటాం... బైఎంటాట్!’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
My Dear Friend President @EmmanuelMacron, we eagerly look forward to receiving you as the Chief Guest at the 75th Republic Day. We will also celebrate India- France strategic partnership and shared belief in democratic values. Bientôt ! https://t.co/jvzvOY2NNa
— Narendra Modi (@narendramodi) December 22, 2023