పంతొమ్మిది వేల నూటఏభై కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆయా పథకాల ను దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.
ఆ పథకాల లో నూతన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ - న్యూ భావూపుర్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ ప్రాజెక్టు యొక్క ప్రారంభ కార్యక్రమం తో పాటు ఇతర రైల్ వే ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి. కొత్త గా ప్రారంభించిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ ప్రాజెక్టు ను సుమారుగా 10,900 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడమైంది. ప్రధాన మంత్రి వారాణసీ-న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు, దోహ్ రీఘాట్-మవూ ఎమ్ఇఎమ్‌యు రైలు కు మరియు దీర్ఘ దూరం ప్రయాణించే సరకుల రవాణా రైళ్ళు రెండిటి కి ఆయన క్రొత్త గా ప్రారంభం జరిగిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ లో ప్రారంభ సూచక జెండాల ను చూపెట్టారు. బనారస్ లోకోమోటివ్ వర్క్‌స్ రూపొందించిన పది వేలవ లోకోమోటివ్ ను కూడా ఆయన ఆకుపచ్చటి జెండా ను చూపారు. 370 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో రెండు ఆర్ఒబి లకు తోడు, శివ్‌పుర్-ఫుల్‌వరియా-లహర్‌తార గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టు ను కూడా ఆయన ప్రారంభించారు. ప్రధాన మంత్రి ప్రారంభించిన ఇతర ముఖ్య పథకాల లో 20 రహదారుల పటిష్టీకరణ మరియు విస్తరణ; కైథీ గ్రామం లో సంగమ్ ఘాట్ రోడ్డు
మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రి లో నివాస భవనాల నిర్మాణం, పోలీస్ లైన్, ఇంకా పిఎసి భుల్లన్‌పుర్ లలో 200 పడకల తో కూడిన, అలాగే 150 పడకల తో కూడిన బహుళ అంతస్తుల బేరక్ బిల్డింగు లు రెండు, 9 చోట్ల నిర్మాణం పూర్తి అయిన స్మార్ట్ బస్ శెల్టర్ లు, మరి అలాయీపుర్ లో నిర్మాణం జరిగిన 132 కెడబ్ల్యు సబ్ స్టేశన్ లు భాగం గా ఉన్నాయి. స్మార్ట్ సిటీ మిశన్ లో భాగం అయినటువంటి యూనిఫైడ్ టూరిస్ట్ పాస్ సిస్టమ్ ను కూడా ఆయన ప్రారంభించారు.
సుమారు 4,000 కోట్ల రూపాయల ఖర్చు తో చిత్రకూట్ జిల్లా లో ఒక 800 ఎమ్‌డబ్ల్యు సామర్థ్యం కలిగిన సోలర్ పార్క్, 1050 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో నిర్మించేటటువంటి మిర్జాపుర్ లోని నూతన పెట్రోలియమ్ ఆయిల్ టర్మినల్, 900 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో చేపట్టే వారాణసీ- భదోహీ ఎన్‌హెచ్ 731 బి (ప్యాకేజి-2) యొక్క విస్తరణ; 280 కోట్ల రూపాయల ఖర్చుతో జల్ జీవన్ మిశన్ లో భాగం గా 69 గ్రామీణ త్రాగునీటి పథకాలు సహా, 6,500 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన వివిధ ప్రాజెక్టు లు సహా అనేక ఆరోగ్య రంగ ప్రాజెక్టు లు ఉన్నాయి.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేవ్ దీపావళి సందర్భం లో చాలా ఎక్కువ సంఖ్య లో దీపాల ను వెలిగించి గిన్నెస్ ప్రపంచ రికార్డు ను నెలకొల్పినందుకు గాను వారాణసీ ప్రజల కు అభినందనల ను వ్యక్తం చేశారు. ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడడానికి స్వయం గా తాను హాజరు కాలేకపోయినటప్పటికీ, వారాణసీ ని సందర్భించిన విదేశీ ప్రముఖులు మరియు యాత్రికులు తత్సంబంధిత సమాచారాన్ని తనకు తెలియజేస్తూ వచ్చారని ప్రధాన మంత్రి అన్నారు. వారాణసీ ని గురించిన మరియు వారాణసీ పౌరుల ను గురించిన ప్రశంసల ను విని తాను గర్వపడినట్లు ఆయన వెల్లడించారు. ‘‘కాశీ యొక్క పౌరులు ప్రశంసల కు నోచుకోవడం నాకు ఎక్కడలేని గర్వాన్ని కలుగ జేసింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భగవాన్ మహాదేవుని నిలయాని కి సేవ చేసేందుకు తనను తాను సమర్పించుకోవడానికి మించింది లేదు అని ఆయన అన్నారు.
‘‘కాశీ సమృద్ధం అయింది అంటే యుపి సమృద్ధం అయినట్లు, మరి ఎప్పుడైతే యుపి సమృద్ధం అవుతుందో దేశం సమృద్ధం అయినట్లు’’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. రమారమి 20,000 కోట్ల రూపాయల విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు చేయడం మరియు ప్రారంభోత్సవాల లో పాలుపంచుకోవడం గురించి ఆయన ప్రస్తావించి, ఈ విషయం లో కూడా సమానమైన నమ్మకాన్ని వెలిబుచ్చారు. వారాణసీ లో పల్లెల కు నీటి సరఫరా ను గురించి బిహెచ్‌యు ట్రామా సెంటర్ లో క్రిటికల్ కేయర్ యూనిట్ ను గురించి, రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, విద్యుత్తు, సౌర శక్తి, గంగానది వద్ద ఘాట్ లు మరియు వివిధ ఇతర రంగాల ను గురించి ఆయన ప్రస్తావించారు. ఇవి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కి మరింత జోరు ను అందిస్తాయి అని ఆయన అన్నారు. నిన్నటి రోజు న సాయంత్రం పూట కాశీ-కన్యాకుమారి తమిళ్ సంగమం రైలు కు ప్రారంభ సూచక జెండా ను చూపెట్టడం గురించి, అదే విధం గా ఈ రోజు న వారాణాసీ-న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ఇంకా దోహ్‌రీఘాట్-మవూ ఎమ్ఇఎమ్‌యు రైళ్ళ కు ప్రారంభ సూచకం గా పచ్చజెండాల ను చూపడం గురించి కూడా ఆయన పేర్కొన్నారు. ఈ రోజు న చేపట్టుకొన్న అభివృద్ధి కార్యక్రమాల కు గాను ప్రతి ఒక్కరికి అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.
‘‘వికసిత్ భారత్ ఆవిష్కారం అనే సంకల్పానికి యావత్తు దేశం తో పాటుగా కాశీ కూడా కంకణం కట్టుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వేల కొద్దీ గ్రామాల కు మరియు నగరాల కు చేరుకొంది. ఆయా ప్రాంతాల లో కోట్ల సంఖ్య లో పౌరులు ఈ కార్యక్రమం తో జత పడుతున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. వారాణసీ లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లో చేరడాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించి, విబిఎస్‌వై వ్యాన్ లను ‘మోదీ కీ గ్యారంటీ కీ గాడీ’ (మోదీ యొక్క పూచీ తాలూకు బండి) అని ప్రజలు అంటున్నారు అని చెప్పారు. ‘‘ప్రభుత్వ పథకాల హక్కుదారులు అయిన అర్హత కలిగిన పౌరులు అందరి ని కలుపుకొని పోవాలి అన్నదే ప్రభుత్వం యొక్క ధ్యేయం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వమే పౌరుల చెంత కు చేరుకొంటున్నది, అంతేగాని దీనికి భిన్నమైన మార్గం ఏదీ లేదు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీ కీ గాడీ’ సూపర్ హిట్ అయింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతకు పూర్వం ఆదరణ కు దూరం గా ఉండిపోయిన వర్గాల లబ్ధిదారులు వేల కొద్దీ మంది వారాణసీ లో విబిఎస్‌వై తో అనుసంధానం అయి ఉన్నారు అని ప్రధాన మంత్రి తెలిపారు. ఆయుష్మాన్ కార్డు లు, ఉచిత రేశన్ కార్డు లు, పక్కా ఇళ్ళు, గొట్టపు మార్గం ద్వారా నీటి సరఫరా సదుపాయం మరియు ఉజ్జ్వల గ్యాస్ కనెక్శన్ లు వంటి ప్రయోజనాలు విబిఎస్‌వై ద్వారా లభించాయి అంటూ ఆయన కొన్ని ఉదాహరణల ను ఇచ్చారు. ‘‘విబిఎస్‌వై మరే అంశం కంటే కూడా ఎక్కువ గా ప్రజల లో నమ్మకాన్ని కలిగించింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ నమ్మకం భారతదేశాన్ని 2047 వ సంవత్సరాని కల్లా అభివృద్ధి చెందినటువంటి ఒక దేశం గా తీర్చిదిద్దాలి అనే నిశ్చయాన్ని బలపరచింది అని ఆయన అన్నారు. ఆంగన్ వాడీ బాలల లో తొణికిసలాడుతున్న ఆత్మవిశ్వాసం పట్ల ప్రధాన మంత్రి ఎక్కడలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, విబిఎస్‌వై సందర్శన కాలం లో తాను ఒక లబ్ధిదారు మరియు ఒక లక్షాధికారి అయినటువంటి సోదరి శ్రీమతి చందా దేవి తో జరిపిన భేటీ ని గురించి కూడా ఆయన ప్రశంస పూర్వకం గా తెలియ జేశారు. విబిఎస్‌వై ను పురస్కరించుకొని తాను నేర్చుకొన్న అనేక అంశాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ‘‘సార్వజనిక కార్యక్షేత్రం లో పాటుపడుతున్న వారి కి విబిఎస్‌వై ఒక యాత్రా విశ్వవిద్యాలయం’’ అంటూ వ్యాఖ్యానించారు.
నగర సుందరీకరణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రధాని వివరించారు. భక్తివిశ్వాసాలకు కేంద్రమైన కాశీ నగర వైభవం దినదినాభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. కాశీ విశ్వానాథ క్షేత్రం నవీకరణ కార్యక్రమాల అనంతరం 13 కోట్ల మందికిపైగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్న నేపథ్యంలో పర్యాటక రంగంలో కొత్త ఉద్యోగ అవకాశాలు అందివచ్చాయని ప్రధాని పేర్కొన్నారు. విదేశీ పర్యటనల గురించి యోచించేవారు ముందుగా 15 స్వదేశీ పర్యాటక ప్రదేశాలను సందర్శించాల్సిందిగా ఎర్రకోట బురుజుల నుంచి తాను పిలుపునివ్వడాన్ని ఆయన ప్రజలకు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో దేశీయ పర్యాటకానికి ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యాధునిక నగరాల కార్యక్రమం (ఎస్‌సిఎం) కింద ఏకీకృత పర్యాటక పాసు వ్యవస్థ సహా పర్యాటక సదుపాయాల మెరుగుదల, నగర సమాచారమిచ్చే పర్యాటక వెబ్‌సైట్ ‘కాశీ’ని ప్రారంభించడం వంటి చర్యలను ప్రధాని ఏకరవు పెట్టారు. గంగా స్నానఘట్టాల పునరుద్ధరణ పనులు ప్రారంభించడం, ఆధునిక బస్ షెల్టర్లు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లలో కల్పించిన సౌకర్యాలను కూడా ఆయన ప్రస్తావించారు.
రైల్వే సంబంధిత ప్రాజెక్టుల గురించి వివరిస్తూ- తూర్పు-పశ్చిమ ప్రత్యేక రవాణా కారిడార్లు, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ నగర్-న్యూ భావుపూర్ కొత్త మార్గం ప్రారంభోత్సవం వగైరాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్థానిక కర్మాగారంలో తయారైన 10,000వ రైలు ఇంజన్‌ను ప్రారంభించడంపైనా ఆయన హర్షం ప్రకటించారు. సౌర విద్యుత్ రంగంలో ద్వంద్వ చోదక ప్రభుత్వ కృషిని కూడా ఆయన ప్రస్తావించారు. చిత్రకూట్‌లోని 800 మెగావాట్ల సౌరశక్తి పార్కు రాష్ట్రంలో విశ్వసనీయ విద్యుత్ సరఫరాపై తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. దేవరాయ్, మీర్జాపూర్‌లలో పెట్రోల్, డీజిల్, బయో- సిఎన్‌జి, ఇథనాల్ శుద్ధి సంబంధిత సదుపాయాలు రాష్ట్ర పెట్రో ఉత్పత్తుల అవసరాన్ని తీరుస్తాయని చెప్పారు.
వికసిత భారతం సంకల్ప సాధనకు నారీశక్తి, యువశక్తి, రైతులు, పేదల అభివృద్ధి కీలకమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ‘‘నా విషయంలో దేశంలోని చతుర్వర్ణాలు ఇవే. వీటి బలోపేతం ద్వారానే దేశం బలోపేతం కాగలదు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ సూత్రం ఆధారంగానే ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని గుర్తుచేశారు. ఈ మేరకు రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.30,000 కోట్ల బదిలీ చేసిన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ వంటి పథకంతోపాటు కిసాన్ క్రెడిట్ కార్డులు, సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం, కిసాన్ డ్రోన్ల గురించి ప్రధాని వివరించారు. వీటితోపాటు ఎరువులు చల్లే సౌలభ్యం కల్పించే ‘‘నమో డ్రోన్ దీదీ’’ పథకం గురించి ప్రస్తావించారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు వీటి వినియోగం శిక్షణ ఇప్పించడం గురించి కూడా వివరించారు.
అత్యాధునిక బనస్ పాడి పరిశ్రమ రూ.500 కోట్లకుపైగా పెట్టుబడితో పాడి పశువుల పెంపకం కార్యక్రమంతోపాటు ప్లాంటు నిర్వహిస్తుండటాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. బెనారస్ రైతులకు ఈ డెయిరీ ఒక వరంగా నిరూపితం కాగలదని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. బనస్ డెయిరీ ప్లాంట్లు ఇప్పటికే లక్నో, కాన్పూర్ నగరాల్లో నడుస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని 4 వేలకుపైగా గ్రామాల రైతులకు ఈ డెయిరీ రూ.వెయ్యి కోట్లదాకా చెల్లించింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కార్యక్రమం సందర్భంగా రూ.100 కోట్లకుపైగా సొమ్మును లాభాంశం కింద డెయిరీ యాజమాన్యం పాడి రైతుల ఖాతాల్లో జమ చేసింది.
చివరగా- వారణాసి అభివృద్ధి స్రవంతి ఈ ప్రాంతం మొత్తాన్నీ కొత్త శిఖరాలకు చేరుస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. దశాబ్దాలుగా పూర్వాంచల్ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైనప్పటికీ మహదేవుని ఆశీర్వాదంతో మోదీ ఇప్పుడు ఆ ప్రాంత సేవా కార్యక్రమంలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానుండటాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ- మూడోసారి అధికారంలోకి వచ్చాక భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ‘‘ఇవాళ నేను దేశానికి ఈ హామీ ఇస్తున్నానంటే, అది కాశీలోని నా కుటుంబ సభ్యులైన మీ అందరి ప్రోత్సాహంతోనే. నా సంకల్పాలను బలపరుస్తూ మీరంతా సదా నాకు అండగా నిలుస్తున్నారు’’ అంటూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
వారణాసి సుందరీకరణతోపాటు పరిసర ప్రాంతాల ప్రజల జీవన సౌలభ్యం మెరుగుపై గడచిన తొమ్మిదేళ్లుగా ప్రధానమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ దిశగా మరో ముందడుగు వేస్తూ దాదాపు రూ.19,150 కోట్లతో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.
ఇందులో భాగంగా దాదాపు రూ.10,900 కోట్లతో నిర్మించిన కొత్త పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ నగర్-న్యూ భౌపూర్ ప్రత్యేక రవాణా కారిడార్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించారు. దీంతోపాటు బలియా-ఘాజీపూర్ సిటీ రైలుమార్గం డబ్లింగ్ ప్రాజెక్ట్; ఇందార-దోహ్రిఘాట్ రైలుమార్గం గేజ్ మార్పిడి ప్రాజెక్ట్ తదితరాలను కూడా ఆయన ప్రారంభించారు.
కొత్తగా రవాణా కారిడార్ మార్గంలో వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్, దోహ్రీఘాట్-మౌ మార్గంలో ‘మెము’ రైలుసహా ఒక జత సుదూర గూడ్స్ రైళ్లను, బనారస్ ఇంజన్ల తయారీ కర్మాగారం తయారుచేసిన 10,000వ ఇంజన్‌ను కూడా ప్రధాని జెండా ఊపి సాగనంపారు.
అలాగే రూ.370 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన రెండు రోడ్డు ఓవర్ బ్రిడ్జిలను, హరిత క్షేత్ర శివ్‌పూర్-ఫుల్వారియా-లహర్తారా రహదారిని ప్రధాని ప్రారంభించారు. ఇది వారణాసి నగర ఉత్తర- దక్షిణ ప్రాంతాల మధ్య వాహన రాకపోకలను సరళీకరిస్తుంది. అలాగే పర్యాటకులకు సౌకర్యాలు సమకూరుస్తుంది. ప్రధాని ప్రారంభించిన మరికొన్ని కీలక ప్రాజెక్టులలో- 20 రోడ్ల మరమ్మతు-విస్తరణ పనులు, కైతి గ్రామంలో సంగం ఘాట్ రోడ్డు, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో నివాస భవనాల నిర్మాణం వగైరాలు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా పోలీసు సిబ్బంది గృహవసతి సమస్య పరిష్కారం దిశగా పోలీస్ లైన్, పిఎసి భుల్లన్‌పూర్‌లో రెండు 200, 150 పడకల బహుళ అంతస్తులుగల బ్యారక్ భవనాలు, 9 ప్రదేశాల్లో నిర్మించిన అత్యాధునిక బస్ షెల్టర్లు, అలైపూర్‌లో నిర్మించిన 132 కిలోవాట్ సబ్‌స్టేషన్‌ను ప్రధాని ప్రారంభించారు.
అత్యాధునిక నగరాల కార్యక్రమం కింద, సమగ్ర పర్యాటక సమాచారం అందించే వెబ్‌సైట్, ఏకీకృత పర్యాటక పాసు వ్యవస్థకు ప్రధానమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ పాసుల వ్యవస్థ శ్రీ కాశీ విశ్వనాథ క్షేత్రం సందర్శన, గంగానదిలో నౌకా విహారం, సారనాథ్ లైట్ అండ్ సౌండ్ షో వంటివాటికి ప్రవేశం కల్పిస్తుంది. ఇది సమీకృత ‘క్యూఆర్’ ఆధారంగా సేవలందిస్తుంది.
మరోవైపు రూ.6500 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పాదక పెంపు దిశగా చిత్రకూట్ జిల్లాలో దాదాపు రూ.4000 కోట్లతో 800 మెగావాట్ల సౌరశక్తి పార్కుకు ప్రధాని శంకుస్థాపన చేశారు. పెట్రోలియం సరఫరా శ్రేణి పెంచడంలో భాగంగా మీర్జాపూర్‌లో రూ.1050 కోట్లతో నిర్మించే కొత్త పెట్రోలియం, ఆయిల్ టెర్మినల్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.
ప్రధాని శంకుస్థాపన చేసిన మరికొన్ని ప్రాజెక్టులలో రూ.900కుపైగా వ్యయంతో వారణాసి-భదోహి జాతీయ రహదారి నం.731బి (ప్యాకేజీ-2); జల్ జీవన్ మిషన్ కింద రూ.280 కోట్లతో 69 గ్రామీణ తాగునీటి పథకాలు; బిహెచ్‌యు అత్యవసర చికిత్స కేంద్రంలో 150 పడకల సామర్థ్యం గల ప్రాణరక్షక యూనిట్ నిర్మాణం; 8 గంగా ఘాట్‌ల పునరాభివృద్ధి, దివ్యాంగ ఆశ్రమ మాధ్యమిక పాఠశాల నిర్మాణం వగైరాలున్నాయి.
महादेव की काशी की मैं जितनी भी सेवा कर पाउं...वो मुझे कम ही लगता है: PM @narendramodi pic.twitter.com/tN9g68LF31
— PMO India (@PMOIndia) December 18, 2023
आज काशी समेत सारा देश विकसित भारत के निर्माण के लिए प्रतिबद्ध है। pic.twitter.com/72CZyDWXIb
— PMO India (@PMOIndia) December 18, 2023
हमारा प्रयास है कि भारत सरकार ने गरीब कल्याण की, जन-कल्याण की जो भी योजनाएं बनाई हैं, उनसे कोई भी लाभार्थी वंचित न रहे: PM @narendramodi pic.twitter.com/XdPa0knpNT
— PMO India (@PMOIndia) December 18, 2023
आस्था और आध्यात्म के महत्वपूर्ण केंद्र के रूप में काशी का गौरव दिन-प्रतिदिन बुलंद होता जा रहा है: PM @narendramodi pic.twitter.com/4N2DngP7XN
— PMO India (@PMOIndia) December 18, 2023
Make in India, make for the world. pic.twitter.com/sYGteUO3yt
— PMO India (@PMOIndia) December 18, 2023
विकसित भारत के लिए देश की नारीशक्ति, युवा शक्ति, किसान और हर गरीब का विकास होना बहुत जरुरी है। pic.twitter.com/FTTpiDCIU6
— PMO India (@PMOIndia) December 18, 2023