రాజస్థాన్, అబు రోడ్ లో ఉన్న బ్రహ్మకుమారీల శాంతివన్ కాంప్లెక్స్ ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు. సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ ఆసుపత్రి, శివమణి వృద్ధాశ్రమం రెండో దశ, నర్సింగ్ కళాశాల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి తిలకించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, బ్రహ్మకుమారీల శాంతివన్ కాంప్లెక్స్ ని అనేక సందర్భాల్లో సందర్శించే అవకాశం వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తాను ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నప్పుడల్లా ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని ఆయన చెప్పారు. గత కొన్ని నెలల్లో బ్రహ్మకుమారీలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావడం ఇది రెండోసారి అని ఆయన తెలియజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జల్-జన్-అభియాన్ ను ప్రారంభించే అవకాశాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకుంటూ, బ్రహ్మ కుమారీ స్ సంస్థతో తనకు గల నిరంతర అనుబంధం గురించి, పరమపిత ఆశీర్వాదం, రాజ్య యోగిని దాదీజీ యొక్క ఆప్యాయత గురించి ఆయన ఘనంగా చెప్పారు. సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశామని, అలాగే శివమణి వృద్ధాశ్రమం, నర్సింగ్ కళాశాల విస్తరణ పనులు జరుగుతున్నాయని ప్రధానమంత్రి తెలియజేశారు. ఇందుకు బ్రహ్మకుమారీస్ సంస్థను ఆయన అభినందించారు.
అమృత్ కాల్ యొక్క ఈ యుగంలో అన్ని సామాజిక, మతపరమైన సంస్థలు పెద్ద పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు. “ఈ అమృత్ కాల్ దేశంలోని ప్రతి పౌరునికి కర్తవ్య కాలం. దీనర్థం మనం మన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి”, అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. సమాజం, దేశ ప్రయోజనాల కోసం మన ఆలోచనలు, బాధ్యతల విస్తరణతో పాటుగా ఇది కొనసాగాలని, ఆయన పేర్కొన్నారు. బ్రహ్మకుమారీలు ఒక సంస్థగా సమాజంలో నైతిక విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తారని, ఆయన చెప్పారు. సైన్స్, విద్య, సామాజిక అవగాహనలను ప్రోత్సహించడంలో వారి పాత్ర గురించి కూడా ఆయన వివరించారు. ఆరోగ్యం, సంరక్షణ రంగంలో వారి కృషిని కూడా ఆయన ప్రశంసించారు.
పేద వర్గాల్లో వైద్య చికిత్స పొందాలనే భావనను వ్యాప్తి చేయడంలో ఆయుష్మాన్ భారత్ పాత్ర గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, "దేశం ఆరోగ్య సదుపాయాల పరివర్తనకు లోనవుతోంది" అని, పేర్కొన్నారు. పేద పౌరులకు ప్రభుత్వంతో పాటు, ఇది ప్రైవేటు ఆసుపత్రుల తలుపులు కూడా తెరిచిందని, ఆయన తెలియజేశారు. ఇప్పటికే 4 కోట్ల మందికి పైగా పేద రోగులు ఈ పథకం కింద ప్రయోజనాలను పొందారని, వారికి 80 వేల కోట్ల రూపాయలు ఆదా చేయడంలో ఏ పథకం సహాయపడిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా, జన్ ఔషధి పథకం పేద, తరగతి రోగులకు సుమారు 20 వేల కోట్ల రూపాయలను ఆదా చేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని బ్రహ్మకుమారీల యూనిట్లను ఆయన ఈ సందర్భంగా కోరారు.
దేశంలో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది కొరతను పరిష్కరించడానికి దేశంలో సంభవించిన అపూర్వ పరిణామాల గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, గత 9 ఏళ్లలో సగటున ప్రతి నెలా ఒక వైద్య కళాశాల ప్రారంభించినట్లు, తెలియజేశారు. 2014 సంవత్సరానికి ముందు దశాబ్ద కాలంలో 150 కంటే తక్కువ వైద్య కళాశాలలు ప్రారంభం కాగా, గత 9 ఏళ్లలో ప్రభుత్వం 350కి పైగా వైద్య కళాశాలలను ప్రారంభించిందని, ఆయన ఎత్తిచూపారు. 2014 సంవత్సరానికి ముందు, ఆ తర్వాత పోలికను వివరిస్తూ, దేశంలో ప్రతి సంవత్సరం ఎం.బి.బి.ఎస్. కోసం దాదాపు 50 వేల సీట్లు ఉండేవని, అయితే ఇప్పుడు, ఆ సంఖ్య, ఒక లక్షకు పైగా పెరిగిందనీ, అదేవిధంగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ల సంఖ్య దాదాపు 30 వేల నుంచి, ఇప్పుడు 65 వేలకు పెరిగిందనీ, ప్రధానమంత్రి తెలియజేశారు. "ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నప్పుడు, అదేవిధంగా, సామాజిక సేవా భావం ఉన్నప్పుడు, అటువంటి తీర్మానాలు తీసుకోబడతాయి, అవి నెరవేరుతాయి", అని ఆయన అన్నారు.
నర్సింగ్ రంగంలో ఉత్పన్నమయ్యే అవకాశాల గురించి ప్రధానమంత్రి వివరిస్తూ, "వచ్చే దశాబ్దంలో భారతదేశంలో ఉత్పత్తి కానున్న వైద్యుల సంఖ్య స్వాతంత్య్రం తర్వాత గత 7 దశాబ్దాలలో ఉత్పత్తి అయిన వైద్యుల సంఖ్యతో సమానంగా ఉంటుంది", అని వ్యాఖ్యానించారు. దేశంలో 150కి పైగా నర్సింగ్ కళాశాలలకు ఆమోదం లభించిందనీ, వీటిలో రాజస్థాన్ లోనే 20కి పైగా నర్సింగ్ కళాశాలలు రానున్నాయని, దీని వల్ల రాబోయే సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ ఆసుపత్రికి కూడా ప్రయోజనం చేకూరుతుందనీ, ఆయన వివరించారు.
భారతీయ సమాజంలో మతపరమైన, ఆధ్యాత్మిక సంస్థలు పోషించే సామాజిక, విద్యాపరమైన పాత్ర గురించి, ప్రధానమంత్రి వివరిస్తూ, ప్రకృతి వైపరీత్యాల విషయంలో బ్రహ్మ కుమారీలు అందించిన సహకారాన్నీ, మానవాళి సేవ కోసం సంస్థ యొక్క అంకితభావాన్ని చూసిన అతని వ్యక్తిగత అనుభవన్నీ, గుర్తు చేసుకున్నారు. జల్ జీవన్ మిషన్, డి-అడిక్షన్ పీపుల్స్ ఉద్యమం వంటి అంశాలను బ్రహ్మకుమారీలు రూపొందించారని ఆయన కొనియాడారు.
బ్రహ్మ కుమారి సంస్థ తాను నిర్దేశించిన అంచనాలను ఎల్లవేళలా అధిగమిస్తోందనీ, "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్", "యోగ్-శివిర్" కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమయంలో, దీదీ జానకీ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ గా మారడాన్ని ప్రధానమంత్రి ఇందుకు ఉదాహరణగా చెప్పారు. బ్రహ్మ కుమారీల ఇటువంటి చర్యలు, సంస్థపై తనకున్న విశ్వాసాన్ని రెట్టింపు చేశాయని, తద్వారా కొత్త అంచనాలను నెలకొల్పిందని ఆయన పేర్కొన్నారు.
శ్రీ అన్న గురించి, ప్రపంచ స్థాయిలో మిల్లెట్లకు భారతదేశం అందిస్తున్న ప్రోత్సాహం గురించి, ప్రధానమంత్రిప్రస్తావించారు. ప్రకృతి వ్యవసాయం, మన నదులను శుద్ధి చేయడం, భూగర్భ జలాలను పరిరక్షించడం వంటి కార్యక్రమాలను దేశం ముందుకు తీసుకువెళుతోందని, ఈ అంశాలు వేల సంవత్సరాల నాటి సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి, తమ ప్రసంగాన్ని ముగిస్తూ, దేశ నిర్మాణానికి సంబంధించిన నూతన అంశాలను వినూత్న రీతిలో ముందుకు తీసుకెళ్లాలని బ్రహ్మకుమారీలను కోరారు. “ఈ ప్రయత్నాలలో మీకు ఎంత సహకారం లభిస్తే, దేశానికి అంతగా సేవ చేయబడుతుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రపంచానికి ‘సర్వే భవన్తు సుఖినః’ అనే మంత్రానికి అనుగుణంగా జీవిస్తాం” అని ప్రధాన మంత్రి ముగించారు.
నేపథ్యం
ప్రధానమంత్రి ప్రత్యేక దృష్టి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఊతం ఇస్తోంది. ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ, ప్రధానమంత్రి బ్రహ్మ కుమారీల శాంతి వన్ కాంప్లెక్స్ ను సందర్శిస్తారు. సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ ఆసుపత్రి, శివమణి వృద్ధాశ్రమం రెండో దశ, నర్సింగ్ కళాశాల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అబూ రోడ్ లో 50 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఛారిటబుల్ గ్లోబల్ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఇది ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను అందిస్తుంది. ఈ ప్రాంతంలోని పేదలకు, ప్రత్యేకించి గిరిజన ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
आज़ादी का ये अमृतकाल, देश के हर नागरिक के लिए कर्तव्यकाल है। pic.twitter.com/IHVjkrIffs
— PMO India (@PMOIndia) May 10, 2023
देश स्वास्थ्य सुविधाओं के ट्रांसफॉर्मेशन से गुजर रहा है।
— PMO India (@PMOIndia) May 10, 2023
इसमें एक बड़ी भूमिका आयुष्मान भारत योजना ने निभाई है। pic.twitter.com/ZcahaMetAL
मुझे आशा है, राष्ट्र निर्माण से जुड़े नए विषयों को ब्रह्मकुमारीज़, innovative तरीके से आगे बढ़ाएँगी: PM @narendramodi pic.twitter.com/x6LkLCL6JO
— PMO India (@PMOIndia) May 10, 2023
आज भारत श्रीअन्न यानी मिलेट्स को लेकर एक वैश्विक आंदोलन को आगे बढ़ा रहा है। pic.twitter.com/8uCSkS0kb5
— PMO India (@PMOIndia) May 10, 2023