‘‘శ్రీ కల్కి ధామ్ దేవాలయం భారతదేశం లో ఒక క్రొత్త ఆధ్యాత్మిక కేంద్రం గా వెలుగు లోకి వస్తుంది’’
‘‘నేటి భారత దేశం ‘వారసత్వంతో పాటు అభివృద్ధి కూడా’అనే మంత్రం తో వేగం గా ముందుకు సాగిపోతున్నది’’
‘‘భారతదేశం యొక్కసాంస్కృతిక పునరుత్థానానికి వెనుక ప్రేరణగాను, మనకు లభించిన గుర్తింపు నకు గర్వ కారణం గాను మరియు దానిని ప్రతిష్టాపించేటటువంటిఆత్మవిశ్వాసం గాను ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ నిలబడి ఉన్నారు ’
‘‘రామ్ లలా కొలువైనఆ అలౌకిక అనుభవం, ఆ యొక్కదివ్యమైనటువంటి అనుభవం ఇప్పుడిక మనల ను ఉద్వేగ భరితుల ను చేసి వేస్తోంది’’
‘‘ఇదివరకు ఊహ కు కూడా అందనిది ప్రస్తుతం ప్రత్యక్షం గా రూపుదాల్చింది’’
‘‘ప్రస్తుతం ఒకప్రక్కన మన తీర్థ యాత్ర స్థలాల ను అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంటే, మరో ప్రక్కన నగరాల లో హై-టెక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుకూడా తయారు చేయడం జరుగుతోంది’’
‘‘కాలచక్రం లోపరివర్తన కు కల్కి ఆద్యుడే కాకుండా ఒక ప్రేరణా మూర్తి గా కూడా ఉన్నారు’’
‘‘ఓటమి కోరల లోనుండి విజయాన్ని ఎలా కైవసం చేసుకోవాలో భారతదేశాని కి తెలుసును’’
‘‘ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశం ఎవరినో అనుసరించడం కాకుండా, మనంతట మనమే ఒక ఉదాహరణ ను నిలబెట్టే స్థితి లో ఉంది’’
‘‘నేటి భారతదేశం లోమనకు ఉన్న శక్తి అనంతమైందిగా ఉంది, మరి మనకు ఉన్న అవకాశాలు కూడా అపారమైనవి’’
‘‘భారతదేశం పెద్దపెద్ద సంకల్పాల ను తీసుకొన్నప్పుడల్లా, దానికి దారిని చూపెట్టడం కోసం దైవీయ చైతన్యం ఏదో ఒక రూపం లో మనమధ్య కు తప్పక వస్తున్నది’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్ జిల్లా లో శ్రీ కల్కి ధామ్ దేవాలయాని కి శంకుస్థాపన చేశారు. శ్రీ కల్కి ధామ్ దేవాలయం యొక్క నమూనా ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. శ్రీ కల్కి ధామ్ ను ఆచార్య శ్రీ ప్రమోద్ కృష్ణామ్ చైర్‌మన్ గా ఉన్నటువంటి శ్రీ కల్కి ధామ్ నిర్మాణ్ ట్రస్టు నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమం లో అనేక మంది సాధువులు, ధార్మిక నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాలుపంచుకొంటున్నారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రభువు శ్రీ రాముని మరియు శ్రీ కృష్ణుని నిలయం అయినటువంటి ఈ ప్రాంతం భక్తి, భావోద్వేగం మరియు ఆధ్యాత్మికత్వం లతో మరొక్క సారి నిండిపోయింది. మరొక ప్రముఖ తీర్థయాత్ర స్థలాని కి శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజు జరుగుతుండడమే దీనికి కారణం. సంభల్ లో శ్రీ కల్కిధామ్ దేవాలయాని కి శంకుస్థాపన చేసే అవకాశం లభించినందుకు శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ఇది భారతదేశం లో ఆధ్యాత్మికత్వం తాలూకు ఒక క్రొత్త కేంద్రం గా ఉనికి లోకి వస్తుందన్న విశ్వాసాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ప్రపంచవ్యాప్తం గా పౌరులు అందరికీ మరియు తీర్థయాత్రికుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

పద్దెనిమిది సంవత్సరాల పాటు నిరీక్షణ అనంతరం ఈ ధామం ప్రారంభం అవుతున్న విషయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, నేను పూర్తి చేయవలసిన సత్కార్యాలు అనేకం ఉన్నట్లు గా అనిపిస్తోంది అన్నారు. ప్రజల యొక్క మరియు మునుల యొక్క ఆశీర్వాదాల తో అసంపూర్తి గా ఉన్న కార్యాల ను పూర్తి చేయడాన్ని తాను కొనసాగిస్తూ ఉంటానని ఆయన అన్నారు.

 

ఈ రోజు న ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ యొక్క జయంతి. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, నేడు జరుగుతున్నటువంటి సాంస్కృతిక పునరుద్ధరణ, గౌరవం మరియు మన గుర్తింపు పట్ల నమ్మకాల కు సంబంధించిన ఖ్యాతి శ్రీ శివాజీ మహారాజ్ కు దక్కుతుంది అన్నారు. ఛత్రపతి శ్రీ శివాజీ మహారాజ్ కు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

దేవాలయం యొక్క వాస్తు కళ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ దేవాలయం లో పది గర్భగుడులు ఉంటాయి, వాటిలో భగవానుని దశ అవతారాల మూర్తులు కొలువుదీరుతాయి అన్నారు. ఈ పది అవతారాల ద్వారా ధర్మ గ్రంథాల లో మానవ రూపం సహా భగవానుని యొక్క అన్ని రూపాల ను ఆవిష్కరించడం జరిగింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ‘‘జీవనం లో ఎవరైనా ఒక వ్యక్తి భగవానుని యొక్క చేతన ను తన అనుభవం లోకి తెచ్చుకోగలుగుతారు. ’’ మనం భగవానుని ‘సింహం , వరాహం మరియు కూర్మం’ ల రూపాల లో అనుభవం లోకి తెచ్చుకొన్నాం’’ అని అని ప్రధాన మంత్రి అన్నారు. భగవానుని ఈ స్వరూపాల లో కొలువుదీర్చడం ప్రజల కు భగవాన్ పట్ల మాన్యత తాలూకు సమగ్రమైన మూర్తుల ను అవగాహన లోకి తీసుకు వస్తుంది అని ఆయన అన్నారు. శ్రీ కల్కి ధామ్ దేవాలయాని కి శంకుస్థాపన ను చేసే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు గాను భగవంతుని కి ధన్యవాదాల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో హాజరు అయిన మునులు అనేక మంది కి వారు అందించినటువంటి మార్గదర్శకత్వాని కి గాను ప్రణామాన్ని ఆచరించడం తో పాటుగా శ్రీ ఆచార్య ప్రమోద్ కృష్ణామ్ కు కూడా ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

 

ఈ రోజు న జరుపుకొంటున్నటువంటి కార్యక్రమం భారతదేశం యొక్క సాంస్కృతిక పునర్జాగరణ తాలూకు మరొక అద్వితీయమైనటువంటి క్షణం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. అయోధ్య ధామ్ లో శ్రీ రామ మందిరం యొక్క అభిషేకం గురించి మరియు అబూ ధాబి లో ఆలయాన్ని ఇటీవల ప్రారంభించడాన్ని గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ‘‘ఊహ కు ఎప్పుడైనా అందనిది ఇక వాస్తవం గా మారిపోయింది’’ అన్నారు.

 

వెంట వెంటనే ఆ తరహా కార్యక్రమాలు చోటు చేసుకొంటూ ఉండడం యొక్క మహత్త్వాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిపలికారు. ఆధ్యాత్మిక ఉత్థనాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, కాశీ లో విశ్వనాథ్ ధామ్, కాశీ యొక్క రూపు రేఖలు మార్పునకు లోను కావడం, మహాకాళ్ మహాలోక్, సోమ్‌‌ నాథ్, ఇంకా కేదార్‌ నాథ్ ధామ్ లను గురించి ప్రస్తావించారు. ‘‘ మనం ‘వికాస్ భీ విరాసత్ భీ’ (‘వారసత్వం తో పాటుగా అభివృద్ధి కూడాను) అనే మంత్రం తో ముందుకు సాగిపోతున్నాం’’ అని ఆయన అన్నారు. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం తో కూడినటువంటి పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతుండడాన్ని ఒక వైపు న, ఆధ్యాత్మిక కేంద్రాల ను మరొక వైపున, దేవాలయాల జాడ ను ఒక ప్రక్కన, క్రొత్త వైద్య చికిత్స కళశాల ల స్థాపన ను మరొక వైపు న, విదేశాల నుండి కళాకృతులు భారతదేశాని కి తరలి వస్తుండడాన్ని ఒక వైపున మరియు విదేశీ పెట్టుబడుల రాక ను మరొక వైపు మనం గమనించ వచ్చును అని ఆయన అన్నారు. ఈ ఘటన క్రమాలు కాలమనే చక్రం యొక్క భ్రమణాన్ని సూచిస్తున్నాయి అని ఆయన అన్నారు. ఎర్ర కోట మీది నుండి ఆయన ‘యహీ సమయ్ హై, సహీ సమయ్ హై’ (‘ ఇదే సమయం - ఇదే సరి అయినటువంటి సమయం’) అంటూ ఇచ్చిన పిలుపు ను గుర్తు కు తీసుకు వస్తూ, కాలం తో కలసి నడవవలసినటువంటి అవసరం ఎంతయినా ఉంది అని స్పష్టం చేశారు.

 

అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని గుర్తుచేసుకుంటూ ప్రధానమంత్రి, 2024 జనవరి 22నుంచి కొత్త కాలచక్రం ప్రారంభమైందని అన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీరాముడి పాలన వేల సంవత్సరాలు కొనసాగిన విషయం తెలియజేశారు.అలాగే ఇప్పుడు రామ్‌లల్లా ప్రతిష్టతో, ఇండియా తన నూతన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నదని , ఆజాది కా అమృత్‌ కాల్‌లో వికసిత్‌ భారత్‌ సంకల్పంతో ముందుకు పోతున్నదని తెలిపారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయం, ప్రతి కాలంలోనూ ఇదే సంకల్పంతో సజీవంగా ఉంటూ వచ్చిందని అన్నారు. శ్రీ కల్కి రూపాలకు సంబంధించి ఆచార్య ప్రమోద్‌ కృష్ణన్‌ జీ పరిశోధన, వారి అధ్యయనం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, మన పురాణ గ్రంథాలపై వారికిగల పట్టును వివరించారు. కల్కి మార్గం , శ్రీరాముడి మార్గంలా భవిష్యత్‌లో వేలాది ఏళ్లకు దిశను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు.

 

కాలచక్రంలో మార్పునకు కల్కి సంకేతమని , ప్రేరణశక్తి అని ప్రధానమంత్రి అన్నారు. కల్కిధామ్‌ కల్కిభగవానుడు అవతరించబోయే ప్రదేశమని అన్నారు. మన గ్రంథాలలో వేల ఏళ్ల క్రితమే ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఉందని అన్నారు.  ప్రమోద్‌ కృష్ణన్‌ జీ ఈ విశ్వాసాలను మరింత ముందుకు తీసుకువెళుతున్నందుకు, పూర్తి నమ్మకంతో , తమ జీవితాన్ని ఇందుకు అంకితం చేస్తున్నందుకు వారిని అభినందించారు. కల్కి ఆలయం ఏర్పాటుకు గత ప్రభుత్వాలతో ఆచార్య ప్రమోద్‌ కృష్ణం జీ సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చిందని ఆయన అన్నారు.  ఇందుకు వారు కోర్టులకు కూడా వెళ్లవలసి వచ్చిందన్నారు. ఆచార్యజీతో ఇటీవల తన సంభాషణ గురించి ఆయన ప్రస్తావించారు. వారితో మాట్లాడిన తర్వాత వారి ఆథ్యాత్మికత,మతానికి సంబంధించివారి అంకితభావం తెలిసిందన్నారు. ఇవాళ ప్రమోద్‌ కృష్ణన్‌ జీ ప్రశాంత మనస్సుతో ఆలయ నిర్మాణం ప్రారంభించుకోగలుగుతున్నారన్నారు. మెరుగైన భవిష్యత్‌ దిశగా ప్రస్తుత ప్రభుత్వం సానుకూల దృష్టితో చూస్తున్నదనడానికి ఈ ఆలయం ఒకనిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
ఓటమి కోరలకుచిక్కకుండా విజయాన్ని ఎలా వరించాలో ఇండియాకు బాగా తెలుసునని ప్రధానమంత్రి అన్నారు. ఎన్నోరకాల దండయాత్రలను తట్టుకుని భారత సమాజం నిలిచిందని ప్రధానమంత్రి గుర్తుచేశారు.

 

‘‘ ప్రస్తుత భారతదేశ అమృత్‌ కాల్‌లో భారతదేశపు వైభవం, సమున్నతత, బలానికి సంబంధించిన విత్తనాలు అంకురిస్తున్నాయ’’ని ఆయన అన్నారు.సాదువులు, ఆథ్యాత్మిక వేత్తలు కొత్త ఆలయాలను నిర్మిస్తున్నారని చెప్పారు.  జాతి మందిర నిర్మాణ లక్ష్యాన్ని తనకు అప్పగించారన్నారు. రాత్రింబగళ్లు  తాను దేశమనే ఆలయ ప్రతిష్ఠను మరింత వైభవ దశకు తీసుకెళ్లడానికి కృషిచేస్తున్నట్టు తెలిపారు. ‘‘ఇవాళ తొలిసారిగా, భారతదేశం, ఒకరి వెనుక నడవడం కాక, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నద’’ని చెప్పారు. ఈ పట్టుదల, కృషి ఫలితంగా సాధించిన విజయాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు.  ఇండియా డిజిటల్‌ సాంకేతికత, ఆవిష్కరణలకు సంబంధించి గొప్ప హబ్‌గా రూపుదిద్దుకున్నదన్న విషయాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.  ఇండియా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నదని,  చంద్రయాన్‌ విజయం, ఆధునిక రైళ్లు అయిన వందే భారత్‌, నమో భారత్‌, రానున్న బుల్లెట్‌ రైళ్లు, బలమైన హైటెక్  హైవేలు, ఎక్స్ప్రెస్ వేల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.ఈ విజయాలు ఇండియాను గర్వపడేట్టు చేస్తున్నాయన్నారు. ఈ రకమైన సానుకూల ఆలోచనా దృక్పథం, దేశంపై విశ్వాసం అద్భుత స్థితిలో ఉన్నాయన్నారు. అందువల్ మన సామర్ధ్యాలు అనంతమని, మన అవకాశాలు కూడా అనంతమని ఆయన అన్నారు.సమష్టి కృషినుంచే  దేశం శక్తిని పొందుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇండియాలో ఇవాళ సమష్టి చైతన్యం వెల్లివిరుస్తోందని ప్రధానమంత్రి అన్నారు.ప్రతి పౌరుడు సబ్ కా సాథ్, సబ్ కా వికాస్  సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ కోసం పాటుపడుతున్నాడని ప్రధానమంత్రి తెలిపారు.

 

గత పది సంవత్సరాలలో జరిగిన కృషిని ప్రధానమంత్రి ప్రస్తావించారు. పి.ఎం.ఆవాస్ యోజన్ కింద నాలుగు కోట్లకుపైగా పక్కా గృహాల నిర్మాణం జరిగిందని, 11 కోట్లటాయిలెట్లు, 2.5 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సదుపాయం, 10 కోట్ల  ఇళ్లకు పైపు ద్వారా మంచినీటి సరఫరా 80 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఉచితరేషన్,పది కోట్ల మహిళలకు సబ్సిడీధరకు గ్యాస్ సిలిండర్లు,  50 కోట్ల ఆయుష్మాన్ కార్డులు, 10 కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్నిధి, కోవిడ్ మహమ్మారి సమయంలో ఉచిత వాక్సిన్ , స్వచ్ఛభారత్ కార్యక్రమాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi