‘బీనా రిఫైనరీ లోపెట్రోకెమికల్ కాంప్లెక్స్’ కు ఆయన శంకుస్థాపన చేశారు
నర్మదపురం లో ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్’ కు మరియు రత్ లామ్ లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ కుకూడా శంకుస్థాపన చేశారు
ఇందౌర్ లో రెండు ఐటి పార్కుల తో పాటుగా రాష్ట్రమంతటా వివిధప్రాంతాల లో ఆరు క్రొత్త ఇండస్ట్రియల్ పార్కుల కు శంకుస్థాపన చేశారు
‘‘ఈ రోజు నమొదలవుతున్న ఈ ప్రాజెక్టు లు మధ్య ప్రదేశ్ కోసం మా సంకల్పాలు ఎంత భారీవో అనేదిసూచిస్తున్నాయి’’
‘‘ఏ దేశం అయినాలేదా ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందాలి అంటే పరిపాలన పారదర్శకం గా ఉండడం మరియు అవినీతిని నిర్మూలించడం అవసరం’’
‘‘బానిసత్వమనస్తత్వాన్ని భారతదేశం విడచిపెట్టి, ప్రస్తుతం స్వతంత్రం గా ఉన్న విశ్వాసం తో ముందుకు పోవడం మొదలు పెట్టింది’’
‘‘భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచిన సనాతన్ ను భంగం చేయగోరుతున్న వారి పట్ల ప్రజలు జాగరూకులై ఉండాలి’’
‘‘జి-20 యొక్క బ్రహ్మాండమైన సాఫల్యం 140 కోట్ల మంది భారతీయుల యొక్క సాఫల్యం’’
‘‘ప్రపంచాన్నిఒకచోటుకు తీసుకు రావడం లో భారతదేశం తన నేర్పును ప్రదర్శించడం తో పాటు విశ్వమిత్రగా ఉనికి లోకి వస్తున్నది’’
‘‘ఆదరణ కు నోచుకోకుండా ఉండిపోయిన వర్గాల కు పెద్దపీట వేయడం అనేది ప్రభుత్వం యొక్క మూల మంత్రం గా ఉన్నది’’
‘‘మోదీ యొక్క హామీ తాలూకు నిదర్శనం మీ ఎదుట ఉంది’’
‘‘రాణి దుర్గావతి గారి500 వ జయంతి ని 2023 అక్టోబరు 5 వ తేదీ నాడు వైభవోపేతం గా పాటించడం జరుగుతుంది’’
‘‘ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నమూనా ప్రస్తుతం ప్రపంచాని కి మార్గదర్శకత్వం వహిస్తున్నది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50,700 కోట్ల రూపాయల కు పైగా విలువల కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల కు మధ్య ప్రదేశ్ లోని బీనా లో ఈ రోజు న శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల లో, దాదాపు గా 49,000 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి చేయనున్న భారత్ పెట్రోలియమ్ కార్పొరేశన్ లిమిటెడ్ (బిపిసిఎల్) కు చెందిన బీనా రిఫైనరీ లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్; నర్మదపురం జిల్లా లో ఒక ‘పవర్ ఎండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ జోన్’; ఇందౌర్ లో రెండు ఐటి పార్కు లు; రత్ లామ్ లో ఒక మెగా ఇండస్ట్రియల్ పార్కు మరియు మధ్య ప్రదేశ్ లో వివిధ ప్రాంతాల లో ఆరు కొత్త ఇండస్ట్రియల్ ఏరియాస్ భాగం గా ఉన్నాయి.

 

ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బుందేల్ ఖండ్ యోధుల భూమి అని అభివర్ణించారు. ఒక నెల రోజుల లోపే మధ్య ప్రదేశ్ లోని సాగర్ ను సందర్శించిన సంగతి ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వాని కి ధన్యవాదాల ను తెలియ జేశారు. సంత్ రవిదాస్ జీ యొక్క స్మారక కట్టడానికి శంకుస్థాపన కార్యక్రమం లో పాలుపంచుకోవడాన్ని కూడా ఆయన గుర్తు కు తెచ్చుకొన్నారు.

 

ఈ రోజు న తలపెట్టిన ప్రాజెక్టు లు ఈ ప్రాంతం అభివృద్ధి కి క్రొత్త శక్తి ని ఇస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టుల కు కేంద్ర ప్రభుత్వం ఏభై వేల కోట్ల రూపాయల ను ఖర్చు పెడుతోందని, ఈ సొమ్ము దేశం లో అనేక రాష్ట్రాల బడ్జెటు కంటే ఎక్కువని ఆయన అన్నారు. ‘‘ఇది మధ్య ప్రదేశ్ కోసం మాకు ఉన్న సంకల్పాలు ఎంత భారీవో తెలియజేస్తోంది.’’ అని ఆయన అన్నారు.

 

స్వాతంత్య్రం వచ్చిన అనంతరం అమృత కాలం లో దేశం లో ప్రతి ఒక్క పౌరుడు/ ప్రతి ఒక్క పౌరురాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశం గా తీర్చిదిద్దాలన్న సంకల్పాన్ని చెప్పుకొన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, దిగుమతుల ను తగ్గించుకోవవలసి ఉంది, ఇదే సందర్భం లో పెట్రోలు కోసం, డీజిల్ కోసం, ఇంకా పెట్రో రసాయనిక ఉత్పత్తుల కోసం భారతదేశం విదేశాల పైన ఆధారపడి వుంది అన్నారు. బీనా రిఫైనరీ లో పెట్రో కెమికల్ కాంప్లెక్స ను గురించి శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, అది పెట్రో రసాయనాల సంబంధి పరిశ్రమ లో ఆత్మనిర్భరత దిశ లో వేస్తున్న ఒక ముందడుగు అవుతుందన్నారు. గొట్టాలు, నల్లాలు, గృహోపకరణాలు, పెయింట్, కారు భాగాలు, వైద్యచికిత్స సంబంధి పరికరాలు, ప్యాకేజింగ్ సామగ్రి మరియు వ్యవసాయం సంబంధి ఉపకరణాలు తదితర ప్లాస్టిక్ ఉత్పాదనల ను గురించిన ఉదాహరణల ను ఇస్తూ, వీటిని ఉత్పత్తి చేయడం లో పెట్రో రసాయనాల ది కీలకమైన పాత్ర అని వివరించారు. ‘‘బీనా రిఫైనరీ లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ యావత్తు ప్రాంతం లో వృద్ధి ని పెంచుతుంది, అభివృద్ధిని సరిక్రొత్త శిఖరాల కు తీసుకు పోతుంది అని మీకు నేను పూచీ ని ఇస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. అది క్రొత్త పరిశ్రమల కు దన్ను గా నిలవడం ఒక్కటే కాకుండా చిన్న రైతుల కు మరియు నవ పారిశ్రామికవేత్తల కు కూడా అవకాశాల ను కల్పిస్తుంది; అంతేకాదు, యువత కై వేల కొద్దీ అవకాశాల ను కూడా అందిస్తుంది అని ఆయన అన్నారు. తయారీ రంగాని కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఈ రోజు న పది నూతన పారిశ్రామిక ప్రాజెక్టు ల తాలూకు పనులు ఆరంభం అయ్యాయి అని తెలియ జేశారు. నర్మదపురం లో , ఇందౌర్ లో, రత్ లామ్ లో ప్రాజెక్టు లు మధ్య ప్రదేశ్ యొక్క పారిశ్రామిక సామర్థ్యాన్ని వృద్ధి చెందింప చేస్తాయి, తత్ఫలితం గా అన్ని వర్గాల కు మేలు జరుగుతుంది అని ఆయన అన్నారు.

 

ఏదయినా రాష్ట్రం గాని లేదా ఏదైనా దేశం గాని అభివృద్ధి చెందాలి అంటే పాలన లో పారదర్శకత్వాని కి మరియు అవినీతి ని అంతం చేయడాని కి పెద్దపీట ను వేయాలి అని ప్రధాన మంత్రి అన్నారు. మధ్య ప్రదేశ్ ను దేశం లో అత్యంత పెళుసైన మరియు బలహీనమైన రాష్ట్రాల లో ఒక రాష్ట్రం గా భావించిన కాలం అంటూ ఒకటి ఉండేది అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘మధ్య ప్రదేశ్ ను దశాబ్దాల తరబడి పాలించిన వ్యక్తులు నేరం మరియు అవినీతి మినహా మరేదీ అందించ లేదు.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రం లో నేరగాళ్ళు ఏ విధం గా ఇష్టారాజ్యం గా నడుచుకొన్నారో; శాంతి మరియు వ్యవస్థ ల పట్ల ప్రజల లో విశ్వాసం ఏ విధం గా లోపించిందో శ్రీ నరంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. ఆ తరహా పరిస్థితులు పరిశ్రమల ను రాష్ట్రం నుండి తరిమి వేశాయి అని ఆయన అన్నారు. మధ్య ప్రదేశ్ లో వర్తమాన ప్రభుత్వం మొదటి సారి ఎన్నిక అయిన తరువాత నుండి స్థితి ని మార్చడం కోసం అమిత ప్రయాసల కు పూనుకొంటూ వచ్చిన సంగతి ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ కార్యసాధనల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, శాంతి ని మరియు వ్యవస్థ ను పునరుద్ధరించడం, పౌరుల మనసుల లో గూడుకట్టుకొన్న భయాన్ని పారద్రోలడం, రహదారుల ను నిర్మించడం మరియు విద్యుచ్ఛక్తి సరఫరా ల ను గురించిన ఉదాహరణల ను ఇచ్చారు. మెరుగైన సంధానం రాష్ట్రం లో ఒక సకారాత్మక వాతావరణాన్ని ఏర్పరచింది. దీనితో కర్మాగారాల ను ఏర్పాటు చేయడం కోసం పెద్ద పరిశ్రమలు తయారు గా ఉన్నాయి అని ఆయన అన్నారు. మధ్య ప్రదేశ్ రాబోయే కొన్ని సంవత్సరాల లో పారిశ్రామిక అభివృద్ధి పరం గా క్రొత్త శిఖరాల ను చేరుకొంటుందన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ఈ నాటి న్యూ భారత్ శరవేగం గా మార్పు చెందుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో బానిస మనస్తత్వం నుండి బయటపడాలని, ‘సబ్ కా ప్రయాస్’ (అందరి యత్నాల తో) ముందుకు దూసుకు పోవాలి అని తాను ఇచ్చిన పిలుపు ను గురించి ఆయన గుర్తు చేశారు. ‘‘భారతదేశం బానిస మనస్తత్వాన్ని విడచిపెట్టింది. మరి ప్రస్తుతం స్వతంత్రం తాలూకు విశ్వాసం తో ముందుకు పోవడం మొదలు పెట్టింది’’ అని ఆయన అన్నారు. ఇది ఇటీవలే నిర్వహించిన జి-20 సభల లో ప్రతిబింబించింది. జి-20 శిఖర సమ్మేళనం ప్రతి ఒక్కరి ఉద్యమం గా మారిపోయింది. మరి అందరూ దేశం యొక్క కార్యసిద్ధుల ను చూసుకొని గర్వపడ్డారు అని ఆయన అన్నారు. జి-20 మహత్తరమైన సాఫల్యాన్ని సాధించింది అంటే అందుకు ఖ్యాతి అంతా ప్రజల కు దక్కుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది 140 కోట్ల మంది భారతీయుల సాఫల్యం’’ అని ఆయన అన్నారు. వేరు వేరు నగరాల లో ఏర్పాటైన కార్యక్రమాలు భారత్ యొక్క వైవిధ్యాన్ని మరియు సామర్థ్యాల ను చాటి చెప్పడం తో పాటుగా సందర్శకుల ను ఎంతగానో ఆకట్టుకొన్నాయి కూడాను అని ఆయన అన్నారు. ఖజురాహో, ఇందౌర్, ఇంకా భోపాల్ లలో జరిగిన జి-20 సంబంధి కార్యక్రమాల ప్రభావాన్ని గురించి ఆయన చెప్తూ, అవి ప్రపంచం దృష్టి లో మధ్య ప్రదేశ్ యొక్క ప్రతిష్ట మెరుగైంది అన్నారు.

 

ఒక ప్రక్కన న్యూ భారత్ ప్రపంచ దేశాల ను ఒక చోటు కు తీసుకు రావడం లో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ‘విశ్వమిత్ర’ గా తెర మీద కు వస్తుంటే, మరో ప్రక్కన కొన్ని సంస్థ లు దేశాన్ని మరియు సమాజాన్ని విభజించాలని శతథా ప్రయత్నిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇటీవల ఏర్పాటు అయిన సంకీర్ణాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వారి విధానాలు భారతీయ విలువల పైన దాడి చేయడాని కి మరియు వేల సంవత్సరాల పాతదీ అందరిని ఒక్కటి గా కలిపేటటువంటిదీ అయిన భావజాలాన్ని, సిద్ధాంతాల ను మరియు సంప్రదాయాల ను ధ్వంసం చేయడాని కి పరిమితం అయ్యాయి అన్నారు. క్రొత్త గా ఏర్పడ్డ సంకీర్ణం సనాతనాని కి స్వస్తి పలకాలని కోరుకొంటోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, దేవి అహిల్య బాయి హోల్కర్ గారు తన సామాజిక కార్యాల తో దేశం లో ధర్మాన్ని పరిరక్షించారు; ఝాన్సీ కి చెందిన రాణి లక్ష్మి బాయి గారు బ్రిటిషు వారి ని ఎదురించారు; గాంధీ మహాత్ముని అంటరానితనం ఉద్యమానికి భగవాన్ శ్రీరాముడు ద్వారా ప్రేరణ లభించింది; ఇక స్వామి వివేకనంద సమాజం లోని అనేక దురాచారాల విషయం లో ప్రజల ను చైతన్యవంతుల ను చేశారు; లోక మాన్య తిలక్ గారు భరత మాత ను రక్షించేందుకు నడుంకట్టారు, గణేశ్ పూజ కు స్వాతంత్య్ర ఉద్యమం తో అనుబంధం ఏర్పడేటట్లుగా చేశారు అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

 

   మహర్షి వాల్మీకి, శబరి మాత, పండిత రవిదాస్‌ వంటి మహనీయుల ప్రతిరూపమైన సనాతన శక్తి అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులకు స్ఫూర్తినిచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశాన్ని ఏకతాటిపై నిలిపిన సనాతన వ్యవస్థను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్న శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించారు. దేశ భక్తికి, ప్రజాసేవకు ప్రభుత్వం అంకితమైందని ఉద్ఘాటిస్తూ- అణగారిన వర్గాలకు పెద్దపీట వేయడమన్నది అవగాహనగల ప్రభుత్వానికి ప్రాథమిక సూత్రమని ఆయన అన్నారు. మహమ్మారి విజృంభించిన వేళ ప్రజలకు చేయూతనిస్తూ చేపట్టిన చర్యల్లో భాగంగా 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలు పంపిణీ చేయడాన్ని గుర్తుచేశారు.

   ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తూ- “మధ్యప్రదేశ్ సరికొత్త ప్రగతి శిఖరాలకు చేరేలా మేం నిర్విరామంగా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ జీవన సౌలభ్యం కల్పన, ఇంటింటా సౌభాగ్యం వెల్లివిరిసేలా చూడటం మా లక్ష్యాలు. ఈ హామీలను మోదీ నెరవేర్చడంపై సాక్ష్యాలు మీ ముందున్నాయి” అన్నారు. రాష్ట్రంలో పేదల కోసం 40 లక్షల పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు ఉచిత వైద్యం, బ్యాంకు ఖాతాలు, పొగ రహిత వంటిళ్లు వంటి హామీలను నెరవేరుస్తున్నామని గుర్తుచేశారు. రాఖీ పండుగ సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. “దీనివల్ల ఉజ్వల లబ్ధిదారులైన  సోదరీమణులు ఇప్పుడు రూ.400 తక్కువ ధరకు సిలిండర్‌ పొందుతున్నారు” అని ప్రధాని పేర్కొన్నారు. “కేంద్ర ప్రభుత్వం నిన్న మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. దీని ప్రకారం దేశంలో మరో 75 లక్షల మంది అక్కచెల్లెళ్లకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు లభిస్తాయి. వంటగ్యాస్‌ సదుపాయం ప్రతి సోదరికీ చేరువ కావాలన్నదే మా లక్ష్యం” అని ప్రధానమంత్రి తెలిపారు.

   ప్రభుత్వం తన ప్రతి హామీ నెరవేర్చేందుకు పూర్తి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆయన నొక్కిచెప్పారు. ప్రతి లబ్ధిదారుకూ సంపూర్ణ ప్రయోజనం లభించేలా దళారీ వ్యవస్థను నిర్మూలించడాన్ని ఆయన ఉదాహరించారు. అలాగే ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ గురించి ప్రస్తావిస్తూ అర్హులైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు నేరుగా రూ.28,000 దాకా నేరుగా బదిలీ అయినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.2,60,000 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిందని ప్రధాని తెలిపారు. గడచిన 9 ఏళ్లలో రైతుల సాగుఖర్చులు తగ్గించే దిశగా ఎరువులు చౌకగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేసిందని ఆయన చెప్పారు. అమెరికాలో యూరియా బస్తాకు అక్కడి రైతు రూ.3000 వరకూ చెల్లిస్తుండగా మన దేశంలో రూ.300కన్నా తక్కువకే లభిస్తున్నదని గుర్తుచేశారు. గతంలో యూరియా కుంభకోణాల్లో రూ.వేల కోట్ల మేర ప్రజాధనం స్వాహా అయ్యేదని, అటువంటి యూరియా ఇవాళ అంతటా సులభంగా అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

 

   బుందేల్‌ఖండ్‌లో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో రెండు ఇంజన్ల ప్రభుత్వం  కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- “సాగునీటి ప్రాధాన్యం ఎంతటిదో బుందేల్‌ఖండ్‌ రైతులకన్నా ఎక్కువ తెలిసిన వారెవరు!” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ‘కెన్-బెత్వా’ సంధాన కాలువ  గురించి వివరిస్తూ- ఇది బుందేల్‌ఖండ్‌ సహా ఈ ప్రాంతంలోని అనేక జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఇంటికీ పైపులద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వ కృషిని వెల్లడిస్తూ- కేవలం నాలుగేళ్లలోనే దేశవ్యాప్తంగా సుమారు 10 కోట్ల కొత్త కుటుంబాలకు కొళాయి నీటిని సరఫరా చేశామన్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 65 లక్షల కుటుంబాలకు కొళాయి నీరు అందుతున్నదని ప్రధాని తెలిపారు. “బుందేల్‌ఖండ్‌లో, ‘అటల్ భూగర్భజల’ పథకం కింద జల వనరుల సృష్టికి విశేష కృషి సాగుతోంది” అని ఆయన పేర్కొన్నారు. మొత్తంమీద ఈ ప్రాంత ప్రగతికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. ఇక 2023 అక్టోబరు 5వ తేదీన రాణి దుర్గావతి 500వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

   చివరగా- తమ ప్రభుత్వ కృషివల్ల దేశవ్యాప్తంగా పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులు అధిక ప్రయోజనం పొందినట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. “బలహీనులకు ప్రాధాన్యమిచ్చే ‘సబ్ కా సాథ్… సబ్‌ కా వికాస్’ మంత్రం నేడు ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది” అని శ్రీ మోదీ అన్నారు. మన దేశం ప్రపంచంలోని తొలి మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నదని ఆయన వివరించారు. భారత దేశం ఆ స్థాయిని అందుకోవడంలో మధ్యప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆ మేరకు రైతులు, పరిశ్రమలతోపాటు యువతరానికీ కొత్త అవకాశాలు సృష్టించబడతాయని ఆయన నొక్కి చెప్పారు. నేటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయగలవని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. “రాబోయే 5 సంవత్సరాల కాలం మధ్యప్రదేశ్ అభివృద్ధిని కొత్త శిఖరాలకు చేరుస్తుంది” అంటూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

 

   మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ మంగూభాయ్‌ పటేల్‌, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర పెట్రోలియం-సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్‌ సింగ్‌ పూరి తదితర ప్రముఖులు ప్రధానమంత్రి వెంట ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

నేపథ్యం

   మధ్యప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతికి భారీ ఉత్తేజమివ్వడంలో భాగంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్‌)కు చెందిన ఇక్కడి బినా చమురుశుద్ధి కర్మాగారం ప్రాంగణంలో రూ.49వేల కోట్లతో నిర్మించే అధునాతన పెట్రో-రసాయన సముదాయానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగారం ఫార్మా, జౌళి, ప్యాకేజింగ్ వంటి వివిధ రంగాలకు కీలకమైన ఇథిలీన్, ప్రొపిలీన్‌ వగైరాలను ఏటా సుమారు 1200 కిలో టన్నుల (కెటిపిఎ) మేర ఉత్పత్తి చేస్తుంది. ఈ ఉత్పత్తుల కోసం మన దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పుతుంది. తద్వారా ప్రధాని నిర్దేశిత స్వప్నమైన ‘స్వయం సమృద్ధ భారతం’ సాకారం దిశగా మరో అడుగు ముందుకు పడుతుంది. ఈ భారీ ప్రాజెక్టుతో ఉపాధి అవకాశాల సృష్టిసహా పెట్రోలియం రంగంలో అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి చేయూత లభిస్తుంది.

 

   ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా న‌ర్మ‌ద‌పురం జిల్లాలో ‘విద్యుత్‌-పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి మండలి’ కింద పది ప్రాజెక్టులకూ ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశారు. అలాగే ఇండోర్‌లో రెండు ఐటీ పార్కులు, రత్లాంలో ఒక భారీ పారిశ్రామిక పార్కుసహా మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆరు కొత్త పారిశ్రామిక ప్రాంతాల రూపకల్పనకు పునాదిరాయి వేశారు. ఇందులో నర్మదపురం జిల్లా  ప్రాజెక్టును రూ.460 కోట్లతో అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధితోపాటు ఉపాధి కల్పనకు ఈ ప్రాజెక్టు ఇతోధికంగా తోడ్పడుతుంది. ఇక రూ.550 కోట్లతో రూపుదిద్దుకునే ఇండోర్‌లోని ‘ఐటి పార్క్-3, 4’ల ద్వారా సమాచార సాంకేతిక, ‘ఐటిఇఎస్‌’ రంగాలకు ఊపుతోపాటు యువతకు కొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయి.

   రత్లాంలో రూ.460 కోట్లకుపైగా వ్యయంతో రూపొందే భారీ పారిశ్రామిక పార్కు రాష్ట్రంలోని జౌళి, ఆటోమొబైల్‌, ఫార్మా వంటి కీలక రంగాలకు ప్రధాన కేంద్రంగా మారుతుంది. ఇది ఢిల్లీ-ముంబై ఎక్స్‌ ప్రెస్‌వేకి అనువుగా అనుసంధానించబడింది. యువతకు ప్రత్యక్ష-పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన ద్వారా ఈ ప్రాంత ఆర్థికవృద్ధిని ఇది ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. మరోవైపు  రాష్ట్రంలో సమతుల ప్రాంతీయాభివృద్ధి, ఏకరూప ఉపాధి అవకాశాలకు ప్రోత్సాహం లక్ష్యంగా  షాజాపూర్, గుణ, మౌగంజ్, అగర్ మాల్వా, నర్మదాపురం, మక్సీలలో దాదాపు రూ.310 కోట్లతో ఆరు కొత్త పారిశ్రామిక వాడలు కూడా రూపుదిద్దుకోనున్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”