"భార‌త‌దేశ చ‌రిత్ర‌లో మీర‌ట్ కేవ‌లం ఒక న‌గ‌రం మాత్ర‌మే కాదు, ఇది సంస్కృతికి , ఒక ముఖ్య‌మైన కేంద్రంగా ఉంది."
"దేశం క్రీడ‌ల‌లో రాణించాలంటే యువ‌త‌కు క్రీడ‌ల‌పై ఆస‌క్తి ఉండాలి. క్రీడ‌ల‌ను ఒక వృత్తిగా చేప‌ట్టేలా ప్రోత్స‌హించాలి. ఇది నా సంక‌ల్పం, నా క‌ల‌."
"గ్రామాలు, చిన్న ప‌ట్ట‌ణాల‌లో క్రీడా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌తో, ఈ ప్రాంతాల‌నుంచి క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది"
“వనరులు , కొత్త రంగాల‌తో అభివృద్ధి చెందుతున్న క్రీడా వాతావ‌ర‌ణం కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. క్రీడల వైపు వెళ్లడమే సరైన నిర్ణయమని ఇది సమాజంలో నమ్మకాన్ని ఏర్పరుస్తుంది”
"మీర‌ట్ స్థానిక‌త‌కు గొంతు వినిపించ‌డ‌మే కాదు, స్థానిక‌త నుంచి అంత‌ర్జాతీయంగా ఎదుగుతోంది"
"మ‌న ల‌క్ష్యం స్ప‌ష్టం గా ఉంది. యువ‌త రోల్ మోడ‌ల్ గా ఉండ‌డ‌మే కాదు, తమ రోల్‌మోడల్స్‌ను గుర్తించాలి"

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మీర‌ట్‌లో మేజ‌ర్‌ధ్యాన్ చంద్ క్రీడా విశ్వ‌విద్యాల‌యానికి శంకుస్థాప‌న చేశారు. 700 కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో ఈ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పుతారు. సింథ‌టిక్ హాకీ గ్రౌండ్‌, ఫుట్‌బాల్ గ్రౌండ్‌, బాస్కెట్ బాల్ , వాలీబాల్ , హ్యాండ్ బాల్‌, క‌బ‌డ్డీ గ్రౌండ్‌, లాన్ టెన్నిస్  కోర్టు, జిమ్నాజియం హాల్ , సింథ‌టిక్ ర‌న్నింగ్ స్టేడియం, స్విమ్మింగ్ ఫూల్‌, బ‌హుళ ఉప‌యోగ మందిరం, సైక్లింగ్ వెలోడ్రోమ్ వంటి అధునాత‌న క్రీడా స‌దుపాయాలు, ప‌రిక‌రాల‌తో దీనిని ఏర్పాటు చేస్తారు.
ఈ యూనివ‌ర్సిటీలో షూటింగ్‌, స్క్వాష్‌, జిమ్నాస్టిక్స్‌, వెయిట్‌లిఫ్టింగ్‌, ఆర్చ‌రి, క‌నోయింగ్‌, కాయ‌కింగ్ త‌దిత‌ర స‌దుపాయాలు ఉంటాయి. ఈ విశ్వ‌విద్యాల‌యం 540 మంది మ‌హిళా క్రీడాకారిణులు, 540 మంది పురుష క్రీడాకారులు క‌లిపి మొత్తం 1080 మంది కి శిక్ష‌ణ ఇచ్చే సామ‌ర్ధ్యాన్ని క‌లిగి ఉంటుంది. 

ఈ సంద‌ర్భంగా హాజ‌రైన ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, స్వ‌తంత్ర భార‌తావ‌నికి కొత్త దిశా నిర్దేశం చేయ‌డంలో మీర‌ట్ దాని ప‌రిస‌ర ప్రాంతాలకు చెప్పుకోద‌గిన పాత్ర ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
స‌రిహ‌ద్దుల‌లో దేశ ర‌క్ష‌ణ‌కు ఈప్రాంత ప్ర‌జ‌లు త‌మ ప్రాణాల‌ను త్యాగం చేశార‌ని, క్రీడా ప్రాంగ‌ణంలో భార‌త ప్ర‌తిష్ఠ‌ను ఉన్న‌త‌స్థాయికి తీసుకువెళ్లార‌న ఆయ‌న అన్నారు.

ఈ ప్రాంతం దేశభక్తి జ్వాలలను సజీవంగా ఉంచిందని ప్రధాని ఉద్ఘాటించారు.  భార‌త‌దేశ‌ చరిత్రలో, మీరట్ ఒక నగరం మాత్రమే కాదు, ఇది  సంస్కృతి కి, శక్తికి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది", అని ప్రధాన మంత్రి అన్నారు. మ్యూజియం ఆఫ్ ఫ్రీడమ్, అమర్ జవాన్ జ్యోతి , బాబా ఔఘర్ నాథ్ జీ దేవాలయం  అందిస్తున్న‌ స్ఫూర్తి పై ప్రధాన మంత్రి తన ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

మేజ‌ర్ ధ్యాన్ చంద్ మీర‌ట్ లోక్రియాశీలంగా ఉండే వార‌ని ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేశారు. కొన్ని నెల‌ల క్రితం, కేంద్ర ప్ర‌భుత్వం దేశ అత్యున్న‌త క్రీడా పుర‌స్కారానికి మేజ‌ర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టిన విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి గుర్తు చేశారు. మీర‌ట్ క్రీడా విశ్వ‌విద్యాల‌యాన్ని మేజ‌ర్ ధ్యాన్ చంద్ కు ఈరోజు అంకితం చేస్తున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌టించారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మారిన విలువ‌ల గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు. గ‌తంలో నేర‌స్థులు, మాఫియాలు ఇక్క‌డ త‌మ ఆట‌లు సాగించేవి. అక్ర‌మ ఆక్ర‌మ‌ణ‌లు, ఆడ‌ప‌డ‌చులకు వేధింపులు య‌ధేచ్ఛ‌గా సాగేవ‌ని అన్నారు. గ‌తంలో అభ‌ద్ర‌త‌, చ‌ట్ట‌రాహిత్య ప‌రిస్థితులు నెల‌కొని ఉండ‌డాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ఇలాంటి నేర‌స్థుల‌లో చ‌ట్టం గురించిన భ‌యాన్ని క‌లిగిస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు. ఈ మార్పు ఆడ‌ప‌డుచుల‌లో ఆత్మ‌విశ్వాసాన్ని తీసుకువ‌చ్చింద‌ని, ఇది దేశం మొత్తానికి ఆనందం క‌లిగిస్తున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.న‌వ‌భార‌తావ‌నికి యువ‌త ఎంతో కీల‌క‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. న‌వ భార‌తావ‌నిని తీర్చి దిద్దేది, దానికి నాయ‌క‌త్వం వ‌హించేది యువ‌తే అన్నారు. మ‌న యువ‌త మ‌న ప్రాచీన వార‌స‌త్వాన్ని, ఆధునిక‌త‌ను క‌లిగి ఉంద‌ని ఆయ‌న అన్నారు. యువ‌త ఎక్క‌డికి వెళితే ఇండియా కూడా ముందుకు సాగుతుంద‌ని అన్నారు. అలాగే ఇండియా వెళుతున్న మార్గంలో ప్ర‌పంచం వెళుతున్న‌ద‌ని ఆయ‌న అన్నారు.

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వం నాలుగు అంశాల‌లో భార‌త క్రీడాకారుల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. అవి వ‌న‌రులు, శిక్ష‌ణ‌కు ఆధునిక స‌దుపాయాలు, అంత‌ర్జాతీయంగా వారి ప్ర‌తిభ వ్య‌క్తం అయ్యేలా చేయ‌డం, క్రీడాకారుల ఎంపిక‌లో పార‌ద‌ర్శ‌క‌త అని అన్నారు.
దేశంలో క్రీడ‌లు అభివృద్ధి చెందాలంటే యువ‌త‌కుక్రీడ‌ల‌పై విశ్వాసం ఉండాల‌ని, వారిని క్రీడ‌ల‌ను ఒక ప్రొఫెష‌న్ గా తీసుకునేందుకు ప్రోత్స‌హించాల‌ని అన్నారు. ఇది నా సంకల్పం, నా క‌ల కూడా. ఇత‌ర ప్రొఫెష‌న్ల మాదిరే క్రీడ‌ల‌నూ ఒక ప్రొఫెష‌న్‌గా మ‌న యువ‌త చూడాలి అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ప్ర‌భుత్వం క్రీడ‌ల‌ను ఉపాధితో ముడిపెట్టిన‌ట్టు ఆయ‌న చెప్పారు. టార్గెట్ ఒలింపిక్స్ పోడియం (టిఒపిఎస్‌) వంటి ప‌థ‌కాలు ఉన్న‌త స్థాయి క్రీడాకారులు అత్యున్న‌త స్థాయిలో పోటీప‌డేందుకు వీలు క‌ల్పిస్తున్నాయ‌ని అన్నారు. ఖేలో ఇండియా అభియాన్ అత్యంత ప్రాథ‌మిక స్థాయిలోనే యువ‌త‌లో ప్ర‌తిభ‌ను గుర్తిస్తోంద‌ని, అంత‌ర్జాతీయ స్థాయికి వారు ఎదిగేందుకు వారికి త‌గిన శిక్ష‌ణ ఇస్తోంద‌ని ఆయ‌న అన్నారు.ఇటీవ‌ల ఒలింపిక్స్‌, పారా ఒలింపిక్స్ లో ఇండియా ప‌నితీరు గురించి ప్ర‌స్తావిస్తూ, క్రీడారంగంలో ఇండియా ఉన్న‌త స్థాయికి చేరుకుంటుండ‌డానికి ఇది నిద‌ర్శ‌న‌మని అన్నారు. గ్రామాలు, చిన్న ప‌ట్ట‌ణాల‌లో మౌలిక క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న‌తో ప‌ట్ట‌ణాల‌నుంచి ఎంద‌రో క్రీడాకారులు వ‌స్తున్నార‌ని ఆయ‌న గుర్తుచేశారు.

 నూత‌న విద్యావిధానంలో క్రీడ‌ల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌డం జ‌రిగింద‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపార‌రు. సైన్సు , కామ‌ర్సు, ఇత‌ర అధ్య‌య‌నాల లాగే క్రీడ‌ల‌ను కూడా ఇప్పుడు అదే కేట‌గిరీలో ఉంచ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. గ‌తంలో క్రీడ‌ల‌ను ఇత‌రేత‌ర వ్యాప‌కాలుగా భావించేవార‌ని కానీ ఇవాళ క్రీడా పాఠ‌శాల‌ల‌లో ఇది ఒక స‌రైన స‌బ్జెక్టుగా  ఉంద‌ని  అన్నారు. క్రీడా వాతావ‌ర‌ణంలో  క్రీడ‌లు, క్రీడ‌ల యాజ‌మాన్యం, క్రీడ‌ల‌కు రాయ‌డం, స్పోర్ట్స్ సైకాల‌జీ వంట‌వి ఎన్నో ఉన్నాయ‌ని, ఇవి కొత్త అవ‌కాశాల‌ను క‌ల్పిస్తాయ‌ని అన్నారు.

క్రీడ‌ల‌వైపు వెళ్ల‌డం స‌రైన నిర్ణ‌య‌మ‌ని ఇది స‌మాజంలో విశ్వాసం క‌ల్పిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. వ‌న‌రుల‌తో, క్రీడ‌ల సంస్కృతి ఒక రూపు దాలుస్తుంంద‌ని, ఈ దిశ‌గా క్రీడ‌ల విశ్వ‌విద్యాల‌యం కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. మీర‌ట్ క్రీడా సంస్కృతి గురించి మాట్లాడుతూ ఆయ‌న‌,  మీర‌ట్ న‌గ‌రం క్రీడ‌ల ఉత్ప‌త్తుల‌ను 100కుపైగా దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్న‌ద‌ని చెప్పారు. ఈ ర‌కంగా మీర‌ట్ స్థానిక‌త‌కు గళం విప్ప‌డ‌మే కాక‌, స్థానికం నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి ఎదిగింద‌ని ఆయ‌న చెప్పారు. స్పోర్ట్స్ క్ల‌స్ట‌ర్ల‌తో దేశాన్ని ఈ రంగంలో  ఆత్మ నిర్భ‌ర్ చేయాల్సిన అవ‌స‌రం గురించి ఆయ‌న తెలిపారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని డ‌బుల్ ఇంజిన్ ప్ర‌భుత్వం ప‌లు విశ్వ‌విద్యాల‌యాల‌ను నెల‌కొల్పుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. గోర‌ఖ్‌పూర్‌లో మ‌హాయోగి గురు గోర‌ఖ్ నాథ్ ఆయుష్ యూనివ‌ర్సిటీ, ప్ర‌యాగ్‌రాజ్ లో డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ లా యూనివ‌ర్సిటీ, ల‌క్నోలో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్‌,  అలీఘ‌డ్ లో రాజా మ‌హేంద్ర ప‌ప్ర‌తాప్ సింగ్ స్టేట్ యూనివ‌ర్సిటీ, ష‌హ‌రాన్ పూర్ లో మా షాకుంబ‌రి యూనివ‌ర్సిటీ, మీర‌ట్ లో మేజ‌ర్ ధ్యాన్ చంద్ యూనివ‌ర్సిటీ లు ఏర్పాట‌య్యాయ‌ని అన్నారు. మ‌న లక్ష్యం స్ప‌ష్టం, యువ‌త రోల్ మోడ‌ల్స్ గా మార‌డం మాత్ర‌మే కాదు, వారి రోల్ మోడ‌ల్స్‌ను గుర్తించాల‌న్నారు. 

స్వ‌మిత్వ‌ ప‌థ‌కం కింద 23 ల‌క్ష‌ల‌కు పైగ టైటిల్స్ (ఘ‌రౌని) 75 జిల్లాల‌లో ఇవ్వ‌డం జ‌రిగింద‌ని, పి.ఎం. కిసాన్ స‌మ్మాన్ నిథికింద రాష్ట్ర రైతులు కోట్లాది రూపాయలు త‌మ ఖాతాల‌లో అందుకున్నార‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. చెర‌కు  రైతులు రికార్డు స్థాయిలో చెల్లింపులు  అందుకుని ప్ర‌యోజ‌నం పొందార‌ని కూడా ఆయ‌న అన్నారు. ఇలాగే, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి 12 వేల కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ఇథ‌నాల్ ను కొనుగోలు చేసిన‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

ప్ర‌భుత్వం పాత్ర ఒక సంర‌క్ష‌కుడి పాత్ర లాంటిద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తిభ క‌ల వారిని ప్ర‌భుత్వం ప్రోత్స‌హించాల‌ని అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రికార్డు స్థాయిలో ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించింద‌ని అన్నారు. ఐటిఐ ల‌లో శిక్ష‌ణ పొందిన వేలాది మంది యువ‌త పెద్ద కంపెనీల‌లో ఉపాధి పొందార‌ని అన్నారు. నేష‌న‌ల్ అప్రెంటీస్ షిప్ ప‌థ‌కం కింద, ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న  కింద‌ ల‌క్ష‌లాది మంది యువ‌త ప్ర‌యోజ‌నం పొందార‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపార‌ర‌రు.  గంగా ఎక్స్‌ప్రెస్ వే, రీజ‌న‌ల్ రాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్ట‌మ్‌, మెట్రో ద్వారా మీర‌ట్ అనుసంధాన‌త‌కు హ‌బ్‌గా మారుతున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."