సుమారు 3800 కోట్ల రూపాయలవిలువ కలిగిన అభివృద్ధి పథకాల లో కొన్నిటిని ప్రధాన మంత్రి ప్రారంభించారు; అలాగే మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేశారు.
‘‘అభివృద్ధిచెందినటువంటి భారతదేశాన్ని నిర్మించాలి అంటే, దేశం లో తయారీరంగాన్ని మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ ను విస్తరించడం చాలా అవసరం’’
‘‘కర్నాటక ‘సాగర్మాల’ పథకం తాలూకు అతిపెద్ద లబ్దిదారుల లో ఒకటి గా ఉంది’’
‘‘కర్నాటక లో మొట్టమొదటిసారిగా30 లక్షల కు పైగాగ్రామీణ కుటుంబాల కు గొట్టపు మార్గం ద్వారా నీరు అందింది’’
‘‘కర్నాటక లో 30 లక్షల కు పైచిలుకు రోగులు ‘ఆయుష్మాన్ భారత్’ తాలూకుప్రయోజనాన్ని పొందారు’’
‘‘పర్యటన రంగంవృద్ధి చెందినప్పుడు, దాని తాలూకులాభాలు మన కుటీర పరిశ్రమల కు, మన చేతి వృత్తికళాకారుల కు, గ్రామ పరిశ్రమలకు, వీధి వ్యాపారులకు, ఆటో రిక్షాడ్రైవర్ లకు, టాక్సీ డ్రైవర్లకు అందుతాయి’’
‘‘ప్రస్తుతండిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులు ఒక చరిత్రాత్మకమైన స్థాయి లో ఉన్నాయి; మరి భీమ్-యుపిఐ వంటి మన నూతన ఆవిష్కరణలు ప్రపంచం యొక్కదృష్టి ని ఆకట్టుకొంటున్నాయి’’
‘‘దాదాపుగా 6 లక్షల కిమీ ల ఆప్టికల్ ఫైబర్ ను వేయడం ద్వారా గ్రామపంచాయతీల ను ఒకదాని తో మరొక దానిని జోడించడం జరుగుతోంది’’
‘‘భారతదేశం 418 బిలియన్ డాలర్ విలువైన వస్తు రూప ఎగుమతుల తాలూకు ఒక కొత్తరెకార్డు ను నెలకొల్పింది. దీని విలువ 31 లక్షల కోట్ల రూపాయల కు సమానం అన్నమాట’’
‘‘పిఎమ్ గతిశక్తినేశనల్ మాస్టర్ ప్లాన్ లో భాగం గా, రైలు మార్గాలుమరియు రహదారుల కు చెందిన రెండు వందల యాభై కి పైగా ప్రాజెక్టుల నుగుర్తించడమైంది. ఆ ప్రాజెక్టులునిరంతరాయమైన నౌకాశ్రయ సంధానం లో తోడ్పడుతాయి’’

దాదాపు గా 3800 కోట్ల రూపాయల విలువ కలిగిన యంత్రీకరణం, ఇంకా పారిశ్రామికీకరణ పథకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మంగళూరు లో ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేశారు.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు భారతదేశం యొక్క చరిత్ర లో ఒక మరపురానటువంటి రోజు అన్నారు. అది ప్రాదేశిక భద్రత కావచ్చు, లేదా ఆర్థిక భద్రత కావచ్చు, భారతదేశం అపారమైన అవకాశాల కు సాక్షిగా నిలుస్తోంది అని ఆయన అన్నారు. ఇదే రోజు న ఐఎన్ఎస్ విక్రాంత్ ను జలప్రవేశాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, ఈ విషయాన్ని భారతదేశం లోని ప్రతి ఒక్కరు గర్వం గా భావిస్తున్నారు అని పేర్కొన్నారు.

ఈ రోజు న ప్రారంభించిన లేదా శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టుల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ పథకాలు కర్నాటక లో జీవన సౌలభ్యాన్ని పెంపొందింప చేయడం తో పాటు ప్రత్యేకించి ఉపాధి ని కల్పించనున్నాయి అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ‘ఒక జిల్లా మరియు ఒక ఉత్పాదన’ పథకం ఇక్కడి మత్స్యకారుల కు, చేతివృత్తుల వారికి, అలాగే రైతుల కు వారి వారి ఉత్పాదనల కు బజారు ను అందుబాటు లోకి తీసుకు వచ్చే సౌకర్యాన్ని ప్రదానం చేయగలదని ఆయన అన్నారు.

‘పాంచ్ ప్రణ్’ (అయిదు ప్రతిజ్ఞ లు) ను గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ ఎర్ర కోట నుండి తాను మాట్లాడిన అయిదు ప్రతినలలో ఒకటోది అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం అని పేర్కొన్నారు. ‘‘అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలి అంటే, అందుకు ‘మేక్ ఇన్ ఇండియా’ ను మరియు దేశం లోని తయారీ రంగాన్ని విస్తరించడం చాలా అవసరమని పేర్కొన్నారు.

నౌకాశ్రయాలు ప్రధానం గా తోడ్పాటు ను అందించేటువంటి అభివృద్ధి దిశ లో సాగేందుకు దేశం చేస్తున్న కృషి ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ఇది అభివృద్ధి కి తోడ్పడే ఒక ముఖ్యమైన మంత్రం గా ఉండడం తో దీనిపై ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరిగిందని నొక్కిచెప్పారు. ఆ తరహా ప్రయాస ల ఫలితం గా భారతదేశం లోని నౌకాశ్రయాల సామర్థ్యం కేవలం 8 సంవత్సరాల లో దాదాపు గా రెట్టింపు అయిపోయింది అని ఆయన అన్నారు.

గడచిన 8 సంవత్సరాల లో మౌలిక సదుపాయాల రంగం అభివృద్ధి కి ప్రాధాన్యం ఇవ్వడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, దీని నుండి ఎంతో లబ్ధి ని పొందిన రాష్ట్రం ఏది అంటే అది కర్నాటక యే అన్నారు. ‘‘సాగర మాల పథకం యొక్క అతి పెద్ద లబ్ధిదారుల లో కర్నాటక ఒకటి గా ఉంది’’ అని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. ఈ రాష్ట్రం లో గత 8 సంవత్సరాల లో 70 వేల కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన రాజమార్గ పథకాల ను జోడించడమైంది. అలాగే, ఒక లక్ష కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన ప్రాజెక్టు లు వరుస లో నిలచాయని ఆయన అన్నారు. కర్నాటక లో ప్రాజెక్టుల కోసం రైల్ వే బడ్జెటు గత 8 సంవత్సరాల లో నాలుగింతలు పెరిగిందని ఆయన అన్నారు.

గత 8 సంవత్సరాల లో చోటు చేసుకొన్న పరిణామాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, దేశం లో పేద ప్రజల కోసం 3 కోట్ల కు పైగా ఇళ్ళ ను నిర్మించడం జరిగింది. మరి కర్నాటక లో పేదల కోసమని 8 లక్షల కు పైచిలుకు పక్కా ఇళ్ళ కు మంజూరు ను ఇవ్వడమైందని వివరించారు. ‘‘వేల కొద్దీ మధ్యతరగతి కుటుంబాల కు కూడా ఇళ్ళను నిర్మించడం కోసం కోట్ల కొద్దీ రూపాయల సహాయాన్ని అందించడమైంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు. జల్ జీవన్ మిశన్ లో భాగం గా దేశం లో 6 కోట్ల కు పైగా ఇళ్ల ను కేవలం మూడు సంవత్సరాల లో గొట్టపు మార్గం ద్వారా నీటి సరఫరా సదుపాయం తో జత పరచడమైంది అని కూడా ఆయన తెలిపారు. ‘‘కర్నాటక లో 30 లక్షల కు పైచిలుకు గ్రామీణ కుటుంబాల కు నల్లా ద్వారా నీరు అందింది; ఇలా జరగడం ఇదే తొలిసారి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా దేశం లో సుమారు 4 కోట్ల మంది పేద ప్రజానీకాని కి ఆసుపత్రి లలో చేరే కాలం లో చికిత్స ఉచితం గా అందిందని ప్రధాన మంత్రి వెల్లడించారు. ‘‘దీనితో పేదల కు చెందిన సుమారు 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవకుండా ఆదా అయింది. కర్నాటక లో 30 లక్షల కు పైగా రోగులు కూడాను ఆయుష్మాన్ భారత్ యొక్క లాభాన్ని అందుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆర్థికం గా తాహతు లేనటువంటి స్థితి కారణం గా ఎవరినైతే పట్టించుకోకుండా మరచిపోవడం జరిగిందో, వారి విషయం లో ఇక ఉపేక్ష కు తావు ఇవ్వకూడదు అని ప్రభుత్వం జాగ్రత వహిస్తున్నదని ప్రధాన మంత్రి అన్నారు. చిన్న రైతులు, చిన్న వ్యాపారులు, చేపల ను పట్టే వారు, వీధి వీధి కి తిరుగుతూ సామానులు అమ్మేటటువంటి వారు, అలాగే ఈ కోవ కు చెందిన కోట్ల మంది కి మొట్టమొదటిసారి గా దేశాభివృద్ధి తాలూకు ప్రయోజనాలు అందడం మొదలైంది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. ‘‘వారు భారతదేశం యొకక ప్రగతి తాలూకు ప్రధాన స్రవంతి లోకి వచ్చి చేరుతున్నారు’’ అని ఆయన అన్నారు.

భారతదేశాని కి ఏడున్నర వేల కిలో మీటర్ ల కోస్తా తీర ప్రాంతం ఉన్న సంగతి ని ప్రతి ఒక్కరి దృష్టి కి ప్రధాన మంత్రి తీసుకు వస్తూ, దేశాని కి ఉన్న ఈ శక్తి ని తప్పక పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలి అన్నారు. ‘‘పర్యటన రంగం వృద్ధి చెందితే గనక అది మన కుటీర పరిశ్రమల కు, మన చేతివృత్తుల వారి కి, గ్రామీణ పరిశ్రమల కు, వీధిల లో తిరుగుతూ సామానుల ను విక్రయించే వారి కి, ఆటో రిక్షాల ను నడిపే వారి కి, టాక్సీ డ్రైవర్ లు మొదలైన వర్గాల కు ప్రయోజనాల ను అందిస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. న్యూ మంగళూరు పోర్టు విహార యాత్ర ప్రధానమైన పర్యటన రంగాని కి దన్ను గా నిలచేటటువంటి కొత్త కొత్త సదుపాయల ను అదే పని గా జోడిస్తూ ఉండడం నాకు సంతోషం కలిగిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

‘‘ప్రస్తుతం చెల్లింపుల ను డిజిటల్ మాధ్యమం ద్వారా చేయడం అనేది ఒక చరిత్రాత్మకమైన స్థాయి కి చేరుకొంది. అంతేకాకుండా, భీమ్-యుపిఐ వంటి మన నూతన ఆవిష్కరణ లు ప్రపంచం యొక్క దృష్టి ని ఆకట్టుకొంటున్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం దేశ ప్రజానీకం మంచి బలమైన సంధాన సదుపాయం కలిగిన ఇంటర్ నెట్ వేగం గా మరియు చౌక గా అందుబాటు లో ఉండాలని కోరుకొంటోంది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. దాదాపు గా 6 లక్షల కిలో మీటర్ ల ఆప్టికల్ ఫైబర్ ను పరచడం ద్వారా గ్రామ పంచాయతీల ను జోడించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ‘‘5జి సదుపాయం ఈ రంగం లో ఒక కొత్త క్రాంతి ని తీసుకు రానుంది. కర్నాటక లోని డబల్ ఇంజన్ ప్రభుత్వం సైతం ప్రజల అవసరాల ను మరియు వారి ఆకాంక్షల ను త్వరిత గతి న తీర్చడం కోసం కృషి చేస్తుండడం చూస్తే నాకు ఆనందం గా ఉంది’’ అని ఆయన అన్నారు.

కొద్ది రోజుల కిందట వెలువడిన జిడిపి గణాంకాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, కరోనా కాలం లో భారతదేశం అమలుపరచిన విధానాలు, మరియు తీసుకొన్న నిర్ణయాలు భారతదేశం యొక్క అభివృద్ధి లో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ను పోషించాయి అన్నారు. ‘‘కిందటి సంవత్సరం లో, ప్రపంచం లో అనేకమైన అంతరాయాలు తలెత్తినప్పటికీ భారతదేశం యొక్క ఎగుమతులు మొత్తం కలుపుకొంటే 670 బిలియన్ డాలర్ తో సమానమైన విలువ కలిగినవి గా ఉన్నాయి. రూపాయల లో అయితే ఈ మొత్తం 50 లక్షల కోట్ల రూపాయలు అన్నమాట. ప్రతి ఒక్క సవాలు ను అధిగమిస్తూ, భారతదేశం 418 బిలియన్ డాలర్ విలువైన వ్యాపారసంబంధి ఎగుమతుల తో ఒక కొత్త రెకార్డు ను సృష్టించింది. ఈ సొమ్ము 31 లక్షల కోట్ల రూపాయల కు సమానం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం యొక్క వృద్ధి తాలూకు ఇంజన్ తో ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగం ప్రస్తుతం పూర్తి సామర్థ్యం తో నడుస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. సేవ ల రంగం కూడా శరవేగం గా వృద్ధి చెందుతోంది అని ఆయన అన్నారు. పిఎల్ఐ పథకాల ప్రభావం ఏమిటనేది తయారీ రంగం లో చాలా స్పష్టం గా కనిపిస్తోంది అని ఆయన అన్నారు. ‘‘మొబైల్ ఫోన్ లు సహా, యావత్తు ఎలక్ట్రానిక్ మేన్యుఫాక్చరింగ్ సెక్టర్ లో ఎన్నో రెట్లు మేరకు వృద్ధి చోటు చేసుకొంది’’ అని ఆయన అన్నారు. భారతదేశం లో సరికొత్త గా ఎదుగుతున్నటువంటి ఆటవస్తువు ల రంగం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ కనబరచాలి అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఆ రంగం లో గడచిన మూడేళ్ళ లో ఆటబొమ్మ ల దిగుమతులు తగ్గాయని, ఎగుమతులు సైతం దాదాపు అదే ధోరణి లో పెరిగాయి అని తెలిపారు. ‘‘ఇవి అన్నీ కూడా దేశం లోని కోస్తా తీర ప్రాంతాల ద్వారా ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నాయి, దేశం లోని కోస్తా తీర ప్రాంతాలు భారతదేశం వస్తువుల ను ఎగుమతి చేసేందుకు వనరుల ను అందిస్తున్నాయి, వీటిలో మంగళూరు వంటి ప్రముఖ నౌకాశ్రయం కూడా ఉంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాల‌ ద్వారా దేశం గత కొన్ని సంవత్సరాలుగా తీరప్రాంత ట్రాఫిక్‌లో గణనీయమైన పెరుగుదలను కనబరిచిందని కూడా, ప్రధాన మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. "దేశంలోని వివిధ ఓడరేవులలో పెరిగిన సౌకర్యాలు మరియు వనరుల కారణంగాతీరప్రాంత అభివృద్ధి ఇప్పుడు సులభమైంది", అన్నారాయన. ఓడరేవుల అనుసంధానత మెరుగ్గా ఉండాలనిఅది వేగవంతం కావాలనేది ప్రభుత్వ ప్రయత్నంఇందుకోసంపి.ఎంగతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కిందఎటువంటి అవరోధాలు లేని ఓడరేవుల అనుసంధానత కు సహాయపడే రైల్వే మరియు రహదారులకు సంబంధించిన రెండు వందల యాభైకి పైగా ప్రాజెక్టులను గుర్తించడం జరిగింది.”, అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

"ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" వేడుకల గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, "బానిసత్వ బారి నుండి భారత దేశాన్ని రక్షించడానికి రాణి అబ్బక్క, రాణి చెన్న భైరా దేవి చేసిన పోరాటాలను గుర్తు చేశారు.  ధైర్యవంతులైన మహిళలుఈ రోజుభారతదేశం ఎగుమతుల రంగంలో ముందుకు సాగడానికి గొప్ప ప్రేరణగా నిలిచారు" అని ఆయన కొనియాడారు.

కర్ణాటకలోని కరవలి ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. నేను ఎల్లప్పుడూ దేశభక్తిజాతీయ సంకల్పం యొక్క  శక్తి నుండి ప్రేరణ పొందుతానుమంగళూరులో కనిపించే  శక్తి అటువంటి అభివృద్ధి పథాన్ని ప్రకాశవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానుఅదే కోరికతో అభివృద్ధి కార్యక్రమాలకు మీ అందరికీ అనేక అభినందనలు మరియు శుభాకాంక్షలు." అని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హాజరైన వారిలో - కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బస్వరాజ్ బొమ్మై, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఓడరేవులు, సరకు రవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్. యడియూరప్ప, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ శ్రీపాద్ యస్సో నాయక్, శ్రీ శంతను ఠాకూర్, సుశ్రీ శోభా కరంద్లాజే, పార్లమెంటు సభ్యులు శ్రీ నళిన్ కుమార్ కటీల్, రాష్ట్ర మంత్రులు శ్రీ అంగర ఎస్., శ్రీ సునీల్ కుమార్ వి., శ్రీ కోట శ్రీనివాస్ పూజారి ప్రభృతులు ఉన్నారు.

ప్రాజెక్టుల వివరాలు

మంగుళూరులో దాదాపు 3,800 కోట్ల రూపాయల విలువైన యాంత్రీకరణ మరియు పారిశ్రామికీకరణ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

న్యూ మంగుళూరు పోర్ట్ అథారిటీ చేపట్టిన కంటైనర్లు, ఇతర కార్గో నిర్వహణ కోసం 14వ నెంబరు బెర్తు యాంత్రీకరణ కోసం 280 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు ను ప్రధానమంత్రి ప్రారంభించారు. యాంత్రిక టెర్మినల్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, టర్న్‌ అరౌండ్ సమయం, ప్రీ-బెర్తింగ్ ఆలస్యం, పోర్ట్‌ లో వేచి ఉండే సమయాలను దాదాపు 35 శాతం తగ్గిస్తుంది, తద్వారా వ్యాపార వాతావరణానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. హ్యాండ్లింగ్ సామర్ధ్యానికి 4.2 ఎం.టి.పి.ఏ. కంటే ఎక్కువ జోడించడం ద్వారా ఈ ప్రాజెక్టు మొదటి దశ విజయవంతంగా పూర్తయింది. ఇది 2025 నాటికి 6 ఎం.టి.పి.ఏ. కి పెరుగుతుంది.

పోర్ట్ ద్వారా చేపట్టిన సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన ఐదు ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక క్రయోజెనిక్ ఎల్.పి.జి. స్టోరేజ్ ట్యాంక్ టెర్మినల్‌ తో అమర్చబడిన సమీకృత ఎల్.పి.జి. మరియు బల్క్ లిక్విడ్ పి.ఓ.ఎల్. ఫెసిలిటీ, 45,000 టన్నుల పూర్తి లోడ్ వి.ఎల్.జి.సి.ని (చాలా పెద్ద గ్యాస్ క్యారియర్లను) అత్యంత సమర్థవంతమైన పద్ధతిలో అన్‌-లోడ్ చేయగలదు. ఈ ప్రాంతంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లక్ష్యాలను, ఈ సదుపాయం బలపరచడంతో పాటు, దేశంలోని అగ్రశ్రేణి ఎల్‌.పి.జి. దిగుమతి పోర్ట్‌లలో ఒకటిగా పోర్ట్ హోదాను బలోపేతం చేస్తుంది. స్టోరేజీ ట్యాంకులు, ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ నిర్మాణం, బిట్ మెన్ స్టోరేజీ తో పాటు, అనుబంధ సౌకర్యాల నిర్మాణం, బిటుమెన్ & ఎడిబుల్ ఆయిల్ స్టోరేజీ మరియు అనుబంధ సౌకర్యాల నిర్మాణం వంటి ప్రాజెక్టులకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు బిటుమెన్ మరియు ఎడిబుల్ ఆయిల్ ట్యాంకుల సమయాన్ని మెరుగుపరచడంతో పాటు, వాణిజ్యం కోసం మొత్తం సరుకు రవాణా వ్యయాన్ని తగ్గిస్తాయి. కులాయ్‌లో ఫిషింగ్ హార్బ‌ర్ అభివృద్ధికి ప్రధానమంత్రి శంకుస్థాప‌న చేశారు. ఇది చేప‌లు ప‌ట్టడాన్ని సులభతరం చేయడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌ లో చేపలకు మంచి ధ‌ర‌ లభించడానికి దోహదపడుతుంది. సాగరమాల కార్యక్రమం కింద ఈ పనులు చేపట్టడం జరిగింది. మత్స్యకార సమాజానికి ఇది గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుంది.

మంగుళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ద్వారా చేపట్టిన బి.ఎస్. అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టు మరియు సముద్రపు నీటి లవణ నిర్మూలన ప్లాంటు అనే రెండు ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. దాదాపు రూ. 1830 కోట్ల రూపాయల విలువైన బి.ఎస్. - VI అప్‌గ్రేడేషన్ ప్రాజెకక్టు, అతి స్వచ్ఛమైన పర్యావరణ అనుకూలమైన బి.ఎస్.-VI గ్రేడ్ (10 పి.పి.ఎం. కంటే తక్కువ సల్ఫర్ కలిగి ఉండే) ఇంధన ఉత్పత్తి ని సులభతరం చేస్తుంది. దాదాపు 680 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సముద్ర జల లవణ నిర్మూలన ప్లాంటు, మంచినీటిపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, ఏడాది పొడవునా హైడ్రోకార్బన్లు, పెట్రోరసాయనాలు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చేస్తుంది. రోజుకు 30 మిలియన్ లీటర్ల (ఎం.ఎల్.డి) సామర్థ్యం కలిగిన ఈ ప్లాంటు సముద్రపు నీటిని రిఫైనరీ ప్రక్రియలకు అవసరమైన నీరు గా మారుస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi