జల్ జీవన్ మిషన్ కింద యాద్గిర్ బహుళ గ్రామాల తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన
నారాయణపూర్ ఎడమ గట్టు కాలువ - విస్తరణ పునరుద్ధరణ మరియు ఆధునీకరణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రధాని
జాతీయ రహదారి -150సి లో బడడాల్ నుంచి మరదాగి ఎస్ ఆందోల వరకు 65.5 కిలోమీటర్ల 6 లైన్ల కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే భాగం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి
"ఈ అమృత కాలంలో వికసిత భారతదేశం నిర్మాణం జరగాలి"
" దేశంలో ఒక్క జిల్లా అయినా అభివృద్ధి లో వెనుకబడితే దేశాభివృద్ధి సాధ్యం కాదు"
" ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, రవాణా లాంటి 10 అంశాలు కీలక అంశాలుగా ఉంటాయి. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో అత్యుత్తమ 10 జిల్లాలో యాద్గిర్ ఒకటి"
"సమస్యల పరిష్కారం, అభివృద్ధి విధానంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం పని చేస్తోంది"
"యాద్గిర్‌లోని దాదాపు 1.25 లక్షల రైతు కుటుంబాలకు పీఎం కిసాన్ నిధి నుంచి .250 కోట్ల రూపాయల చెల్లింపులు "
"దేశం వ్యవసాయ విధానంలో సన్నకారు రైతులకు అత్యధిక ప్రాధాన్యత"
"మౌలిక సదుపాయాలు, సంస్కరణలపై డబుల్ ఇంజన్ ప్రభుత్వం దృష్టి పెట్టడంతో కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు"

క‌ర్ణాట‌క‌లోని కోడెక‌ల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, మరికొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.  కోడెకల్‌లో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.  జల్ జీవన్ మిషన్ కింద చేపట్టనున్న యాద్గిర్ బహుళ-గ్రామ తాగునీటి సరఫరా పథకం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు.   సూరత్-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే ఎన్ హెచ్ -150సీ లో 65.5 కి.మీ విభాగం (బడదల్ నుంచి  మరదగిఎస్  ఆందోల వరకు) , నారాయణపూర్ లెఫ్ట్ బ్యాంక్  కాలువ - పొడిగింపు పునరుద్ధరణ మరియు ఆధునికీకరణ ప్రాజెక్ట్ ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన  ప్ర‌ధానమంత్రి క‌ర్ణాట‌క ప్ర‌జ‌ల చూపిస్తున్న ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ లకు కృతజ్ఞత  తెలిపారు. ప్రజల ఆదరణ, ప్రేమ తమకు బలం కలిగిస్తున్నాయని  అన్నారు. తన ప్రసంగంలో ప్రధానమంత్రి  యాద్గిర్ పురాతన  చరిత్రను ప్రస్తావించారు.పురాతన రట్టిహళ్లి కోట  పూర్వీకుల సామర్థ్యం ప్రాచీన  సంస్కృతి మరియు సంప్రదాయాలు ప్రతిబింబిస్తుందని అన్నారు.  స్వరాజ్యం కోసం పోరాడి, సుపరిపాలన అందించిన   మహారాజు వెంకటప్ప నాయక్ దేశం అంతటా గుర్తింపు గౌరవం పొందారని అన్నారు.  "ఈ వారసత్వ సంపద చూసి ప్రతి ఒక్కరూ గర్వపడాలి" అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈరోజు శంకుస్థాపన చేసిన రోడ్లు, నీటి సంబంధించిన ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజలకు భారీ ప్రయోజనాలను అందిస్తాయని ప్రధాని అన్నారు. సూరత్ చెన్నై కారిడార్  కర్ణాటక భాగం నిర్మాణ పనులు  ఈ రోజు ప్రారంభమయ్యాయి. దీనివల్ల  యాద్గిర్, రాయచూర్ మరియు కల్బుర్గి తో సహా అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు  జీవన సౌలభ్యం అందించి  ఉపాధి, ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధికి తోడ్పడుతుంది.ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లో  అభివృద్ధి ప‌నులు అమలు చేస్తున్న  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్ర‌ధానమంత్రి అభినందించారు. 

రానున్న 25 ఏళ్లు దేశానికి, ప్రతి రాష్ట్రానికి ‘అమృత్‌ కాలం ’ అని ప్రధాని అన్నారు. “ఈ అమృత కాలం  సమయంలో వికసిత భారతదేశం నిర్మాణం జరగాలి.  . ప్రతి వ్యక్తి, కుటుంబం  రాష్ట్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మాత్రమే లక్ష్య సాధన  జరుగుతుంది. వ్యవసాయంలో రైతు, పరిశ్రమల రంగంలో పారిశ్రామికవేత్తలు  అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే  భారతదేశం అభివృద్ధి చెందుతుంది. పంట దిగుబడి పెరిగి, పరిశ్రమల ఉత్పత్తి ఎక్కువ అయినప్పుడు  భారతదేశం అభివృద్ధి చెందుతుంది. గతంలో అనుసరించిన ప్రతికూల అనుభవాలు, విధానాలను సమీక్షించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ” అని ఆయన అన్నారు. దీనికి ఉదాహరణ ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లోని యాద‌గిరి ఒక ఉదాహరణ అని ప్రధానమంత్రి అన్నారు. గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్ల ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.అభివృద్ధి సాధించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు, వసతులు ఈ ప్రాంతంలో ఉన్నాయని అన్నారు.  యాద్గిర్ మరియు ఇతర జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించిన  గత ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత పాలక ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాలు అనుసరించి పాల్పడి విద్యుత్తు , రోడ్డు మార్గాలు, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదని ఆక్షేపించారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి, ప్రాధాన్యతా అంశాల అమలు కోసం కృషి చేస్తున్నదని శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. ప్రభుత్వ దృష్టి  దృష్టి కేవలం అభివృద్ధిపైనే ఉందని, ఓటు బ్యాంకు రాజకీయాలపై లేదని  ప్రధాని స్పష్టం చేశారు.  "దేశంలో ఒక జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉంటే , దేశం అభివృద్ధి చెందదు" అని ప్రధాన మంత్రి అన్నారు ప్రస్తుత ప్రభుత్వం . అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ, యాద్గిర్‌తో సహా వంద ఆకాంక్ష గ్రామాలఅభివృద్ధికి కార్యక్రమాలు  ప్రారంభించింది అని  ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాలలో సుపరిపాలన, అభివృద్ధికి అంశాలకు  ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాన మంత్రి అన్నారు.  యాద్గిర్ 100లో శాతం పిల్లలకు టీకాలు వేయించారని, పోషకాహార లోపం ఉన్న పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిందని, జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్లు, ఉమ్మడి సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేసారు. గ్రామ పంచాయతీలకు డిజిటల్ సేవలు అందించడానికి ప్రత్యేక కేంద్రాలు పనిచేస్తున్నాయని ప్రధాని అన్నారు. " ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో విద్య, ఆరోగ్యం, రవాణా లాంటి 10 అంశాలు కీలక అంశాలుగా ఉంటాయి. ఆకాంక్ష జిల్లాల కార్యక్రమంలో అత్యుత్తమ 10 జిల్లాలో యాద్గిర్ ఒకటి" అని ప్రధాన మంత్రి తెలిపారు. అనేక రంగాల్లో విజయం సాధించిన  ప్రజా ప్రతినిధులు, జిల్లా యంత్రాంగాన్ని ప్రధాన మంత్రి అభినందించారు.

 

21వ శతాబ్దపు భారతదేశ అభివృద్ధిలో  నీటి భద్రత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. సరిహద్దు, తీరప్రాంత మరియు అంతర్గత భద్ర తతో సమానంగా నీటి భద్రత నిలుస్తుందని అన్నారు."సమస్యల పరిష్కారం, అభివృద్ధి  విధానంతో డబుల్ ఇంజన్ ప్రభుత్వం పని చేస్తోంది"   అని ఆయన చెప్పారు. 2014 నాటికీ  పెండింగ్‌లో ఉన్న 99 నీటిపారుదల పథకాలలో 50 ఇప్పటికే పూర్తయ్యాయి అని తెలిపిన ప్రధానమంత్రి   పథకాల పరిధి  విస్తరించామని చెప్పారు. కర్ణాటకలో కూడా ఇలాంటి ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి.10,000 క్యూసెక్కుల సామర్ధ్యం కలిగిన  నారాయణపూర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ విస్తరణ,ఆధునీకరణ, పునర్జీవం కార్యక్రమం ద్వారా  కమాండ్ ఏరియా లో 4.5 లక్షల హెక్టార్లకు నీరు అందిస్తుంది అని ఆయన తెలియజేశారు. గత 7-8 సంవత్సరాల కాలంలోమైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం   70 లక్షల హెక్టార్లకు పైగా భూమికి నీటి పారుదల సౌకర్యం కలిగించిందని వివరించారు. ' ఒక బొట్టు నీటితో అదనపు పంట ' విధానం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ రోజు ప్రారంభించిన ప్రాజెక్టు కర్ణాటకలో 5 లక్షల ఎకరాల భూమికి నీటి సౌకర్యం కల్పించి, భూగర్భ జలాలను అభివృద్ధి చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. 

జోడు ఇంజిన్ ల ప్రభుత్వం ద్వారా పూర్తి అయిన పనుల తాలూకు ఉదాహరణల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, మూడున్నర సంవత్సరాల క్రితం ఆరంభం అయినప్పుడు ‘జల్ జీవన్ మిశన్’ పద్దెనిమిది కోట్ల గ్రామీణ కుటుంబాల లో కేవలం మూడు కోట్ల కుటుంబాల కే నల్లా నీరు అందేది అని తెలిపారు. ‘‘ప్రస్తుతం ఈ తరహా గ్రామీణ కుటుంబాల సంఖ్య పదకొండు కోట్ల కు పెరిగింది’’ అని ఆయన చెప్పారు. ‘‘మళ్ళీ ఇందులో, ముప్పై అయిదు లక్షల కుటుంబాలు కర్నాటక లో ఉన్నాయి’’ అని ఆయన అన్నారు. యాద్ గీర్ మరియు రాయచూరు లలో ప్రతి కుటుంబాని కి నల్లా నీరు సదుపాయం లభ్యత కర్నాటక మరియు యావత్తు దేశం యొక్క మొత్తం మీది సగటు కంటే అధికం గా ఉంది అని ఆయన వెల్లడించారు.

ఈ రోజు న ప్రారంభం అయిన పథకాల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, యాద్ గీర్ లో ప్రతి ఇంటి కి నల్లా నీటి ని అందించే లక్ష్యం జోరందుకోగలదని తెలియ జేశారు. భారతదేశం లో జల్ జీవన్ మిశన్ ప్రభావం వల్ల ప్రతి ఏటా 1.25 లక్షల కు పైగా బాలల యొక్క ప్రాణాల ను కాపాడడం సాధ్యపడగలదని ఒక అధ్యయనం లో తేలిందన్నారు. హర్ ఘర్ జల్ ప్రచారోద్యమం యొక్క ప్రయోజనాల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, రైతుల కు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల ను పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం లో భాగం గా ఇస్తుండగా, దానికి తోడు కర్నాటక ప్రభుత్వం 4,000 రూపాయల ను ఇస్తోందని, దీంతో రైతుల కు అందే ప్రయోజనాలు రెట్టింపు అవుతున్నాయని స్పష్టం చేశారు. ‘‘యాద్ గీర్ లో దాదాపు గా 1.25 లక్షల రైతు కుటుంబాల వారు సుమారు 250 కోట్ల రూపాయల నిధుల ను పిఎమ్ కిసాన్ నిధి నుండి అందుకొన్నారు’’ అని ప్రధాన మంత్రి చెప్పారు.

 

డబల్ ఇంజన్ ప్రభుత్వం వేగవంతమైన లయ ను గురించి ప్రధాన మంత్రి మరింత గా వివరిస్తూ, కేంద్రం నూతన విద్య విధానాన్ని ప్రవేశపెట్ట గా, కర్నాటక ప్రభుత్వం విద్య నిధి పథకాల ద్వారా పేద విద్యార్థుల కు సాయపడుతోందన్నారు. కేంద్రం ప్రగతి చక్రాన్ని ముందుకు కదిలేటట్లు చూస్తోందని, కర్నాటక ఇన్ వెస్టర్ లకు రాష్ట్రాన్ని ఆకర్షణీయం గా మార్చుతోందని ఆయన అన్నారు. ‘‘నేత కార్మికుల కు ముద్ర పథకం ద్వారా కేంద్రం అందిస్తున్న సహాయాన్ని కర్నాటక ప్రభుత్వం మరింతగా పెంచి వారికి సాయపడుతోంది’’ అని ఆయన అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన తరువాత అనేక సంవత్సరాలు గడచినప్పటికీ ఏదైనా ఒక ప్రాంతం, ఒక వర్గం, ఒక వ్యక్తి ఇంకా లోటుపాటుల ను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే గనుక, అటువంటి సందర్భాల లో ప్రస్తుత ప్రభుత్వం వారికి గరిష్ఠ ప్రాధాన్యాన్ని ఇస్తోందని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. మన దేశం లో కోట్ల కొద్దీ చిన్న రైతులు దశాబ్దాల తరబడి ప్రతి సౌకర్యాని కి ఆమడ దూరం లో ఉండిపోయారని, ఈ విషయం లో ప్రభుత్వ విధానాల లో ఎటువంటి ప్రయాస చోటు చేసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం, ఈ చిన్న రైతు దేశ వ్యవసాయ విధానం యొక్క అతి పెద్ద ప్రాథమ్యం గా ఉన్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. రైతుల కు యంత్రాల ను అందించడం ద్వారా సాయపడడం, వారిని డ్రోన్ ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశ గా తీసుకు పోవడం, నానో యూరియా వంటి రసాయనిక ఎరువుల ను సమకూర్చడం, ప్రాకృతిక వ్యవసాయాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం, చిన్న రైతుల కు కిసాన్ క్రెడిట్ కార్డుల ను మంజూరు చేయడం, అంతేకాకుండా పశు పోషణ, చేపల పెంపకం, ఇంకా తేనెటీగల పెంపకం లలో ఊతాన్ని అందించడం వంటి కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరణలు గా ప్రస్తావించారు.

 

పప్పు/కాయ ధాన్యాల నిలయం గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దినందుకు స్థానిక రైతుల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. గత ఎనిమిది సంవత్సరాల లో ఎమ్ఎస్ పి లో భాగం గా పప్పు/కాయ ధాన్యాల ను 80 రెట్లు అధికం గా సేకరించడమైంది అని ఆయన వెల్లడించారు. పప్పు/కాయ ధాన్యాల ను పండించే రైతులు 2014వ సంవత్సరాని కి పూర్వం కేవలం కొన్ని వందల కోట్ల రూపాయలను అందుకొంటే, దానితో పోలిస్తే గడచిన 8 సంవత్సరాల లో వారు 60,000 కోట్ల రూపాయల ను అందుకొన్నారని ప్రధాన మంత్రి చెప్పారు.

 

ఐక్య రాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరం గా ప్రకటించిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావించి, జొన్న, ఇంకా రాగి వంటి ముతక ధాన్యాల ను కర్నాటక లో సమృద్ధి గా ఉత్పత్తి చేయడం జరుగుతోందన్నారు. ఈ కోవ కు చెందిన పోషక విలువలు కలిగిన ముతక ధాన్యాల ఉత్పత్తి ని పెంచడం తో పాటుగా వాటిని ప్రపంచవ్యాప్తం గా ప్రోత్సహించడానికి జోడు ఇంజిన్ ల ప్రభుత్వం కంకణం కట్టుకొంది అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం లో కర్నాటక రైతులు ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించగలరన్న నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

కర్నాటక లో సంధానం విషయానికి వస్తే జంట ఇంజన్ ల ప్రభుత్వం తాలూకు ప్రయోజనాల ను గురించి ప్రధాన మంత్రి పేర్కొంటూ, వ్యవసాయాని కి, పరిశ్రమ కు మరియు పర్యటన కు సంధానం అనేది సమాన ప్రాధాన్యం కలిగినటువంటి అంశం అన్నారు. సూరత్-చెన్నై ఇకానామిక్ కారిడర్ పూర్తి కావడం తో ఉత్తర కర్నాటక లో చాలా ప్రాంతాల కు కలిగే ప్రయోజనాన్ని గురించి ప్రముఖం గా ప్రకటించారు. ఉత్తర కర్నాటక లోని పర్యటక ప్రదేశాల కు, తీర్థయాత్ర లకు చేరుకోవడం దేశ ప్రజల కు సులభతరం గా మారుతుందని, దీని ద్వారా యువత కు సరికొత్త గా వేల కొద్దీ ఉద్యోగాలు మరియు స్వతంత్రోపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. ‘‘మౌలిక సదుపాయాల కల్పన పై మరియు సంస్కరణల పై జోడు ఇంజిన్ ల ప్రభుత్వం తీసుకొనే శ్రద్ధ కర్నాటక ను ఇన్వెస్టర్ ల ఎంపిక గా మార్చివేస్తున్నది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచం అంతటా ఉత్సుకత వ్యక్తం అవుతున్న కారణం గా, అటువంటి పెట్టుబడులు రాబోయే కాలం లో మరింత అధికం అయ్యేందుకు ఆస్కారం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారి లో కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లోత్, కర్నాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై, సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబా లతో పాటు కర్నాటక ప్రభుత్వాని కి చెందిన మంత్రులు, తదితరులు ఉన్నారు.

 

పూర్వరంగం

ప్రతి ఇంటికీ నల్లా ల ద్వారా త్రాగునీటి ని అందించాలన్న ప్రధాన మంత్రి దార్శనికత ను సాకారం చేయడం లో మరొక అడుగా అన్నట్లు జల్ జీవన్ మిశన్ లో భాగంగా యాద్ గీర్ బహుళ గ్రామ త్రాగునీటి సరఫరా పథకాని కి యాద్ గీర్ జిల్లా కోడెకల్ లో శంకుస్థాపన ను చేయడమైంది. ఈ పథకం లో భాగం గా 117 ఎంఎల్ డి సామర్థ్యం తో ఒక నీటి శుద్ధి ప్లాంలు ను నిర్మించడం జరుగుతుంది. 2050 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు కాగల ఈ ప్రాజెక్టు యాద్ గీర్ జిల్లా లోని మూడు పట్టణాలతో పాటు 700కు పైగా గ్రామాల లో దాదాపు 2.3 లక్షల కుటుంబాల కు త్రాగునీటి ని అందించనుంది.

ఈ కార్యక్రమం లో, నారాయణ పుర్ ఎడమ గట్టు కాలువ విస్తరణ, నవీకరణ మరియు ఆధునికీకరణ ప్రాజెక్టు (ఎన్ఎల్ బిసి - ఇఆర్ఎమ్) ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. 10,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని కలిగివుండే కాలువల తో కూడిన ఈ ప్రాజెక్టు ద్వారా 4.5 లక్షల హెక్టేర్ ల ఆయకట్టు ప్రాంతాని కి సేద్యపు నీటి ని అందించవచ్చు. దీనివలన కలబురగి, యాద్ గీర్, ఇంకా విజయ్ పుర్ జిల్లా ల లో 560 గ్రామాల కు చెందిన మూడు లక్షల మంది రైతుల కు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు కు అయ్యే మొత్తం ఖర్చు దాదాపు గా 4700 కోట్ల రూపాయలు గా ఉంది.

ఎన్ హెచ్-150సి లో భాగం గా ఉన్న 65.5 కిలో మీటర్ ల సెక్శను కు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ఆరు దోవ ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టు సూరత్-చెన్నై ఎక్స్ ప్రెస్ వే లో భాగం గా ఉంది. దీనిని దాదాపు గా 2,000 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మిస్తున్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi