జాతీయ రాజమార్గ పథకాలు అయిదింటి కి శంకుస్థాపన చేయడంతో పాటు దేశ ప్రజల కుఅంకితం చేశారు
103 కి.మీ. పొడవైనరాయ్ పుర్ - ఖరియార్ రోడ్ రైల్ లైన్ డబ్లింగ్ ను మరియు 17 కి.మీ. పొడవైనటువంటి కేవటీ-అంతాగఢ్ కొత్త రైలు మార్గాన్నిదేశ ప్రజల కు అంకితం చేశారు.
కోర్ బా లో ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ బాట్లింగ్ప్లాంటు ను దేశ ప్రజల కు అంకితం చేశారు
అంతాగఢ్ - రాయ్ పుర్ రైలు కు ప్రారంభ సూచక జెండా ను వీడియోలింక్ మాధ్యం ద్వారా చూపారు
ఆయుష్మాన్ భారత్ లో భాగం గా 75 లక్షల కార్డుల ను లబ్ధిదారుల కు పంపిణీ చేయడాన్ని మొదలుపెట్టినప్రధాన మంత్రి
‘‘ఈ నాటిప్రాజెక్టు లు ఛత్తీస్ గఢ్ లో అభివృద్ధి తాలూకు ఒక కొత్త యాత్ర కు సూచికలు; అంతేకాదు, అవి ఆదివాసి ప్రాంతాల కు సౌకర్యాన్ని కూడా సమకూర్చుతాయి’’
‘‘అభివృద్ధి పరం గావెనుకబడినటువంటి కొన్ని ప్రాంతాల లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ని ప్రభుత్వం ప్రాథమ్యంగా తీసుకొంటున్నది’’
‘‘ఆధునిక మౌలికసదుపాయాలు అనేవి సామాజిక న్యాయం తో నూ ముడిపడినటువంటివి గా ఉన్నాయి’’
‘‘ఈ రోజు న ఛత్తీస్గఢ్ రెండు ఇకానామిక్ కారిడార్ లతో జత పడుతోంది’’
‘‘క్రొత్త అవకాశాల ను కల్పించడాని కి మరియు ప్రాకృతికసంపద నెలవైన ప్రాంతాల లో మరిన్ని పరిశ్రమల ను ఏర్పాటు చేయడాని కి ప్రభుత్వంకట్టుబడి ఉంది’’
‘‘ఎమ్ఎన్ఆర్ఇజిఎ లోభాగం గా చాలినంత ఉపాధి ని కల్పించడం కోసం 25,000 కోట్ల రూపాయల కు పైగా డబ్బు ను ఛత్తీస్ గఢ్ కు ప్రభుత్వం అందించింది’’

దాదాపు గా 7,500 కోట్ల రూపాయల విలువ కలిగిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కు ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పుర్ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన లు చేయడం తో పాటుగా ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు కూడాను. సుమారు గా 6,400 కోట్ల రూపాయల విలువ కలిగిన జాతీయ రాజమార్గ పథకాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేయడమే కాకుండా, శంకుస్థాపన సైతం చేశారు. 750 కోట్ల రూపాయల ఖర్చు తో నిర్మాణం పూర్తి అయిన 103 కిలోమీటర్ ల పొడవైన రాయ్ పుర్ - ఖారియర్ రోడ్ రైల్ లైన్ డబ్లింగు ను, 290 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచిన 17 కి.మీ. పొడవైన కేవటీ - అంతాగఢ్ క్రొత్త రైల్వే లైను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వీటికి అదనం గా, సంవత్సరాని కి అరవై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ యొక్క బాట్లింగ్ ప్లాంటు ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితమిచ్చారు. ఈ ప్లాంటు ను 130 కోట్ల రూపాయల కు పైచిలుకు ఖర్చు తో నిర్మించడం జరిగింది. అంతాగఢ్-రాయ్ పుర్ రైలు కు ఆయన వీడియో లింక్ మాధ్యం ద్వారా ప్రారంభోత్సవం జరిపారు. అలాగే, ఆయుష్మాన్ భారత్ లో భాగం గా లబ్ధిదారుల కు 75 లక్షల కార్డుల పంపిణీ ని ప్రధాన మంత్రి మొదలు పెట్టారు. 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మౌలిక సదుపాయాలు మరియు సంధానం వంటి రంగాల లో 7,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఛత్తీస్ గఢ్ అందుకొంటున్న సందర్భం లో రాష్ట్ర అభివృద్ధి యాత్ర లో అతి ముఖ్యమైన అధ్యాయం మొదలైందన్నారు. నేటి ప్రాజెక్టు లు రాష్ట్రం లో ప్రజల జీవనాన్ని సరళతరం గా మార్చుతూ, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ను బలపరచనున్నాయి అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు లు ఛత్తీస్ గఢ్ లో వరి రైతుల కు, ఖనిజ పరిశ్రమ కు మరియు పర్యటన పరిశ్రమ కు ప్రయోజనం కలిగిస్తూ, రాష్ట్రం లో ఉద్యోగ అవకాశాల ను వృద్ధి చెందింప చేయనున్నాయి అని కూడా ఆయన నొక్కి చెప్పారు. ‘‘ఈనాడు ప్రారంభం అవుతున్న ప్రాజెక్టు లు ఛత్తీస్ గఢ్ లోని ఆదివాసి ప్రాంతాల అభివృద్ధి లో ఒక క్రొత్త యాత్ర కు సూచిక గా నిలుస్తాయి.’’ అని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఈ ప్రాజెక్టుల కు గాను రాష్ట్ర ప్రజల కు అభినందనల ను తెలియ జేశారు.

 

ఏ ప్రాంతం లో అయినా అభివృద్ధి లో జాప్యం జరిగింది అంటే అది అక్కడి మౌలిక సదుపాయాల లోటు తో ప్రాత్యక్ష సంబంధాన్ని కలిగివుంటుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. అందువల్ల ప్రభుత్వం అభివృద్ధి విషయాల లో వెనుకపట్టున మిగిలిపోయినటువంటి నిర్దిష్ట ప్రాంతాల లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కి ప్రాధాన్యాన్ని ఇస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మౌలిక సదుపాయాల కు అర్థం.. జీవించడం లో సరళత్వం తో పాటు వ్యాపారాన్ని నిర్వహించడం లో సౌలభ్యం. మౌలిక సదుపాయాలు అంటే అర్థం త్వరిత గతి న అభివృద్ధి, ఇంకా ఉద్యోగ అవకాశాలూ ను’’ అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఛత్తీస్ గఢ్ లో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల లో భాగం గా గడచిన తొమ్మిది సంవత్సరాల లో రహదారి సంధానం అనేది ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజన లో భాగం గా రాష్ట్రం లోని వేల కొద్దీ ఆదివాసీ గ్రామాల కు విస్తరించింది అని ఆయన అన్నారు. దాదాపు గా 3,500 కి.మీ. పొడవైన జాతీయ రాజమార్గ పథకాల కు ప్రభుత్వం ఆమోదాన్ని తెలిపింది. వాటిలో 3000 కి.మీ. మేరకు పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి అని ఆయన వెల్లడించారు. రాయ్ పుర్ - కోడెబోడ్ మరియు బిలాస్ పుర్ - పథ్ రాపాలీ రాజమార్గాల ను ఈ రోజు న ప్రారంభించిన విషయాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ‘‘అవి రైలు మార్గాలు లేదా రహదారులు, లేదా టెలికమ్యూనికేశన్ లు కావచ్చు.. గడచిన కొన్ని సంవత్సరాల లో అన్ని విధాలైన సంధానాన్ని పెంపొందింప చేయడం కోసం గడచిన తొమ్మిదేళ్ళ లో ఛత్తీస్ గఢ్ లో ఇంతకు ముందు ఎరుగనటువంటి కార్యాల ను ప్రభుత్వం పూర్తి చేసింది.’’అని ఆయన అన్నారు. 

ఆధునిక మౌలిక సదుపాయాలు సామాజిక న్యాయం తో సంబంధాన్ని కలిగివున్నటువంటివి కూడా ను అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ రోజు న చేపట్టిన ప్రాజెక్టు లు, రహదారులు మరియు రైలు మార్గాలు పేదల, దళితుల, వెనుకబడిన వర్గాల మరియు ఆదివాసుల జనావాసాల ను కలుపుతాయి. అవి రోగులు మరియు మహిళ లు ఆసుపత్రుల కు వెళ్ళేందుకు సంధానాన్ని మెరుగు పరుస్తాయి అని ఆయన వివరించారు. తొమ్మిదేళ్ళ కిందట ఛత్తీస్ గఢ్ లో 20 శాని కి పైగా పల్లె లు ఎటువంటి మొబైల్ కనెక్టివిటీ కీ నోచుకోలేదు. ప్రస్తుతం ఆ కోవ కు చెందిన పల్లెల సంఖ్య దాదాపు 6 శాతాని కి తగ్గిపోయింది. మరి దీని తాలూకు అతి పెద్ద లబ్ధిదారులు ఎవరయ్యా అంటే వారు ఈ ప్రాంతాని కి చెందిన రైతులు, మరియు శ్రమికులే అని చెప్పాల్సివుంటుంది అని ఆయన అన్నారు. సంధానం సదుపాయం మెరుగు పడినటువంటి ఆదివాసీ గ్రామాల లో చాలా వరకు గ్రామాలు ఒకప్పుడు నక్సలైట్ హింస వల్ల ప్రభావితం అయ్యాయి అని కూడా ఆయన పేర్కొన్నారు. 4జి సంధానాన్ని అందించడం కోసం ఏడు వందల కు పైచిలుకు మొబైల్ టవర్ లను ప్రభుత్వం నెలకొల్పుతున్నదని ప్రధాన మంత్రి తెలియ జేశారు. సుమారు 300 టవర్ లు ఇప్పటికే పని చేయడం మొదలు పెట్టాయి కూడా అని ఆయన అన్నారు. ‘‘ఒకప్పుడు నిశబ్దం గా ఉన్న ఆదివాసి పల్లెల లో ప్రస్తుతం రింగ్ టోన్ ల ధ్వనుల ను వినవచ్చును.’’ అని ఆయన అన్నారు. మొబైల్ కనెక్టివిటీ రంగ ప్రవేశం చేయడం ద్వారా గ్రామీణ ప్రజల కు అనేక కార్యాల లో అండ దొరికింది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘‘ఇదే సామాజిక న్యాయం అంటే. మరి ఇదే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’. ’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. 

‘‘ఈ రోజు న రెండు ఇకానామిక్ కారిడార్ లతో ఛత్తీస్ గఢ్ ముడి పడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాయ్ పుర్ - ధన్ బాధ్ ఇకానామిక్ కారిడార్ మరియు రాయ్ పుర్ - విశాఖపట్నం ఇకానామిక్ కారిడార్ లు యావత్తు ప్రాంతం యొక్క భాగ్యరేఖల ను మార్చి వేస్తాయి అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలు అని పేరుపడ్డటువంటి మరియు ప్రస్తుతం ఆకాంక్షయుక్త జిల్లాలు గా పేర్కొంటున్నటువంటి ప్రాంతాల గుండా ఈ ఇకానామిక్ కారిడార్ లు సాగుతూ ఉన్నాయని ఆయన అన్నారు. ఈ రోజు న శంకుస్థాపన జరిగినటువంటి రాయ్ పుర్-విశాఖపట్నం ఇకానామిక్ కారిడార్ ఫలితం గా రాయ్ పుర్ కు మరియు విశాఖపట్నం కు మధ్య యాత్ర కాలం సగాని కి తగ్గిపోతుంది. అందువల్ల ఇది ఈ ప్రాంతం లో ఒక సరిక్రొత్త జీవనాడి వలే మారుతుంది అని ఆయన అన్నారు. ఆరు దోవల తో ఉండేటటువంటి ఈ రహదారి ధమ్ తరీ ధాన్య మండలాన్ని, కాంకేర్ బాక్సైట్ జోను ను, మరి అదే విధంగా కొండాగాఁవ్ లోని హస్తకళల సంపద ను దేశం లోని ఇతర ప్రాంతాల తో పెనవేస్తుంది అని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రహదారి వన్యప్రాణుల సంచారం ఉన్న ప్రాంతం ద్వారా పయనిస్తూ ఉన్న కారణం గా వన్యప్రాణుల ను దృష్టి లో పెట్టుకొని ప్రత్యేక సొరంగ మార్గాల ను, ప్రత్యేక మార్గాల ను నిర్మించడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘సుదూర ప్రాంతాల కు ప్రయాణించడాన్ని దల్లీ రాజ్ హరా నుండి జగ్ దల్ పుర్ కు రైలు మార్గం మరియు అంతాగఢ్ నుండి రాయ్ పుర్ కు నేరు గా నడిచే రైలు.. ఈ రెండూ సులభతరం చేసి వేస్తాయి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 

‘‘ప్రకృతి సంపద కు ఆలవాలం గా ఉన్న ప్రాంతాల లో క్రొత్త అవకాశాల ను కల్పించడాని కి మరియు ఎక్కువ పరిశ్రమల ను ఏర్పాటు చేయడాని కి ప్రభుత్వం కంకణం కట్టుకొంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో ఈ దిశ లో సాగిన కృషి ఛత్తీస్ గఢ్ లో పారిశ్రామికీకరణ కు నూతన శక్తి ని అందించింది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఆదాయం పరంగా ఛత్తీస్ గఢ్ నిధుల లో వృద్ధి నమోదు అయింది అని ఆయన వెల్లడించారు. రాయల్టీ రూపం లో ఛత్తీస్ గఢ్ అధిక నిధుల ను అందుకోసాగింది.. ప్రత్యేకించి గనులు మరియు ఖనిజాల చట్టం లో మార్పు అనంతరం ఇది మొదలైంది అని ఆయన అన్నారు. 2014 వ సంవత్సరాని కంటే పూర్వం నాలుగేళ్ళ లో ఛత్తీస్ గఢ్ రాయల్టీ రూపంలో 1300 కోట్ల రూపాయల ను అందుకోగా 2015-16 మొదలుకొని 2020-21 మధ్య కాలం లో రాష్ట్రం దాదాపు 2800 కోట్ల రూపాయల ను అందుకొంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఖనిజ సంపద కలిగిన జిల్లాల లో అభివృద్ధి తాలూకు పనులు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ లో వృద్ధి చోటు చేసుకొన్న పర్యవసానం గా వేగవంతం అయ్యాయి అని ఆయన అన్నారు. ‘‘బాలల కు పాఠశాలలు కావచ్చు, గ్రంథాలయాలు కావచ్చు, రహదారులు కావచ్చు, జల సంబంధి ఏర్పాటులు కావచ్చు.. అటువంటి అనేక అభివృద్ధి కార్యాల కు ప్రస్తుతం డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ యొక్క డబ్బు ను వెచ్చించడం జరుగుతున్నది.’’ అని ఆయన అన్నారు.

 

ఛత్తీస్ గఢ్ లో ఈ రోజు న తెరచిన ఒక కోటి అరవై లక్షల పై చిలుకు జన్ ధన్ బ్యాంక్ ఖాతాల లో 6,000 కోట్ల రూపాయల కు పైచిలుకు జమ అయిందని ప్రధాన మంత్రి తెలియజేస్తూ, ఆ డబ్బు పేద కుటుంబాల కు, రైతుల కు మరియు శ్రమికుల కు చెందిన డబ్బు అని పేర్కొన్నారు. ఈ వర్గాల వారు వారి యొక్క డబ్బు ను ఒకప్పుడు మరెక్కడో అట్టిపెట్టక తప్పని స్థితి ని ఎదుర్కొన్నారు అని ఆయన అన్నారు. పేద ప్రజలు ప్రభుత్వం నుండి నేరు గా సాయాన్ని అందుకోవడం లో జన్ ధన్ ఖాతా లు తోడ్పడుతున్నాయి అని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఉద్యోగ కల్పన మరియు స్వతంత్రోపాధి అవకాశాల పరం గా ఛత్తీస్ గఢ్ లోని యువత కోసం ప్రభుత్వం నిరంతరం గా పాటుపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ముద్ర యోజన లో భాగం గా 40,000 కోట్ల రూపాయల కు పైగా డబ్బు ను ఛత్తీస్ గఢ్ యువత కు ఇవ్వడమైంది. పేద కుటుంబాల లోని యువత కు మరియు ఆదివాసీ యువత కు ఎంతో మందికి ముద్ర యోజన సాయాన్ని అందించిందని ఆయన అన్నారు. కరోనా కాలం లో దేశం లో చిన్న పరిశ్రమల కు ఊతాన్ని ఇవ్వడానికని లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, ఆ పథకం ద్వారా ఛత్తీస్ గఢ్ లోని ఇంచుమించు రెండు లక్షల వాణిజ్య సంస్థలు రమారమి 5,000 కోట్ల రూపాయల సహాయాన్ని అందుకొన్నాయని ఆయన అన్నారు. 

వీధుల లో తిరుగుతూ సరకుల ను విక్రయించే వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాల ను అందించే పిఎమ్ స్వనిధి యోజన ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ పథకం లో అరవై వేల మందికి పైగా లబ్ధిదారులు ఛత్తీస్ గఢ్ కు చెందిన వారేనన్నారు. ఎమ్ఎన్ఆర్ఇజిఎ లో భాగం గా పల్లెల లో తగినంత ఉపాధి ని కల్పించడం కోసం ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కు పైచిలుకు మొత్తాన్ని ఛత్తీస్ గఢ్ కు అందించిందని ఆయన తెలిపారు.

 

ఆయుష్మాన్ కార్డుల ను 75 లక్షల మంది లబ్ధిదారుల కు ఇవ్వడం అనే ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ పథకం లో రాష్ట్రం లోని పదిహేను వందల కు పైగా పెద్ద ఆసుపత్రుల లో ప్రతి ఏటా 5 లక్షల రూపాయల వరకు విలువైన ఉచిత వైద్య చికిత్స ల తాలూకు పూచీకత్తు పేద ప్రజానీకాని కి మరియు ఆదివాసీ కుటుంబాల కు లభిస్తుందని స్పష్టం చేశారు. పేదలు, ఆదివాసులు, వెనుకబడిన వర్గాల వారు మరియు దళిత కుటుంబాల వారి కి అండగా ఆయుష్మాన్ యోజన ఉంటున్నందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో, ఛత్తీస్ గఢ్ లోని ప్రతి ఒక్క కుటుంబాని కి సమానమైన సేవ భావన తో సేవల ను అందించడం జరుగుతుందని హామీ ని ఇచ్చారు.

ఛత్తీస్ గఢ్ గవర్నర్ శ్రీ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేశ్ బ‌ఘెల్‌, ఛత్తీస్ గఢ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ టి.ఎస్. సింహ్ దేవ్, రహదారి రవాణా మరియు రాజమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా లతో పాటు పార్లమెంటు సభ్యులు మరియు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

పూర్వరంగం

 

మౌలిక సదుపాయాల అభివృద్ధి కి ఊతాన్ని ఇచ్చే చర్యల లో భాగం గా, దాదాపు గా 6,400 కోట్ల రూపాయల విలువ కలిగిన జాతీయ రాజమార్గ (ఎన్ హెచ్) పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయడం తో పాటుగా శంకుస్థాపన కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రాజెక్టుల లో జబల్ పుర్ - జగ్ దల్ పుర్ జాతీయ రాజమార్గం లోని 33 కిలో మీటర్ ల పొడవైన రాయ్ పుర్ నుండి కోడేబోడ్ సెక్శన్ వరకు నాలుగు దోవ ల సెక్శన్ కూడా ఒక భాగం గా ఉంది. ఈ సెక్శన్ పర్యటన రంగాని కి ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటు జగ్ దల్ పుర్ సమీపం లోని ఉక్కు కర్మాగారాల తాలూకు ముడి వస్తువులు, తుది ఉత్పత్తుల చేరవేత లో ఒక ముఖ్యమైన పాత్ర ను కూడా పోషించనుంది. అంతేకాక, ఇనుప ఖనిజం సమృద్ధి గా లభ్యమయ్యే ప్రాంతాల కు సంధానాన్ని సైతం సమకూర్చుతుంది. ఎన్ హెచ్-130 లో భాగమైన బిలాస్ పుర్ నుండి అంబికాపుర్ వెళ్ళే సెక్శన్ లో నాలుగు దోవల తో కూడిన 53 కిమీ పొడవైన బిలాస్ పుర్- పత్ రాపాలీ మార్గాన్ని కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. ఈ మార్గం ఉత్తర్ ప్రదేశ్ తో ఛత్తీస్ గఢ్ కు ఇప్పుడు ఉన్న సంధానాన్ని మెరుగు పరచడం లో తోడ్పడనుంది. దీనితో పాటు, ఈ మార్గం చుట్టుప్రక్కల ప్రాంతాల లోని బొగ్గు గనుల కు సంధానాన్ని సమకూర్చడం ద్వారా బొగ్గు రవాణా ను పెంపు చేయడం లో దోహద పడనుంది.

 

ఆరు దోవ ల గ్రీన్ ఫీల్డ్ రాయ్ పుర్ - విశాఖపట్నం కారిడర్ లోని ప్రాజెక్టు కు చెందిన ఛత్తీస్ గఢ్ సెక్శన్ జాతీయ రాజమార్గ ప్రాజెక్టులు మూడింటి కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ మూడు ప్రాజెక్టుల లో ఎన్ హెచ్-130 సిడి లోని ఆరు దోవల తో కూడిన 43 కిమీ పొడవైన ఝాంకీ- సర్ గీ సెక్శన్ అభివృద్ధి పనులు; ఎన్ హెచ్-130 సిడి లోని ఆరు దోవల తో కూడిన 57 కిమీ పొడవు గల సర్ గీ - బసన్ వాహీ సెక్శన్ అభివృద్ధి పనులు మరియు ఎన్ హెచ్- 130 సిడి లోని ఆరు దోవల తో కూడిన 25 కిమీ పొడవైన బసన్ వాహీ - మారంగ్ పురీ సెక్శన్ అభివృద్ధి పనులు భాగం గా ఉన్నాయి. ఉదంతీ అభయారణ్యం లో వన్యప్రాణులు ఎటువంటి నియంత్రణ లేకుండా యథేచ్ఛ గా సంచరించేందుకు 2.8 కి.మీ. పొడవు న ఆరు దోవ ల సొరంగ మార్గాన్ని 27 ఏనిమల్ పాసెస్ మరియు 17 మంకీ కేనోపీస్ తో ఏర్పాటు చేయడమైంది. ఈ ప్రాజెక్టు లు ధమ్ తరీ లో బియ్యం మిల్లుల కు మరియు కాంకేర్ లో బాక్సైట్ సమృద్ధం గా లభించే ప్రాంతాల కు మెరుగైన సంధానం సదుపాయాన్ని అందుబాటు లోకి తీసుకు రానున్నాయి. అంతేకాకుండా, కొండాగాఁవ్ లోని హస్తకళ ల పరిశ్రమ ల వల్ల లాభం కలుగుతుంది. మొత్తం మీద చూస్తే, ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో సామాజిక - ఆర్థిక అభివృద్ధి కి ప్రధానమైనటువంటి ఉత్తేజాన్ని అందించనున్నాయని చెప్పవచ్చును.

 

నూట మూడు కి.మీ. ల పొడవు న సాగేటటువంటి మరియు 750 కోట్ల రూపాయల ఖర్చు తో డబ్లింగ్ పనులు పూర్తి అయినటువంటి రాయ్ పుర్ - ఖారియార్ రోడ్ రైల్ మార్గాన్ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. ఇది ఛత్తీస్ గఢ్ లో పరిశ్రమల కు ఓడరేవుల వద్ద నుండి బొగ్గు, ఉక్కు, ఎరువులు మరియు ఇతర సరకుల రవాణా ను సులభతరం చేయనుంది. కేవటీ ని మరియు అంతాగఢ్ ను కలుపుతూ సాగే 17 కి.మీ. పొడవైన ఒక క్రొత్త రైలు మార్గాన్ని కూడా ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు. 290 కోట్ల రూపాయల వ్యయం తో అభివృద్ధి పరచినటువంటి ఈ క్రొత్త రైలు మార్గం దల్లీ రాజ్ హరా, ఇంకా రావ్ ఘాట్ ప్రాంతాల లోని ఇనుప ఖనిజం గనుల కు మరియు భిలాయి ఉక్కు కర్మాగారాని కి మధ్య సంధానం సదుపాయాన్ని కలుగజేస్తుంది; ఇది దట్టమైన అటవీ ప్రాంతాల గుండా సాగుతూ ఛత్తీగఢ్ లోని మారుమూల ప్రాంతాల ను జోడిస్తుంది.

 

నూట ముప్ఫయ్ కోట్ల రూపాయల కు పైచిలుకు ఖర్చు తో కోర్ బా లో నిర్మించిన అరవై వేల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ యొక్క బాట్లింగ్ ప్లాంటు ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. అంతాగఢ్ - రాయ్ పుర్ రైలు కు ప్రారంభ సూచక పచ్చజెండా ను కూడా ఆయన వీడియో లింక్ మాధ్యం ద్వారా చూపారు. ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల కు 75 లక్ష ల కార్డు ల పంపిణీ నీ ప్రధాన మంత్రి మొదలుపెట్టారు. 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”