సుమారు 16 లక్షల మంది మహిళా సభ్యుల కు లబ్ధి కలిగేటట్టు ఎస్ హెచ్ జి ల కు 1000కోట్ల రూపాయల ను ప్రధాన మంత్రి బదిలీ చేశారు
బిజినెస్ కరస్పాండెంట్-సఖి స్ కు ఒకటో నెల స్టైపెండ్ ను బదలాయించినప్రధాన మంత్రి; అలాగే ముఖ్యమంత్రి కన్య సుమంగళ స్కీము కు చెందిన ఒక లక్ష మంది కిపైగా లబ్ధిదారుల కు కూడా డబ్బు ను బదిలీ చేశారు
200 కు పైగా అదనపు పోషణ తయారీ విభాగాల కుప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు
‘‘ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన వంటి పథకాలు గ్రామీణ పేదల కు మరియుబాలికల కు విశ్వాసం తాలూకు గొప్ప మాధ్యమం గా మారుతున్నాయి’’
‘‘జోడు ఇంజిన్ ల ప్రభుత్వం ఉత్తర్ ప్రదేశ్ లోని మహిళ ల భద్రత కు, హోదా కు మరియు గౌరవానికి పడుతున్న పూచీ ఇది వరకు ఎన్నడూ ఎరుగనటువంటిది గా ఉంది. ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలు ఇదివరకటి పరిస్థితులు తిరిగి రానివ్వబోం అంటూనిర్ణయం తీసుకొన్నారు’’
‘‘మహిళా స్వయం సహాయ సమూహాల కు చెందిన సోదరీమణులు ఆత్మనిర్భర్ భారత్ఉద్యమ సమర్ధకులు అని నేను భావిస్తున్నాను. ఈ స్వయంసహాయ సమూహాలు వాస్తవాని కి జాతీయ సహాయ సమూహాలు గా ఉన్నాయి’’
‘‘కుమార్తె లు కూడా వారు వారి చదువుల ను కొనసాగించడాని కి, అలాగేసమాన అవకాశాల ను దక్కించుకోవడానికి సమయం చిక్కాలి అని కోరుకొన్నారు. ఈ కారణం గా, పుత్రికల కు చట్టబద్ధ వివాహ వయస్సు ను 21సంవత్సరాలు గా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దేశం ఈ నిర్ణయాన్ని పుత్రికల ను దృష్టి లో పెట్టుకొని తీసుకొంటోంది’’
‘‘మాఫియారాజ్ మరియు అవ్యవస్థ ల నిర్మూలన తాలూకు అతి పెద్ద లబ్ధిదారులు ఉత్తర్ ప్రదేశ్ కు చెందినపుత్రికలు మరియు సోదరీమణులే’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ ను సందర్శించారు. మహిళల సాధికారిత కోసం, ప్రత్యేకించి క్షేత్ర స్థాయి లోని మహిళల సశక్తీకరణ కోసం, నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జి స్) కు చెందిన బ్యాంకు ఖాతా లోకి 1000 కోట్ల రూపాయల సొమ్ము ను మంత్రి బదిలీ చేశారు. దీనితో ఎస్ హెచ్ జి స్ కు చెందిన దాదాపు 16 లక్షల మంది మహిళా సభ్యుల కు లబ్ధి కలుగుతుంది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన్ - నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిశ‌న్‌ (డిఎవై-ఎన్ఆర్ఎల్ఎమ్) లో భాగం గా ఈ బదిలీ చోటు చేసుకొంటున్నది. దీని ద్వారా 80,000 ఎస్ హెచ్ జి లలో ఒక్కొక్క ఎస్ హెచ్ జి 1.10 లక్షల రూపాయల వంతు న కమ్యూనిటీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (సిఐఎఫ్) ను అందుకొంటుండగా, 60,000 ఎస్ హెచ్ జి లలో ఒక్కొక్క ఎస్ హెచ్ జి 15,000 రూపాయల వంతు న రివాల్వింగ్ ఫండ్ ను అందుకొంటాయి. బిజినెస్ కరస్పాండెంట్-సఖీస్ కు (బి.సి.- సఖీస్) ఒకటో నెల స్టైపెండ్ రూపం లో 4000 రూపాయల ను బదిలీ చేయడం ద్వారా వారిని మంత్రి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లోని మరొక విశేషం అని చెప్పాలి. ఈ కార్యక్రమం లో భాగం గా ముఖ్యమంత్రి కన్య సుమంగళ స్కీము తాలూకు ఒక లక్ష కు పైగా లబ్ధిదారుల కు 20 కోట్ల రూపాయల కు పైగా ధన రాశి ని మంత్రి బదిలీ చేశారు. 202 సప్లిమెంటరీ న్యూట్రిశన్ మేన్యుఫాక్చరింగ్ యూనిట్ లకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, హిందీ సాహిత్య రంగం లో ప్రముఖుడు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది కి ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ప్రయాగ్ రాజ్ అనేది వేల సంవత్సరాలుగా మన మాతృ శక్తి కి ఒక సంకేతం గా నిలచిన గంగ-యమున-సరస్వతి నదుల సంగమ స్థలంగా ఉండింది. ఈ రోజున ఈ ఈ తీర్థయాత్ర సంబంధి నగరం మహిళా శక్తి యొక్క అద్భుతమైన సమూహాన్ని తిలకిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళల సశక్తీకరణ కోసం జరుగుతున్న కృషి ని యావత్తు దేశం గమనిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కన్య సుమంగళ యోజన- దేనిలో భాగం గా అయితే ఆయన ఈ రోజు న రాష్ట్రం లోని లబ్ధిదారులైన ఒక లక్ష మంది కి పైగా పుత్రిక ల ఖాతాల లోకి కోట్లాది రూపాయల ను బదిలీ చేశారో- వంటి పథకాలు గ్రామీణ పేదల మరియు బాలికల విశ్వాసాని కి ఒక ఘనమైన మాధ్యమం గా మారుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

జంట ఇంజిన్ ప్రభుత్వం యుపి మహిళల భద్రత కు, హోదా కు, వారి గౌరవాని కి పూచీ పడుతోంది అని, గతం లో ఈ విధం గా ఎన్నడూ జరుగలేదు అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని మహిళ లు ఇది వరకటి పరిస్థితుల ను వారు తిరిగి రానీయకూడదని నిర్ణయించుకొన్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. మాతృ గర్భం లో ఉన్న శిశువు ఆడ శిశువో, లేక మగ శిశువో తెలుసుకొని మరీ గర్భస్రావాల కు పాల్పడటాన్ని నిరోధించడం కోసం ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచార ఉద్యమాన్ని తీసుకు రావడం ద్వారా సమాజం లో చైతన్యాన్ని మేల్కొలపడం కోసం ప్రభుత్వం యత్నించింది అని ప్రధాన మంత్రి అన్నారు. తత్ఫలితం గా అనేక రాష్ట్రాల లో పుత్రిక ల సంఖ్యల లో పెరుగుదల చోటు చేసుకొంది అని ఆయన చెప్పారు. గర్భిణిల కు టీకామందు ను ఇప్పించడంపైన, వారి ప్రసావాలు ఆసుపత్రుల జరిగేటట్లు చూడటంపైన, గర్భావస్థ లో పోషకాహారాన్ని అందించడం పైన ప్రభుత్వం శ్రద్ధ వహించింది అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళలు గర్భం దాల్చి ఉన్న కాలం లో ‘ప్రధాన మంత్రి మాతృ వందన యోజన’ లో భాగం గా 5000 రూపాయల ను వారి బ్యాంకు ఖాతా లో జమ చేయడం జరుగుతోందని, దీని ద్వారా వారు సరైన భోజనాన్ని తీసుకొంటూ జాగ్రత పడేందుకు వీలు ఉంటుందని ఆయన చెప్పారు.

మహిళ ల హోదా ను పెంచేటటువంటి అనేక చర్యల ను గురించి ప్రధాన మంత్రి ఒక్కటొక్కటి గా వివరించారు. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ లో భాగం గా కోట్ల కొద్దీ టాయిలెట్ లను నిర్మించడం తోను, ‘ఉజ్జ్వల పథకం’ లో భాగం గా గ్యాస్ కనెక్శన్ ను సమకూర్చడం తోను, ఇంటి వద్దకే నల్లా నీటి ని తీసుకు రావడం తోను సోదరీమణుల జీవితాల లో ఒక కొత్త సౌకర్యం తరలివచ్చినట్లు అయింది అని ప్రధాన మంత్రి తెలిపారు.

దశాబ్దాల తరబడి, ఇల్లు మరియు సంపత్తి అనేవి ఒక్క పురుషులకు చెందినటువంటి హక్కు గానే పరిగణించడం జరిగింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ అసమానత్వాన్ని ప్రభుత్వం యొక్క పథకాలు తొలగిస్తున్నాయి అని ఆయన అన్నారు. దీనికి ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ యే ఒక అతి పెద్ద ఉదాహరణ గా ఉంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా ఇస్తున్న ఇళ్ళ ను ప్రాధాన్యం ప్రాతిపదికన మహిళల పేరిటే నిర్మించడం జరుగుతోంది అని ఆయన వివరించారు.

ఉపాధి కోసం నిర్వహిస్తున్నటువంటి పథకాలు మరియు కుటుంబం లో ఆదాయాన్ని పెంచడం కోసం నడుపుతున్న పథకాల లో మహిళల ను సమాన భాగస్వాముల ను చేయడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ముద్ర యోజన కొత్త కొత్త మహిళా నవ పారిశ్రామికవేత్తల ను ప్రోత్సహిస్తోంది, గ్రామాల లోని పేద కుటుంబాల కు చెందిన వారి ని సైతం ప్రోత్సహించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. మహిళల ను దీన్ దయాళ్ అంత్యోదయ యోజన ద్వారా దేశం అంతటా గల స్వయం సహాయ సమూహాలు మరియు గ్రామీణ సంస్థల తో జోడించడం జరుగుతోంది అని ఆయన పేర్కొన్నారు. ‘‘నేను స్వయం సహాయ సమూహాల కు చెందిన సోదరీమణుల ను ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రచార ఉద్యమ సమర్ధకులు గా భావన చేస్తున్నాను. ఈ స్వయం సహాయ సమూహాలు నిజాని కి జాతీయ సహాయ సమూహాలు’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

డబల్ ఇంజన్ ప్రభుత్వం, ఎలాంటి విచక్షణ కు తావు ఇవ్వకుండా. పుత్రికల భవిష్యత్తు కు సాధికారిత ను కల్పించడం కోసం అదే పని గా కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. అమ్మాయి ల చట్టబద్ధ వివాహ వయస్సు కు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం గురించి ఆయన ఈ సందర్భం లో తెలియ జేశారు. ‘‘ఇంతకు ముందు, పుత్రుల కు వివాహ సంబంధి చట్టబద్ధ వయస్సు 21 సంవత్సరాలు గా ఉండింది, అదే పుత్రిక ల విషయం లో మాత్రం 18 ఏళ్ళు గా ఉండింది. కుమార్తె లు కూడా తాము చదువుకోవడానికి మరియు సమాన అవకాశాల ను ప్రాప్తింప చేసుకోవడానికి తగినంత కాలం కావాలి అని కోరుకున్నారు. ఈ కారణం గా పుత్రికల కువివాహ వయస్సు ను 21 సంవత్సరాలు చేసేందుకు ప్రయాస లు కొనసాగుతున్నాయి. దేశం పుత్రిక ల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకొంటోంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

రాష్ట్రం లో ఇటీవలి కొన్ని సంవత్సరాల లో చట్టం, వ్యవస్థ ల స్థితి లో మెరుగుదల చోటు చేసుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. మాఫియా రాజ్, ఇంకా అవ్యవస్థ ల నిర్మూలన తాలూకు అతి పెద్ద లబ్ధిదారు యుపి లోని సోదరీమణులు మరియు కుమార్తెలు అని ఆయన అన్నారు. స్థితి ని అదుపు లోకి తెచ్చినందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ను ఆయన ప్రశంసించారు.

‘‘ప్రస్తుతం, ఉత్తర్ ప్రదేశ్ లో భద్రత తో పాటు హక్కులు కూడా ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం యుపి లో వ్యాపారాని కి తోడు అవకాశాలు కూడా ఉన్నాయి. నాకు పూర్తి నమ్మకం ఉంది.. ఎప్పుడయితే మన మాతృమూర్తుల మరియు సోదరీమణుల ఆశీర్వాడం ఉందో ఈ కొత్త ఉత్తర్ ప్రదేశ్ ను ఏ ఒక్కరు తిరిగి చీకటి లోకి నెట్టివేయలేరు..’’ అని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi