వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్టర్మినల్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు
పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కు చెందిన 75 లైట్ హౌస్ లలో యాత్రికుల సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు
భారతదేశం లో మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను ప్రారంభించారు
పలు రైలు ప్రాజెక్టుల ను మరియు రోడ్డు ప్రాజెక్టుల నుదేశ ప్రజల కు అంకితమిచ్చారు
“తూత్తుక్కుడి లో, తమిళ నాడు, వళర్చియిన ప్రత్తియొక్క ప్రజ్ఞలను ఎంచుకోవడం”
“ఈ రోజు, దేశం 'పూర్తి ప్రభుత్వం' యొక్క పని మాట్లాడుతున్నాయి”
“సంధానాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు జీవన సౌలభ్యాలను పెంచుతున్నాయి”
“సముద్ర రంగానికి అభివృద్ధి అనిపిస్తుంది అయితే తమిళ నాడు వంటి ఒక రాష్ట్రానికి అభివృద్ధి అనిపిస్తుంది”
“ఒకే సమయంలో 75 ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ఇది పూర్తి ప్రభుత్వం”

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 17,300 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగినటువంటి అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు తమిళ నాడు లోని తూత్తుక్కుడి లో ఈ రోజు న శంకుస్థాపన చేయడం తో పాటు గా వాటిని దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ప్రధాన మంత్రి వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్ నిర్మాణాని కి శంకుస్థాపన చేశారు. భారతదేశం లో మొట్టమొదటిసారి గా పూర్తి గా దేశీయం గా రూపొందించిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో ఉన్న 75 లైట్ హౌస్ లలో యాత్రికుల సదుపాయాల ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. వాంచీ మణియాచ్చి - తిరునెల్‌వేలి సెక్శన్, ఇంకా మేలప్పాలయమ్ - అరళ్‌వాయ్‌మొళి సెక్శన్ లు సహా వాంచీ మణియాచ్చి - నాగర్‌కోయిల్ రైలు మార్గం యొక్క డబ్లింగ్ ప్రాజెక్టుల ను కూడా ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. సుమారు గా 4,586 కోట్ల రూపాయల మొత్తం ఖర్చు తో తమిళ నాడు లో అభివృద్ధి పరచిన నాలుగు రహదారి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేశారు.

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, తూత్తుక్కుడి లో ఒక క్రొత్త ప్రగతి అధ్యాయాన్ని తమిళ నాడు లిఖిస్తోంది అన్నారు. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం తాలూకు మార్గసూచీ ని సిద్ధం చేసే దిశ లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన లు ఈ రోజు న జరిగాయి అని ఆయన అన్నారు. ప్రస్తుతం చేపట్టుకొంటున్న ఈ అభివృద్ధి ప్రాజెక్టుల లో ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ తాలూకు భావన ను గమనించవచ్చును అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టులు తూత్తుక్కుడి లోనివే కావచ్చు, అయినప్పటికీ ఇది భారతదేశం అంతటా అనేక ప్రాంతాల లో అభివృద్ధి కి జోరు ను అందించేదే అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ యొక్క యాత్ర ను గురించి మరియు ఆ యాత్ర లో తమిళ నాడు పోషించిన పాత్ర ను గురించి పునరుద్ఘాటించారు. రెండు సంవత్సరాల క్రిందట చిదంబరనార్ నౌకాశ్రయం సామర్థ్యాన్ని విస్తరించడం కోసం ఎన్నో ప్రాజెక్టుల కు తాను నాంది ని పలికిన విషయాన్ని, మరి అలాగే ఈ పోర్టు ను నౌకాయానం సంబంధి ప్రధానమైన నిలయం గా తీర్చిదిద్దడం జరుగుతుంది అంటూ తాను ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన ఈ సందర్భం లో గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ఆనాడు ఇచ్చిన హామీ ఈనాడు నెరవేరుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వి.ఒ. చిదంబరనార్ పోర్టు లో అవుటర్ హార్బర్ కంటైనర్ టర్మినల్ కు శంకుస్థాపన ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు కోసం 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి ని పెట్టడం జరుగుతుంది అని తెలియ జేశారు. ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రాజెక్టుల విలువ 900 కోట్ల రూపాయలు, అలాగే 2,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ను 13 నౌకాశ్రయాల లో మొదలు పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టులు తమిళ నాడు కు లబ్ధి ని చేకూర్చడం తో పాటుగా రాష్ట్రం లో ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తాయి అని ఆయన వివరించారు.

 

వర్తమాన ప్రభుత్వం ఈ రోజు న తీసుకు వస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజలు కోరినవే, కానీ మునుపటి ప్రభుత్వాలు వీటి విషయం లో ఎన్నడు శ్రద్ధ తీసుకోలేదు అని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. ‘‘తమిళ నాడు కు సేవ చేయడం కోసం, మరి ఈ రాష్ట్రం యొక్క భాగ్యాన్ని మార్చడం కోసం నేను ఇక్కడకు వచ్చాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

హరిత్ నౌక కార్యక్రమం లో భాగం గా భారతదేశం యొక్క ఒకటో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌లాండ్ వాటర్‌వే వెసల్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది కాశీ నగరాని కి తమిళ నాడు ప్రజలు అందిస్తున్నటువంటి కానుక అంటూ అభివర్ణించారు. తమిళ నాడు ప్రజల ఉత్సాహాన్ని, మరి వారి ఆప్యాయత ను కాశీ తమిళ్ సంగమం కార్యక్రమం లో కనులారా తిలకించాను అని ఆయన అన్నారు. వి.ఒ. చిదంబరనార్ నౌకాశ్రయాన్ని దేశంలోకెల్లా ప్రప్రథమ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్ గా తీర్చిదిద్దడాని కి ఉద్దేశించిన అనేక ఇతర ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల లో ఒక నిర్లవణీకరణ ప్లాంటు, హైడ్రోజన్ ఉత్పత్తి సదుపాయం లతో పాటు బంకరింగ్ ఫెసిలిటీ లు కూడా ఉన్నాయి. ‘‘ప్రపంచం ప్రస్తుతం ఏ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతోందో వాటిలో తమిళ నాడు చాలా ముందుకు పోతుంది’’ అని ఆయన అన్నారు.

 

 

నేటి రైలు మరియు రహదారి సంబంధి అభివృద్ధి ప్రాజెక్టుల ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, రైలు మార్గాల విద్యుతీకరణ మరియు డబ్లింగు పనుల తో తమిళ నాడు లోని దక్షిణ ప్రాంతాని కి, కేరళ కు మధ్య సంధానం మరింత గా మెరుగు పడుతుంది; అంతేకాకుండా తిరునెల్‌వేలి, ఇంకా నాగర్‌కోయిల్ క్షేత్రాల లో రాకపోకల లో రద్దీ కూడా తగ్గుతుంది అని వివరించారు. తమిళ నాడు లో 4,000 కోట్ల రూపాయల కు పైగా విలువైన రహదారుల ఆధునికీకరణ సంబంధి ప్రధాన ప్రాజెక్టులు నాలుగింటిని ఈ రోజు న చేపట్టిన విషయాన్ని సైతం ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వీటితో కనెక్టివిటీ కి ప్రోత్సాహం లభించడం, యాత్ర కు పట్టే కాలం తగ్గడం తో పాటుగా రాష్ట్రం లో వ్యాపారం మరియు పర్యటన రంగాల కు ప్రోత్సాహం అందుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

‘న్యూ ఇండియా’ లో పూర్తి ప్రభుత్వం దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, తమిళ నాడు లో మెరుగైన సంధానాన్ని మరియు మెరుగైన అవకాశాల ను కల్పించడం కోసం రహదారులు, హైవేస్ మరియు జల మార్గాల విభాగాలు కలసికట్టుగా కృషి చేస్తున్నాయి అన్నారు. ఈ కారణం గా రైల్‌వే స్, రహదారులు మరియు మేరిటైమ్ ప్రాజెక్టుల ను ఒకేసారి ప్రారంభించుకొంటున్నట్లు ఆయన చెప్పారు. బహుళ విధాలైనటువంటి పద్ధతి రాష్ట్రం లో అభివృద్ధి కి సరిక్రొత్త గతి ని అందిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

దేశం లో ప్రధానమైనటువంటి లైట్ హౌస్ లను పర్యటన స్థలాలు గా అభివృద్ధి పరచాలంటూ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ ) కార్యక్రమం లోని ఎపిసోడ్ లలో ఒక ఎపిసోడ్ లో తాను చేసిన సూచన ను ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 75 లైట్ హౌస్ ల లో యాత్రికుల సదుపాయాల ను దేశ ప్రజల కు అంకితం చేస్తున్నందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. ‘‘ఒకే సారి 75 ప్రాంతాల లో అభివృద్ధి కార్యక్రమాలు చోటుచేసుకొన్నాయి, ఇది కదా న్యూ ఇండియా’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించి, ఈ 75 ప్రదేశాలు రాబోయే కాలాల్లో చాలా పెద్ద పర్యటక కేంద్రాలు గా మారిపోతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

 

  కేంద్ర ప్ర‌భుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్ర‌ధానమంత్రి గుర్తు చేస్తూ- గ‌త 10 సంవ‌త్స‌రాల్లో  త‌మిళ‌నాడులో 1300 కిలోమీటర్ల పొడవైన వివిధ రైలు మార్గాల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. అలాగే 2000 కిలోమీటర్ల మేర రైలుమార్గాల విద్యుదీకరణ పూర్తయిందని, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణంసహా పలు రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణ పూర్తయ్యాయని ఆయన వివరించారు. అంతర్జాతీయ స్థాయి ప్రయాణానుభూతి కల్పిస్తూ రాష్ట్రంలో 5 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో రహదారి మౌలిక వసతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లదాకా పెట్టుబడులు పెడుతున్నదని వెల్లడించారు. ‘‘అనుసంధానం మెరుగు దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి జీవన సౌలభ్యాన్ని పెంచుతోంది’’ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

 

   భారతదేశంలో దశాబ్దాలుగా జలమార్గాలు-సముద్ర రంగంపై భారీ అంచనాలున్నాయని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. నేడు ఈ రంగాలే వికసిత భారత్ పునాదులుగా మారుతున్నాయని చెప్పారు. వీటిద్వారా దక్షిణ భారతం మొత్తంమీద అత్యధికంగా లబ్ధి పొందేది తమిళనాడు రాష్ట్రమేనని చెప్పారు. తమిళనాడులోని మూడు ప్రధాన ఓడరేవులతోపాటు 12కుపైగా చిన్న ఓడరేవుల ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాలకూ అవకాశాలు అందివస్తాయని ప్రధానమంత్రి ‘‘సముద్ర రంగం అభివృద్ధి అంటే తమిళనాడు వంటి రాష్ట్ర ప్రగతి’’ అంటూ గత దశాబ్దంలో వి.ఒ.చిదంబరనార్ రేవుద్వారా నౌకల రాకపోకలలో 35 శాతం వృద్ధి నమోదైందని ప్రధాని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఈ రేవు 38 మిలియన్ టన్నుల మేర సరకు రవాణా బాధ్యతలు నిర్వర్తించిందని, తద్వారా 11 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. ‘‘దేశంలోని ఇతర ప్రధాన ఓడరేవులలోనూ ఈ తరహాల ఫలితాలు కచ్చితంగా కనిపిస్తాయి’’ అంటూ- ఇందులో సాగరమాల వంటి ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ అన్నారు.


   జలమార్గాలు, సముద్ర సంబంధ రంగాల్లో భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రధాని నొక్కిచెప్పారు. ‘లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌’లో మన దేశం 38వ స్థానానికి దూసుకెళ్లడంతోపాటు  రేవుల సామర్థ్యం దశాబ్ద కాలంలో రెండింతలైందని ఆయన వివరించారు. ఈ కాలంలో జాతీయ జలమార్గాలు 8 రెట్లు, నౌకా ప్రయాణికుల సంఖ్య 4 రెట్లు, నావికుల సంఖ్య రెండింతల మేర పెరుగుదల నమోదైందని ఆయన అన్నారు. ఈ విధంగా ముందడుగు పడుతుండటం ఇటు తమిళనాడుకు అటు మన యువతరానికి మేలు కలుగుతుందని చెప్పారు. ‘‘తమిళనాడు ప్రగతి పథంలో దూసుకెళ్లగలదని నా దృఢ విశ్వాసం. ఈ పరిస్థితుల నడుమ దేశం మాకు మూడోసారి సేవ చేసే అవకాశం ఇస్తే ద్విగుణీకృత ఉత్సాహంతో సేవలందిస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను’’ అని ప్రకటించారు. ప్రస్తత పర్యటనలో తమిళనాడులోని వివిధ ప్రాంతాల ప్రజలు తనపై ప్రదర్శించిన ప్రేమాదరాలు, ఉత్సాహంతోపాటు ఆశీర్వాదాలు కురిపించారని ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ అభిమానం, ఆప్యాయతలకు సరితూగే విధంగా రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని వాగ్దానం చేశారు. చివరగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రగతి పనులను ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరూ తమ ఫోన్ లైట్లను స్విచాన్ చేసి, వెలుగులు విరజిమ్మాలని ప్రధాని కోరారు.

 

   ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవి, కేంద్ర ఓడరేవులు-షిప్పింగ్-జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.
 

నేపథ్యం


   ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఇవాళ వి.ఒ.చిదంబరనార్ రేవులో ‘ఔటర్ హార్బర్ కంటైనర్ టెర్మినల్‌’కు శంకుస్థాపన చేశారు. ఈ రేవును తూర్పు భారతానికి రవాణా కూడలిగా మార్చడంలో ఈ కంటైనర్ టెర్మిన‌ల్‌ను ఒక ముందడుగుగా పేర్కొనవచ్చు. సుదీర్ఘ భారత తీరప్రాంతంతోపాటు సానుకూల భౌగోళిక స్థానాన్ని ప్రభావితం చేయడంతోపాటు ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ పోటీతత్వాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే ఈ ప్రాంతంలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధిలోనూ ఈ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ తనవంతు పాత్ర పోషిస్తుంది. అలాగే వి.ఒ.చిదంబరనార్ ఓడరేవును దేశంలోనే తొలి హరిత ఉదజని కూడలిగా మార్చడం లక్ష్యంగా అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు. వీటిలో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్లాంట్, ఉదజని ఉత్పత్తి-బంకరింగ్ సౌకర్యం తదితరాలు కూడా ఉన్నాయి.

 

   ‘హరిత నౌకా కార్యక్రమం’ కింద భారత తొలి స్వదేశీ హరిత ఉదజని ఇంధన సెల్ అంతర్గత జలమార్గ నౌకను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ నౌకను కొచ్చిన్ షిప్‌యార్డ్ తయారుచేయగా, పరిశుభ్ర ఇంధన పరిష్కారాల అనుసరణతోపాటు నికర-శూన్య ఉద్గారాలపై దేశం నిబద్ధతకు అనుగుణంమైన ఓ మార్గదర్శక దశకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. మరోవైపు దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 75 లైట్‌హౌస్‌లలో పర్యాటక సౌకర్యాలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.


   ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా వంచి మ‌ణియాచ్చి-తిరునెల్వేలి విభాగం, వంచి మ‌ణియాచ్చి - నాగ‌ర్‌కోయిల్ రైలు మార్గం, మేల‌పాళ‌యం-అర‌ళ్‌వాయిమొళి విభాగం సహా వంచి మ‌ణియాచ్చి- నాగ‌ర్‌కోయిల్ రైలు మార్గం డబ్లింగ్ ప్రాజెక్టులను ప్ర‌ధాని జాతికి అంకితం చేశారు. దాదాపు రూ.1,477 కోట్లతో నిర్మించిన ఈ డబ్లింగ్ ప్రాజెక్ట్ వల్ల చెన్నై-కన్యాకుమారి, నాగర్‌కోయిల్-తిరునల్వేలి మార్గాల్లో రైళ్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది.


   తమిళనాడులో దాదాపు రూ.4,586 కోట్లతో నిర్మించిన 4 రహదారి ప్రాజెక్టులను కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. వీటిలో ఎన్‌హెచ్-844లోని జిట్టాందహళ్లి-ధర్మపురి సెక్షన్‌ 4 వరుసలుగా విస్తరణ; ఎన్‌హెచ్-81లోని మీన్‌సురుట్టి-చిదంబరం సెక్షన్‌ 2 వరుసల విస్తరణ, ఎన్‌హెచ్-83లోని ఓడంచత్రం-మడతుకుళం సెక్షన్ 4 వరుసలుగా విస్తరణ; ఎన్‌హెచ్-83లోని నాగపట్టిణ-తంజావూరు సెక్షన్‌లో రెండువైపులా అదనపు భుజాలతో 2 వరుసల విస్తరణ ప్రాజెక్టులున్నాయి. వీటిద్వారా అనుసంధానం మెరుగుపడటమేగాక ప్రయాణ సమయం తగ్గుతుంది. అలాగే సామాజిక-ఆర్థిక వృద్ధికి ముందడుగు పడటంతోపాటు ఈ ప్రాంతంలో తీర్థయాత్రికులకు సౌలభ్యం ఇనుమడిస్తుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi