ఇండియన్ ఆయిల్ కు చెందిన 518 కి.మీ. పొడవైనహల్దియా-బరౌనీ క్రూడ్ ఆయిల్ పైప్ లైను ను ఆయన ప్రారంభించారు
నూట ఇరవై టిఎమ్‌టిపిఎ సామర్థ్యం కలిగిన ఇండియన్ ఆయిల్ఎల్‌ పిజి బాట్లింగ్ ప్లాంటు ను ఖడగ్‌ పుర్ లోని విద్యాసాగర్ ఇండస్ట్రియల్ పార్కు లోప్రారంభించారు
కోల్‌కాతా లోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులోమౌలిక సదుపాయాల పటిష్టీకరణ కు ఉద్దేశించిన అనేక ప్రాజెక్టుల ను దేశ ప్రజల కుఅంకితం ఇవ్వడం తో పాటు శంకుస్థాపన జరిపారు
సుమారు 2680 కోట్ల రూపాయలు విలువ కలిగిన అనేక ముఖ్యరైలు ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు
వ్యర్థ జలాల మరియు మురుగు జలాల శుద్ధి కి సంబంధించినమూడు ప్రాజెక్టుల ను పశ్చిమ బంగాల్ లో ప్రధాన మంత్రి ప్రారంభించారు
‘‘21వ శతాబ్ది లోభారతదేశం శరవేగం గా పురోగమిస్తున్నది. 2047 వ సంవత్సరాని కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలన్నలక్ష్యాన్ని మనం అందరం కలసికట్టు గా నిర్దేశించుకొన్నాం’’
‘‘దేశం లో ఇతరప్రాంతాల లో మాదిరి గా పశ్చిమ బంగాల్ లో కూడా అంతే వేగం గా రైలు మార్గాలఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం పాటుపడుతున్నది’’
‘‘పర్యావరణం తోసద్భావన ను కలిగి ఉంటూ అభివృద్ధి ని ఏ విధం గా సాధించవచ్చో ప్రపంచాని కి భారతదేశం చాటిచెప్పింది’’
‘‘ఏదైనా ఒకరాష్ట్రం లో మౌలిక సదుపాయాల సంబంధి ప్రాజెక్టు ను మొదలు పెడితే ఉద్యోగాల కు అనేక అవకాశాల ను తెరచుకొంటాయి’’

ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను పశ్చిమ బంగాల్ లోని హుగ్‌లీ లో గల ఆరామ్‌బాగ్ లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంకితం ఇవ్వడంతో పాటు గా శంకుస్థాపన ను జరిపారు. ఈ రోజు న ప్రారంభించుకొంటున్న అభివృద్ధి ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల లో రైలు, నౌకాశ్రయాలు, చమురు సరఫరా కు ఉద్దేశించిన గొట్టపు మార్గం, ఎల్‌పిజి సరఫరా మరియు వ్యర్థ జలాల శుద్ధి వంటి రంగాల కు సంబంధించినవి ఉన్నాయి.

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం లో శరవేగం గా వృద్ధి చోటుచేసుకొంటోందని, 2047 వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశం గా తీర్చిదిద్దాలి అనేది సంకల్పమని పేర్కొన్నారు. ఆయన యువతీ యువకుల, మహిళల, రైతుల మరియు పేదల సశక్తీకరణ కు సంబంధించిన ప్రాధాన్యాల ను పునరుద్ఘాటించారు. ‘‘మేం పేదల సంక్షేమం కోసం సదా పాటుపడుతూ వచ్చాం, మరి ఈ కృషి తాలూకు ఫలితాలు ప్రస్తుతం ప్రపంచం కళ్ళెదుట కనిపిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు. పేదరికం వలయం లో నుండి 25 కోట్ల మంది ప్రజానీకం బయటకు వచ్చారన్న వాస్తవం ప్రభుత్వ నిర్ణయాల విధానాల యొక్క మరియు ప్రభుత్వం పయనిస్తున్న దిశ యొక్క సప్రమాణికత ను సూచిస్తోంది అని ఆయన స్పష్టం చేశారు. దీనికి అంతటికి వెనుక ఉన్న ప్రధానమైన కారణం సరి అయినటువంటి ఉద్దేశ్యాలే అని ఆయన అన్నారు.

 

పశ్చిమ బంగాల్ అభివృద్ధి కి తోడ్పాటును అందించే 7,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రారంభించడం మరియు శంకుస్థాపన చేయడం జరిగింది; ఈ ప్రాజెక్టుల లో రైలు, నౌకాశ్రయాలు, పెట్రోలియమ్, ఇంకా జలశక్తి ల వంటి రంగాల కు చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ‘‘దేశం లోని ఇతర ప్రాంతాల లో మాదిరిగానే పశ్చిమ బంగాల్ లో కూడాను రైలు మార్గాల ఆధునికీకరణ ను అంతే వేగం గా చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సందర్భం లో ఝార్‌గ్రామ్ -సాల్‌గాఝారీ ని కలిపే మూడో రైలు మార్గం గురించి ఆయన ప్రస్తావించి, ఇది రైల్ కనెక్టివిటీ ని మెరుగు పరచడం కోసమే కాకుండా ఆ ప్రాంతం లో పర్యటన రంగాన్ని మరియు పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహిస్తుంది అని వివరించారు. సోండాలియా - చంపాపుకుర్, ఇంకా దన్‌కునీ- భట్టనగర్ - బాల్టికురీ రైలు మార్గాల యొక్క డబ్లింగు ను గురించి కూడా ఆయన మాట్లాడారు. కోల్ కాతా లో ఉన్న శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు లో మౌలిక సదుపాయాల ను బలోపేతం చేయడం కోసం తలపెట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల ను గురించి మరియు 1,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన మరో మూడు ప్రాజెక్టుల ను గురించి కూడా ప్రధాన మంత్రి మాట్లాడారు.

 

హల్దియా బరౌనీ క్రూడ్ పైప్ లైన్ ను ఉదాహరణగా చూపుతూ, “ పర్యావరణానికి అనుగుణంగా అభివృద్ధి ఎలా చేయవచ్చో భారతదేశం ప్రపంచానికి చూపించిందని” ప్రధాని మోదీ అన్నారు. ముడి చమురును నాలుగు రాష్ట్రాలు - బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ - గుండా పైపులైన్ ద్వారా మూడు రిఫైనరీలకు రవాణా చేయడం వల్ల పొదుపు, పర్యావరణ పరిరక్షణ

 

జరుగుతుంది.
ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ 7 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుస్తుందని, ఈ ప్రాంతంలో ఎల్ పిజి డిమాండ్ ను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల వల్ల అనేక జిల్లాల్లో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.
;ఒక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ప్రారంభించడం ఉపాధికి బహుళ మార్గాలను తెరుస్తుంది; అని ప్రధాన మంత్రి చెప్పారు, పశ్చిమ బెంగాల్ లో రైల్వేల అభివృద్ధి కోసం ఈ సంవత్సరం రూ 13000 కోట్ల పైగా బడ్జెట్ కేటాయింపుల గురించి తెలియజేశారు, ఇది 2014 కంటే మూడు రెట్లు ఎక్కువ. రైలు మార్గాల విద్యుదీకరణ,
ప్రయాణీకుల సౌకర్యాల మెరుగుదల, రైల్వే స్టేషన్ల పునారాభి వృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన చెప్పారు. గడచిన 10 సంవత్సరాలలో పూర్తయిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, పశ్చిమ బెంగాల్ లో 3,000 కిలోమీటర్లకు పైగా రైలు మార్గాల విద్యుదీకరణ జరిగిందని, అమృత్ స్టేషన్ పథకం కింద తారకేశ్వర్ రైల్వే
 

స్టేషన్ పునర్నిర్మాణం, 150 కి పైగా కొత్త రైలు సేవలను ప్రారంభించడం సహా సుమారు 100 రైల్వే స్టేషన్లను పునర్ అభివృద్ధి చేస్తున్నామని ప్రధాన మంత్రి తెలియజేశారు. ఐదు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రజల సహకారంతో వికసిత్ భారత్ సంకల్పాలు నెరవేరుతాయని ప్రధాన
మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పౌరులకు తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి.ఆనందబోస్, కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలరవాణా శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
సుమారు రూ.2,790 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన 518 కిలోమీటర్ల హల్దియా-బరౌనీ క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ పైప్ లైన్ బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ మీదుగా వెళుతుంది. బరౌనీ రిఫైనరీ, బొంగైగావ్ రిఫైనరీ, గౌహతి రిఫైనరీలకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితమైన రీతిలో ముడి చమురును సరఫరా
 

చేస్తుంది.
ఖరగ్ పూర్ లోని విద్యాసాగర్ ఇండస్ట్రియల్ పార్కులో 120 టిఎంటిపిఎ సామర్థ్యంతో ఇండియన్ ఆయిల్ ఎల్ పిజి బాట్లింగ్ ప్లాంట్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. రూ.200 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ ఈ ప్రాంతంలో మొదటి ఎల్ పి జి బాట్లింగ్ ప్లాంట్ అవుతుంది. పశ్చిమ బెంగాల్లో 14.5
లక్షల మంది వినియోగదారులకు ఎల్ పి జి ని సరఫరా చేయనుంది. కోల్ కతా లోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ లో మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేసే 1000 కోట్ల రూపాయల బహుళ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం,

శంకుస్థాపన చేశారు. బెర్త్ నెం.8 ఎన్ ఎస్ డి పునర్నిర్మాణం, కోల్ కతా డాక్ సిస్టమ్ లోని బెర్త్ నంబర్ 7 అండ్ 8 ఎన్ ఎస్ డి యాంత్రీకరణ ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రాజెక్టులలో ఉన్నాయి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టులోని హల్దియా డాక్ కాంప్లెక్స్ లోని ఆయిల్ జెట్టీల వద్ద అగ్నిమాపక వ్యవస్థను పెంచే ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. అత్యాధునిక గ్యాస్, ఫ్లేమ్ సెన్సర్ లతో కూడిన అత్యాధునిక పూర్తి ఆటోమేటెడ్ సెటప్ ద్వారా తక్షణమే ప్రమాదాన్ని గుర్తించేలా

 

ఈ అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 40 టన్నుల లిఫ్టింగ్ సామర్ధ్యం కలిగిన హల్దియా డాక్ కాంప్లెక్స్ లోని మూడవ రైల్ మౌంటెడ్ క్వే క్రేన్ (ఆర్ ఎం క్యు సీ) ను ప్రధాన మంత్రి అంకితం చేశారు. కోల్ కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈకొత్త ప్రాజెక్టులు వేగవంతమైన, సురక్షితమైన కార్గో హ్యాండ్లింగ్, తరలింపునకు
సహాయపడటం ద్వారా పోర్టు ఉత్పాదకతను గణనీయంగా పెంచుతాయి. సుమారు రూ.2680 కోట్ల విలువైన ముఖ్యమైన రైలు ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఝార్గ్రామ్ - సల్గాఝరి (90 కి.మీ) నికలిపే మూడవ రైలు మార్గం; సోండాలియా - చంపపుకూర్ రైలు మార్గం (24 కి.మీ) డబ్లింగ్; దంకుని - భట్టానగర్ - బాల్టికురి రైలు
మార్గం (9 కి.మీ.) డబ్లింగ్ ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో రైలు రవాణా సౌకర్యాలను విస్తరిస్తాయి, చలనశీలతను మెరుగుపరుస్తాయి. ఈ ప్రాంతంలోఆర్థిక, పారిశ్రామిక వృద్ధికి దారితీసే సరుకు రవాణా అంతరాయం లేని సేవలను సులభతరం చేస్తాయి.

పశ్చిమ బెంగాల్ లో మురుగునీటి శుద్ధి, మురుగునీటి పారుదలకి సంబంధించిన మూడు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు నిధులు సమకూర్చింది. హౌరాలో 65 ఎంఎల్ డీ సామర్థ్యం, 3.3 కిలోమీటర్ల మురుగునీటి నెట్ వర్క్ తో ఇంటర్ సెప్షన్ అండ్డైవర్షన్ (ఐ అండ్ డీ), సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) : 62 ఎంఎల్ డీ
సామర్థ్యం, 11.3 కిలోమీటర్ల మురుగునీటి నెట్ వర్క్ తో బల్లి వద్ద ఐ అండ్ డీ పనులు, ఎస్టీపీలు, 60 ఎంఎల్ డీ సామర్థ్యం, 8.15 కిలోమీటర్ల మురుగునీటి నెట్ వర్క్ తో కమర్హతి, బారానగర్ వద్ద ఐ అండ్ డీ వర్క్స్, ఎస్టీపీలు ఇందులో ఉన్నాయి.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi

Media Coverage

'You Are A Champion Among Leaders': Guyana's President Praises PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."