పిఎమ్ఎవై-అర్బన్ లో భాగం గా మహారాష్ట్ర లో నిర్మాణంపూర్తి అయిన 90,000 కు పైగా ఇళ్ళ నుదేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
సోలాపుర్ లో రేనగర్ హౌసింగ్ సొసైటీ కి చెందిన 15,000 గృహాల ను కూడా అంకితం చేశారు
పిఎమ్-స్వనిధి యొక్క 10,000 మంది లబ్ధిదారుల కు ఒకటో కిస్తు మరియు రెండో కిస్తు లపంపిణీ ని మొదలు పెట్టారు
‘‘దేశం లో నిజాయతీరాజ్యం ఏలాలని, శ్రీ రామునిఆదర్శాల ను అనుసరిస్తూ, సుపరిపాలన కు పూచీ పడాలని మా ప్రభుత్వం తొలి రోజు నుండి ప్రయత్నిస్తున్నది’’
‘‘వేల కొద్దీకుటుంబాల కలలు పండి, మరి వారి ఆశీర్వాదాలు నా అత్యంత ఘనమైన సంపద గా మారడం ఎక్కడ లేని సంతృప్తి ని కలిగిస్తున్నది’’
‘‘జనవరి 22 వ తేదీ న వెలిగే రామ జ్యోతి పేదరికం తాలూకు చీకటి ని పారదోలేందుకు ఒక ప్రేరణ గా మారనుంది’’
‘‘ ‘శ్రమ కు గౌరవం’, ‘సొంతకాళ్ళ మీద నిలబడిన శ్రమికులు’ మరియు ‘పేదల సంక్షేమం’.. ఇదే ప్రభుత్వం సాగిపోయే మార్గం’’
‘‘పేద ప్రజలు పక్కాఇల్లు, టాయిలెట్ , విద్యుత్తు కనెక్శన్ , త్రాగునీరు ల వంటి అన్ని సదుపాయాల ను దక్కించుకోవాలి; అవి సామాజిక న్యాయంతాలూకు హామీలు కూడాను’’

సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఎనిమిది అమృత్ (అట‌ల్ మిశన్ ఫార్ రిజూవినేశన్ ఆఫ్ అర్బ‌న్ ట్రాన్స్‌ఫార్మేశన్ -ఎఎమ్ఆర్‌యుటి..అమృత్) ప్రాజెక్టులు ఎనిమిదింటి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సోలాపుర్ లో ఈ రోజు న శంకుస్థాపన చేశారు. పిఎమ్ఎవై-అర్బన్ లో భాగం గా మహారాష్ట్ర లో నిర్మాణ పనులు పూర్తి అయిన 90,000 కు పైగా ఇళ్ళ ను, సోలాపుర్ లో రేనగర్ హౌసింగ్ సొసైటీ కి చెందిన 15,000 గృహాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. ఈ ఇళ్ళ లబ్ధిదారుల లో వేల కొద్దీ చేనేత కార్మికులు, విక్రేతలు, మరమగ్గాల శ్రమికులు, వ్యర్థ పదార్థాల ను సేకరించే వారు, బీడీ కార్మికులు, డ్రైవర్ లు.. తదితర వ్యక్తులు ఉన్నారు. ఇదే కార్యక్రమం లో ఆయన పిఎమ్ స్వనిధి తాలూకు 10,000 మంది లబ్ధిదారుల కు ఒకటో కిస్తు మరియు రెండో కిస్తు ల పంపిణీ ని కూడా ప్రారంభించారు.

 

జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జనవరి 22 వ తేదీ నాడు అయోధ్య ధామ్ లో రామ మందిరం లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందువల్ల దేశ ప్రజలందరి లో భక్తి భావం పొంగిపొర్లుతోందన్నారు. ‘‘ఒక చిన్న గుడారం లో ప్రభువు రాముని యొక్క దర్శనం తాలూకు దశాబ్ద కాలం నుండి కలుగుతున్న వేదన నుండి ఇక విముక్తి లభించనుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పదకొండు రోజుల పాటు కఠినమైన ధర్మ సంబంధి నియమాల ను మునులు, సాధువుల మార్గదర్శకత్వం లో అత్యంత నిష్ఠ తో తాను అనుసరిస్తున్నట్లు, మరి పౌరులు అందరి ఆశీర్వాదాల తో ప్రాణ ప్రతిష్ఠ ను నిర్వహించవచ్చునన్న విశ్వాసం తన లో ఉన్నట్లు ఆయన తెలిపారు. తన పదకొండు రోజుల ప్రత్యేక ఆచార నియమాల పాలన ను మహారాష్ట్ర లోని నాసిక్ లో పంచవటి వద్ద మొదలు పెట్టిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఈ భక్తి పూర్వకమైన ఘట్టం లో సమాంతరం గా మహారాష్ట్ర కు చెందిన ఒక లక్ష కు పైగా కుటుంబాలు వారి ‘గృహ ప్రవేశాన్ని’ పెట్టుకొన్నందుకు ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘‘జనవరి 22 వ తేదీ నాడు సాయంత్రం పూట ఈ ఒక లక్ష కుటుంబాల సభ్యులు వారి వారి పక్కా ఇళ్ళ లో రామ జ్యోతి ని వెలిగించనుండడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం’’ అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభ్యర్థించిన మీదట ప్రజలు వారి వారి మొబైల్ ఫోన్ లలో ఫ్లాశ్ ల ను వెలిగించడం ద్వారా రామ జ్యోతి తాలూకు ప్రతిజ్ఞ ను స్వీకరించినట్లు సూచన చేశారు.

 

ఈ రోజు న ప్రారంభం అయినటువంటి ప్రాజెక్టుల కు గాను మహారాష్ట్ర లో ప్రజల కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. మహారాష్ట్ర కు లభించిన ఈ వైభవాని కి సంబంధించిన ఖ్యాతి ప్రగతిశీల రాష్ట్ర ప్రభుత్వాని ది మరియు రాష్ట్ర ప్రజల యొక్క కఠోర శ్రమ దీ అని ఆయన అన్నారు.

 

‘‘మనం ఆడే మాటలు మరియు చేసే వాగ్ధానాల విషయం లో సత్య సంధత ఎంతైనా అవసరం అని రాముడు మనకు బోధిస్తూ వచ్చారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సోలాపుర్ లో వేల సంఖ్య లో పేదల కోసం చెప్పుకొన్న సంకల్పం ఈ రోజు న వాస్తవ రూపం దాల్చడం పట్ల ప్రధాన మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా అతి పెద్ద ది అయినటువంటి సొసైటీ ని ఈ రోజు న ప్రారంభించుకోవడం జరుగుతున్నది అని ప్రధాన మంత్రి ఉద్విగ్నం గా తెలిపారు. అటువంటి ఇళ్ళ లో నివసించడాన్ని గురించి తాను చిన్నతనం లోనే అభిలాష ను కలిగి ఉన్నట్లు ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘వేల కొద్దీ కుటుంబాల కల లు నెరవేరుతూ ఉండడం, మరి వారి యొక్క దీవెన లు నా అత్యంత ఘనమైన సంపద లా మారడం ఎక్కడలేనటువంటి సంతృప్తి ని ప్రసాదిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించినప్పుడు ప్రధాన మంత్రి కళ్లు చెమర్చాయి. ఈ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసిన రోజు ననే, ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత, ప్రజల కు వారి ఇంటి తాళం చెవుల ను అప్పగించడం కోసం స్వయం గా తరలివస్తాను అంటూ హామీ ని ఇచ్చిన సంగతి ని ఆయన జ్ఞప్తి కి తెచ్చారు. ‘‘ఇవాళ మోదీ ఇచ్చిన హామీ ని నిలబెట్టుకొన్నాడు’’ అని ఆయన అన్నారు. ‘‘మోదీ హామీ ని ఇచ్చాడు అంటే ఆ హామీ ని నిలబెట్టుకొంటాడు’’ అని ఆయన అన్నారు. ఈ రోజు న గృహాల ను అందుకొన్న వ్యక్తులు, మరి వారి కి చెందిన తరాలు ఇది వరకు యాతనల ను ఎదుర్కొన్నారని, గూడు లేని కారణం గా అవస్థలు పడ్డారు అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, ఆ ఇక్కట్టు ల వలయం ఇక మీదట బద్దలు అయినట్లే, భావి తరాలు అవే ఇబ్బందుల ను ఎదుర్కోవలసిన పని ఉండదు మరి అని ఆయన అన్నారు. ‘‘జనవరి 22 వ తేదీ నాడు కాంతులీననున్న రామ జ్యోతి పేదరికం చీకటి ని పారదోలేందుకు ఒక స్ఫూర్తి గా నిలవనుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరి కి సంతోషభరితమైన జీవనం లభించాలి అని ఆయన కోరుకున్నారు.

 

 

ఈ రోజు న నూతన గృహాల ను స్వీకరిస్తున్న కుటుంబాలు సంతోషం తో, సమృద్ధి తో విలసిల్లాలి అని ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు. ‘‘దేశం లో సుపరిపాలన నెలకొనాలి, మరి దేశం లో నిజాయతీ రాజ్యం ఏలాలి, దీనికి గాను శ్రీ రాముని ఆదర్శాల ను అనుసరించాలి అని మా ప్రభుత్వం ఒకటో రోజు నుండి ప్రయత్నిస్తూ వస్తున్నది. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మరియు సబ్‌కా ప్రయాస్.. ఈ మంత్రం రామ రాజ్యం నుండే ప్రేరణ ను పొందింది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాంచరిత్ మానస్ ను ప్రధాన మంత్రి ఉట్టంకిస్తూ, పేద ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది అని పునరుద్ఘాటించారు.

 

 

పక్కా ఇళ్ళు మరియు టాయిలెట్ ల వంటి మౌలిక సదుపాయాలు లోపించిన కారణం గా పేద ప్రజలు గౌరవాని కి నోచుకోలేకపోయిన కాలం అంటూ ఉండింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. ఈ స్థితి యే ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ళు మరియు టాయిలెట్ సమస్యల పట్ల శ్రద్ధ తీసుకోవడాని కి బాట ను పరచింది. మరి పది కోట్ల ‘ఇజ్జత్ ఘర్’ లను, ఇంకా నాలుగు కోట్ల పక్కా ఇళ్ళ ను ఒక ఉద్యమం తరహా లో అందించడం జరిగింది అని ఆయన చెప్పారు.

 

ప్రజల ను పెడదోవ పట్టించడం కన్నా, ‘శ్రమ ను గౌరవించడం’, ‘ఆత్మనిర్భర కార్మికుడు’, మరియు ‘పేద ల సంక్షేమం’ అనే మార్గం లో ప్రభుత్వం నడుస్తోంది అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘మీరు పెద్ద పెద్ద కలల ను కనండి. మీ యొక్క స్వప్నాలే నా యొక్క సంకల్పాలు గా ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. తక్కువ ఖర్చు లో పట్టణ ప్రాంతాల లో ఇళ్ళు, మరి వలస శ్రమికుల కోసం న్యాయమైన కిరాయి తో కూడిన సొసైటీ లు అనే అంశాల ను ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. ‘‘పని ప్రదేశాని కి దగ్గర లోనే నివాసాల ను అందించడం కోసం మేం కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.

 

ప్రజల ను పెడదోవ పట్టించడం కన్నా, ‘శ్రమ ను గౌరవించడం’, ‘ఆత్మనిర్భర కార్మికుడు’, మరియు ‘పేద ల సంక్షేమం’ అనే మార్గం లో ప్రభుత్వం నడుస్తోంది అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘మీరు పెద్ద పెద్ద కలల ను కనండి. మీ యొక్క స్వప్నాలే నా యొక్క సంకల్పాలు గా ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. తక్కువ ఖర్చు లో పట్టణ ప్రాంతాల లో ఇళ్ళు, మరి వలస శ్రమికుల కోసం న్యాయమైన కిరాయి తో కూడిన సొసైటీ లు అనే అంశాల ను ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. 

‘‘పని ప్రదేశాని కి దగ్గర లోనే నివాసాల ను అందించడం కోసం మేం కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు. 

Click here to read full text speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Regional languages take precedence in Lok Sabha addresses

Media Coverage

Regional languages take precedence in Lok Sabha addresses
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in the mishap in Chitradurga district of Karnataka
December 25, 2025
Announces ex-gratia from PMNRF

The Prime Minister, Shri Narendra Modi has condoled the loss of lives due to a mishap in Chitradurga district of Karnataka. Shri Modi also wished speedy recovery for those injured in the mishap.

The Prime Minister announced an ex-gratia from PMNRF of Rs. 2 lakh to the next of kin of each deceased and Rs. 50,000 for those injured.

The Prime Minister posted on X:

“Deeply saddened by the loss of lives due to a mishap in the Chitradurga district of Karnataka. Condolences to those who have lost their loved ones. May those injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi"