సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఎనిమిది అమృత్ (అటల్ మిశన్ ఫార్ రిజూవినేశన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేశన్ -ఎఎమ్ఆర్‌యుటి..అమృత్) ప్రాజెక్టులు ఎనిమిదింటి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని సోలాపుర్ లో ఈ రోజు న శంకుస్థాపన చేశారు. పిఎమ్ఎవై-అర్బన్ లో భాగం గా మహారాష్ట్ర లో నిర్మాణ పనులు పూర్తి అయిన 90,000 కు పైగా ఇళ్ళ ను, సోలాపుర్ లో రేనగర్ హౌసింగ్ సొసైటీ కి చెందిన 15,000 గృహాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. ఈ ఇళ్ళ లబ్ధిదారుల లో వేల కొద్దీ చేనేత కార్మికులు, విక్రేతలు, మరమగ్గాల శ్రమికులు, వ్యర్థ పదార్థాల ను సేకరించే వారు, బీడీ కార్మికులు, డ్రైవర్ లు.. తదితర వ్యక్తులు ఉన్నారు. ఇదే కార్యక్రమం లో ఆయన పిఎమ్ స్వనిధి తాలూకు 10,000 మంది లబ్ధిదారుల కు ఒకటో కిస్తు మరియు రెండో కిస్తు ల పంపిణీ ని కూడా ప్రారంభించారు.
జనసమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జనవరి 22 వ తేదీ నాడు అయోధ్య ధామ్ లో రామ మందిరం లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందువల్ల దేశ ప్రజలందరి లో భక్తి భావం పొంగిపొర్లుతోందన్నారు. ‘‘ఒక చిన్న గుడారం లో ప్రభువు రాముని యొక్క దర్శనం తాలూకు దశాబ్ద కాలం నుండి కలుగుతున్న వేదన నుండి ఇక విముక్తి లభించనుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పదకొండు రోజుల పాటు కఠినమైన ధర్మ సంబంధి నియమాల ను మునులు, సాధువుల మార్గదర్శకత్వం లో అత్యంత నిష్ఠ తో తాను అనుసరిస్తున్నట్లు, మరి పౌరులు అందరి ఆశీర్వాదాల తో ప్రాణ ప్రతిష్ఠ ను నిర్వహించవచ్చునన్న విశ్వాసం తన లో ఉన్నట్లు ఆయన తెలిపారు. తన పదకొండు రోజుల ప్రత్యేక ఆచార నియమాల పాలన ను మహారాష్ట్ర లోని నాసిక్ లో పంచవటి వద్ద మొదలు పెట్టిన సంగతి ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఈ భక్తి పూర్వకమైన ఘట్టం లో సమాంతరం గా మహారాష్ట్ర కు చెందిన ఒక లక్ష కు పైగా కుటుంబాలు వారి ‘గృహ ప్రవేశాన్ని’ పెట్టుకొన్నందుకు ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు. ‘‘జనవరి 22 వ తేదీ నాడు సాయంత్రం పూట ఈ ఒక లక్ష కుటుంబాల సభ్యులు వారి వారి పక్కా ఇళ్ళ లో రామ జ్యోతి ని వెలిగించనుండడం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం’’ అని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభ్యర్థించిన మీదట ప్రజలు వారి వారి మొబైల్ ఫోన్ లలో ఫ్లాశ్ ల ను వెలిగించడం ద్వారా రామ జ్యోతి తాలూకు ప్రతిజ్ఞ ను స్వీకరించినట్లు సూచన చేశారు.
ఈ రోజు న ప్రారంభం అయినటువంటి ప్రాజెక్టుల కు గాను మహారాష్ట్ర లో ప్రజల కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. మహారాష్ట్ర కు లభించిన ఈ వైభవాని కి సంబంధించిన ఖ్యాతి ప్రగతిశీల రాష్ట్ర ప్రభుత్వాని ది మరియు రాష్ట్ర ప్రజల యొక్క కఠోర శ్రమ దీ అని ఆయన అన్నారు.
‘‘మనం ఆడే మాటలు మరియు చేసే వాగ్ధానాల విషయం లో సత్య సంధత ఎంతైనా అవసరం అని రాముడు మనకు బోధిస్తూ వచ్చారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సోలాపుర్ లో వేల సంఖ్య లో పేదల కోసం చెప్పుకొన్న సంకల్పం ఈ రోజు న వాస్తవ రూపం దాల్చడం పట్ల ప్రధాన మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా అతి పెద్ద ది అయినటువంటి సొసైటీ ని ఈ రోజు న ప్రారంభించుకోవడం జరుగుతున్నది అని ప్రధాన మంత్రి ఉద్విగ్నం గా తెలిపారు. అటువంటి ఇళ్ళ లో నివసించడాన్ని గురించి తాను చిన్నతనం లోనే అభిలాష ను కలిగి ఉన్నట్లు ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘వేల కొద్దీ కుటుంబాల కల లు నెరవేరుతూ ఉండడం, మరి వారి యొక్క దీవెన లు నా అత్యంత ఘనమైన సంపద లా మారడం ఎక్కడలేనటువంటి సంతృప్తి ని ప్రసాదిస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించినప్పుడు ప్రధాన మంత్రి కళ్లు చెమర్చాయి. ఈ ప్రాజెక్టు కు శంకుస్థాపన చేసిన రోజు ననే, ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత, ప్రజల కు వారి ఇంటి తాళం చెవుల ను అప్పగించడం కోసం స్వయం గా తరలివస్తాను అంటూ హామీ ని ఇచ్చిన సంగతి ని ఆయన జ్ఞప్తి కి తెచ్చారు. ‘‘ఇవాళ మోదీ ఇచ్చిన హామీ ని నిలబెట్టుకొన్నాడు’’ అని ఆయన అన్నారు. ‘‘మోదీ హామీ ని ఇచ్చాడు అంటే ఆ హామీ ని నిలబెట్టుకొంటాడు’’ అని ఆయన అన్నారు. ఈ రోజు న గృహాల ను అందుకొన్న వ్యక్తులు, మరి వారి కి చెందిన తరాలు ఇది వరకు యాతనల ను ఎదుర్కొన్నారని, గూడు లేని కారణం గా అవస్థలు పడ్డారు అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, ఆ ఇక్కట్టు ల వలయం ఇక మీదట బద్దలు అయినట్లే, భావి తరాలు అవే ఇబ్బందుల ను ఎదుర్కోవలసిన పని ఉండదు మరి అని ఆయన అన్నారు. ‘‘జనవరి 22 వ తేదీ నాడు కాంతులీననున్న రామ జ్యోతి పేదరికం చీకటి ని పారదోలేందుకు ఒక స్ఫూర్తి గా నిలవనుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరి కి సంతోషభరితమైన జీవనం లభించాలి అని ఆయన కోరుకున్నారు.
ఈ రోజు న నూతన గృహాల ను స్వీకరిస్తున్న కుటుంబాలు సంతోషం తో, సమృద్ధి తో విలసిల్లాలి అని ఆ ఈశ్వరుడిని ప్రధాన మంత్రి ప్రార్థించారు. ‘‘దేశం లో సుపరిపాలన నెలకొనాలి, మరి దేశం లో నిజాయతీ రాజ్యం ఏలాలి, దీనికి గాను శ్రీ రాముని ఆదర్శాల ను అనుసరించాలి అని మా ప్రభుత్వం ఒకటో రోజు నుండి ప్రయత్నిస్తూ వస్తున్నది. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మరియు సబ్‌కా ప్రయాస్.. ఈ మంత్రం రామ రాజ్యం నుండే ప్రేరణ ను పొందింది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాంచరిత్ మానస్ ను ప్రధాన మంత్రి ఉట్టంకిస్తూ, పేద ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుంది అని పునరుద్ఘాటించారు.
పక్కా ఇళ్ళు మరియు టాయిలెట్ ల వంటి మౌలిక సదుపాయాలు లోపించిన కారణం గా పేద ప్రజలు గౌరవాని కి నోచుకోలేకపోయిన కాలం అంటూ ఉండింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు. ఈ స్థితి యే ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ళు మరియు టాయిలెట్ సమస్యల పట్ల శ్రద్ధ తీసుకోవడాని కి బాట ను పరచింది. మరి పది కోట్ల ‘ఇజ్జత్ ఘర్’ లను, ఇంకా నాలుగు కోట్ల పక్కా ఇళ్ళ ను ఒక ఉద్యమం తరహా లో అందించడం జరిగింది అని ఆయన చెప్పారు.
ప్రజల ను పెడదోవ పట్టించడం కన్నా, ‘శ్రమ ను గౌరవించడం’, ‘ఆత్మనిర్భర కార్మికుడు’, మరియు ‘పేద ల సంక్షేమం’ అనే మార్గం లో ప్రభుత్వం నడుస్తోంది అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘మీరు పెద్ద పెద్ద కలల ను కనండి. మీ యొక్క స్వప్నాలే నా యొక్క సంకల్పాలు గా ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. తక్కువ ఖర్చు లో పట్టణ ప్రాంతాల లో ఇళ్ళు, మరి వలస శ్రమికుల కోసం న్యాయమైన కిరాయి తో కూడిన సొసైటీ లు అనే అంశాల ను ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు. ‘‘పని ప్రదేశాని కి దగ్గర లోనే నివాసాల ను అందించడం కోసం మేం కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
ప్రజల ను పెడదోవ పట్టించడం కన్నా, ‘శ్రమ ను గౌరవించడం’, ‘ఆత్మనిర్భర కార్మికుడు’, మరియు ‘పేద ల సంక్షేమం’ అనే మార్గం లో ప్రభుత్వం నడుస్తోంది అని ప్రధాన మంత్రి వివరించారు. ‘‘మీరు పెద్ద పెద్ద కలల ను కనండి. మీ యొక్క స్వప్నాలే నా యొక్క సంకల్పాలు గా ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. తక్కువ ఖర్చు లో పట్టణ ప్రాంతాల లో ఇళ్ళు, మరి వలస శ్రమికుల కోసం న్యాయమైన కిరాయి తో కూడిన సొసైటీ లు అనే అంశాల ను ఆయన ఈ సందర్భం లో ప్రస్తావించారు.
‘‘పని ప్రదేశాని కి దగ్గర లోనే నివాసాల ను అందించడం కోసం మేం కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
हमारी सरकार पहले दिन से प्रयास कर रही है कि श्रीराम के आदर्शों पर चलते हुए देश में सुशासन हो, देश में ईमानदारी का राज हो: PM @narendramodi pic.twitter.com/gGdQlODHRW
— PMO India (@PMOIndia) January 19, 2024
हमने एक के बाद एक ऐसी योजनाएं लागू कीं, जिससे गरीब की मुश्किलें कम हों, उनका जीवन आसान बने: PM @narendramodi pic.twitter.com/I6mOz6seOq
— PMO India (@PMOIndia) January 19, 2024
जब हमारी सरकार ने गरीबों को सर्वोच्च प्राथमिकता देते हुए काम किया, गरीब कल्याण की अनेक योजनाएं शुरू कीं, तो इसके नतीजे भी निकले: PM @narendramodi pic.twitter.com/sxIwLNIHTk
— PMO India (@PMOIndia) January 19, 2024
विकसित भारत के निर्माण के लिए आत्मनिर्भर भारत बनाना ज़रूरी है: PM @narendramodi pic.twitter.com/jq6HP0KEom
— PMO India (@PMOIndia) January 19, 2024
आज जिस प्रकार दुनिया में भारत की साख बढ़ रही है, उससे 'मेड इन इंडिया' उत्पादों के लिए भी संभावनाएं बढ़ रही हैं: PM @narendramodi pic.twitter.com/Mdpl0GLVr5
— PMO India (@PMOIndia) January 19, 2024