Quote‘‘ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అడ్డుగా నిలిచిన అన్నింటికీ ఎర్రకార్డు చూపిన ప్రభుత్వం’’
Quote‘‘ఇలాంటి ఉత్సవాన్ని ఇండియా నిర్వహించడం ఇక ఎంతోదూరంలో లేదు, ప్రతి భారతీయుడు మన టీం ను అభినందనలతో ముంచెత్తుతారు’’
Quote‘‘అభివృద్ధి అనేది బడ్జెట్లు, టెండర్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పరిమితం కాదు’’
Quote“మనం ఇవాళ చూస్తున్న పరివర్తన, మన ఉద్దేశాలు, సంకల్పాలు, ప్రాధాన్యతలు, మన పని సంస్కృతి ఫలితం’’
Quote‘‘కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ఈ ఏడాది 7 లక్షల రూపాయలు ఖర్చుచేస్తోంది. 8 సంవత్సరాల క్రితం ఇది 2 లక్షల కోట్ల రూపాయల కన్న తక్కువగా ఉండేది’’
Quote‘‘పిఎం–డివైన్ కింద రాగల 3–4 సంవత్సరాలలో 6,000 కోట్ల రూపాయల బడ్జెట్ను నిర్ణయిండం జరిగింది’’
Quote‘‘గిరిజన సంప్రదాయాలు, భాష, గిరిజన సంస్కృతిని కాపాడుకుంటూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి అనేది ప్రభుత్వ ప్రాధాన్యత ’’
Quote‘‘ ఈ ప్రాంతానికి సంబంధించి గత పాలకులు డివైడ్ విధానం లో వెళితే, మా ప్రభుత్వం పవిత్ర ఉద్దేశాలతో ముందుకు వచ్చింది’’

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మేఘాలయలోని షిల్లాంగ్లో 2450 కోట్ల రూపాయల విలువగల పలు ప్రాజెక్టులకు ఈరోజు  శంకుస్థాపనలు,
 ప్రారంభోత్సవాలు చేసి వాటిని జాతికి అంకితం చేశారు.అంతకు ముందు ప్రధానమంత్రి షిల్లాంగ్లో స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈశాన్య కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఈ కౌన్సిల్ స్వర్ణోత్సవాలలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. 320 పూర్తిచేసుకున్న 4 జి మొబైల్ టవర్లు, 890 నిర్మాణంలోని మొబైల్ టవర్లు, ఉమ్సాలిలో ఐఐఎం షిల్లాంగ్ కొత్త క్యాంపస్,కొత్త షిల్లాంగ్ టౌన్షిప్కు మరింత మెరుగైన అనుసంధానతను కల్పించే షిలలాంగ్–దీంగ్ పోష్ రోడ్, మూడు రాష్ట్రాల లో అంటే మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో  నాలుగు ఇతర రోడ్డు ప్రాజెక్టులు ప్రధానమంత్రి ప్రారంభించిన వాటిలో ఉన్నాయి. ప్రధానమంత్రి మేఘాలయలో సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రం, పుట్టగొడుగుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. మిజోరం, మణిపూర్, త్రిపుర, అస్సాంలలో 21 హిందీ లైబ్రరీలను

|

ప్రధానమంత్రి ప్రారంభిచారు. ఆరు రోడ్డు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇవి అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాలలోని రోడ్డు ప్రాజెక్టులు, తురలో సమీకృత ఆతిథ్య, కన్వెన్షన్ సెంటర్ కు షిల్లాంగ్ టెక్నాలజీ పార్క్ ఫేజ్ –2కు ప్రధానమంత్రి శంకుస్థాపనచేశారు.

|

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి, మేఘాలయ ప్రకృతిపరంగా, సంస్కృతి పరంగా సుసంపన్నమైన ప్రారంతమని,ఈ సంస్కృతి సంప్రదాయాలు, సుసంపన్నత ఇక్కడి ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతం పలకడంలో ప్రతిఫలిస్తుందని అన్నారు. ఈ ప్రాంతంలో కాత్తగా వస్తున్న ప్రాజెక్టులు, కొత్తగా ప్రారంభమైన ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనుసంధానత, విద్య, నైపుణ్యాలు, ఉపాధిఅవకాశాలు వంటివి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయనున్నాయన్నారు. ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్న సమయంలో ఈరోజుటి కార్యక్రమం ఫుట్బాల్ మైదానంలో జరుగుతుండడం యాదృచ్ఛికమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఒక వైపు ఫుట్బాల్ పోటీ జరుగుతోంద, ఇక్కడ మనం ఫుట్బాల్ మైదానంలో అభివృద్ది విషయంలో పోటీ పడుతున్నాం. ప్రపంచకప్ పుట్బాల్ పోటీ ఖతార్లో జరుగుతున్నప్పటికీ ఇక్కడి ప్రజలలో దానిపై ఆసక్తి తక్కువేమీ కాదు. ’’అని ప్రధానమంత్రి అన్నారు.

|

క్రీడా స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఫుట్బాల్లో రెడ్ కార్డ్ చూపుతుండడాన్ని ఉదాహరణగా చెబుతూ, ఈశాన్య ప్రాంత అభివృద్ధికి అడ్డంకిగా నిలిచే అంశాలన్నింటికీ రెడ్ కార్డ్ చూపినట్టు ప్రధానమంత్రి చెప్పారు.  ఈ ప్రాంత అభివృద్ధిని దెబ్బతీసే అవినీతి, వివక్ష, బంధుప్రీతి, హింస, ఓటుబ్యాంకు రాజకీయాలకు రెడ్ కార్డ్ చూపాము. , చిత్తశుద్ది, నిజాయితీతో పనిచేస్తూ ఈ దుర్లక్షణాలను పెకలించేందుకు కృషిచేస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. ఇలాంటి దుర్లక్షణాలు సమాజంలో పాతుకుపోయినప్పటికీ మనం వాటిని ఒక్కొక్కటిగా పెకలించేదిశగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని అయన అన్నారు. క్రీడల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెడుతూ , ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నపలు చర్యలు వివరించారు. ఈ నూతన విధానాల వల్ల ప్రయోజనాలు

ఈశాన్యప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. భారతదేశంలోని తొలి క్రీడల విశ్వవిద్యాలయమే కాకుండా,ఈశాన్యప్రాంతం పలు మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయని, మల్టీపర్పస్ హాల్, ఫుట్బాల్ ఫీల్డ్, అథ్లెటిక్ ట్రాక్ కలిగిఉన్నాయన్నారు. ఇలాంటి 90 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. ఖతార్లో అంతర్జాతీయ టీమ్లు ప్రపంచఫుట్బాల్ పోటీలలో పాల్గొంటుండడం మనం చూస్తున్నప్పటికీ, ఈదేశ యువశక్తిని గమనించినపుడు మనంకూడా ఇలాంటి క్రీడాపోటీలను నిర్వహించి, అలాంటి ఉత్సవాలుజరుపుకుని ప్రతిభారతీయుడూ  ఈ పోటీలలో పాల్గొనే మన టీం పట్ల ఆనందం వ్యక్తం చేసేరోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. “అభివృద్ధి అనేది కేవలం బడ్జెట్, టెండర్లు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పరిమితంకాదని అన్నారు. 2014 కు ముందు ఇలాంటి భావన ఉండేదని,

|

ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఇవాళ మనం చూస్తున్న పరివర్తన మన ఉద్దేశాలు, సంకల్పాలు, ప్రాధాన్యతలలో , పని సంస్కృతిలో వచ్చిన మార్పులో గమనించవచ్చని అన్నారు. ‘‘అధునాతన మౌలిక సదుపాయాలతో, అధునాతన అనుసంధానతతో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం మన సంకల్పమని. ఇందుకు అనుగుణంగా, ప్రతి ప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ, సబ్ కా ప్రయాస్ , అందరి సమష్టి కృషితో శరవేగంతో అభివృద్ధి సాధించడం మన సంకల్పమని ప్రధానమంత్రి అన్నారు. దూరాన్ని తగ్గించడం, లేమి పరిస్థితులు లేకుండా చూడడం,సామర్ధ్యాల నిర్మాణం,యువతకు మరిన్నిఉపాధి అవకాశాలు కల్పించడం మనప్రాధాన్యత అని ఆయన అన్నారు. పనిసంస్కృతిలో మార్పు కారణంగా ప్రతి ప్రాజెక్టూ, ప్రతికార్యక్రమమూ నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేట్టు చేస్తుందన్నారు.
 కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మౌలికసదుపాయాలపై 7 లక్షలకోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నదని అంటూ ప్రధానమంత్రి, 8 సంవత్సరాల క్రితం ఈ వ్యయం 2 లక్షల కోట్లరూపాయల కన్నా తక్కువగా ఉండేదని తెలిపారు.  మౌలికసదుపాయాలను మరింత కల్పించడంలో రాష్ట్రాలు తమ మధ్య తామే పోటీపడుతున్నాయని అన్నారు.
ఈశాన్య ప్రాంతంలో మౌలికసదుపాయాల అభివృద్ధికి సంబంధించి ఉదాహరణలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, షిల్లాంగ్తో సహా ఈశాన్య ప్రాంతంలోని అన్నిరాజధానులను రైలు సర్వీసులతో కలిపేందుకు సత్వర పనులుసాగుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
 అలాగే 2014లో వారానికి900 విమాన సర్వీసులు తిరగగా ప్రస్తుతం ఈ ప్రాంతానికి 1900 విమానసర్వీసులు నడుస్తున్నాయన్నారు. ఉడాన్ పథకం కింద మేఘాలయలో 16 రూట్లలో విమానాలు తిరుగుతున్నాయని, దీనితో మేఘాలయ ప్రజలకు తక్కువ చార్జీలతో విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు.

మేఘాలయ రైతులకు, ఈశాన్య ప్రాంత రైతులకు జరిగిన ప్రయోజనం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,ఈ ప్రాంతంలో పండించిన పండ్లు, కూరగాయలు దేశంలోని వివిధ ప్రాంతాల మార్కెట్లకు, ఇతర దేశాలకు కృషిఉడాన్ పథకం కింద అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
 ఈరోజు ప్రారంభించిన అనుసంధానత ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, గత 8 సంవత్సరాలలో మేఘాలయలోజాతీయ రహదారుల నిర్మాణానికి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు చెప్పారు. మేఘాలయలో గత 8 సంవత్సరాలలో ప్రధానమంత్రి సడక్ యోజన కింద  ఎన్నో గ్రామీణ రహదారులను నిర్మించినట్టు చెప్పారు. ఇంతకు ముందు 20 సంవత్సరాలలో నిర్మించిన దానికి ఇది ఏడురెట్లు ఎక్కువ అని ప్రధానమంత్రి తెలిపారు.

ఈశాన్య ప్రాంత యువత కోసం డిజిటల్ అనుసంధానత పెంపు గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,ఈశాన్యప్రాంతంలో ఆప్టికల్ ఫైబర్ కవరేజ్  2014 తో పోలిస్తే 4 రెట్లు పెరిగిందని, మేఘాలయలో ఇది 5 రెట్లు పెరిగిందని అన్నారు. మొబైల్ అనుసంధానతను ఈ ప్రాంతంలోని ప్రతిప్రదేశానికి తీసుకువెళ్లేందుకు 5 వేల కోట్ల రూపాయల వ్యయంతో 6 వేల మొబైల్ టవర్లను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.ఈ మౌలికసదుపాయాలు, మేఘాలయ యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తాయని ఆయన అన్నారు. విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలను ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి ఐఐఎం, టెక్నాలజీ పార్క్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ ప్రాంతంలో రాబడి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈశాన్యప్రాంతంలో 150కి పైగా ఏకలవ్యపాఠశాలలు నిర్మితమవుతున్నాయని, అందులో 39 ఏకలవ్యపాఠశాలలు మేఘాలయలో నిర్మాణం అవుతున్నాయన్నారు.

|

 భారీ అభివృద్ధి ప్రాజెక్టులకు సులభతర అనుమతులకు వీలు కల్పిస్తూ ఈశాన్య ప్రాంత అభివృద్ధికి పెద్ద ఊతం ఇచ్చేలా పిఎం డివైన్, రోప్వే నెట్వర్క్ ల నిర్మాణం చేపడుతున్న పర్వతమాల పథకంగురించి ప్రధానమంత్రి తెలియజేశారు. పిఎం డివైన్ పథకానికి రాగల 3 నుంచి 4 సంవత్సరాలలో 6 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.  గతంలో ఈశాన్యాన్ని పాలించిన పాలకులు, డివైడ్‌ అప్రోచ్‌ లో వెళ్లగా తాము మాత్రం డివైన్‌ ఉద్దేశాలతో ముందుకు వచ్చామని ప్రధానమంత్రి అన్నారు.అది వివిధ కమ్యూనిటీల మధ్య కానీ లేదా వివిధ మతాల మధ్యకానీ తాము అన్నిరకాల విభజనలను తొలగిస్తున్నామని ప్రధానమంత్రి అన్నారు. ఇవాళ ఈశాన్యప్రాంతంలో  అభివృద్ధి కారిడార్‌ల నిర్మాణంపై  ప్రత్యేక దృష్టిపెట్టాముకాని వివాదాల సరిహద్దులపై కాదని అన్నారు. గత 8 సంవత్సరాలలో  ఎన్నో సంస్థలు హింసను విడనాడి  శాశ్వత శాంతిని కోరుకున్నారని చెప్పారు. ఈశాన్యంలో ఎఎఫ్‌ఎస్‌పిఎ నిరుపయోగిత గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి,  రాష్ట్రప్రభుత్వాల సహాయంతో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని, రాష్ట్రాల మధ్య దశాబ్దాలతరబడి కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు.

ఈశాన్య ప్రాంతం భద్రతకు , సుసంపన్నతకు ద్వారం వంటిదని ప్రధానమంత్రి అన్నారు. అద్భుతమైన గ్రామీణ వ్యవస్థ గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, ఇందులో సరిహద్దు గ్రామాలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం జరుగుతున్నట్టు చెప్పారు. శత్రువుకు మేలుజరుగుతుందేమోనన్న భయంతో సరిహద్దు ప్రాంతాలు అనుసంధానతకు నోచుకోలేకపోయాయని అన్నారు.కానీ ఇవాళ తాము సరిహద్దు ప్రాంతంలో కొత్తరోడ్లు, కొత్త టన్నెల్‌ లు, కొత్త బ్రిడ్జిలు, కొత్త రైల్వేలైన్లు, ఎయిర్‌ స్ట్రిప్‌లు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఒకప్పుడు నిరుత్సాహంగా ఉన్న సరిహద్దు గ్రామాలు ఇప్పుడు కొత్త ఉత్సాహం సంతరించుకున్నాయన్నారు. మన నగరాలకు వేగం అవసరమైనట్టు సరిహద్దు గ్రామాలకూ కావాలన్నారు.

హిజ్‌ హోలీనెస్‌ పోప్‌తో ఇటీవల తాను జరిపిన సమావేశాన్ని గురించి ప్రస్తావిస్తూ, ఇవాళ మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి ఇరువురూ చర్చించినట్టు చెప్పారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు గట్టి కృషి జరిపేందుకు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్పారు. ఈ సెంటిమెంట్‌ను మనం బలోపేతం చేయాలని ప్రధానమంత్రి  అన్నారు .  

ప్రభుత్వం అనుసరిస్తున్న శాంతియుత రాజకీయాలు, అభివృద్ధి విధానాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇందులో అద్భుతంగా లాభపడినవారు మన గిరిజన సమాజమని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతా విధానమని, గిరిజనుల సంప్రదాయాలు, భాష, వారి సంస్కృతిని కాపాడుతూనే ఆయా ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నట్టు చెప్పారు. వెదురు పంటకోతపై నిషేధాన్ని ఎత్తివేయడం గురించిన ఉదాహరణను ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది వెదురుతో ముడిపడిన గిరిజన ఉత్పత్తుల తయారీకి మంచి ఊతం ఇచ్చినట్టు తెలిపారు. ఈశాన్యప్రాంతంలో 850 వన్‌ ధన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అడవులనుంచి సేకరించిన ఉత్పత్తులకు  విలువను జోడిరచేలా వీటిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సామాజిక మౌలికసదుపాయాలైన గృహనిర్మాణం, నీటిసరఫరా, విద్తుత్తు సదుపాయాలవల్ల ఈశాన్యప్రాంతం బాగా ప్రయోజనం పొందిందని అన్నారు. గడచిన కొద్ది సంవత్సరాలలో 2 లక్షల మంది కొత్త ఇళ్లకు విద్యుత్‌సరఫరా కల్పించినట్టు చెప్పారు. పేదలకు 70 వేలకు పైగా ఇళ్లను మంజూరుచ చేశామని, 3 లక్షల గృహాలకు పైపుద్వారా మంచినీటి సరఫరా జరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. వీటన్నింటిలోనూ మన గిరిజన కుటుంబాలు అతిపెద్ద లబ్ధిదారులుగా ఉన్నారని ఆయన అన్నారు.  
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, తన ప్రసంగాన్ని ముగిస్తూ,ఈ ప్రాంత అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి
తమ కృషి మొత్తానికి శక్తి ప్రజల ఆశీర్వాదం నుంచి అందుతున్నదని అన్నారు. రానున్న క్రిస్మస్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

|

మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కొనరాడ్ కు సంగమా, మేఘాలయ గవర్నర్  బ్రిగేడియర్ డాక్టర్ బి.డి. మిశ్ర రిటైర్డ్, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర మంత్రులు శ్రీ జి.కిషన్ రెడ్డి,శ్రీ కిరన్ రిజుజు, శర్వానంద్ సోనొవాల్, కేంద్ర సహాయమంత్రి  శ్రీబి.ఎల్వర్మ, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్.బిరేన్ సింగ్,మిజోరం ముఖ్యమంత్రి శ్రీ జొరామ్ తంగ,
అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, నాగాలాండ్ ముఖ్యమంత్రిశ్రీనిఫు రియో,  సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సహా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

 నేపథ్యం:
ఈ ప్రాంతంల్ టెలికం అనుసంధానతను మరింత పెంచే దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 4 జి మొబైల్ టవర్లను జాతికి అంకితం చేశారు. ఇందులో 320కి పైగా పూర్తి అయ్యాయి. మరో 890 నిర్మాణంలో ఉన్నాయి. ప్రధానమంత్రి ఐఐఎం షిల్లాంగ్  నూతన క్యాంపస్ను ఉమ్సవ్లిలో ప్రారంభించారు. ప్రధానమంత్రి షిల్లాంగ్ –దీంగ్ పాసోహ్ రోడ్ను కూడా ప్రారంభించారు. ఇది కొత్త షిల్లాంగ్ శాటిలైట్ టౌన్షిప్కు మరింత మెరుగైన అనుసంధానతను కల్పిస్తుంది. అలాగే షిల్లాంగ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.  మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లకు చెందిన మరో నాలుగు  నాలుగు రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి స్పాన్ లేబరెటరీని మేఘాలయలో పుట్టగొడుగుల అభివృద్ధి కేంద్రంలో ప్రారంభించారు. పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, రైతులకు,  ఎంటర్ప్రెన్యుయర్లకు ఇది ఉపకరిస్తుంది. ప్రధానమంత్రి సమీకృత తేనెటీగల అభివృద్ధి కేంద్రాన్ని  మేఘాలయలో ప్రారంభించారు. తేనెటీగల పెంపకం రైతుల జీవనోపాథిని , సామర్ధ్యాల పెంపు ద్వారా , సాంకేతికత అభివృద్ధి ద్వారా  మెరుగు పరిచేందుకు ఇది కృషి చేయనుంది. అలాగే ప్రధానమంత్రి  మిజోరం, మణిపూర్, త్రిపుర, అస్సాంలలో 21 హిందీ లైబ్రరీలను ప్రారంభించారు.

అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపురలలో ఆరు రోడ్డు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. షిల్లాంగ్ లోని తురలో సమీకృత ఆతిథ్య , సమావేశ కేంద్రానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.
అలాగే షిల్లాంగ్ టెక్నాలజీ పార్క్ ఫేజ్ ‌‌2ను ప్రారంభించారు. ఈ టెక్నాలజీ పార్కు 1.5 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఇది ప్రొఫెషనల్స్ కు కొత్త అవకాశాలు కల్పిస్తుంది. అలాగే 3 వేల ఉద్యోగాలు కల్పించగలదని అంచనా.  సమీకృత ఆతిథ్య, కన్వెన్షన్ సెంటర్ కు కన్వెన్షన్ హబ్ , గెస్ట్రూం, ఫుడ్ కోర్ట్ తదితరాలు ఉంటాయి. ఇది పర్యాటక రంగ ప్రోత్సాహానికి తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఇది ఉపయోగపడుతుంది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • Manjeet Singh November 09, 2024

    🙏🙏🙏
  • Anil Kumar January 12, 2023

    नटराज 🖊🖋पेंसिल कंपनी दे रही है मौका घर बैठे काम करें 1 मंथ सैलरी होगा आपका ✔25000 एडवांस 5000✔मिलेगा पेंसिल पैकिंग करना होगा खुला मटेरियल आएगा घर पर माल डिलीवरी पार्सल होगा अनपढ़ लोग भी कर सकते हैं पढ़े लिखे लोग भी कर सकते हैं लेडीस 😍भी कर सकती हैं जेंट्स भी कर सकते हैं Call me 📲📲8768474505✔ ☎व्हाट्सएप नंबर☎☎ 8768474505🔚🔚. आज कोई काम शुरू करो 24 मां 🚚🚚डिलीवरी कर दिया जाता है एड्रेस पर✔✔✔
  • Dr j s yadav January 10, 2023

    नमो नमो
  • Rajesh Saxena December 29, 2022

    North East is progressing well under your esteemed leadership and vision sir.
  • T S KARTHIK December 27, 2022

    car ownership
  • T S KARTHIK December 27, 2022

    cycle ownership state wise
  • CHANDRA KUMAR December 24, 2022

    मोहनपुर+2 विद्यालय देवघर, झारखंड में, जेसीईआरटी उपनिदेशक प्रदीप चौबे ने निरीक्षण किया। इस दौरान, 1. 2019 से निर्माणाधीन विद्यालय का निर्माण कार्य पूर्ण नहीं हुआ था और 2. विद्यालय के मुख्य गेट पर विद्यालय का नाम लिखा हुआ नहीं था। 3. विकाश कोष रोकड पंजी अद्यतन नहीं था। अब आप सोचेंगे की 2019 से निर्माणाधीन विद्यालय का निर्माण अधूरा क्यों है, क्योंकि उस विद्यालय का निर्माण खराब सीमेंट से किया गया है, विद्यालय का भवन कभी भी गिर सकता है। ऐसे में प्रश्न उठता है की प्रभारी प्रधानाध्यापक महोदय 5000 बच्चे को कहां बैठाते हैं। तो बात यह है की विद्यालय में इंटर के छात्र पढ़ने नहीं आते हैं, केवल रजिस्ट्रेशन कराने और फॉर्म भरने आते हैं। विद्यालय में एक लाख रुपए मासिक वेतन लेने वाले शिक्षक केवल गप्प करके समय बिता देते हैं। ई विद्या वाहिनी पर बच्चों की उपस्थिति हजार में दिखाया जाता है, लेकिन सचमुच में यदि हजार बच्चे विद्यालय पहुंच जाएं, तब उनके लिए कमरे तथा बेंच कम पड़ जायेंगे। अब प्रश्न उठता है की जब कमरे नहीं है, बेंच नहीं हैं, तब इतने बच्चे का नामांकन क्यों लिया जाता है। दरअसल प्रभारी प्रधानाध्यापक विकास कोष का पैसा लेने , नामांकन के समय, रजिस्ट्रेशन के समय, फॉर्म जमा करते समय, नाम सुधार करवाते समय, प्रायोगिक परीक्षा के समय अतिरिक्त पैसा लेते हैं। जितना अधिक छात्र, उतना अधिक आमदनी। छात्रों रशीद देते हैं और कभी कभी नहीं भी देते हैं, ऐसे में अतिरिक्त पैसे और बढ़ जाते हैं। अब देखिए, निरीक्षण में गड़बड़ी मिला, लेकिन फाइल मैनेज करने के लिए समय दे दिया, नकली रशीद और नकली हिसाब किताब तैयार किया जा रहा है। इस विद्यालय के प्रभारी प्रधानाध्यापक पुरुषोत्तम चौधरी, झारखंड के झारखंड मुक्ति मोर्चा पार्टी को प्रतिवर्ष लाखों रुपए का चंदा देता है,बदले में दुमका में पेट्रोल पंप मिला है, करोड़ों की संपत्ति और कई फॉर व्हीलर गाडियां है, लेकिन इनकम टैक्स चोरी करना आम बात है। जिला शिक्षा पदाधिकारी कार्यालय उसका गुलाम है और राज्य का निरीक्षण टीम भी उस पर कोई कार्रवाई नहीं किया है, जबकि उसे कई अनियमितता मिला है। दरवाजे पर, विद्यालय का मुख्य गेट पर विद्यालय का नाम नहीं लिखने का कारण यह है की कोई भी निरीक्षण टीम को पता न चल सके की विद्यालय कहां है। बाहर से देखने पर, जंगल के बीच में एक बॉउंड्री जैसा दिखेगा। ऐसे कोई निरीक्षण टीम जल्दी विद्यालय नहीं पहुंच पाता है। केंद्रीय जांच दल को जाकर इस विद्यालय का निरीक्षण करना चाहिए, तभी इस विद्यालय को आदर्श विद्यालय का दर्जा देना चाहिए। सुशील कुमार वर्मा इस विद्यालय के वरीय पीजीटी शिक्षक हैं, लेकिन टीजीटी शिक्षक पुरुषोत्तम चौधरी, अवैध तरीके से इस विद्यालय का प्रभारी बना हुआ है और छात्रों के पैसे से अपना जेब भर रहा है। कई बार नोटिफिकेशन जारी होने के बावजूद, अपने रूतबे का इस्तेमाल करके वह प्रभारी बने हुए हैं। देश में, अन्य कई ऐसे विद्यालय हैं, यदि बीजेपी सरकार, सरकारी विद्यालय के नेतृत्व और निरीक्षण पर ध्यान दे, तो तस्वीर बदल सकती है। और जनता बीजेपी की प्रशंसक बन सकती है।
  • Sudhakar December 22, 2022

    Good to watch wonderful speech. very happy to know about 90 projects are implemented including sports.
  • T S KARTHIK December 22, 2022

    Love Maths Love Life  Mathematics day 22 December is celebrated to honour Sreenivas Ramanujan. Mathematics encompasses everybody's life. But many especially students have fear of maths, which needs to be removed by making it simple. India has produced Aryabhatta, Bhaskaracharya and Shakuntala Devi and Vedic mathematics. World may quote in millions or billions but we indians invented zero. Love maths love life!
  • Chandan Haloi December 22, 2022

    good
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years

Media Coverage

India Eyes Rs 3 Lakh Crore Defence Production By 2025 After 174% Surge In 10 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Men’s Regu team on winning India’s first Gold at Sepak Takraw World Cup 2025
March 26, 2025

The Prime Minister Shri Narendra Modi today extended heartfelt congratulations to the Indian Sepak Takraw contingent for their phenomenal performance at the Sepak Takraw World Cup 2025. He also lauded the team for bringing home India’s first gold.

In a post on X, he said:

“Congratulations to our contingent for displaying phenomenal sporting excellence at the Sepak Takraw World Cup 2025! The contingent brings home 7 medals. The Men’s Regu team created history by bringing home India's first Gold.

This spectacular performance indicates a promising future for India in the global Sepak Takraw arena.”