ఒక లక్షా ఇరవై అయిదు వేల పిఎమ్ కిసాన్ సమృద్ధికేంద్రాల ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
పిఎమ్-కిసాన్ లో భాగం గా సుమారు 17,000 కోట్ల రూపాయల విలువైన పధ్నాలుగో వాయిదా సొమ్ము నుఆయన విడుదల చేశారు
ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) తో 1600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ ను జతపరచారు
గంధకం పూత పూసినటువంటి యూరియా - ‘యూరియా గోల్డ్’ ను ఆయన ప్రవేశపెట్టారు
అయిదు నూతన వైద్య కళాశాల లను ప్రారంభించడం తో పాటు ఏడు వైద్యకళాశాలల కు శంకుస్థాపన కూడా చేశారు
‘‘కేంద్రం లో ఉన్నప్రభుత్వం రైతుల బాధల ను మరియు అవసరాల ను అర్థం చేసుకొంటున్నది’’
‘‘యూరియా యొక్క ధరల తో రైతులు ఇబ్బందిపడేటట్టు ప్రభుత్వం చేయదు. ఒక రైతు యూరియా ను కొనుగోలు చేసేటందుకు వెళ్ళినప్పుడు, ఆయనకు మోదీ హామీ ఒకటి ఉంది అనే నమ్మకం కలుగుతుంది’’
‘‘పల్లె లువికసిస్తేనే భారతదేశం అభివృద్ధి చెందగలుగుతుంది’’
‘‘రాజస్థాన్ లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన మా ప్రాధాన్యం గా ఉంది’’
‘‘మనమందరం కలసి రాజస్థాన్ యొక్క అభిమానాని కి మరియు వారసత్వాని కి యావత్తుప్రపంచం లో ఒక క్రొత్త గుర్తింపు ను కట్టబెడదాం’’

రాజస్థాన్ లోని సీకర్ లో వేరు వేరు అభివృద్ధి పథకాల కు ప్రధాన మంత్రి ఈ రోజు న శంకుస్థాపన చేసి వాటి ని దేశ ప్రజల కు అంకితం చేశారు. ఆయా ప్రాజెక్టుల లో 1.25 లక్షల కు పైచిలుకు ‘పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాల’ (పిఎమ్ కెఎస్ కె స్) ను దేశ ప్రజల కు అంకితం చేయడం, గంధకం పూత పూసినటువంటి ఒక క్రొత్త రకం యూరియా ‘యూరియా గోల్డ్ ’ ను ప్రవేశపెట్టడం, 1,600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్) ను ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో చేరినట్లు ప్రకటించడం, ‘ప్రధాన మంత్రి కిసాస్ సమ్మాన్ నిధి’ (పిఎమ్-కిసాన్) లో భాగం గా 8.5 కోట్ల మంది లబ్ధిదారుల కు పధ్నాలుగో వాయిదా సొమ్ము తాలూకు దాదాపు 17,000 కోట్ల రూపాయల ను విడుదల చేయడం, చిత్తౌడ్ గఢ్, ధౌల్ పుర్, సిరోహీ, సీకర్, ఇంకా శ్రీ గంగానగర్ లలో నూతన వైద్య కళాశాలలు అయిదింటి ని ప్రారంభించడం, బారాఁ, బూందీ, కరౌలీ, ఝుంఝునూ, సవాయి మాధోపుర్, జైసల్ మెర్ మరియు టోంక్ లలో వైద్య కళాశాల లు ఏడింటి కి శంకుస్థాపన చేయడం, అలాగే ఉదయ్ పుర్, బాన్స్ వాడ, ప్రతాప్ గఢ్ మరియు డుంగర్ పుర్ జిల్లాల లో ఏర్పటైన ఆరు ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఆరింటిని మరియు జోద్ పుర్ లో కేంద్రీయ విద్యాలయ తింవరీ ని ప్రారంభించడం భాగం గా ఉన్నాయి.

 

సభా స్థలి కి ప్రధాన మంత్రి చేరుకోవడంతోనే పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రం యొక్క నమూనా ను పరిశీలించారు. సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశం లోని అనేక ప్రాంతాల నుండి ఈనాటి కార్యక్రమం లో అనుబంధితులు అయినటువంటి కోట్ల కొద్దీ రైతుల కు నమస్సుల ను అర్పించారు. ఖాటూ శ్యామ్ జీ వెలసిన గడ్డ భారతదేశం నలుమూలల నుండి విచ్చేసే యాత్రికుల కు భరోసా ను కలిగిస్తుంది అని ఆయన అన్నారు. శేఖావాటి వీర భూమి నుండి వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను మొదలు పెట్టే అవకాశం దక్కినందుకు ఆయన తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. ఇదే సందర్భం లో కోట్లాది రైతు లబ్ధిదారుల కు ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పిఎమ్- కిసాన్) నుండి వాయిదా ను నేరు గా బదలాయించిన సంగతి ని ఆయన ప్రస్తావించారు. దేశం లో 1.25 లక్షల కు పైగా పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాల ను ప్రజల కు అంకితం చేయడాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం పల్లె స్థాయి లో మరియు బ్లాకు స్థాయి లో కోట్ల కొద్దీ రైతుల కు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందిస్తుందన్నారు. ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్) పాలుపంచుకొన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి, ఇది రైతుల కు వారి ఉత్పత్తి ని దేశం లోని ఏ ప్రాంతానికైనా తీసుకు పోవడాన్ని సులభతరం చేసి వేస్తుంది అన్నారు. ‘యూరియా గోల్డ్’ ను ప్రవేశపెట్టడం గురించి, క్రొత్త వైద్య కళాశాలల ను గురించి మరియు ఏకలవ్య నమూనా పాఠశాలల ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రోజు న చేపట్టిన అభివృద్ధి పథకాల కు గాను భారతదేశం ప్రజల కు, మరి అలాగే కోట్లాది రైతుల కు అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు.

 

సీకర్, ఇంకా శేఖావాటి ప్రాంతాల లో రైతుల కు గల ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ ఆ ప్రాంతాల లో ఇబ్బందులు ఉన్నప్పటి కీ కూడాను రైతులు కఠోర శ్రమ చేస్తున్నారంటూ వారి కి నమస్సుల ను అర్పించారు. కేంద్రం లో ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రైతుల బాధల ను, రైతుల అవసరాల ను అర్థం చేసుకొంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో ‘విత్తనం మొదలుకొని, విపణి వరకు’ (బీజ్ సే బాజార్ తక్) క్రొత్త వ్యవస్థల ను ఏ విధం గా స్థాపించిందీ ప్రధాన మంత్రి వివరించారు. ‘సాయిల్ హెల్థ్ కార్డు’ పథకాన్ని 2015 వ సంవత్సరం లో సూరత్ గఢ్ లో ప్రారంభించిన సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ఈ పథకం ద్వారా కోట్లాది రైతులు భూమి యొక్క స్వస్థత ను గురించి న సమాచారాన్ని ఆధారం చేసుకొని, అభిలషణీయమైనటువంటి నిర్ణయాల ను తీసుకొంటున్నారు అని ఆయన అన్నారు. 1.25 లక్షల పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాలు (పిఎమ్ కెఎస్ కె స్) రైతుల సమృద్ధి కి బాట ను పరుస్తాయి అని ఆయన అన్నారు. ఈ కేంద్రాల ను రైతుల వివిధ అవసరాలు ఒకే చోటు లో నెరవేరే విధం గా అభివృద్ధి పరచడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ఈ కేంద్రాలు వ్యవసాయాని కి సంబంధించిన అంశాల పై ఉన్నతమైన ఆధునిక సమాచారాన్ని కూడా రైతుల కు అందిస్తాయి అని ఆయన అన్నారు. అంతేకాకుండా, ఈ కేంద్రాలు ప్రభుత్వం యొక్క వ్యవసాయ పథకాల కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియ జేస్తాయి అని ఆయన తెలిపారు. రైతులు ఈ కేంద్రాల ను తరచు గా సందర్శిస్తూ, అక్కడ లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా ప్రయోజనాల ను పొందవలసింది గా ప్రధాన మంత్రి సూచించారు. ఈ సంవత్సరం ముగిసే లోపు అదనం గా 1.75 లక్షల పిఎమ్ కిసాన్ సమృద్ధి కేంద్రాల (పిఎమ్ కెఎస్ కె స్) లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రధాన మంత్రి తెలిపారు.

రైతుల ఖర్చుల ను తగ్గించడం కోసం మరి అలాగే, వారి కి అవసరమైన వేళ లో సమర్థన ను అందించడం కోసం ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి తో పాటుపడుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇది ప్రపంచం లో అతి పెద్దది అయినటువంటి పథకం, దీనిలో భాగం గా నిధుల ను యొక్క బ్యాంకు ఖాతాల లోకి నేరుగా బదిలీ చేయడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ు వారి కి సంబంధించిన వేరు వేరు ఖర్చుల ను తీర్చుకోవడాని కి వారి కి ఉపయోగకరం గా ఉంటున్నటువంటి వాయిదా సొమ్ముల లో నేటి పద్నాలుగో వాయిదా ధన రాశి ని కూడా కలిపినట్లయితే ఇంతవరకు రైతుల కు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల కు పైచిలుకు డబ్బు ను వారి బ్యాంకు ఖాతాల లోకి నేరుగా బదిలీ చేయడం జరిగింది అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ను వారి ఖర్చుల విషయం లో ఏ విధం గా ఆదుకొంటున్నదీ అనడాని కి దేశం లోని యూరియా యొక్క ధరే ఒక ఉదాహరణ గా ఉంది అని ఆయన అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ని గురించి, రశ్యా - యూక్రేన్ యుద్ధం గురించి ఆయన చెబుతూ, ఈ రెండు పరిణామాలు ఎరువుల రంగం లో భారీ ఆటుపోటుల కు దారి తీశాయి అని పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామాలు దేశం లో ను ప్రభావితం చేయకుండా వర్తమాన ప్రభుత్వం చూసింది అని ఆయన స్పష్టం చేశారు. ఎరువుల ధరల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం లో 266 రూపాయల ఖరీదు ఉన్నటువంటి యూరియా సంచి పాకిస్తాన్ లో సుమారు 800 రూపాయలు, బాంగ్లాదేశ్ లో దాదాపుగా 720 రూపాయలు కు దొరుకుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. అదే చైనా లో అయితే సుమారు 2,100 రూపాయలు, మరియు యుఎస్ఎ లో అయితే ఇంచుమించుగా 3,000 రూపాయలు గా ఉందన్నారు. ‘‘యూరియా ధర ల వల్ల మన ు ఆందోళన చెందే స్థితి ని ప్రభుత్వం రానివ్వదు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘‘ఒక రైతు యూరియా ను కొనుగోలు చేయడం కోసం వెళ్తే, అప్పుడు ఆయన కు ఇది మోదీ యొక్క పూచీకత్తు అనే నమ్మకం కలుగుతుంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

చిరుధాన్యాల కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం మరియు చిరుధాన్యాల కు ‘శ్రీ అన్న’ గా పేరు పెట్టడం వంటి చర్యల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. శ్రీ అన్న యొక్క ప్రచారం ద్వారా ఆ తరహా ఆహారం ఉత్పాదన, ప్రాసెసింగ్ మరియు ఎగుమతి ప్రక్రియ లు వృద్ధి చెందుతున్నాయి అని ఆయన అన్నారు. ఇటీవల తాను యుఎస్ఎ ను సందర్శించినప్పుడు వైట్ హౌస్ లో ఆధికారిక రాత్రి భోజనం కార్యక్రమం లో వడ్డించిన ఆహార పదార్థాల లో చిరుధాన్యాల తో చేసిన వంటకాలు కూడా చోటు చేసుకొన్న విషయాన్ని ఆయన జ్ఞప్తి కి తెచ్చారు.

‘‘పల్లె లు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందడం అనేది సాధ్యం అవుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘వికసిత గ్రామాల తో మాత్రమే వికసిత భారతదేశం రూపుదిద్దుకొంటుంది. ఈ కారణం గానే ప్రభుత్వం పల్లెల లో అన్ని సదుపాయాలు అందుబాటు లో ఉండేటందుకు కృషి చేస్తున్నది; ఆ తరహా సదుపాయాలు కేవలం నగరాలలో ఉండేవి’’ అని ఆయన అన్నారు. ఆరోగ్య రంగం లో మౌలిక సదుపాయాల ను విస్తరిస్తున్న సంగతి ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, తొమ్మిది సంవత్సరాల కు పూర్వం రాజస్థాన్ లో పది వైద్య కళాశాలలే ఉన్నాయి. ఈ రోజు న ఈ సంఖ్య 35 కు చేరుకొందన్నారు. ఇది సమీప ప్రాంతాల లో వైద్య సదుపాయాల ను మెరుగు పరుస్తూ, వైద్య విద్యార్థుల కు నాణ్యమైన విద్యావకాశాల ను ప్రసాదిస్తోంది అని ఆయన అన్నారు. ఈ రోజు న ప్రారంభించినటువంటి వైద్య కళాశాలలు, ఈ రోజు న శంకుస్థాపన జరుగుతున్న వైద్య కళాశాలలు రాష్ట్రం లో అనేక ప్రాంతాల లో వైద్య రంగ మౌలిక సదుపాయాల ను మెరుగు పడగలవు అని ఆయన అన్నారు. వైద్య విద్య బోధన ను అందరికీ అందుబాటు లోకి తీసుకు వచ్చేందుకు తగిన ప్రయాస లు జరుగుతూ ఉన్నాయి, అదే కోవ లో మాతృభాష లో వైద్య విద్య బోధన కై సన్నాహాలు సాగుతున్నాయి; అంతేకాకుండా వైద్య విద్య బోధన ను ప్రజాస్వామ్యీకరించి, ఇంతవరకు ఆదరణ కు నోచుకోని అటువంటి వర్గాల వారి కి సైతం తత్సంబంధి ద్వారాల ను తెరచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా ఆయన వివరించారు. ‘‘ఇంగ్లీషు తెలియనంత మాత్రాన డాక్టరు అయ్యే అవకాశం ఏ పేద వ్యక్తి యొక్క కుమారుడు గానీ, లేదా కుమార్తె గాని కోల్పోరు. ఇది కూడాను మోదీ యొక్క హామీ’’ అని ఆయన అన్నారు.

 

దశాబ్దాల తరబడి మంచి బడులు మరియు పల్లెల లో విద్య బోధన సౌకర్యాలు కొరవడిన కారణం గా కూడా పల్లె లు మరియు పేద లు వెనుకపట్టు న ఉండిపోయారు అని ప్రధాన మంత్రి అన్నారు. వెనుకబడిన వర్గాల వారి పిల్లల కు మరియు ఆదివాసీ సముదాయాల సంతానాని కి వారి యొక్క కలల ను పండించుకొనేటటువంటి సాధనాలు అందుబాటులో లేకపోవడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్య బోధన కు బడ్జెటు ను మరియు వనరుల ను పెంచింది; మరి ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల ను తెరచింది, ఈ పాఠశాలలు ఆదివాసి యువతీ యువకుల కు ఎంతో మేలు చేశాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘‘విజయం పెద్దది ఎప్పుడు అవుతుంది అంటే కనే కల లు పెద్ద కల లు అయినప్పుడే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాజస్థాన్ ఎటువంటి రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం యొక్క వైభవం వందల సంవత్సరాలు గా ప్రపంచాన్ని ఆకట్టుకొంటున్నది అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. రాజస్థాన్ ను ఆధునిక అభివృద్ధి శిఖర స్థాయి కి తీసుకుపోతూ ఈ గడ్డ యొక్క వారసత్వాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉంది అని ఆయన నొక్కి చెప్పారు. ఈ కారణం గానే రాజస్థాన్ లో నవీనమైనటువంటి మౌలిక సదుపాయాల ను ఏర్పరచాలి అనేది మా ప్రాధాన్యం గా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన కొన్ని నెలల్లో హై-టెక్ ఎక్స్ ప్రెస్ వేస్ రెండిటి ని ప్రారంభించడం గురించి ఆయన ప్రస్తావించారు. దిల్లీ - ముంబయి ఎక్స్ ప్రెస్ వే మరియు అమృత్ సర్- జామ్ నగర్ ఎక్స్ ప్రెస్ వే లో ఒక ప్రముఖ భాగం మాధ్యాల ద్వారా అభివృద్ధి తాలూకు ఒక క్రొత్త అధ్యాయాన్ని రాజస్థాన్ రచిస్తున్నది అని ఆయన అన్నారు. రాష్ట్రం నుండి నడుపుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను గురించి కూడా ఆయన ప్రస్తావించారు. పర్యటన రంగాని కి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన లో, తత్సంబంధిత సదుపాయాల ను అభివృద్ధి పరచడం లో ప్రభుత్వం పెట్టుబడి పెడుతోంది. దీనివల్ల రాజస్థాన్ లో సైతం క్రొత్త క్రొత్త అవకాశాలు ఏర్పడుతాయి అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ‘‘ ‘మా రాష్ట్రాని కి విచ్చేయండి’’ (‘పధారో మహారే దేశ్’) అని రాజస్థాన్ ఆహ్వానిస్తున్నప్పుడల్లా యాత్రికుల కు ఎక్స్ ప్రెస్ వేస్ తో పాటు మెరుగైన రైలు సదుపాయాలు కూడా స్వాగతం పలుకుతాయి’’ అని ఆయన అన్నారు. స్వదేశ్ దర్శన్ పథకం లో భాగం గా ఖాటు శ్యామ్ జీ దేవాలయం లో సదుపాయాల విస్తరణ ను గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. శ్రీ ఖాటు శ్యామ్ యొక్క ఆశీర్వాదాల తో రాజస్థాన్ యొక్క అభివృద్ధి మరింత గా జోరు ను అందుకో గలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ‘‘మనం అందరం కలసి రాజస్థాన్ యొక్క గౌరవాని కి మరియు వారసత్వాని కి యావత్తు ప్రపంచం లో ఒక సరిక్రొత్త గుర్తింపు ను కట్టబెడదాం’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్ లోత్ కు ఆ ఈశ్వరుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షిస్తూ ప్రసంగాన్ని ముగించారు. శ్రీ అశోక్ గహ్ లోత్ కొంత కాలం గా అనారోగ్యం బారిన పడ్డారు మరి ఈ కార్యక్రమాని కి ఆయన రాలేకపోయారు.

ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో రాజస్థాన్ గవర్నరు శ్రీ కల్ రాజ్ మిశ్ర, వ్యవసాయం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింహ్ తోమర్, జల్ శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియా, చట్టం మరియు న్యాయం శాఖ కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్ వాల్, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమం శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాశ్ చౌధరీ తో పాటు ఇతరులు కూడా ఉన్నారు.

పూర్వరంగం

రైతుల కు మేలు ను చేకూర్చేటటువంటి ముఖ్యమైన చర్యల లో భాగం గానా అన్నట్లు గా, ఒక లక్ష ఇరవై అయిదు వేల కు పైగా పిఎమ్-కిసాన్ సమృద్ధి కేంద్రాల (పిఎమ్ కెఎస్ కె స్) ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. రైతు ల అన్ని అవసరాల ను తీర్చే ఏకైక నిలయం గా పిఎమ్ కెఎస్ కె స్ ను అభివృద్ధి పరచడం జరుగుతోంది. ఎరువులు, విత్తనాలు, ఉపకరణాలు వంటి వాటి గురించి న సమాచారాన్ని తెలియ జేయడం మొదలుకొని, నేల, విత్తనాలు, ఇంకా ఎరువుల సంబంధి పరీక్ష సదుపాయాల ను అందించడం తో పాటు వివిధ ప్రభుత్వ పథకాల కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వడం వరకు పిఎమ్ కెఎస్ కె స్ దేశం లోని రైతు లు ఆధారపడగలిగే మద్దతు వ్యవస్థ వలె మారాలనే ఉద్దేశ్యం తో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అవి ఎరువుల బ్లాకు స్థాయి విక్రయ కేంద్రాలు / జిల్లా స్థాయి విక్రయ కేంద్రాల లో చిల్లర విక్రేతల కు రెగ్యులర్ కెపాసిటీ బిల్డింగ్ అంశం లోనూ పూచీ పడతాయి.

‘యూరియా గోల్డ్’ అనే ఒక క్రొత్త రకం యూరియా ను ప్రధాన మంత్రి ప్రవేశ పెట్టారు. ఈ యూరియా కు సల్ఫర్ పూత పూసి ఉంటుంది. గంధకం పూత ను పూసినటువంటి యూరియా ను పరిచయం చేయడం అనేది నేల లో గంధకం కొదువ సమస్య కు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఈ వినూత్నమైన ఎరువు తక్కువ ఖర్చు తో కూడినదీ, వేప పూత పూసినటువంటి యూరియా కంటే మేలైన రకందీనూ కానుంది. ఈ క్రొత్త రకం యూరియా మొక్కల లో నత్రజని సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది, ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు పంట నాణ్యత ను పెంచుతుంది.

ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్ (ఒఎన్ డిసి) లో 1600 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్ పిఒ స్ ) ను జోడించే ప్రక్రియ ను మొదలుపెట్టారు. ఒఎన్ డిసి అనేది ఎఫ్ పిఒ స్ కు డిజిటల్ మార్కెటింగ్, ఆన్ లైన్ పేమెంట్, బిజినెస్-టు-బిజినెస్ (బి2బి) మరియు బిజినెస్-టు-కన్స్యూమర్ ట్రాన్సాక్శన్ కు ప్రత్యక్ష లభ్యత సదుపాయాన్ని ఇవ్వడం తో పాటు స్థానికం గా విలువ ను జోడించే ప్రక్రియ ను ప్రోత్సహిస్తుంది; గ్రామీణ ప్రాంతాల లో లాజిస్టిక్స్ యొక్క అభివృద్ధి కి ఉత్ప్రేరకం వలె కూడాను పని చేస్తుంది.

రైతు ల సంక్షేమం దిశ లో ప్రధాన మంత్రి యొక్క నిబద్ధత కు మరొక ఉదాహరణా అని అనిపించేటట్లు గా, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా దాదాపు గా 17,000 కోట్ల రూపాయల తో కూడినటువంటి పద్నాలుగో వాయిదా సొమ్ము ను 8.5 కోట్ల కు పైగా లబ్ధిదారుల కు ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ పద్ధతి లో విడుదల చేయడం జరిగింది.

ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన లో ఒక ప్రధానమైనటువంటి విస్తరణ కు సాక్షి గా రాజస్థాన్ ఉండబోతున్నది. ఎలాగంటే ప్రధాన మంత్రి రాజస్థాన్ లోని చిత్తౌడ్ గఢ్, ధౌల్ పుర్, సిరోహీ, సీకర్, ఇంకా శ్రీ గంగానగర్ లలో క్రొత్త గా ఏర్పాటైన అయిదు వైద్య కళాశాల లు అయిదింటి ని ప్రారంభించారు. అలాగే బారాఁ, బూందీ, కరౌలీ, ఝుంఝునూ, సవాయ్ మాధోపుర్, జైసల్ మెర్ మరియు టోంక్ లలో వైద్య కళాశాల లు ఏడిటి కి శంకుస్థాపన కూడా చేశారు. ‘‘ఇప్పటికే ఉన్న జిల్లా ఆసుపత్రుల కు/రిఫరల్ ఆసుపత్రుల కు అనుబంధం గా క్రొత్త వైద్య కళాశాలల స్థాపన’’ అనే కేంద్ర ప్రాయోజిత పథకం లో భాగం గా ఈ వైద్య కళాశాలల ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రధాన మంత్రి ప్రారంభించినటువంటి అయిదు వైద్య కళాశాలల ను 1400 కోట్ల రూపాయల కు పైగా వ్యయం తో అభివృద్ధి పరచడమైంది. శంకుస్థాపన జరిగిన ఏడు వైద్య కళాశాలలు ఏడిటి ని మొత్తం 2275 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించడం జరుగుతుంది. 2014 వ సంవత్సరం వరకు చూస్తే, రాజస్థాన్ లో 10 వైద్య కళాశాల లు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అంకిత భావం తో నడుం కట్టిన ప్రయాస ల ఫలితం గా రాష్ట్రం లో వైద్య కళాశాల ల సంఖ్య 35 కు వృద్ధి చెందింది; ఇది 250 శాతం వృద్ధి తో సమానం అన్న మాట. ఈ 12 నూతన వైద్య కళాశాలల స్థాపన తో రాష్ట్రం లో ఎమ్ బిబిఎస్ సీట్ ల సంఖ్య 2013-14 సంవత్సరం లో ఉన్న 1750 సీట్ ల స్థాయి నుండి 6275 సీట్ ల స్థాయి కి పెరుగుతుంది. అంటే ఎమ్ బిబిఎస్ సీట్ లు 258 శాతం వృద్ధి చెందినట్లు అవుతుందన్న మాట.

ఉదయ్ పుర్, బాన్స్ వాడ, ప్రతాప్ గఢ్ మరియు డుంగర్ పుర్ జిల్లాల లో ఏర్పాటైన ఏకలవ్య నమూనా ఆశ్రమ పాఠశాలలు ఆరిటి ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ పాఠశాలల తో ఆయా జిల్లాల ఆదివాసి జనాభా కు ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ఇదే కార్యక్రమం లో భాగం గా కేంద్రీయ విద్యాలయ తింవరీ, జోధ్ పుర్ ను కూడా ప్రారంభించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

h

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"