డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ లో న్యూ ఖుర్జా-న్యూ రేవాడి మధ్య 173 కి.మీ. పొడవైన విద్యుదీకరణ జరిగినటువంటి డబల్ లైన్సెక్శను ను దేశ ప్రజల కు ఆయన అంకితం చేశారు
మథుర - పల్‌వల్ సెక్శను ను మరియు చిపియానా బుజుర్గ్ - దాద్ రీ సెక్శను ను కలిపే నాలుగో లైను నుకూడా దేశ ప్రజల కు అంకితం చేశారు
అనేక రహదారి అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు
ఇండియన్ ఆయిల్ కు చెందిన టుండ్‌లా- గవారియా గొట్టపు మార్గాన్ని ప్రారంభించారు
గ్రేటర్ నోయెడా లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్శిప్ (ఐఐటిజిఎన్) ను దేశ ప్రజల కుఅంకితమిచ్చారు
పునర్ నవీకరించిన మథుర సీవరేజీ స్కీము నుప్రారంభించారు
‘‘కళ్యాణ్ సింహ్ గారు ఆయన జీవనాన్ని రామ్ కాజ్ కు మరియురాష్ట్ర కాజ్ కు సమర్పణం చేసివేశారు’’
‘‘ఉత్తర్ ప్రదేశ్ లో వేగవంతమైన అభివృద్ధి జరుగనిదే అభివృద్ధిచెందిన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం కాదు’’
‘‘రైతుల మరియు పేద ప్రజల జీవనాన్ని తీర్చిదిద్దడం అనేదేడబల్ ఎన్ జిన్ ప్రభుత్వాని కి ప్రాధాన్యం గా ఉంది’’
‘‘ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని దేశం లో అందరుఅందుకోవాలన్నది మోదీ యొక్క హామీ గా ఉన్నది. మోద
ఆయా ప్రాజెక్టు లు రేల్ వే, రహదారులు, చమురు, ఇంకా గ్యాస్, పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 19,100 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన అభివృద్ధి పథకాల ను ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌శహర్ లో ఈ రోజు న ప్రారంభించడం తో పాటు శంకుస్థాపనలను కూడా చేశారు. ఆయా ప్రాజెక్టు లు రేల్ వే, రహదారులు, చమురు, ఇంకా గ్యాస్, పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణం ల వంటి అనేక ముఖ్య రంగాల కు సంబంధించినవి.

ప్రధాన మంత్రి జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, బులంద్‌శహర్ యొక్క ప్రజలు, ప్రత్యేకించి పెద్ద సంఖ్యల లో తరలి వచ్చిన మాతృమూర్తులు మరియు సోదరీమణులు చాటిన వాత్సల్యానికి, విశ్వాసానికి గాను కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. జనవరి 22 వ తేదీ నాడు ప్రభువు శ్రీ రాముని దర్శనం కలగడం, మరి ఈ రోజు న ఉత్తర్ ప్రదేశ్ యొక్క ప్రజలు ఈ కార్యక్రమాని కి తరలి రావడం తనకు దక్కిన సౌభాగ్యం అంటూ శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను తెలియ జేశారు. రేల్ వే, హైవే, పెట్రోలియమ్ పైప్ లైన్, నీరు, మురుగు నీరు, వైద్య కళాశాల మరియు ఇండస్ట్రియల్ టౌన్ శిప్ ల వంటి రంగాల లో 19,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అభివృద్ధి పథకాల కు గాను బులంద్‌శహర్ ప్రజల తో పాటు యావత్తు పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కు ఆయన అభినందనల ను తెలియ జేశారు. యమున నది మరియు రామ్ గంగ నది ల లో స్వచ్ఛత ప్రచార ఉద్యమాల కు సంబంధించిన ప్రాజెక్టు ల ప్రారంభాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

 

అటు రామ్ కాజ్ కు, ఇటు రాష్ట్ర కాజ్ కు (రామ కార్యానికి మరియు దేశం యొక్క కార్యాలకు) జీవనాన్ని సమర్పణం చేసినటువంటి శ్రీ కళ్యాణ్ సింహ్ వంటి ఒక పుత్రుడి ని దేశ ప్రజల కు ఈ ప్రాంతం అందించింది అని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ కళ్యాణ్ సింహ్ కన్న కల ను దేశం నెరవేర్చింది అని ప్రధాన మంత్రి చెప్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఒక బలమైన దేశాన్ని మరియు సిసలైన సామాజిక న్యాయాన్ని సాధించాలి అని శ్రీ కల్యాణ్ సింహ్ కన్న కలను పండించడం కోసం మనం మరింత జోరు ను అందుకోవలసి ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అయోధ్య లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి అయిన సంగతి ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, రాష్ట్ర ప్రతిష్ఠ కు పెద్దపీట ను వేయాలి, మరి దేశాన్ని క్రొత్త శిఖరాల కు చేర్చాలి అని స్పష్టం చేశారు. ‘‘దేవ్ నుండి దేశం, మరి అలాగే రాముని నుండి దేశం’’ అనే మార్గానికి ధైర్యాన్ని మనం సంతరించి తీరాలి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. 2047 వ సంవత్సరాని కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని శ్రీ నరేంద్ర మోదీ నొక్కి పలికారు. ఉన్నత లక్ష్యాల ను సాధించడం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సబ్ కా ప్రయాస్ తాలూకు ఉత్సాహం తో పాటు అవసరమైన అన్ని వనరుల ను పోగేసుకోవాలి అని ఉద్ఘాటించారు. ‘‘వికసిత్ భారత్ ను ఆవిష్కరించాలి అంటే శరవేగంతో కూడినటువంటి ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి తప్పనిసరి’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ క్రమం లో వ్యవసాయం, విజ్ఞాన శాస్త్రం, విద్య, పరిశ్రమ మరియు వాణిజ్య సంస్థలు తదితర రంగాల లో పునరుత్తేజపరచవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు. ‘‘ఈ నాటి సందర్భం ఈ దిశ లో ఒక పెద్ద అడుగు’’ అంటూ ఆయన అభివర్ణించారు.

 

భారతదేశం స్వాతంత్య్రం సంపాదించుకొన్న తరువాతి కాలం లో అభివృద్ధి పరం గా ప్రాంతీయ అసమానతల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అతి ఎక్కువ జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం చిన్నచూపునకు గురి అయింది అన్నారు. ‘పాలక’ మనస్తత్వాన్ని ప్రధాన మంత్రి విమర్శించారు; ఇదివరకటి కాలాల్లో అధికారం కోసం సామాజిక విభజనల ను ఎగదోయడం తో రాష్ట్రం మరియు దేశం భారీ మూల్యాల ను చెల్లించుకోవలసి వచ్చింది అని ఆయన అన్నారు. ‘‘దేశం లో అతి పెద్దది అయినటువంటి రాష్ట్రం బలహీనం గా ఉన్నప్పుడు, దేశం ఏ విధం గా బలోపేతం అవుతుంది?’’ అంటూ ప్రధాన మంత్రి ప్రశ్నించారు.

ఉత్తర్ ప్రదేశ్ లో 2017 వ సంవత్సరం లో డబల్ ఎన్ జిన్ ప్రభుత్వం ఏర్పాటు కావడం తో, రాష్ట్రం పాత సవాళ్ళ ను ఎదుర్కోవడం లో క్రొత్త దారుల ను కనుగొంది; ఆర్థిక అభివృద్ధి కి అండ ను అందించింది; మరి ఈ రోజు న ఈ సందర్భం ప్రభుత్వం యొక్క నిబద్ధత కు ఒక రుజువు గా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవలి ఘటన క్రమాల ను గురించి న ఉదాహరణల ను ప్రధాన మంత్రి ఇస్తూ, భారతదేశం లో రెండు డిఫెన్స్ కారిడర్ లను అభివృద్ధి చేయడం గురించి; అలాగే, అనేక నూతన జాతీయ రాజమార్గాల ను ఏర్పాటు చేయడం గురించి వివరించారు. ఆధునిక ఎక్స్ ప్రెస్ వేస్, ఒకటో నమో భారత్ ట్రైన్ ప్రాజెక్టు ను మొదలు పెట్టడం, అనేక నగరాల లో మెట్రో కనెక్టివిటీ ల ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లో అన్ని ప్రాంతాల కు కనెక్టివిటీ ని పెంచడానికి ప్రభుత్వం శ్రద్ధ ను తీసుకొంది. మరి రాష్ట్రం ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ కు మరియు వెస్ట్రర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ కు ఒక కేంద్రం గా రూపుదిద్దుకొంటోంది అని ఆయన అన్నారు. ‘‘ఈ అభివృద్ధి ప్రాజెక్టు లు రాబోయే శతాబ్దాల లో వాటి ప్రభావాన్ని ప్రసరింప చేస్తాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. జేవర్ విమానాశ్రయం పూర్తి కావడం తో, ఈ ప్రాంతం ఒక క్రొత్త బలాన్ని మరియు ఉన్నతి ని అందుకోగలుగుతుంది అని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

“ప్రభుత్వ కృషితో  దేశంలోని ప్రధాన ఉద్యోగ ప్రదాత ప్రాంతాల్లో ఒకటిగా నేడు పశ్చిమ ఉత్తరప్రదేశ్ అవతరిస్తోంది” అని ప్రధాన మంత్రి అన్నారు. ప్ర‌భుత్వం నాలుగు ప్ర‌పంచ స్థాయి ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీల‌పై కసరత్తు చేస్తోందని ప్రధాన మంత్రి తెలిపారు. వీటిలో ఒకటి పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉంది, ఈ ముఖ్యమైన టౌన్‌షిప్‌ను ప్రధాన మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఇది పరిశ్రమలకు, ఈ ప్రాంతంలోని చిన్న, కుటీర వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. టౌన్‌షిప్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు కొత్త మార్గాలను సృష్టిస్తుందని, స్థానిక రైతులు,  కార్మికులకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 

 

వ్యవసాయంపై పూర్వ కాలంలో కనెక్టివిటీ లేకపోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావం గురించి ప్రస్తావించిన ప్రధాన మంత్రి, కొత్త విమానాశ్రయం, కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌లో పరిష్కారాన్ని చూడవచ్చని అన్నారు. చెరకు ధరలను పెంచడంతోపాటు మండిలో ఉత్పత్తులను విక్రయించిన తర్వాత నేరుగా రైతుల ఖాతాలకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చూడడం కోసం డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. అదేవిధంగా, చెరకు రైతులకు ఇథనాల్‌పై దృష్టి పెట్టడం లాభదాయకంగా మారిందని అన్నారు.

"రైతు సంక్షేమమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. రైతులకు రక్షణ కవచం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, భారత రైతులకు తక్కువ ధరకే ఎరువులు అందుబాటులో ఉంచేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. భారతదేశం వెలుపల రూ. 3,000 ఖరీదు చేసే యూరియా బ్యాగ్‌ను రూ. 300 కంటే తక్కువ ధరకే రైతులకు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన తెలియజేశారు. చిన్న బాటిల్‌తో ఎరువుల బస్తాకు సరిపడే నానో యూరియాను రూపొందించడంపై దృష్టి సారించామని, తద్వారా వినియోగం తగ్గుతుందని, డబ్బు ఆదా అవుతుందని ఆయన వెల్లడించారు.  ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం రూ. 2.75 లక్షల కోట్లు బదిలీ చేసిందని శ్రీ మోదీ తెలియజేశారు.

వ్యవసాయం, వ్యవసాయ-ఆర్థిక వ్యవస్థలో రైతుల సహకారాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, సహకార సంఘాల పరిధి నిరంతర విస్తరణను వివరించారు. చిన్న రైతుల బలోపేతానికి చర్యలుగా పిఎసిలు, సహకార సంఘాలు, ఎఫ్‌పిఓలను ఆయన ప్రస్తావించారు. సహకార సంస్థలు అమ్మకం కొనుగోలు, రుణాలు, ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఎగుమతులకు ప్రోత్సహిస్తున్నామని అన్నారు. మొత్తం దేశంలో కోల్డ్ స్టోరేజీల నెట్‌వర్క్‌ను సృష్టించే ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ సంబంధిత పథకాలను కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. నారీ శక్తి దీనికి ఒక భారీ మాధ్యమంగా మారగలదని నొక్కిచెప్పారు. మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ పైలట్లు కావడానికి శిక్షణ ఇస్తున్న నమో డ్రోన్ దీదీ పథకాన్ని ఆయన ప్రస్తావించారు. "నమో డ్రోన్ దీదీ భవిష్యత్తులో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయానికి బలీయమైన శక్తిగా మారబోతోంది" అని ఆయన అన్నారు. 

 

గడచిన 10 ఏళ్లలో చిన్న రైతులు, మహిళలను సాధికారత కలిపించడానికి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. కోట్లాది పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, కుళాయి నీటి కనెక్షన్లు, రైతులు, కూలీలకు పెన్షన్ సౌకర్యాలు, పంటలు నష్టపోతే రైతులకు రూ. 1.5 లక్షల కోట్లకు పైగా అందజేసే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఉచిత రేషన్ పథకం, ఆయుష్మాన్ భారత్ పథకం తదితర అంశాలను ప్రధాని వివరించారు. “ప్రభుత్వ పథకానికి ఏ లబ్ధిదారుడు దూరం కాకూడదనేది ప్రభుత్వ ప్రయత్నం, దీని కోసం మోడీ కి గ్యారెంటీ వాహనాలు ప్రతి గ్రామానికి చేరుతున్నాయి, ఉత్తరప్రదేశ్‌లో కూడా లక్షలాది మందిని పథకాలలో రిజిస్టర్ అయ్యేలా చేసాము” అని శ్రీ మోదీ తెలిపారు. 

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధి ప్రతి పౌరుడికి అందుతుందన్నది మోదీ హామీ. ఈ రోజు దేశం ఏదైనా హామీని నెరవేర్చే హామీగా మోడీ హామీని పరిగణిస్తోంది” అని ప్రధాన మంత్రి అన్నారు. “ప్రభుత్వ పథకం ప్రయోజనాలు ప్రతి లబ్దిదారునికి చేరేలా ఈరోజు మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకే మోడీ గ్యారెంటీ ఇస్తున్నారు. 100 శాతం లబ్ధిదారులను చేరవేయాలని మోదీ ఉద్ఘాటిస్తున్నారు” అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది వివక్ష లేదా అవినీతికి సంబంధించిన ఏదైనా అవకాశాన్ని తొలగిస్తుంది. "ఇది నిజమైన లౌకికవాదం, సామాజిక న్యాయం" అన్నారాయన. ప్రతి సమాజంలోనూ రైతులు, మహిళలు, పేదలు, యువత కలలు ఒకేలా ఉంటాయన్నారు. ప్రభుత్వ కృషి వల్ల గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని అన్నారు.

ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ, “నాకు మీరు నా కుటుంబం. మీ కల నా తీర్మానం. ” అని స్పష్టం చేశారు. దేశంలోని సామాన్య కుటుంబాల సాధికారత సాధించడమే మోదీ సంపద అని ఆయన నొక్కి చెప్పారు. గ్రామాలు, పేదలు, యువత, మహిళలు, రైతులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సాధికారత కల్పించాలనే ప్రచారం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేష్ పాఠక్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల రాష్ట్ర మంత్రి, జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

నేపథ్యం 
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డి ఎఫ్ సి)లో న్యూ ఖుర్జా - న్యూ రేవారీ మధ్య 173 కి.మీ పొడవైన డబుల్ లైన్ విద్యుద్దీకరణ విభాగాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రెండు స్టేషన్ల నుండి గూడ్స్ రైళ్లను ఫ్లాగ్ చేయడం ద్వారా ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ కొత్త డి ఎఫ్ సి విభాగం ముఖ్యమైనది, ఎందుకంటే ఇది పశ్చిమ, తూర్పు  డి ఎఫ్ సి ల మధ్య కీలకమైన కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది. ఇంకా, ఈ విభాగం ఇంజనీరింగ్ అద్భుతమైన ప్రయత్నానికి ప్రసిద్ధి చెందింది. ఇది 'హై రైజ్ ఎలక్ట్రిఫికేషన్‌తో ఒక కిలోమీటరు పొడవైన డబుల్ లైన్ రైలు సొరంగం' కలిగి ఉంది, ఇది ప్రపంచంలోనే మొదటిది. ఈ సొరంగం డబుల్-స్టాక్ కంటైనర్ రైళ్లను సజావుగా నడపడానికి రూపొందించబడింది. డి ఎఫ్ సి ట్రాక్‌పై గూడ్స్ రైళ్లను మార్చడం వల్ల ప్యాసింజర్ రైళ్ల నిర్వహణను మెరుగుపరచడంలో ఈ కొత్త డి ఎఫ్ సి విభాగం సహాయపడుతుంది.

 

మథుర - పల్వాల్ సెక్షన్ & చిపియానా బుజుర్గ్ - దాద్రీ సెక్షన్‌లను కలిపే నాల్గవ లైన్‌ను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. ఈ కొత్త లైన్లు జాతీయ రాజధాని దక్షిణ పశ్చిమ, తూర్పు భారతదేశానికి రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. 
అనేక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టులలో అలీగఢ్ నుండి భద్వాస్ నాలుగు-లేనింగ్ వర్క్ ప్యాకేజీ-1 (ఎన్హెచ్-34లోని అలీఘర్-కాన్పూర్ విభాగంలో భాగం); షామ్లీ (ఎన్హెచ్-709ఏ) మీదుగా మీరట్ నుండి కర్నాల్ సరిహద్దు వరకు విస్తరించడం; మరియు ఎన్హెచ్-709 ఏడి ప్యాకేజీ-IIలోని షామ్లీ-ముజఫర్‌నగర్ సెక్షన్ నాలుగు లేనింగ్. రోడ్డు ప్రాజెక్టులు. రూ. 5000 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేయబడిన ఈ రహదారి ప్రాజెక్టులు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి సహాయపడతాయి.  

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ఇండియ‌న్ ఆయిల్ కి సంబంధించిన తుండ్లా-గవారియా పైప్‌లైన్‌ను కూడా ప్రారంభించారు. సుమారు రూ.700 కోట్లతో నిర్మించిన ఈ 255 కి.మీ పొడవునా పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్ణీత సమయం కంటే చాలా ముందుగానే పూర్తయింది. మథుర, తుండ్ల వద్ద పంపింగ్ సౌకర్యాలతో, తుండ్లా, లక్నో కాన్పూర్‌లలో డెలివరీ సౌకర్యాలతో బరౌనీ-కాన్పూర్ పైప్‌లైన్‌లోని గవారియా టి-పాయింట్‌కు తుండ్ల నుండి పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు ఈ ప్రాజెక్ట్ సహాయం చేస్తుంది. 

 

‘గ్రేటర్ నోయిడాలోని ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్’ (ఐఐటీ జిఎన్)ని కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. ఇది పీఎం-గతిశక్తి కింద మౌలిక సదుపాయాల కనెక్టివిటీ ప్రాజెక్టుల సమగ్ర ప్రణాళిక, సమన్వయ అమలు ప్రధాన మంత్రి దృష్టికి అనుగుణంగా అభివృద్ధి చేయబడింది.  1,714 కోట్ల వ్యయంతో నిర్మించారు.  ప్రాజెక్ట్ 747 ఎకరాలలో విస్తరించి ఉంది. తూర్పు, పశ్చిమ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ల కూడలికి సమీపంలో తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే దక్షిణాన, తూర్పున ఢిల్లీ-హౌరా బ్రాడ్ గేజ్ రైల్వే లైన్‌తో ఉంది. ఐఐటీజిఎన్ వ్యూహాత్మక స్థానం అసమానమైన కనెక్టివిటీని నిర్ధారిస్తుంది, ఎందుకంటే మల్టీ-మోడల్ కనెక్టివిటీ కోసం ఇతర మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్నాయి. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే (5 కిమీ), యమునా ఎక్స్‌ప్రెస్‌వే (10 కిమీ), ఢిల్లీ విమానాశ్రయం (60 కిమీ), జేవార్ విమానాశ్రయం (40 కిమీ), అజైబ్‌పూర్ రైల్వే స్టేషన్ (0.5 కిమీ) మరియు న్యూ దాద్రి డిఎఫ్సిసి స్టేషన్ (10 కిమీ) దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని పెంపొందించే దిశగా ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన అడుగు సూచిస్తుంది.

ఈ కార్య‌క్ర‌మంలో, దాదాపు రూ.460 కోట్ల‌తో మురుగునీటి శుద్ధి ప్లాంట్ (ఎస్‌టిపి) నిర్మాణంతో సహా పునరుద్ధరించబడిన మధుర మురుగునీటి పారుదల పథకాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ పనిలో మసాని వద్ద 30 ఎంఎల్డి ఎస్టిపి నిర్మాణం, ట్రాన్స్ యమునా వద్ద ఇప్పటికే ఉన్న 30 ఎంఎల్డి పునరావాసం, మసాని వద్ద 6.8  ఎంఎల్డి ఎస్టిపి, 20  ఎంఎల్డి ప్లాంట్ (రివర్స్ ఆస్మాసిస్ ప్లాంట్) నిర్మాణం ఉన్నాయి. మొరాదాబాద్ (రామగంగ) మురుగునీటి పారుదల వ్యవస్థ, ఎస్టిపి పనులను (ఫేజ్ I) కూడా ఆయన ప్రారంభించారు. దాదాపు రూ. 330 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో 58  ఎంఎల్డి ఎస్టిపి, 264 కి.మీ మురుగునీటి నెట్‌వర్క్, మొరాదాబాద్ వద్ద రామగంగా నది కాలుష్య నివారణకు తొమ్మిది మురుగు పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi