బుందేల్ఖండ్ భూమి పుత్రుల లో మరొకరు అయిన మేజర్ధ్యాన్ చంద్ లేదా దద్ దా ధ్యాన్ చంద్ ను స్మరించుకొన్నారు
ఉజ్జ్వలయోజన వెలుగులు నింపిన ప్రజల సంఖ్య, ప్రత్యేకించి మహిళల సంఖ్య, కని విని ఎరుగనిది గా ఉంది: ప్రధాన మంత్రి
సోదరీమణులఆరోగ్యం, సౌకర్యం, స్వశక్తీకరణ ల కోసం తీసుకొన్న సంకల్పానికి ఉజ్జ్వల యోజననుంచి గొప్ప ఉత్తేజం లభించింది: ప్రధాన మంత్రి
గృహనిర్మాణం, విద్యుత్తు, నీరు, టాయిలెట్, గ్యాస్, రహదారులు, ఆసుపత్రి, పాఠశాల ల వంటి కనీససౌకర్యాల ను దశాబ్దాల క్రితమే సమకూర్చి ఉండాల్సింది: ప్రధాన మంత్రి
ఉజ్జ్వల2.0 పథకం లక్షల కొద్దీ ప్రవాసీ శ్రామిక కుటుంబాల కు గరిష్ఠప్రయోజనాన్ని అందిస్తుంది: ప్రధాన మంత్రి
బయోఫ్యూయల్ అనేది ఇంధన రంగం లో స్వావలంబన తాలూకు, దేశాభివృద్ధి తాలూకు , గ్రామాల అభివృద్ది తాలూకు ఇంజిన్ గా ఉంది: ప్రధాన మంత్రి
మరింత సమర్థవంతమైన భారతదేశంతాలూకు సంకల్పాన్ని సాధించడం లో సోదరీమణులు ఒక ప్రత్యేకమైన పాత్రనుపోషించనున్నారు: ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ఎల్ పీజీ కనెక్షన్ లను లబ్ధిదారుల కు అప్పగించి, ‘ఉజ్జ్వల 2.0’ (ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన - (పిఎమ్ యువై) ని   ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఉజ్జ్వల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ రక్షా బంధన్ కు ముందు యూపీలో సోదరీమణులను ఉద్దేశించి ప్రసంగించడానికి తాను సంతోషిస్తున్నానన్నారు.  ఉజ్జ్వల యోజన ద్వారా జీవితాల లో వెలుగు లు నిండిన ప్రజల సంఖ్య, ప్రత్యేకించి మహిళ ల సంఖ్య, ఇది వరకు లేనంతగా ఉంది అని ఆయన అన్నారు. ఈ పథకాన్ని స్వాతంత్య్ర పోరాటం లో మార్గదర్శి గా నిలచిన మంగళ్ పాండే పుట్టిన గడ్డ అయినటువంటి ఉత్తర్ ప్రదేశ్ లోని బలియా లో 2016వ సంవత్సరం లో ప్రారంభించడం జరిగింది.  ఉజ్జ్వల రెండో సంచిక ను కూడా ఉత్తర్ ప్రదేశ్ లో వీర భూమి మహోబా లో నేడు ప్రారంభించడమైంది అని ఆయన అన్నారు.  దేశం లో క్రీడల రంగం లో అత్యున్నతమైంది అయినటువంటి పురస్కారాని కి ఇక  ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం’ గా పేరు ను పెట్టడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.  క్రీడల రంగం లో ప్రవేశించాలి అని  కోరుకొనే లక్షల మంది ప్రజలకు ఇది ప్రేరణ ను అందిస్తుందని ఆయన అన్నారు.

గృహ నిర్మాణం, విద్యుత్తు, నీరు, మరుగుదొడ్డి, గ్యాసు, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాల వంటి అనేక కనీస సౌకర్యాల కోసం దేశ ప్రజలు దశాబ్దాల తరబడి వేచి ఉండవలసి వచ్చింది అంటూ ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు.  అటువంటి అనేక పనుల ను దశాబ్దాల కిందటే పూర్తి చేసి ఉండివుండవలసింది అని కూడా ఆయన అన్నారు.  ఇంటి కి సంబంధించిన, వంట గది కి సంబంధించిన సమస్యల ను ముందుగా పరిష్కరించినట్లయితేనే మన కుమార్తె లు వంట గది నుంచి, ఇంటి నుంచి  బయటకు రాగలుగుతారు, దేశ నిర్మాణం లో విస్తృత స్థాయిలో వారు తోడ్పాటు ను అందించగలుగుతారు అని ప్రధాన మంత్రి అన్నారు.  అందువల్ల, ప్రభుత్వం గడిచిన  6-7 సంవత్సరాల లో వివిధ సమస్యల కు ఒక ఉద్యమం తరహా లో పరిష్కారాల ను కనుగొనేందుకు కృషి చేసింది అని ఆయన అన్నారు.  ఆ తరహా అనేక కార్యాల ను గురించి ఆయన వివరించారు. వాటిలో- స్వచ్ఛ్ భారత్ మిశన్ లో భాగం గా దేశం అంతటా కోట్ల కొద్దీ టాయిలెట్ ల ను నిర్మించడం జరుగుతోంది; పేద కుటుంబాల కోసం 2 కోట్ల కు పైగా ఇళ్ల ను నిర్మించడం, వాటిలో చాలా వరకు మహిళ ల పేరిట నిర్మించడం,  గ్రామీణ ప్రాంతాల లో రహదారుల ను నిర్మించడం; 3 కోట్ల కుటుంబాలు విద్యుత్తు సదుపాయం కల్పన; ‘ఆయుష్మాన్ భారత్’ ద్వారా 50 కోట్ల మంది ప్రజల కు 5 లక్షల రూపాయల విలువైన వైద్య చికిత్స సంబంధిత రక్షణ ను అందించడం;  టీకా  మందు కోసం, అలాగే ‘మాతృ వందన యోజన’ లో భాగం గా గర్భవతులకు పోషకాహారం కోసం డబ్బు నేరు గా బదిలీ వంటి వాటిని గురించి చెప్పారు. కరోనా కాలం లో మహిళ ల జన్ ధన్ ఖాతాల లో 30 వేల కోట్ల రూపాయల ను ప్రభుత్వం జమ చేసింది.  ‘జల్ జీవన్ మిశన్’ లో భాగంగా గొట్టాల ద్వారా మంచి నీటి ని మన సోదరీమణులు అందుకొంటున్నారు అని ప్రధాన మంత్రి వివరించారు.  ఈ పథకాలు మహిళ ల జీవనాలలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకు వచ్చాయి అని ఆయన అన్నారు.

సోదరీమణుల కు ఆరోగ్యం, సౌకర్యం, స్వశక్తీకరణ లకు సంబంధించిన సంకల్పం ఉజ్జ్వల యోజన నుంచి గొప్ప ఉత్తేజాన్ని అందుకొంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ పథకం ఒకటో దశ లో, పేద కుటుంబాలు, దళిత కుటుంబాలు, ఆదరణ కు దూరంగా ఉండిపోయిన కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కు చెందిన కుటుంబాలు, ఆదివాసీ కుటుంబాలు.. 8 కోట్ల మంది కి గ్యాస్ కనెక్షన్ లను ఉచితం గా అందజేయడమైందన్నారు.  కరోనా మహమ్మారి కాలం లో ఈ ఉచిత గ్యాస్ కనెక్శన్ తాలూకు ప్రయోజనాన్ని గమనించాం అని ఆయన అన్నారు.  ఉజ్జ్వల యోజన ఎల్ పిజి సంబంధి మౌలిక సదుపాయాల కల్పన లో అనేక రెట్ల విస్తరణ కు దారి తీసిందన్నారు.  గత ఆరేడేళ్ల లో 11,000 కు పైగా ఎల్ పిజి పంపిణీ కేంద్రాలు ఆరంభం అయ్యాయన్నారు.  ఈ కేంద్రాల సంఖ్య ఉత్తర్ ప్రదేశ్ లో 2014వ సంవత్సరం లో 2000 గా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 4000 కు పెరిగిందన్నారు.  2014వ సంవత్సరం లో ఇచ్చిన గ్యాస్ కనెక్శన్ ల కంటే ఎక్కువ గా గ్యాస్ కనెక్శన్ లను గత ఏడు సంవత్సరాల లో ఇచ్చిన కారణం గా మనం 100 శాతం గ్యాస్ లభ్యత కు చాలా సమీపం లోకి చేరుకొన్నాం అని ప్రధాన మంత్రి అన్నారు.

బుందేల్ ఖండ్ సహా ఉత్తర్ ప్రదేశ్ లో అన్ని ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పని కోసం పల్లె నుంచి నగరానికి గాని, లేదా ఇతర రాష్ట్రాల కు గాని వలస పోయిన వారు ఎందరో అని ప్రధాన మంత్రి అన్నారు.  వారికి అక్కడ నివాస సంబంధి పత్రం తాలూకు సమస్య ఎదురవుతుంది అని ఆయన అన్నారు.  ఆ కోవ కు చెందిన లక్షల కొద్దీ కుటుంబాల కు ఉజ్జ్వల 2.0 పథకం గరిష్ఠ ప్రయోజనాన్ని ఇస్తుంది అని ఆయన చెప్పారు.  ఇక ఇతర ప్రాంతాల శ్రామికులు నివాస నిరూపణ పత్రం కోసం ఎక్కడెక్కడికో నానా యాతనలు పడనక్కర లేదు అని ఆయన అన్నారు.  ప్రవాసీ శ్రామికుల నిజాయతీ పట్ల ప్రభుత్వానికి పూర్తి నమ్మకం ఉంది అని ఆయన అన్నారు.  గ్యాస్ కనెక్శన్ ను అందుకోవడం కోసం చిరునామా తాలూకు స్వీయ ప్రకటన ను ఇస్తే చాలు అని ఆయన అన్నారు.

గ్యాస్ ను మరింత పెద్ద ఎత్తు న గొట్టపు మార్గాల ద్వారా అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సిలిండర్ కంటే పిఎన్ జి ఎంతో చౌక, మరి ఉత్తర్ ప్రదేశ్ తో సహా భారతదేశం లోని తూర్పు ప్రాంతం లో అనేక జిల్లాల లో పిఎన్ జి ని సమకూర్చడం కోసం పనులు జరుగుతున్నాయన్నారు.  ఒకటో దశ లో భాగం గా, ఉత్తర్ ప్రదేశ్ లో 50 కి పైగా జిల్లాల లో 12 లక్ష ల కుటుంబాల కు జతపరచాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడమైంది అని ఆయన చెప్పారు.  ఈ లక్ష్యాని కి మనం చాలా సమీపం లో ఉన్నామని ఆయన తెలిపారు. ఈ లక్ష్య సాధనకు చాలా సమీపం లోకి వచ్చేశామని ఆయన తెలిపారు.

బయోఫ్యూయల్ తాలూకు ప్రయోజనాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, బయో ఫ్యూయల్ అనేది ఒక పరిశుభ్రమైన ఇంధనం మాత్రమే కాదని అది ఇంధనం విషయం లో ఆత్మ నిర్భరత తాలూకూ ఇంజను కు జోరు ను జోడించే ఒక సాధనం అని, అంతే కాకుండా దేశాభివృద్ధి అనే ఇంజను కు, గ్రామీణాభివృద్ధి అనే ఇంజను కు అదనపు శక్తి ని కూడా ఇస్తుందని ఆయన అన్నారు.  బయో ఫ్యూయల్ ఏ కోవ కు చెందిన శక్తి అంటే అది మనం  కుటుంబాలు పారవేసే వ్యర్థ పదార్థాల ద్వారాను, వ్యవసాయ వ్యర్థాల ద్వారాను, మొక్కల ద్వారాను, ఉపయోగించని గింజల ద్వారాను ఆ శక్తి ని సంపాదించవచ్చు అని ఆయన వివరించారు.  10 శాతం మిశ్రణాన్ని గత ఆరు ఏడు ఏళ్ల లో సాధించాలి అని పెట్టుకొన్న లక్ష్యాని కి మనం చాలా సమీపం లోకి వచ్చేశాం, మరి  20 శాతం మిశ్రణాన్ని రాబోయే నాలుగు ఐదు సంవత్సరాల లో సాధించే దిశ లో మనం పయనిస్తున్నాం అని కూడా ఆయన వెల్లడించారు.  ఉత్తర్ ప్రదేశ్ లో కిందటి సంవత్సరం లో 7 వేల కోట్ల రూపాయల విలువైన ఇథెనాల్ ను కొనుగోలు చేయడం జరిగిందని ఆయన చెప్పారు.  రాష్ట్రం లో అనేక ఇథెనాల్, బయోఫ్యూయల్ సంబంధి యూనిట్ లను ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన చెప్పారు.  చెరకు వ్యర్థాల నుంచి, సిబిజి ప్లాంటు ల నుంచి కంప్రెస్ డ్ బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసేందుకు అవసరపడే యూనిట్ లను ఏర్పాటు చేసే ప్రక్రియ రాష్ట్రం లోని 70 జిల్లాల లో ప్రస్తుతం సాగుతోంది అని ఆయన అన్నారు.  ‘పరాలీ’ నుంచి బయో ఫ్యూయల్ ను ఉత్పత్తి చేయడం కోసం బదాయూఁ లో, గోరఖ్ పుర్ లో ప్లాంటు లు నిర్మాణం లో ఉన్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం ప్రస్తుతం కనీస సదుపాయాల ను తీర్చుకొనే దశ నుంచి ఒక మెరుగైనటువంటి జీవనాన్ని సాధించుకోవాలి అనే కల ను పండించుకొనే దిశ లో ముందుకు సాగిపోతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ సామర్ధ్యాన్ని రాబోయే 25 సంవత్సరాల లో మనం అనేక రెట్లు పెంచుకోవలసి ఉంది అని ఆయన అన్నారు.  ఒక స్వశక్తియుత భారతదేశం తాలూకు ఈ సంకల్పాన్ని మనం అందరం కలసికట్టుగా నిరూపించాలి అని ఆయన అన్నారు.  ఈ కార్యాన్ని సాధించడం లో సోదరీమణులకు ఒక ప్రత్యేక పాత్ర ఉండబోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage