Quote‘‘ప్రజాస్వామ్యంలో అతి ప్రధానమైన గీటురాయిల లో ఒకటి దాని ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ యొక్క బలమే; ఇంటిగ్రేటెడ్అంబుడ్స్ మన్ స్కీము ఈ దిశ లో చాలా దూరం మేర పయనించగలదు’’
Quote‘‘అందరిని ఆర్థిక వ్యవస్థ లోకి చేర్చే సత్తువ ను రిటైల్ డైరెక్ట్ స్కీము ఇస్తుంది;ఎందుకంటే ఇది మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్నవ్యాపారులు మరియు సీనియర్ సిటిజన్స్ రు వారి చిన్న పొదుపు మొత్తాల ను ప్రభుత్వహామీ పత్రాల లో నేరు గా, సురక్షితంగా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది’’
Quote‘‘ప్రభుత్వంతీసుకొన్న చర్య ల వల్ల బ్యాంకుల పాలన మెరుగు పడుతోంది, మరి ఈవ్యవస్థ పట్ల డిపాజిటర్ ల లో విశ్వాసం అంతకంతకు పటిష్టం అవుతోంది’’
Quote‘‘ఇటీవలి కాలాల్లో ప్రభుత్వం తీసుకొన్న పెద్దపెద్ద నిర్ణయాల తాలూకు ప్రభావాన్ని పెంచడం లో ఆర్ బిఐ నిర్ణయాలు కూడా సహాయకారిఅయ్యాయి’’
Quote‘‘ఆరేడేళ్ళ క్రితం వరకు చూస్తే, భారతదేశం లో బ్యాంకింగ్, పింఛను మరియు బీమా ఒక విశిష్ట క్లబ్ తరహా లో ఉండేవి’’
Quote‘‘కేవలం7సంవత్సరాల లో, భారతదేశం డిజిటల్ లావాదేవీ ల విషయం లో 19రెట్ల వృద్ధి ని నమోదు చేసింది; ప్రస్తుతంమన బ్యాంకింగ్ వ్యవస్థ దేశం లో ఏ మూలన అయినా, ఎప్పుడయినా 24 గంటలూ,7 రోజులూ, 12 నెలలూ పనిచేస్తోంది’’
Quote‘‘మనందేశ పౌరుల అవసరాల ను కేంద్ర స్థానం లో పెట్టుకొని మరీ పెట్టుబడిదారు ల బరోసా ను నిరంతరం బలపరచుకొంటూ ఉండవలసిందే’’
Quote‘‘ఒక సంవేదనశీలమైనటువంటి మరియుపెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి గమ్యస్థానం గా భారతదేశం యొక్క కొత్త గుర్తింపును బలపరచడం కోసం ఆర్ బిఐ కృషి చేస్తూనే ఉంటుందన్న నమ్మకం నాలో ఉంది’’

వినియోగదారు ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకొని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్ బిఐ) రూపొందించిన రెండు కొత్త కార్యక్రమాలు అయిన రిటైల్ డైరెక్ట్ స్కీము ను, రిజర్వ్ బ్యాంకు- ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కిము ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఆర్థిక వ్యవహారాలు మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ తో పాటు ఆర్ బిఐ గవర్నరు శ్రీ శక్తికాంత దాస్ కూడా పాలుపంచుకొన్నారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మహమ్మారి కాలం లో ఆర్థిక మంత్రిత్వ శాఖ తో పాటు, ఆర్ బిఐ వంటి సంస్థ లు చేసిన ప్రయాసల ను ప్రశంసించారు. ‘‘ప్రస్తుత అమృత్ మహోత్సవ్ కాలం లో దేశాభివృద్ధి కి గాను 21వ శతాబ్దం తాలూకు ఈ పది సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి. ఈ తరహా పరిస్థితి లో, ఆర్ బిఐ పాత్ర కూడా ఎంతో ప్రధానం అయినటువంటిది. దేశం అంచనాల ను ఆర్ బిఐ జట్టు అందుకొంటుందన్న విశ్వాసం నాలో ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

|

ఈ రోజు న ప్రారంభం అయిన రెండు పథకాల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ పథకాల వల్ల దేశం లో పెట్టుబడి తాలూకు పరిధి విస్తరిస్తుందని, మూలధన బజారులు ఇట్టే అందుబాటు లోకి వస్తాయని, ఇన్వెస్టర్ లకు మరింత సురక్షత ను ప్రసాదిస్తాయని ప్రధాన మంత్రి అన్నారు. రిటైల్ డైరెక్ట్ స్కీము తో దేశం లోని చిన్న ఇన్వెస్టర్ లకు ప్రభుత్వ హామీ పత్రాల లో పెట్టుబడి పెట్టడాని కి ఒక సులభం అయినటువంటి మరియు సురక్షితం అయినటువంటి మాధ్యమం చేజిక్కింది అని ఆయన అన్నారు. ఇదే విధం గా, ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీము ద్వారా బ్యాంకింగ్ రంగం లో వన్ నేశన్, వన్ అంబుడ్స్ మన్ సిస్టమ్ రూపుదాల్చింది అని ఆయన అన్నారు.

ఈ పథకాల కు ఉన్నటువంటి పౌర ప్రధాన లక్షణాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఏ ప్రజాస్వామ్యం లో అయినా సరే అతి ప్రధానం అయినటువంటి గీటు రాళ్ళ లో ఒక గీటురాయి ఏది అంటే అది దాని ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ యొక్క బలమే అని ఆయన అన్నారు. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్ మన్ స్కీము ఈ దిశ లో ఎంతో ముందుకు పయనించగలదని ఆయన అన్నారు. అదే మాదిరిగా, రిటైల్ డైరెక్ట్ స్కీము ఆర్థిక వ్యవస్థ లో ప్రతి ఒక్కరి చేరిక ను పటిష్టం చేస్తుందని, ఎందుకంటే అది మధ్యతరగతి ని, ఉద్యోగుల ను, చిన్న వ్యాపారస్తుల ను, సీనియర్ సిటిజన్ లను వారి యొక్క చిన్న పొదుపు మొత్తాల ను ప్రభుత్వ హామీ పత్రాల లోకి నేరు గా, సురక్షితం గా ప్రవేశపెట్టగలుగుతుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ హామీ పత్రాల కు సంబంధించిన చెల్లింపుల కు పూచీకత్తు తో కూడినటువంటి పరిష్కారం సంబంధి ఏర్పాటు ఉంది; అందుకని, దీని ద్వారా చిన్న పెట్టుబడిదారు కు సురక్షత తాలూకు అభయం లభిస్తుంది అని ఆయన అన్నారు.

|

గడచిన ఏడు సంవత్సరాల లో వసూలు కాని రుణాలు (నాన్ ప్రొడక్టివ్ ఎసెట్ స్ - ఎన్ పిఎ స్) ను పారదర్శకమైనటువంటి పద్ధతి లో గుర్తించడం జరిగిందని, రికవరీ పైన, రెజల్యూశన్ పైన శ్రద్ధ వహించడం జరిగిందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల కు మళ్ళీ మూలధనాన్ని ఇవ్వడమైందని, ప్రభుత్వ రంగ బ్యాంకుల తో పాటు ఆర్థిక వ్యవస్థ లో ఒకదాని తరువాత మరొకటి గా సంస్కరణల ను తీసుకురావడమైందని ప్రధాన మంత్రి వివరించారు. బ్యాంకింగ్ రంగాన్ని దృఢతరం గా మలచడం కోసం సహకార బ్యాంకుల ను సైతం భారతీయ రిజర్వ్ బ్యాంకు పరిధి లోకి తీసుకొని రావడం జరిగిందని ఆయన అన్నారు. దీనితో ఈ బ్యాంకుల పరిపాలన కూడా మెరుగు పడుతోందని, డిపాజిటర్ లలో ఈ వ్యవస్థ పట్ల విశ్వాసం అంతకంతకు బలపడుతోందని కూడా ఆయన పేర్కొన్నారు.

దేశ బ్యాంకింగ్ రంగం లో గత కొన్నేళ్ల కాలం లో ఆర్థిక రంగం లోకి చేరికలు మొదలుకొని సాంకేతికత సంబంధి ఏకీకరణ వరకు అనేక ఇతర సంస్కరణల ను తీసుకు రావడమైందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘కోవిడ్ తాలూకు ఈ కష్ట కాలం లో వాటి బలాన్ని మనం గమనించాం. ప్రభుత్వం ఇటీవలి కాలాల్లో తీసుకొన్న పెద్ద పెద్ద నిర్ణయాల తాలూకు ప్రభావాన్ని పెంచడం లో ఆర్ బిఐ నిర్ణయాలు కూడా తోడ్పడ్డాయి’’ అని ఆయన అన్నారు.

|

ఆరు ఏడు సంవత్సరాల కిందట బ్యాంకింగ్, పెన్శన్, ఇంకా బీమా.. ఇవన్నీ భారతదేశం లో ఏ విశిష్ట క్లబ్ తరహాలోనో ఉండేవి అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లోని సామాన్య పౌరులు, పేద కుటుంబాలు, రైతులు, చిన్న వర్తకులు, వ్యాపారులు, మహిళలు, దళితులు, ఆదరణ కు నోచుకోని వర్గాలు, వెనుకబడిన వర్గాల వారు.. వీరు అందరి కోసం ఈ సౌకర్యాలు అందుబాటు లో లేకపోయాయి అని ఆయన అన్నారు. మునుపటి వ్యవస్థ ను ప్రధాన మంత్రి విమర్శిస్తూ, ఈ సదుపాయాల ను పేదల వద్ద కు తీసుకు పోయే బాధ్యత ఎవరిమీద అయితే ఉండిందో వారు దీని విషయం లో ఎన్నడూ శ్రద్ధ తీసుకోలేదన్నారు. దీనికి బదులు గా, మార్పు చోటు చేసుకోకుండా ఉండడం కోసమని రకరకాల సాకుల ను చెప్పడం జరిగేది అని ఆయన అన్నారు. బ్యాంకు శాఖ లేదని, సిబ్బంది లేరని, ఇంటర్ నెట్ లోపించిందని, చైతన్యం కొరవడిందని, ఇంకా ఏవేవో తర్కాల ను చెప్పే వారు అంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.

యుపిఐ చాలా తక్కువ సమయం లో డిజిటల్ లావాదేవీ ల విషయం లో భారతదేశాన్ని ప్రపంచం లో అగ్రగామి దేశం గా మార్చివేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. కేవలం ఏడు సంవత్సరాల లో భారతదేశం డిజిటల్ ట్రాన్ జాక్శన్ స్ పరం గా భారతదేశం 19 రెట్ల వృద్ధి ని నమోదు చేసింది అని ఆయన అన్నారు. ప్రస్తుతం 24 గంటలు, ఏడు రోజులు, 12 నెలల పాటు దేశం లో ఎప్పుడైనా, ఎక్కడైనా కూడా మన బ్యాంకింగ్ వ్యవస్థ పని చేస్తున్నది అని శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.

మనం దేశ పౌరుల అవసరాల ను కేంద్ర స్థానం లో నిలుపుకోవాలి, ఇన్వెస్టర్ ల బరోసా ను నిరంతరం దృఢతరం చేసుకొంటూ ఉండాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఒక సంవేదనశీలమైనటువంటి మరియు ఇన్వెస్టర్-ఫ్రెండ్ లీ డెస్టినేశన్ గా భారతదేశం యొక్క కొత్త గుర్తింపు ను ఆర్ బిఐ పటిష్ట పరుస్తూనే ఉంటుందనే నమ్మకం నాలో ఉంది’’ అని ప్రధాన మంత్రి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

अमृत महोत्सव का ये कालखंड, 21वीं सदी का ये दशक देश के विकास के लिए बहुत अहम है।

ऐसे में RBI की भी भूमिका बहुत बड़ी है।

मुझे पूरा विश्वास है कि टीम RBI, देश की अपेक्षाओं पर खरा उतरेगी: PM @narendramodi

— PMO India (@PMOIndia) November 12, 2021

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption

Media Coverage

In Mann Ki Baat, PM Stresses On Obesity, Urges People To Cut Oil Consumption
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 ఫెబ్రవరి 2025
February 24, 2025

6 Years of PM Kisan Empowering Annadatas for Success

Citizens Appreciate PM Modi’s Effort to Ensure Viksit Bharat Driven by Technology, Innovation and Research