Quote‘‘స్వాతంత్య్రానంతర బారతదేశం లో ఆరోగ్య సంబంధి మౌలికసదుపాయాల కల్పన చాలా కాలం పాటు తగినంత శ్రద్ధ కు నోచుకోలేదు, మరి పౌరులు సరి అయిన చికిత్స కోసం ఎక్కడెక్కడికో పోవలసి వచ్చేది; ఫలితం గా వారిఆరోగ్య స్థితి దిగజారడం, వారు ఆర్థికం గా ఇబ్బందుల పాలు అవడం జరిగేది’’
Quote‘‘కేంద్రం లోని ప్రభుత్వం తో పాటు రాష్ట్రం లోని సర్కారు కూడా పేదలు, పీడితులు, అణచివేత కు గురైన వర్గాలు, వెనుకబడిన వర్గాల తో పాటు మధ్యతరగతి ప్రజల బాధ ను అర్థం చేసుకొంటోంది’’
Quote‘‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్మిశన్ ద్వారా చికిత్స మొదలుకొని క్రిటికల్ రీసర్చ్ వరకు దేశం లోని ప్రతి మూలన సేవలతాలూకు ఒక పూర్తి వ్యవస్థ ను నిర్మించడం జరుగుతుంది’’
Quote‘‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్మిశన్ అనేది ఆరోగ్యం తో పాటు ఆత్మనిర్భరతతాలూకు ఒక మాధ్యమం గా ఉంది’’
Quote‘‘కాశీ యొక్క మనస్సు, కాశీ యొక్క మేధస్సు అదే విధం గా ఉన్నాయి. అయితే, కాశీ యొక్క దేహాన్ని మెరుగు పరచడం కోసం చిత్తశుద్ధి తో కూడిన ప్రయత్నాల నుచేపట్టడం జరుగుతోంది’’
Quote‘‘ప్రస్తుతం బిహెచ్ యు లో సాంకేతిక విజ్ఞానం మొదలుకొని ఆరోగ్యరంగం వరకు ఇదివరకు లేనటువంటి సదుపాయాల ను కల్పించడం జరుగుతోంది. దేశం అంతటి నుంచి యువ మిత్రులు ఇక్కడ కు చదువుకోవడం కోసం వస్తున్నారు.’’

‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆయన సుమారు 5200 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పథకాల ను కూడా వారాణసీ లో ప్రారంభించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి లతో పాటు, కేంద్ర మంత్రులు డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ, డాక్టర్ మహేంద్రనాథ్ పాండే, రాష్ట్ర మంత్రులు మరియు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

|

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కరోనా మహమ్మారి కి వ్యతిరేకం గా దేశం జరుపుతూ ఉన్న పోరాటం లో 100 కోట్ల వ్యాక్సీన్ డోజుల తాలూకు ఒక ప్రధానమైన మైలురాయి ని చేరుకోవడం జరిగింది అని పేర్కొన్నారు. ‘‘బాబా విశ్వనాథ్ ఆశీస్సుల తోను, గంగా మాత అఖండ వైభవం ద్వారాను, కాశీ ప్రజల దృఢ విశ్వాసం ద్వారాను అందరికీ టీకామందు ను ఉచితం గా ఇప్పించే ఉద్యమం ఫలప్రదం గా పురోగమిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

స్వాతంత్య్రానంతర భారతదేశం లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన దీర్ఘ కాలం పాటు అవసరమైనంత శ్రద్ధ కు నోచుకోలేదు, పౌరులు సరి అయిన చికిత్స ను అందుకోవడం కోసం దూర సుదూర ప్రాంతాల కు పరుగులు పెట్టవలసి వచ్చింది, తత్ఫలితం గా వారి ఆరోగ్య స్థితి విషమం కావడంతో పాటు వారు ఆర్థికం గా ఇక్కట్టుల ను ఎదుర్కోవలసి వచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. ఇది మధ్యతరగతి, పేద ప్రజానీకం మనస్సుల లో వైద్య చికిత్స అంటే ఒక ఎడతెగని బాధ కు దారి తీసింది. దేశం లో చాలా కాలం పాటు కొనసాగినటువంటి ప్రభుత్వాలు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క సర్వతోముఖ అభివృద్ధి ని గురించి పట్టించుకోవడానికి బదులుగా దానిని ఎలాంటి సదుపాయాల కు నోచుకోకుండానే అట్టిపెట్టారు అని ప్రధాన మంత్రి అన్నారు.

|

ఈ లోటును తీర్చాలన్నదే ‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్’ ఉద్దేశ్యం అని ప్రధాన మంత్రి అన్నారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల లో గ్రామం మొదలుకొని బ్లాకు వరకు, అటుపైన జిల్లా మొదలుకొని ప్రాంతీయ స్థాయి వరకు, అలాగే జాతీయ స్థాయి వరకు కూడా ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ సంబంధి నెట్ వర్క్ ను పటిష్టం చేయాలి అన్నది లక్ష్యం గా ఉంది అని ఆయన అన్నారు. కొత్త మిశన్ లో భాగం గా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, దేశం లో ఆరోగ్య రంగం లో నెలకొన్న వేరు వేరు అంతరాల ను పూరించడం కోసం ‘ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్’ లో మూడు ప్రధానమైనటువంటి దృష్టి కోణాలు ఉన్నట్లు వివరించారు. ఈ దృష్టి కోణాల లో ఒకటోది - రోగ నిర్ధారణ సేవల తో పాటు, చికిత్స కు సంబంధించిన విస్తృతమైన సదుపాయాల ను కల్పించడానికి ఉద్దేశించింది. దీనిలో భాగం గా పల్లెల లోను, నగరాల లోను హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లను తెరవడం జరుగుతుంది. అక్కడ రోగాల ను ఆరంభిక దశ లోనే గుర్తించడానికి కావలసిన సదుపాయాలు ఉంటాయి. ఉచిత వైద్య సలహా సంప్రదింపులు, ఉచిత పరీక్షలు, ఉచిత మందులు వంటి సదుపాయాలు ఈ కేంద్రాల లో లభిస్తాయి. గంభీరమైన అస్వస్థత కు సంబంధించి 35 వేల సంఖ్య లో కొత్త క్రిటికల్ కేర్ బెడ్స్ ను 600 జిల్లాల లో సమకూర్చడం జరుగుతోంది. మరో 125 జిల్లాల లో రెఫరల్ ఫెసిలిటీస్ ను అందించడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు.

|

ఈ పథకం లోని రెండో దృష్టి కోణం విషయానికి వస్తే- అది వ్యాధుల నిర్ధారణ కోసం టెస్టింగ్ నెట్ వర్క్ కు సంబంధించింది అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ మిశన్ లో భాగం గా వ్యాధుల తాలూకు నిర్ధారణ కు, పర్యవేక్షణ కు అవసరం అయ్యే మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం జరుగుతుంది అని ఆయన అన్నారు. దేశం లో 730 జిల్లాల లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్థ్ ల్యాబ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 3 వేల బ్లాకుల లో బ్లాక్ పబ్లిక్ హెల్థ్ యూనిట్ లు కొలువుదీరుతాయి. దీనికి అదనం గా 5 రీజనల్ నేశనల్ సెంటర్స్ ఫార్ డిసీజ్ కంట్రోల్, 20 మెట్రోపాలిటన్ యూనిట్ లు.. వీటికి తోడు 15 బిఎస్ఎల్ ల్యాబ్స్ కూడా ఈ నెట్ వర్క్ ను పటిష్ట పరుస్తాయి అని ప్రధాన మంత్రి వెల్లడించారు.

|

మూడో అంశం గురించి ప్రధాన మంత్రి చెప్తూ, మహమ్మారుల ను గురించి అధ్యయనం చేసే ప్రస్తుత పరిశోధన సంస్థల ను విస్తరించడం అన్నారు. ఇప్పటికే పని చేస్తున్న 80 వైరల్ డాయగ్నోస్టిక్ ఎండ్ రిసర్చ్ ల్యాబ్స్ ను బలోపేతం చేయడం జరుగుతుంది, 15 బాయో సేఫ్ టీ ల్యాబ్స్ ను పని చేయించడం మొదలవుతుంది. అంతేకాకుండా, కొత్తగా 4 నేశనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ వైరాలజీ, ఒక నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఫార్ వన్ హెల్థ్ ను కూడా నెలకొల్పడం జరుగుతుంది. డబ్ల్యుహెచ్ఒ తాలూకు దక్షిణ ఆసియా ప్రాంత పరిశోధన వేదిక యొక్క సమర్ధన కూడా ఈ నెట్ వర్క్ కు ఉంటుంది. అంటే ‘‘పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ద్వారా దేశం లోని ప్రతి మూలన చికిత్స మొదలుకొని క్రిటికల్ రిసర్చ్ వరకు వేరు వేరు సేవల తాలూకు యావత్తు ఇకో సిస్టమ్ ను నిర్మించడం జరుగుతుందన్న మాట’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

ఈ చర్య ల ఫలితం గా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. పిఎమ్ ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ అనేది ఆరోగ్యాని కి తోడు ఆత్మనిర్భరత కు కూడా ఒక మాధ్యమం గా ఉందని ఆయన అన్నారు. ‘‘ఒక సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణ లక్ష్యాన్ని సాధించడానికి జరుగుతున్న ప్రయాసల లో ఇది ఒక భాగం. దీనికి అర్థం ఆరోగ్య సంరక్షణ అనేది తక్కువ ఖర్చు తో కూడుకొని, అందరికీ అందుబాటులో ఉండాలనేదే’’ అని ఆయన వివరించారు. సంపూర్ణమైన ఆరోగ్య సంరక్షణ అనేది ఆరోగ్యం తో పాటు, వెల్ నెస్ పైన కూడా దృష్టి ని సారిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ్ భారత్ అభియాన్, జల్ జీవన్ మిశన్, ఉజ్జ్వల, పోషణ్ అభియాన్, మిశన్ ఇంద్రధనుష్ లు కోట్ల కొద్దీ ప్రజల ను వ్యాధి బారి నుంచి కాపాడాయి. రెండు కోట్ల కు పైగా పేదలు ఆయుష్మాన్ భారత్ యోజన లో భాగం గా ఉచిత చికిత్స ను అందుకొన్నారు. అంతేకాక ఆరోగ్యాని కి సంబంధించిన అనేక సమస్యల ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిశన్ ద్వారా పరిష్కరించడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు.

|

పేదలు, పీడితులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, మధ్యతరగతి ప్రజల బాధ ను అర్థం చేసుకొనేటటువంటి ప్రభుత్వాలు ప్రస్తుతం ఇటు రాష్ట్రం లో, అటు కేంద్రం లో ఉన్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘దేశం లో ఆరోగ్య సదుపాయాల ను మెరుగు పరచడం కోసం మేం రాత్రింబగళ్లు కృషి చేస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఎంతటి వేగం తో కొత్త వైద్య కళాశాల లను తెరవడం జరుగుతోందో, ఆ పరిణామం రాష్ట్రం లోని వైద్య సీట్ల సంఖ్య ను మరియు వైద్యుల ను గొప్ప గా ప్రభావితం చేస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మరిన్ని సీట్లు లభ్యమయ్యే నేపథ్యం లో ఇక పేద తల్లితండ్రుల సంతానం కూడా డాక్టర్ లు అయ్యే కల ను కనడం తో పాటు ఆ కల ను నెరవేర్చుకోగలుగుతారు కూడా అని ఆయన అన్నారు.

|

పవిత్ర నగరం అయినటువంటి కాశీ యొక్క గత కాలపు దుస్థితి ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నగరం లోని మౌలిక సదుపాయాల తాలూకు దయనీయమైనటువంటి స్థితి లో మార్పు రాదు అని ప్రజలు దాదాపు గా ఒక అభిప్రాయాని కి వచ్చేశారు అని ప్రధాన మంత్రి అన్నారు. పరిస్థితులు మారాయి, మరి ఈ రోజు న కాశీ యొక్క హృదయం అదే విధం గా ఉంది, కాశీ యొక్క మేధస్సు అదే విధం గా ఉంది. అయితే దీని దేహాన్ని మెరుగు పరచడం కోసం హృద‌య‌పూర్వకం గా ప్రయాస లు జరుగుతూ ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘గడచిన 7 సంవత్సరాల లో వారాణసీ లో చేసిన పనులు గడచిన అనేక దశాబ్దుల లో జరుగలేదు’’ అని ఆయన తెలిపారు.

ప్రపంచం లో ఉత్కృష్టత దిశ లో బనారస్ హింద్ యూనివర్శిటీ (బిహెచ్ యు) యొక్క పురోగతి ని గడచిన కొన్నేళ్ళ లో కాశీ సాధించిన కీలకమైన అంశాల లో ఒకటి గా ప్రధాన మంత్రి ప్రత్యేకం గా ప్రస్తావించారు. ‘‘బిహెచ్ యు లో ప్రస్తుతం సాంకేతిక విజ్ఞానం మొదలుకొని ఆరోగ్యం వరకు చూసుకొన్నట్లయితే నెలకొల్పిన సదుపాయాలు ఇంతకుముందు ఎరుగనివి అంటూ, దేశం లో అనేక ప్రాంతాల నుంచి యువ మిత్రులు చదువుకోవడం కోసం ఇక్కడకు తరలి వస్తున్నారు’’ అని ఆయన అన్నారు.

|

వారాణసీ లో గత 5 సంవత్సరాల లో ఖాదీ ఇంకా ఇతర కుటీర పరిశ్రమ ఉత్పాదనల విక్రయాల లో 90 శాతం వృద్ధి, అలాగే ఉత్పత్తి లో 60 శాతం వృద్ధి చోటు చేసుకోవడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, స్థానిక ఉత్పాదనల ను ప్రోత్సహించవలసింది గా దేశ ప్రజల కు మరో సారి ఉద్బోధించారు. ‘స్థానిక వస్తువుల కొనుగోలు’ (‘వోకల్ ఫార్ లోకల్’) అనే వాదన ను సమర్ధించండి అని ఆయన చెప్పారు. ఇక్కడ ‘లోకల్’ అంటే దీపపు ప్రమిదల వంటి కొన్ని ఉత్పత్తులే అని కాదు అర్థం, దేశ ప్రజలు కఠోర శ్రమ తో రూపొందించే ఏ ఉత్పత్తి ని అయినా సరే పండుగ ల కాలం లో దేశ ప్రజలు ప్రోత్సహించవలసిన మరియు ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

  • krishangopal sharma Bjp January 17, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 17, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 17, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷
  • naveen kumar agrawal January 13, 2024

    modiji mera ayushman card nahi ban pa raha hai, mujhe ilaz mai bahut problem ho rahi hai.
  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
  • Mahendra singh Solanki Loksabha Sansad Dewas Shajapur mp December 13, 2023

    Namo namo namo namo namo namo
  • Ravi kant Sharma September 11, 2022

    arrest bihar chief minister Nitish Kumar then India achieve prosperity and peace
  • R N Singh BJP June 16, 2022

    jai hind
  • ranjeet kumar May 01, 2022

    Jay sri ram🙏🙏🙏
  • SHRI NIVAS MISHRA January 19, 2022

    अगस्त 2013 में देश का जो स्वर्ण भंडार 557 टन था उसमें मोदी सरकार ने 148 टन की वृद्धि की है। 30 जून 2021 को देश का स्वर्ण भंडार 705 टन हो चुका था।*
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Global aerospace firms turn to India amid Western supply chain crisis

Media Coverage

Global aerospace firms turn to India amid Western supply chain crisis
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Former UK PM, Mr. Rishi Sunak and his family meets Prime Minister, Shri Narendra Modi
February 18, 2025

Former UK PM, Mr. Rishi Sunak and his family meets Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

Both dignitaries had a wonderful conversation on many subjects.

Shri Modi said that Mr. Sunak is a great friend of India and is passionate about even stronger India-UK ties.

The Prime Minister posted on X;

“It was a delight to meet former UK PM, Mr. Rishi Sunak and his family! We had a wonderful conversation on many subjects.

Mr. Sunak is a great friend of India and is passionate about even stronger India-UK ties.

@RishiSunak @SmtSudhaMurty”