India is moving forward with the goal of reaching connectivity to every village in the country: PM
21st century India, 21st century Bihar, now moving ahead leaving behind all old shortcomings: PM
New farm bills passed are "historic and necessary" for the country to move forward: PM Modi

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్సు మాధ్య‌మం ద్వారా బిహార్ లో14,000 కోట్ల రూపాయ‌ల విలువ చేసే తొమ్మిది జాతీయ ర‌హ‌దారి ప‌థ‌కాల కు శంకుస్థాప‌న చేశారు.  అలాగే, రాష్ట్రం లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ద్వారా ఇంట‌ర్ నెట్ సేవ‌ల ను అందించ‌డానికి ఒక ప్రాజెక్టు ను కూడా ఆయ‌న ప్రారంభించారు.

ఈ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ హైవే ప్రాజెక్టులు బిహార్ లో క‌నెక్టివిటీ ని మెరుగు ప‌రుస్తాయ‌న్నారు.  ఈ హైవే ప్రాజెక్టుల లో.. మూడు పెద్ద వంతెన‌ల నిర్మాణం, హైవేల ను నాలుగు దోవ‌లు గా, 6 దోవ‌లుగా ఉన్న‌తీక‌రించే ప‌నులు భాగం గా ఉన్నాయి.  బిహార్ లోని న‌దుల‌న్నింటి పైన 21వ శ‌తాబ్ద ప్ర‌మాణాల‌ కు అనుగుణంగా ఉండే వంతెన‌లు ఏర్పాటుకావ‌డంతో పాటు, అన్ని ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల ను విస్త‌రించ‌డం, ప‌టిష్ట ప‌ర‌చ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

ఈ రోజు బిహార్ కు మాత్ర‌మే గాక‌, యావ‌త్తు దేశానికి చ‌రిత్రాత్మ‌క‌మైన రోజ‌ని, దీనికి కార‌ణం ఆ రాష్ట్రాల‌ లోని గ్రామాల‌ ను ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ కు ప‌ట్టుగొమ్మ‌గా తీర్చిదిద్దేందుకు ప్ర‌ధానమైన నిర్ణ‌యాల‌ ను ప్ర‌భుత్వం తీసుకోవ‌డ‌మేన‌ని, మ‌రి ఈ కార్యం నేడు బిహార్ లో మొద‌లవుతోంద‌ని ఆయ‌న అన్నారు.  ఈ ప్రాజెక్టు లో భాగం గా ఒక వెయ్యి రోజుల లో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ ద్వా‌రా 6 ల‌క్ష‌ల గ్రామాల‌ కు ఇంట‌ర్ నెట్ సేవ‌ల‌ను అందించ‌డం జ‌రుగుతుందని ఆయ‌న తెలిపారు.  వీటిలో బిహార్ లో 45,945 గ్రామాలు కూడా ఉన్నాయ‌ని చెప్పారు.  గ్రామీణ ప్రాంతాల లోని ఇంట‌ర్ నెట్ వినియోగ‌దారుల సంఖ్య ప‌ట్ట‌ణ ప్రాంతాల వినియోగ‌దారుల సంఖ్య కంటే ఎక్కువ‌గా ఉంటుంద‌నేది కొన్ని సంవ‌త్స‌రాల క్రితం ఊహ‌కు అంద‌ని అంశ‌మ‌ని ఆయ‌న అన్నారు.

డిజిట‌ల్ లావాదేవీల ప‌రంగా చూసిన‌ప్పుడు ప్ర‌పంచం లో అగ్ర‌గామి దేశాల లో భార‌త‌దేశం ఒక దేశం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ఈ సంవ‌త్స‌రం ఒక్క‌ ఆగ‌స్టు నెల‌నే తీసుకొంటే యుపిఐ ద్వారా సుమారు మూడు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువైన లావాదేవీలు జ‌రిగాయ‌న్నారు.  ఇంట‌ర్ నెట్ వినియోగం పెర‌గ‌డంతో ప్ర‌స్తుతం దేశం లోని ప‌ల్లెల‌ లో నాణ్య‌మైన అధిక వేగం తో కూడిన ఇంట‌ర్ నెట్ అవ‌స‌ర‌ప‌డుతోంద‌ని ఆయ‌న చెప్పారు.  

ప్ర‌భుత్వం కృషి తో ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ ఇప్ప‌టికే ఇంచుమించు ఒక‌టిన్న‌ర ల‌క్ష‌ల గ్రామ పంచాయ‌తీల‌కు, అలాగే 3 ల‌క్ష‌ల‌ కు పైగా కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల‌ కు చేరుకొంద‌ని ఆయ‌న అన్నారు.

వేగ‌వంత‌మైన క‌నెక్టివిటీ ద్వారా ద‌క్కే ప్ర‌యోజ‌నాల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి వివ‌రిస్తూ, దీనివ‌ల్ల విద్యార్థుల‌ కు అత్యుత్త‌మ పాఠ్య సామ‌గ్రి అందుబాటులోకి రావ‌డ‌మే కాకుండా, టెలి మెడిసిన్ సేవ‌లు ల‌భిస్తాయ‌ని, రైతుల కు వాతావ‌ర‌ణ స్థితిగ‌తుల కు సంబంధించిన వాస్త‌వ కాల స‌మాచారం, విత్త‌నాల‌ కు సంబంధించిన స‌మాచారం, నూత‌న సాంకేతిక ప‌ద్ధ‌తులు, దేశ‌వ్యాప్త బ‌జారులు అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.  రైతులు వారి ఉత్ప‌త్తుల ను దేశమంత‌టా, అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుల‌భం గా రవాణా చేయ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని ఆయ‌న అన్నారు.

దేశం లో గ్రామీణ ప్రాంతాల కు ప‌ట్ట‌ణాల లో ఉండే స‌దుపాయాల ను అందించాల‌నేది ప్ర‌భుత్వం ధ్యేయం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

ఇంత‌కు ముందు మౌలిక స‌దుపాయాల సంబంధిత ప్ర‌ణాళిక ర‌చ‌న ఒక క్ర‌మం అంటూ లేకుండా ఉండేదని, మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి శ్రీ అట‌ల్ బిహారీ వాజ్ పేయీ ప్ర‌ధాని గా ఉన్న‌ప్పుడే స‌రైన వేగాన్ని అందించ‌డం జ‌రిగింద‌ని శ్రీ మోదీ చెప్పారు. వాజ్ పేయీ గారు రాజ‌కీయాల కంటే మౌలిక స‌దుపాయాల‌ కు పెద్ద పీట వేశార‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  

ప్ర‌తి ఒక్క ర‌వాణా వ్య‌వ‌స్థ‌ ను మ‌రొక ర‌వాణా వ్య‌వ‌స్థ తో జ‌త ప‌ర‌చే ఒక బ‌హుళ ర‌వాణా వ్య‌వ‌స్థ‌ల నెట్ వ‌ర్క్ ను అభివృద్ధి ప‌ర‌చాల‌నేది ప్ర‌స్తుత విధానం గా ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల ప‌నులు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థాయి గానీ, వాటి వేగం గానీ మునుపెన్న‌డూ ఎరుగ‌ని విధంగా సాగుతున్నాయ‌ని చెప్పారు.  ప్ర‌స్తుతం హైవే లను 2014 కంటె పూర్వం ఉన్న వేగం క‌న్నా, రెండింతల వేగం తో నిర్మించ‌డం జ‌రుగుతోంద‌న్నారు.  2014 కంటె పూర్వ‌పు కాలం తో పోలిస్తే, హైవేల నిర్మాణ వ్య‌యం లో అయిదింత‌ల పెరుగుద‌ల ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

రాబోయే నాలుగయిదేళ్ళలో 110 ల‌క్ష‌ల కోట్ల‌ కు పైగా మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న పై ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని ఆయ‌న గుర్తు చేశారు.  దీనిలో భాగం గా 19 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా విలువైన ప్రాజెక్టుల ను ఒక్క హైవేల అభివృద్ధికే కేటాయించడ‌మైంద‌ని వివ‌రించారు.

రోడ్లు, క‌నెక్టివిటీ కి సంబంధించిన మౌలిక స‌దుపాయాల ను విస్త‌రించ‌డం కోసం జ‌రుగుతున్న ఈ ప్ర‌య‌త్నాల ద్వారా బిహార్ కూడా లాభ‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  2015 లో ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి ప్యాకేజీ లో భాగం గా 3,000 కిలో మీట‌ర్ల‌ కు పైగా జాతీయ ర‌హ‌దారుల ను ప్ర‌తిపాదించ‌డ‌మైంద‌న్నారు.  దీనికి అద‌నంగా భార‌త్ మాల ప్రాజెక్టు లో భాగం గా ఆరున్న‌ర కిలో మీట‌ర్ల జాతీయ ర‌హ‌దారిని నిర్మించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు.  ప్ర‌స్తుతం బిహార్ లో నేష‌న‌ల్ హైవే గ్రిడ్ కు చెందిన ప‌నులు జోరుగా సాగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.  తూర్పు బిహార్ ను, ప‌శ్చిమ బిహార్ ను నాలుగు దోవ‌ల‌తో క‌లిపేందుకు 5 ప్రాజెక్టులు నిర్మాణం లో ఉన్నాయ‌ని, ఉత్త‌ర భార‌త‌దేశాన్ని, ద‌క్షిణ భార‌త‌దేశం తో క‌లిపేందుకు 6 ప్రాజెక్టులు నిర్మాణం లో ఉన్నాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

బిహార్ లో క‌నెక్టివిటీ కి పెద్ద పెద్ద న‌దుల కార‌ణంగా అతి పెద్ద అడ్డంకి ఎదుర‌వుతోంద‌ని ఆయ‌న అన్నారు.  దీనిని దృష్టి లో పెట్టుకొని పిఎం ప్యాకేజీ ని ప్ర‌క‌టించిన‌ప్పుడు వంతెన‌ల నిర్మాణం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.  ప్ర‌ధాన మంత్రి ప్యాకేజీ లో భాగం గా గంగా న‌ది మీద 17 వంతెన‌ల‌ ను నిర్మించ‌డం జ‌రుగుతోంద‌ని, వాటిలో చాలా వ‌ర‌కు పూర్తి అయ్యాయ‌ని చెప్పారు.  అదే విధంగా కోసీ న‌ది మీద గండక్ న‌ది మీద వంతెన‌ల నిర్మాణ ప‌నులు సాగుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

ప‌ట్నా రింగు రోడ్డును, ప‌ట్నా లో మ‌హాత్మ గాంధీ సేతు కు స‌మాంత‌రం గా వంతెన, భాగ‌ల్ పుర్ లో విక్ర‌మ్ శిల సేతు నిర్మాణాలు క‌నెక్టివిటీని వేగంవంతం చేస్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

పార్ల‌మెంటు నిన్న‌టి రోజున ఆమోదించిన వ్య‌వ‌సాయ బిల్లుల‌ ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, రైతుల కు ర‌క‌ర‌కాల బంధ‌నాల నుంచి స్వేచ్ఛ ను ప్ర‌సాదించ‌డానికి ఈ సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం అయ్యాయ‌న్నారు.  ఈ చ‌రిత్రాత్మ‌క చ‌ట్టాలు రైతుల కు కొత్త హ‌క్కుల ను ఇస్తాయ‌ని, వారి ఉత్ప‌త్తిని రైతు స్వ‌యం గా నిర్ధారించుకొనే ష‌ర‌తుల పై, అలాగే రైతు నిర్ణ‌యించిన ధ‌ర‌కు ఎవ‌రికైనా, ఎక్క‌డైనా విక్ర‌యించ‌డం పై ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌బోవ‌ని ఆయ‌న వివ‌రించారు.

ఇదివ‌ర‌క‌టి వ్య‌వ‌స్థ స్వార్థ‌ప‌ర శ‌క్తుల ను పెంచి పోషించింద‌ని, ఆ శ‌క్తులు అస‌హాయ రైతుల ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకొని ల‌బ్ధి ని పొందాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

కొత్త సంస్క‌ర‌ణ‌ల లో భాగం గా రైతుకు వ్య‌వ‌సాయ బ‌జారుల (కృషి మండీస్‌)కు తోడు అనేక ప్ర‌త్యామ్నాయాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని శ్రీ మోదీ చెప్పారు.  ఇక ఒక రైతు త‌న ఉత్ప‌త్తి ని ఎక్కువ లాభం ద‌క్కే ప్రాంతం లో విక్ర‌యించుకోవ‌చ్చ‌న్నారు.

ఒక రాష్ట్రం లో బంగాళ‌దుంప రైతుల ఉదాహ‌ర‌ణ ను అలాగే, మ‌ధ్య ప్ర‌దేశ్ లో, రాజ‌స్థాన్ లో నూనెగింజ‌లు పండించే రైతుల తాలూకు ఉదాహ‌ర‌ణ‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, సంస్క‌రించిన వ్య‌వ‌స్థ లో భాగం గా ఈ రైతులు 15 నుంచి 30 శాతం కంటె అధిక లాభాన్ని చేజిక్కించుకున్నార‌న్నారు.  ఈ రాష్ట్రాల లో నూనె మిల్లుల య‌జ‌మానులు నూనె గింజ‌ల‌ ను రైతు వ‌ద్ద నుంచే నేరుగా కొనుగోలు చేశార‌ని ఆయ‌న అన్నారు.  కాయ‌ధాన్యాలు మిగులుగా ఉన్న ప‌శ్చిమ బెంగాల్, ఛత్తీగ‌ఢ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల‌ లో రైతులు కింద‌టి సంవ‌త్స‌రం తో పోలిస్తే 15 నుంచి 25 శాతం అధిక ధ‌ర‌ల ను అందుకున్నార‌ని, దీనికి కార‌ణం కాయ‌ధాన్యాల మిల్లులు సైతం రైతుల నుంచే నేరుగా కొనుగోళ్ళు జ‌ర‌ప‌డ‌మేన‌ని ఆయ‌న అన్నారు.

వ్య‌వ‌సాయ బ‌జారుల ను మూసివేయ‌డం జ‌ర‌గ‌ద‌ని, అవి ఇంత‌కుముందు ప‌నిచేసే విధం గానే వాటి కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తాయని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  గ‌త ఆరేళ్ళుగా వ్య‌వ‌సాయ బ‌జారుల ఆధునికీక‌ర‌ణ కోసం, వాటి కంప్యూట‌రీక‌ర‌ణ కోసం పాటుప‌డింది ఎన్‌డిఎ ప్ర‌భుత్వ‌మేన‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

ఎంఎస్‌పి విధానం ఇంత‌కు ముందులాగానే కొన‌సాగుతుందని కూడా దేశం లో ప్ర‌తి ఒక్క రైతుకు శ్రీ న‌రేంద్ర మోదీ హామీ ని ఇచ్చారు.  రైతుల ను దోచుకొంటూ వ‌చ్చిన అవే స్వార్ధ‌ప‌రశ‌క్తులు క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర విష‌యం లో స్వామినాథ‌న్ క‌మిటీ సిఫార్సుల‌ ను ఏళ్ళ త‌ర‌బ‌డి అట‌కెక్కించాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  ప్ర‌భుత్వం ప్ర‌తి సీజ‌ను కు ఎప్ప‌టిలాగానే క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌ ను ప్ర‌క‌టిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.

రైతుల స్థితి ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావిస్తూ, మ‌న‌కు ఉన్న రైతుల‌ లో 85 శాతం మంది రైతులు అయితే చిన్న రైతులు గానో, లేదా స‌న్న‌కారు రైతులు గానో ఉన్నార‌ని, ఈ కార‌ణం గా వారికి ఉత్పాద‌కాల ఖ‌ర్చులు పెరుగుతాయ‌ని, అంతేగాక‌, వారు త‌క్కువ ఉత్ప‌త్తి వ‌ల్ల లాభాల‌ ను సంపాదించ లేకపోతున్నార‌న్నారు.  రైతులు గ‌నుక ఒక యూనియ‌న్ ను ఏర్పాటు చేసుకొంటే, అప్పుడు వారు మెరుగైన ఉత్పాద‌క వ్య‌యాల ను, అదే విధంగా ఉత్త‌మ ప్ర‌తిఫ‌లాల‌ ను అందుకోవ‌చ్చ‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  అలాగ‌యితే వారు కొనుగోలుదారుల తో ఉత్త‌మ‌మైన కాంట్రాక్టుల‌ ను కుదుర్చుకోవ‌డానికి వీలుంటుంద‌న్నారు.  ఈ సంస్క‌ర‌ణ‌లు వ్య‌వ‌సాయం లో పెట్టుబ‌డిని పెంచుతాయ‌ని, రైతులు ఆధునిక సాంకేతిక విజ్ఞాన ఫ‌లాల‌ ను అందుకోగ‌లుగుతార‌ని, రైతుల ఉత్ప‌త్తులు మ‌రింత సుల‌భంగా అంత‌ర్జాతీయ మార్కెట్ ను చేరుకోగ‌లుగుతాయ‌ని ఆయ‌న అన్నారు.

బిహార్ లో ఇటీవ‌ల అయిదు ఫార్మ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్గ‌నైజేష‌న్ (ఎఫ్‌పిఒ లు) లు చాలా ప్ర‌సిద్ధి చెందిన బియ్యం వ్యాపారం కంపెనీ తో ఏ విధంగా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌దీ శ్రీ మోదీ గుర్తుకు తెచ్చారు.  ఈ ఒప్పందం లో భాగం గా 4 వేల ట‌న్నుల ధాన్యాన్ని ఎఫ్‌పిఒ ల నుంచి సేక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.  ఇదే విధంగా పాడి రైతులు, పాల ఉత్ప‌త్తిదారులు కూడా సంస్క‌ర‌ణ‌ల నుంచి ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.

నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల చ‌ట్టం లో కూడా సంస్క‌ర‌ణ‌ల ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.  ఈ చ‌ట్టం లో కొన్ని నిబంధ‌న‌లు రైతుల స్వేచ్ఛ కు అడ్డు గోడ‌గా నిలిచాయ‌ని ఆయ‌న అన్నారు.  కాయ‌ధాన్యాలు, నూనె గింజ‌లు, బంగాళా దుంప‌లు, ఉల్లిపాయ‌లు మొద‌లైన వాటిని చ‌ట్టం యొక్క ఆంక్ష‌ల నుంచి తొల‌గించ‌డం జ‌రిగింద‌ని శ్రీ మోదీ చెప్పారు.  ప్ర‌స్తుతం దేశ రైతులు వారి ఉత్ప‌త్తుల ను పెద్ద ఎత్తున శీత‌ల గిడ్డంగి లో సుల‌భంగా నిల్వ చేసుకోవ‌చ్చ‌ని ఆయ‌న చెప్పారు.  మ‌న దేశం లో నిల్వ స‌దుపాయాల‌ కు సంబంధించిన చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల ను తొల‌గిస్తే గ‌నుక, శీత‌ల గిడ్డంగుల నెట్ వ‌ర్క్ కూడా మ‌రింత విస్తృతం కావ‌డంతోపాటు, అభివృద్ధి చెందుతుంద‌ని ఆయ‌న అన్నారు.

వ్య‌వ‌సాయం లో చ‌రిత్రాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల పై రైతుల ను త‌ప్పుదారి ప‌ట్టించ‌డానికి కొన్ని స్వార్ధ‌ప‌ర శ‌క్తులు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.  గ‌త అయిదేళ్ళ‌లో ప్ర‌భుత్వం సేక‌రించిన కాయ‌ధాన్యాలు, నూనె గింజ‌లు 2014 కంటె ముందు అయిదేళ్ళ కాలం లో సేక‌రించిన వాటి కంటె దాదాపు 24 రెట్లు గా ఉన్నాయ‌ని  ఆయ‌న అన్నారు.  

ఈ ఏడాది క‌రోనా కాలం లో ర‌బీ సీజ‌న్  లో రైతుల వ‌ద్ద నుంచి గోధుమ‌లు రికార్డు స్థాయి లో కొనుగోలు చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.  ఈ సంవ‌త్స‌రం లో ర‌బీ సీజ‌న్ సంద‌ర్భం గా రైతుల కు గోధుమ‌, ధాన్యం, కాయ‌ధాన్యాలు, నూనెగింజ‌ల సేక‌ర‌ణ కు గాను క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర గా 1 ల‌క్షా 13 వేల కోట్ల రూపాయ‌లు ఇవ్వ‌డం జ‌రిగింది.

ఈ సొమ్ము సైతం క్రితం సంవ‌త్స‌రం కంటె 30 శాతానికి పైగా అధికం గా ఉంది.  అంటే క‌రోనా కాలం లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున రికార్డు స్థాయి లో కొనుగోళ్ళు జ‌ర‌గ‌డం తో పాటు, రైతుల‌ కు రికార్డు స్థాయి లో చెల్లింపులు కూడా జ‌రిగాయన్న మాట‌.  దేశం లోని రైతుల కోసం ఆధునిక‌మైన ఆలోచ‌న‌ల తో కూడిన కొత్త వ్య‌వ‌స్థ‌ల ను రూపొందించ‌డం 21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశ బాధ్య‌త గా ఉంది.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi