అహ్మదాబాద్ లోని అసర్వా సివిల్ ఆస్పత్రిలో రూ.1275 కోట్ల విలువ గల ఆరోగ్య వసతులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు.
కార్యక్రమ స్థలానికి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆరోగ్య మౌలిక వసతుల ప్రాజెక్టులన్నింటినీ సందర్శించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి వేదిక వద్దకు వచ్చారు. అక్కడ ఆయనకు సత్కారం చేశారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఫలకాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. (i) మంజుశ్రీ మిల్ క్యాంపస్ లో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్ర ఇన్ స్టిట్యూట్(ఐకెఆర్ డిసి); (ii) అసర్వాలో సివిల్ ఆస్పత్రి క్యాంపస్ లో గుజరాత్ కేన్సర్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆస్పత్రి భవనం; (iii) యుఎన్ మెహతా ఆస్పత్రిలో హాస్టల్ భవనం; (iv) ఒక రాష్ట్రం, ఒక డయాల్సిస్ కార్యక్రమం కింద గుజరాత్ డయాల్సిస్ కార్యక్రమం విస్తరణ; (v) గుజరాత్ రాష్ట్ర కెమో ప్రోగ్రామ్. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. (i) గోధ్రాలో కొత్త వైద్య కళాశాల; (ii) సోలాలోని జిఎంఇఆర్ఎస్ మెడికల్ కాలేజిలో కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి; (iii) అసర్వా సివిల్ ఆస్పత్రిలో బాలికల వైద్య కళాశాల; (iv) అసర్వాలో రెన్ బసేరా సివిల్ ఆస్పత్రి; (v) భిలోడాలో 125 పడకల జిల్లా ఆస్పత్రి; (vi) అంజర్ లో 100 పడకల సబ్ డిస్ర్టిక్ట్ ఆస్పత్రి.
మోర్వా హదాఫ్ లోని సిహెచ్ సి,, జునాగఢ్ లోని జిఎంఎల్ఆర్ఎస్, వాఘాయ్ లోని సిహెచ్ సిల్లో రోగులతో ప్రధానమంత్రి సంభాషించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ గుజరాత్ ఆరోగ్య రంగానికి ఇది అద్భుతమైన రోజు అన్నారు. ఈ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తి చేసినందుకు వాటితో సంబంధం గల వారందరినీ అభినందించారు. ప్రపంచంలోని అత్యంత ఆధునిక వైద్య టెక్నాలజీలు, వైద్య మౌలిక వసతులు గుజరాత్ ప్రజలు అందుకోగలుగుతారని, తద్వారా సమాజం లాభం పొందుతుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ వైద్య వసతులు అందుబాటులోకి రావడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగల స్తోమత లేని వారు ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి నియమితులైన వైద్య బృందాలున్న ప్రభుత్వ నిర్వహణలోని ఈ ఆస్పత్రులకు వెళ్లవచ్చునని చెప్పారు. మూడున్నర సంవత్సరాల క్రితం 1200 పడకలు గల మాతృత్వ, బాలల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించే అవకాశం తనకు లభించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
కిడ్నీ వ్యాధుల ఇన్ స్టిట్యూట్, యుఎన్ మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ రెండింటి సామర్థ్యాలు, సేవలు విస్తరించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. గుజరాత్ కేన్సర్ పరిశోధన సంస్థ కొత్త భవనం ప్రారంభం కావడంతో బోన్ మారో మార్పిడి సదుపాయాలు అప్ గ్రేడ్ అయినట్టు తెలుపుతూ “దేశంలో సైబర్-నైఫ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఏకైక ప్రభుత్వ ఆస్పత్రి ఇదే” అన్నారు. గుజరాత్ త్వరితగతిన అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుతున్నదని ప్రధానమంత్రి అన్నారు. గుజరాత్ అభివృద్ధి వేగాన్ని గురించి ప్రస్తావిస్తూ అక్కడ జరిగిన పనులు, సాధించిన విజయాలను లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదన్నారు.
20-25 సంవత్సరాల క్రితం గుజరాత్ లోని లోపభూయిష్టమైన వ్యవస్థ తీరుతెన్నుల గురించి ప్రస్తావిస్తూ ఆరోగ్య రంగంలో వెనుకబాటు కారణంగా వ్యాధుల వ్యాప్తి, విద్యారంగం నిర్లక్ష్యం, విద్యుత్ కొరత, పాలనా లోపాలు, శాంతి భద్రతల సమస్యలతో అల్లాడేదని ప్రధానమంత్రి చెప్పారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలే అన్నింటి కన్నా పెద్ద రుగ్మత అన్నారు. అందుకు భిన్నంగా నేడు గుజరాత్ వ్యాధులన్నింటి నుంచి బయటపడి పురోగమన పథంలో ఉన్నదని చెప్పారు. నేడు హై-టెక్ ఆస్పత్రుల గురించి ప్రస్తావించినా గుజరాత్ అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. అలాగే విద్యాసంస్థల విషయానికి వచ్చినా నేడు గుజరాత్ తో సరిపోల్చదగినదేదీలేదని చెప్పారు. వృద్ధిలో నేడు గుజరాత్ పురోగమిసతూ అభివృద్ధిలో కొత్త శిఖరాలు చేరుతున్నదన్నారు. గుజరాత్ లో నీరు, విద్యుత్, శాంతి భద్రతలు ఎంతో మెరుగుపడ్డాయని చెప్పారు. “నేడు సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని గుజరాత్ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది” అని శ్రీ మోదీ చెప్పారు.
నేడు ప్రారంభించిన ఆరోగ్య మౌలిక వసతుల ప్రాజెక్టులు గుజరాత్ కు కొత్త గుర్తింపు తెచ్చాయని, గుజరాత్ ప్రజల సామర్థ్యాలకు ఇవి గుర్తు అని ప్రధానమంత్రి చెప్పారు. గుజరాత్ ప్రజలు మంచి ఆరోగ్య వసతులతో పాటు ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి వైద్య వసతులు తమ రాష్ట్రంలోనే ఉండడం, అవి నిరంతరం పెరుగుతూ ఉండడం గర్వకారణంగా భావిస్తారని ఆయన చెప్పారు. గుజరాత్ లో మెడికల్ టూరిజంకు ఇవి దోహదపడతాయని ఆయన అన్నారు.
మంచి ఉద్దేశాలు, విధానాలు కలిసినప్పుడే మంచి ఆరోగ్య మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “ప్రభుత్వ హృదయం, లక్ష్యాలు ప్రజాసమస్యల పట్ల ఆందోళనతో నిండి ఉండకపోతే సరైన ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యం కాదు” అన్నారు. సంపూర్ణ దృక్పథంతో హృదయపూర్వకంగా కృషి చేసినప్పుడు వాటి ఫలితాలు కూడా బహుముఖీనంగా ఉంటాయని ప్రధానమంత్రి సూచించారు. “గుజరాత్ విజయమంత్రం ఇదే” అని చెప్పారు.
వైద్యశాస్త్ర సారూప్యతలను మరింతగా వివరిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉద్దేశపూర్వకంగా, బలవంతంగా రుద్దిన అనవసరమైన వ్యవస్థలను ఏరి వేయడానికి “సర్జ”రీ చేశానని చెప్పారు. అలాగే వ్యవస్థను శక్తివంతం చేయడానికి నిరంతర ఇన్నోవేషన్ అనే “ఔషధం”, ఆరోగ్య వసతుల పట్ల అవగాహనతో పని చేసేందుకు “కేర్” అస్ర్తాలుగా ఉపయోగించుకున్నట్టు ఆయన తెలిపారు. జంతువుల సంరక్షణ పట్ల కూడా శ్రద్ధ వహించిన మొదటి రాష్ట్రం గుజరాత్ అని ఆయన తెలిపారు. విభిన్న వ్యాధులు, మహమ్మారుల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఒక భూమి, ఒక ఆరోగ్య కార్యక్రమం వంటి వ్యవస్థలను పటిష్ఠం చేయాల్సి ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం జాగ్రత్తతో ప్రవర్తించిందని చెబుతూ “మేం ప్రజల్లోకి వెళ్లి వారి బాధలను పంచుకున్నాం” అన్నారు. ప్రభుత్వ భాగస్వామ్య విధానం ద్వారా ప్రజలను అనుసంధానం చేసేందుకు జరిగిన ప్రయత్నాల గురించి వివరిస్తూ వ్యవస్థ ఆరోగ్యవంతంగా మారినప్పుడు గుజరాత్ ఆరోగ్య రంగం కూడా ఆరోగ్యవంతం అయింది, గుజరాత్ దేశానికే ఒక ఉదాహరణగా నిలిచింది అని చెప్పారు.
గుజరాత్ లో నేర్చుకున్న పాఠాలను తాను కేంద్రప్రభుత్వంలో కూడా ఆచరించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. గత 8 సంవత్సరాల కాలంలో కేంద్రప్రభుత్వం 22 కొత్త ఎయిమ్స్ ను దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, గుజరాత్ కూడా దాని నుంచి లాభం పొందిందని అన్నారు. రాజ్ కోట్ లో గుజరాత్ లో తొలి ఎయిమ్స్ వచ్చింది అని శ్రీ మోదీ చెప్పారు. గుజరాత్ లో ఆరోగ్య రంగం విషయంలో జరిగిన కృషిని వివరిస్తూ వైద్య పరిశోధన, బయోటెక్ పరిశోధన, ఫార్మా పరిశోధనలో గుజరాత్ ప్రతిభ ప్రదర్శించి ప్రపంచ స్థాయిలో తన పేరు మార్మోగిపోయేలా చేసుకునే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధానమంత్రి అన్నారు.
ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల అవగాహనతో పని చేస్తున్నట్టయితే ఆ ప్రయోజనాలు తల్లులు, సోదరీమణులు, బలహీన వర్గాలు సహా మొత్తం సమాజం అందుకుంటుందని ప్రధానమంత్రి అన్నారు. మాతృత్వ మరణాలు, శిశు మరణాల సంఖ్య ప్రభుత్వానికి ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం అలాంటి దురదృష్ట సంఘటనలను విధిరాతగా పరిగణించేదని ఆయన గుర్తు చేశారు. తల్లులు, పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపింది తమ ప్రభుత్వమేనని చెబుతూ “గత 20 సంవత్సరాల కాలంలో మేము అవసరమైన విధానాలు రూపొందించి, అమలుపరచడం వల్ల మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది” అని శ్రీ మోదీ చెప్పారు. బేటీ బచావో బేటీ పఢావో అభియాన్ గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు సమాజంలో జన్మిస్తున్న బాలికల సంఖ్య జన్మిస్తున్న మగపిల్లల కన్నా ఎక్కువగా ఉన్నదన్నారు. ఈ విజయం గుజరాత్ ప్రభుత్వం అమలుపరిచిన “చిరంజీవి”, “ఖిల్ ఖిలాహత్” వంటి విధానాలదే ఈ విజయమని ఆయన అభివర్ణించారు. కేంద్రప్రభుత్వం అమలుపరుస్తున్న “ఇంద్రధనుష్”, “మాతృవందన” వంటి పథకాలకు గుజరాత్ విజయాలు, ప్రయత్నాలే దారి చూపాయని శ్రీ మోదీ అన్నారు.
పేదలు, అవసరంలో ఉన్న వారికి చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభించినట్టు ప్రధానమంత్రి తన ప్రసంగం ముగిస్తూ తెలిపారు. డబుల్-ఇంజన్ ప్రభుత్వ బలం గురించి వివరిస్తూ ఆయుష్మాన్ భారత్, ముఖ్యమంత్రి అమృతం యోజన వంటి పథకాలు రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చుతున్నాయని ఆయన చెప్పారు. “వర్తమానాన్ని మాత్రమే కాకుండా భవిష్యత్తు దిశను కూడా నిర్దేశించే రెండు రంగాలు ఆరోగ్యం, విద్య మాత్రమే” అన్నారు. 2019లో 1200 పడకలతో ఏర్పాటు చేసిన సివిల్ ఆస్పత్రి కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలో అతి పెద్ద ఆరోగ్య సేవా కేంద్రంగా ఉపయోగపడిందన్న ఉదాహరణ ఆయన చూపారు. “ఒకే ఒక ఆరోగ్య మౌలిక వసతి మహమ్మారి కాలంలో వేలాది మంది రోగుల ప్రాణాలు కాపాడింది” అన్నారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వం భవిష్యత్తు కోసం కూడా కృషి చేయాల్సి ఉంటుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “మీరు, మీ కుటుంబాలు వ్యాధుల చింత లేకుండా జీవించాలి” అనే ఆకాంక్ష శ్రీ మోదీ ప్రకటించారు.
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యులు శ్రీ సి.ఆర్.పాటిల్, శ్రీ నరహరి అమీన్, శ్రీ కిరీట్ భాయ్ సోలంకి, శ్రీ హస్ముఖ్ భాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
పూర్వాపరాలు
అహ్మదాబాద్ లోని అస్వారా సివిల్ ఆస్పత్రిలో రూ.1275 కోట్ల విలువ గల ఆరోగ్య వసతుల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శంకుస్థాపన చేయడంతో పాటు కొన్నింటిని జాతికి అంకితం చేశారు. పేద రోగుల కుటుంబాలకు నీడ అందించే షెల్టర్ హోమ్స్ కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే యు.ఎన్.మెహతా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ లో మరింత మెరుగుపరిచిన, కొత్త సదుపాయాలను; ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో కొత్త ఆస్పత్రి భవనాన్ని; గుజరాత్ కేన్సర్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో కొత్త భవనాన్ని ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు.
Modern medical facilities in Ahmedabad will benefit the citizens. pic.twitter.com/CUMOviKJL7
— PMO India (@PMOIndia) October 11, 2022
Gujarat is rapidly scaling new heights of development. pic.twitter.com/TcKzb3s219
— PMO India (@PMOIndia) October 11, 2022
Gujarat is moving ahead and scaling new trajectories of growth. pic.twitter.com/lVA2To4XfP
— PMO India (@PMOIndia) October 11, 2022
We have worked keeping a holistic approach in mind. This has hugely benefitted in Gujarat's development journey. pic.twitter.com/Hf9lxzZqG4
— PMO India (@PMOIndia) October 11, 2022
In last 8 years, we have worked to augment India's healthcare infrastructure. pic.twitter.com/qGgmwtkRIk
— PMO India (@PMOIndia) October 11, 2022
Our government is sensitive towards the weaker sections, mothers and sisters. pic.twitter.com/9THAh7BtiW
— PMO India (@PMOIndia) October 11, 2022