Inspired by Pt. Deendayal Upadhyaya, 21st century India is working for Antyodaya: PM Modi
Our government has given top priority to roads, highways, waterways, railways, especially regarding infrastructure: PM
Our government is working to reach the last person in the society, to bring the benefits of development to them: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వారాణ‌సీ లో దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గారి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అలాగే దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ స్మార‌క కేంద్రాన్ని దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేశారు. మూడు జ్యోతిర్లింగ యాత్రా స్థ‌లాలు వారాణ‌సీ ని, ఉజ్ై పన్ ను, ఓంకారేశ్వ‌ర్ ను క‌లుపుతూ ప్రయాణించే మూడో కార్పొరేట్ రైలు అయిన ‘మ‌హాకాల్ ఎక్స్ ప్రెస్’కు ప్రారంభ సూచ‌క జెండా ను చూపారు. 

430 ప‌డ‌క‌ల తో సూప‌ర్ స్పెశల్టి గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ తో స‌హా అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాలు ముప్ఫైఆరిటి ని ఆయ‌న ప్రారంభించారు. మరో 14 అభివృద్ధి ప్ర‌ధాన‌ ప‌థ‌కాల కు శంకుస్థాపన లు చేశారు.

వారాణ‌సీ లో పండిత్ దీన్‌ ద‌యాళ్ ఉపాధ్యాయ మెమోరియ‌ల్ సెంట‌ర్ లో స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగిస్తూ, ఈ రోజు న ఈ ప్రాంతం పండిత్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ్ స్మార‌క ప్ర‌దేశం తో తాను జత కలవడం ద్వారా త‌న‌కు ఉన్న పడావ్ అనేటటువంటి పేరు కు ఉన్న ప్రాముఖ్యాన్ని మ‌రింత ప‌టిష్ట ప‌ర‌చుకొందన్నారు. ఇది సేవ‌, త్యాగం, ప్ర‌జాహితం అన్నీ ఒక చోటులో క‌ల‌సిపోయిన ఒక వేదిక వలె అభివృద్ధి చెందుతుంద‌న్నారు. ఇప్పుడు ఇక ఈ స్మార‌క ప్ర‌దేశం, ఇక్క‌డ నిర్మించినటువంటి ఉద్యానవ‌నం, అలాగే ఇక్క‌డ నెల‌కొల్పినటువంటి భారీ విగ్ర‌హం దీన్ ద‌యాళ్ గారి ఆలోచ‌న‌ల ను మ‌రియు నైతిక ప్రమాణాల ను త‌రాల త‌ర‌బ‌డి అనుస‌రించే ప్రేర‌ణ లభిస్తూ ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోద‌య మార్గాన్ని మ‌న‌కు చూపెట్టారు. స‌మాజం లో క‌డ‌ప‌టి వ్య‌క్తి సైతం వృద్ధి లోకి రావాలి అనేదే అంత్యోద‌య పరమావధి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఈ ఆలోచ‌న నుండి ప్రేర‌ణ‌ ను పొంది 21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశం అంత్యోద‌య కోసం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప‌విత్ర‌మైన‌టువంటి సంద‌ర్భం లో దాదాపు గా 1250 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల ను ఆరంభించ‌డం జ‌రిగింది. ఇవి వారాణ‌సీ తో పాటు యావ‌త్తు పూర్వాంచ‌ల్ కు మేలు ను చేస్తాయి. ‘‘ఈ ప‌థ‌కాల‌న్నీ కూడాను గ‌త అయిదు సంవ‌త్స‌రాల కాలం లో కాశీ స‌హా మొత్తం పూర్వాంచ‌ల్ లో జ‌రుగుతూ వ‌చ్చిన పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల లో ఓ భాగం గా ఉన్నాయి. ఇన్నేళ్ళ లో వారాణ‌సీ జిల్లా లో సుమారు గా 25,000 కోట్ల రూపాయ‌ల విలువైన అభివృద్ధి ప‌నుల ను పూర్తి చేయ‌డ‌మో లేక ఆయా ప‌నులు పురోగ‌తి లో ఉండ‌ట‌మో జ‌రిగింది’’ అని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.

ప్ర‌భుత్వం ర‌హ‌దారుల కు, హైవేస్ కు, జ‌ల మార్గాల‌ కు, రైల్ వేస్ కు, ప్ర‌త్యేకించి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌ కు అగ్ర ప్రాధాన్యాన్ని క‌ట్ట‌బెట్టింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘ఈ అభివృద్ధి ప‌నులు దేశాన్ని ముందుకు తీసుకుపోవ‌డం ఒక్క‌టే కాకుండా ఉపాధి అవ‌కాశాల ను, ప్ర‌త్యేకించి కాశీ మ‌రియు ప‌రిస‌ర ప్రాంతాల లో గొప్ప అవ‌కాశాలు ఉన్నటువంటి ప‌ర్య‌ట‌న ప్ర‌ధాన ఉపాధి ని కూడా క‌ల్పిస్తున్నాయి’’ అని ఆయ‌న అన్నారు. కొద్ది రోజుల క్రితం ఇక్క‌డ‌ కు విచ్చేసిన శ్రీ లంక అధ్య‌క్షుడు ఇక్క‌డి దివ్య‌మైన వాతావ‌ర‌ణాన్ని కాంచి అప్ర‌తిభుడు అయ్యార‌ని కూడా ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

ఈ ప‌విత్ర‌మైన ఘ‌డియ‌ల లో బాబా విశ్వ‌నాథుని న‌గ‌రాన్ని ఓంకారేశ్వ‌ర్ తోను, మ‌హాకాళేశ్వ‌ర్ తోను క‌లిపే కాశీ ‘మ‌హాకాల్ ఎక్స్ ప్రెస్’ రైలు కు కూడా ప‌చ్చజెండా ను చూపించడం జరిగింది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. 2016వ సంవ‌త్స‌రం ద్వితీయార్థం లో బిహెచ్‌యు లో శంకుస్థాప‌న జ‌రిగిన సూప‌ర్ స్పెశల్టి హాస్పిట‌ల్ ప్ర‌స్తుతం ప్రారంభ‌మైంది. 

‘‘కేవ‌లం 21 మాసాల లో ఈ 430 ప‌డ‌క‌ల ఆసుప‌త్రి కాశీ ప్రజల కు మ‌రియు పూరాంచ‌ల్ ప్ర‌జ‌ల కు సేవ చేయ‌డం కోసం సిద్ధం అయింది’’ అని ఆయ‌న చెప్పారు. దీన్ ద‌యాళ్ గారి యొక్క స్వావ‌లంబ‌న‌, స్వ‌యం స‌హాయం వంటి ఆలోచ‌న‌ లు అన్ని ప‌థ‌కాల కు కేంద్ర స్థానం లో నిల‌వాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ప్ర‌భుత్వ ప్ర‌ణాళిక‌ల లో మ‌రియు ప్ర‌భుత్వం యొక్క సంస్కృతి లో ఈ ఆలోచ‌న‌ల ను ఇమిడ్చేందుకు నిరంత‌ర కృషి జరుగుతోందని ఆయ‌న అన్నారు.

స‌మాజం లో ఆఖ‌రు వ్య‌క్తి వ‌ర‌కు చేరుకోవ‌డం కోసం అభివృద్ధి తాలూకు ప్ర‌యోజ‌నాల ను వారికి అంద‌జేయ‌డం కోసం ప్ర‌భుత్వం నిరంత‌ర ప్ర‌యాస చేస్తున్నట్లు ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. ‘‘ప్ర‌స్తుతం ప‌రిస్థితి మారుతోంది. ఇప్పుడు సంఘం లోని చిట్ట చివ‌రి మ‌నిషి కి అగ్ర‌తాంబూలం క‌ట్ట‌బెట్ట‌డం జ‌రుగుతోంది’’ అని ఆయ‌న అన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage