ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్రామపంచాయతీలు, పానీ సమితులు/ గ్రామ నీటి, పారిశుధ్య కమిటీల (విడబ్ల్యుఎస్ సి) సభ్యులతో జల్ జీవన్ మిషన్ పై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించారు. ఇందులో భాగస్వాములైన అందరిలో చైతన్యం పెంచేందుకు; ఈ కార్యక్రమం కింద పథకాల్లో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి పెంచేందుకు జల్ జీవన్ మిషన్ యాప్ ను కూడా ఆయన ప్రారంభించారు. దానితో పాటుగా రాష్ర్టీయ జల్ జీవన్ కోశ్ ను కూడా ఆయన ప్రారంభించారు. ప్రతీ ఒక్క గ్రామీణ గృహం, పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం, ఆశ్రమశాల, ఇతర ప్రభుత్వ సంస్థలకు టాప్ ల ద్వారా నీటి కనెక్షన్ అందించేందుకు వ్యక్తులు, సంస్థలు, కార్పొరేషన్లు లేదా దాతలు ఈ కోశ్ ద్వారా విరాళాలు అందించవచ్చు. గ్రామ పంచాయతీలు, పానీ సమితుల సభ్యులతో పాటు కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, శ్రీ భువనేశ్వర్ తుడు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమితులతో సంభాషణ సమయంలో ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాకు చెందిన ఉమరీ గ్రామ వాసి శ్రీ గిరిజాకాంత్ తివారీని అతని గ్రామంలో జల్ జీవన్ మిషన్ ప్రభావం ఎలా ఉన్నదని అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు తమకు సురక్షితమైన, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉన్నదని, గ్రామంలో మహిళల జీవితం మెరుగుపడిందని శ్రీ తివారీ తెలియచేశారు. తమకు పైప్ ల ద్వారా నీటి కనెక్షన్ అందుతుందని మీ గ్రామ ప్రజలు ఎప్పుడైనా అనుకున్నారా, ఇప్పుడెలా భావిస్తున్నారు అని శ్రీ తివారీని ప్రధానమంత్రి అడిగారు. ఈ మిషన్ ను ముందుకు నడిపేందుకు తమ వాసులు చేసిన సంఘటిత కృషి గురించి శ్రీ తివారీ వివరించారు. గ్రామంలో ప్రతీ ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి ఉన్నదని, ప్రతీ ఒక్కరూ దాన్ని వినియోగిస్తున్నారని శ్రీ తివారీ చెప్పారు. బుందేల్ ఖండ్ గ్రామస్థుల అంకిత భావాన్ని ప్రధానమంత్రి కొనియాడుతూ పిఎం ఆవాస్, ఉజ్వల, జల్ జీవన్ మిషన్ వంటి స్కీమ్ ల ద్వారా మహిళలు సాధికారత పొందారని, వారికి అందాల్సిన గౌరవం దక్కిందని చెప్పారు.
గుజరాత్ కు చెందిన పిప్లి గ్రామ వాసి శ్రీ రమేశ్ భాయ్ పటేల్ ను వారి గ్రామంలో నీటి సరఫరా పరిస్థితి గురించి ప్రధానమంత్రి అడిగారు. నీటి నాణ్యత తరచు పరిశీలిస్తున్నారా అని కూడా ప్రశ్నించారు. నాణ్యత బాగుందని, నీటి నాణ్యత పరీక్షించుకోవడంలో గ్రామంలోని మహిళలకు శిక్షణ ఇచ్చారని శ్రీ రమేశ్ భాయి తెలియచేశారు. మంచినీటికి మీ గ్రామ ప్రజలు డబ్బు చెల్లిస్తున్నారా అని ప్రధానమంత్రి అడిగారు. నీరు స్వచ్ఛంగా ఉంటున్నదంటూ దానికి డబ్బు చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నారని రమేశ్ భాయి చెప్పారు. తమ గ్రామంలో కొత్త ఇరిగేషన్ టెక్నిక్ లు ఉపయోగిస్తున్నట్టు కూడా ప్రధానమంత్రికి తెలియచేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఈ స్వచ్ఛత ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారని చెబుతూ అదే విధంగా జల్ జీవన్ మిషన్ కూడా విజయవంతం కాగలదన్న ఆశాభావం ఆయన ప్రకటించారు.
జల్ జీవన్ మిషన్ కు ముందు, తర్వాత నీటి సరఫరా ఎలా ఉంది అని ఉత్తరాఖండ్ కు చెందిన శ్రీమతి కౌశల్యా రావత్ ను ప్రధానమంత్రి ప్రశ్నించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత పర్యాటకులు తమ గ్రామానికి వచ్చి ఇళ్లలో బస చేస్తున్నారని ఆమె తెలిపారు. తమ గ్రామ ప్రజలందరూ వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు కూడా ఆమె తెలియచేశారు. అడవుల పెంపకం, పర్యాటకం అభివృద్ధి, పర్యాటకులకు ఇళ్లలోనే బసల ఏర్పాటు ద్వారా పర్యావరణమిత్రమైన స్థిర విధానాలు అనుసరిస్తున్నందుకు శ్రీమతి రావత్ ను, గ్రామస్థులను ఆయన కొనియాడారు.
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లెరికి చెందిన శ్రీమతి సుధని జల్ జీవన్ మిషన్ ప్రభావం గురించి ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత అన్ని ఇళ్ళకి మంచినీటి కనెక్షన్లు వచ్చాయని ఆమె తెలిపారు. ఆమె గ్రామానికి ప్రసిద్ధమైన ఆర్ని సిల్క్ గురించి కూడా ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. పైప్ ల ద్వారా మంచినీరు సరఫరా చేయడం వల్ల మీకు ఇంటి పనులు చేసుకునేందుకు సమయం లభిస్తోందా అని కూడా అడిగారు. నీటి సరఫరా వచ్చిన తర్వాత తమ జీవనం మెరుగుపడిందని, అలా ఆదా అయిన సమయాన్ని ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నామని శ్రీమతి సుధ తెలిపారు. అలాగే నీటిని పరిరక్షించుకునేందుకు తమ గ్రామంలో చేపట్టిన చెక్ డామ్ లు, కుంటల నిర్మాణం కార్యకలాపాల గురించి ఆమె వివరించారు. గ్రామంలో ప్రజలు చేపట్టిన నీటి ఉద్యమం మహిళా సాధికారత దిశగా ఒక పెద్ద అడుగు అని ప్రధానమంత్రి అన్నారు.
శ్రీ మోదీతో మణిపూర్ కి చెందిన శ్రీమతి లైతాంథెమ్ సరోజినీ దేవి మాట్లాడుతూ గతంలో సుదూర తీరాల్లో మాత్రమే నీరు అందుబాటులో ఉండేదని, సుదీర్ఘ క్యూలలో నిలబడి నీరు తెచ్చుకోవలసి వచ్చేదని అన్నారు. ఇప్పుడు ప్రతీ ఇంటికీ పైప్ ల ద్వారా నీరు రావడంతో పరిస్థితి ఎంతగానో మెరుగుపడిందని చెప్పారు. అలాగే ఒడిఎఫ్ అమలులోకి వచ్చి గ్రామం అంతటా మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ గ్రామంలో ఆరోగ్యం మెరుగుపడిందని ఆమె తెలిపారు. నీటి నాణ్యత తరచు పరీక్షించడం తమ గ్రామంలో ఒక అలవాటుగా మారిందని, నీటి నాణ్యత పరీక్షలో ఐదుగురు మహిళలకు శిక్షణ ఇచ్చారని ఆమె చెప్పారు. ప్రజల జీవితాలు సరళం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో సంభవిస్తున్న వాస్తవిక మార్పు పట్ల ఆయన సంతృప్తి ప్రకటించారు.
బాపూ, బహదూర్ శాస్ర్తిజీలకు గ్రామాలు గుండెతో సమానమని సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు "గ్రామ సభ"ల రూపంలో "జల్ జీవన్ సంవాద్" నిర్వహించడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు.
"ప్రజలకు మంచినీటిని అందుబాటులోకి తేవడమే కాదు, వికేంద్రీకరణ దిశగా పెద్ద ఉదమ్యం తేవడం జల్ జీవన్ మిషన్ లక్ష్యం" అని ప్రధానమంత్రి వివరించారు. ఇది గ్రామాలు, ప్రత్యేకించి మహిళలు సారథ్యం వహించే, ప్రజా భాగస్వామ్యంతో కూడిన ఉద్యమం అని ఆయన చెప్పారు. సంపూర్ణ ఆత్మవిశ్వాసం సాధించడమే "గ్రామ స్వరాజ్" వాస్తవ అర్ధమని గాంధీజీ చెబుతూ ఉండేవారన్న విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు. "అందుకే గ్రామ స్వరాజ్ ను పరిపూర్ణం చేయడం కోసం నేను నిరంతరం కృషి చేస్తున్నాను" అని చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా గ్రామ్ స్వరాజ్ కు తాను చేసిన కృషిని శ్రీ మోదీ గుర్తు చేశారు. గ్రామాలను బహిరంగ మల మూత్ర రహితం చేయడానికి నిర్మల్ గాం, గ్రామాల్లోని పాత కుంటలు, బావులు పునరుద్ధించడానికి జల్ మంది అభియాన్, 24 గంటల విద్యుత్ సరఫరాకు జ్యోతి గ్రామ్, గ్రామాల్లో పరస్పర సహకారాన్ని తెచ్చేందుకు తీర్థ గ్రామ్, గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సదుపాయం కల్పించడానికి జల్ మందిర్ అభియాన్ వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన వివరించారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా కూడా వివిధ పథకాల నిర్వహణ, ప్రణాళిక రూపకల్పనలో స్థానిక సమాజాన్ని భాగస్వాములను చేయడానికి తాను కృషి చేశానని అన్నారు. గ్రామాల్లో నీరు, స్వచ్ఛత కోసం గ్రామ పంచాయతీలకు రూ.2.5 లక్షలకు పైగా నిధులు అందించామని తెలిపారు. అధికారాలు కల్పించడమే కాదు, పారదర్శకత కోసం పంచాయతీల పనితీరును సన్నిహితంగా పర్యవేక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. గ్రామ్ స్వరాజ్ పట్ల కేంద్రప్రభుత్వ కట్టుబాటుకు జల్ జీవన్ మిషన్, పానీసమితులు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన తెలిపారు.
నీరు తెచ్చుకునేందుకు గ్రామాల్లోని మహిళలు, పిల్లలు మైళ్ల దూరం నడవాల్సివచ్చేదన్న విషయం పలు సినిమాలు, కథలు, పద్యాలు కళ్లకి కట్టినట్టు వివరించాయన్నారు. గ్రామం విషయం ప్రస్తావనకు వస్తే ప్రజల మదిలో ఇవన్నీ కదలాడేవన్నారు. ప్రతీ రోజూ ప్రజలు నీటి కోసం దూరంలో ఉన్న నదికి లేదా చెరువుకి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది, నీరు వాటి ముంగిటికి ఎందుకు రావడంలేదన్న విషయం కొద్ది మంది మాత్రమే ఎందుకు ఆలోచించేవారని ప్రధానమంత్రి ప్రశ్నించారు. "దీర్ఘకాలంగా విధాన నిర్ణయాల బాధ్యత వహించిన వ్యక్తులు తమని తాము ఈ ప్రశ్న అడిగి ఉండాల్సింది" అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన వారంతా నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడం వల్ల నీటి ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోయారని చెప్పారు. కాని గుజరాత్ వంటి దుర్భిక్ష పరిస్థితులున్న రాష్ట్రం నుంచి రావడం వల్ల ప్రతీ ఒక్క నీటి చుక్క ప్రాధాన్యం తాను గుర్తించానని శ్రీ మోదీ అన్నారు. అందుకే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రజలకు నీరు అందించడం, జల సంరక్షణ తన ప్రాధాన్యతలుగా ఉన్నాయని ఆయన చెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు దేశంలోని 3 కోట్ల ఇళ్లకి మాత్రమే టాప్ వాటర్ కనెక్షన్ లభించిందని ప్రధానమంత్రి అన్నారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన తర్వాత 5 కోట్ల ఇళ్లకి నీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు 80 జిల్లాల్లోని 1.25 లక్షలకు పైగా ఇళ్లకి పైప్ ల ద్వారా నీరు చేరుతోంది. ఆకాంక్షాపూరిత జిల్లాల్లో టాప్ కనెక్షన్లు 31 లక్షల నుంచి 1.16 కోట్లకి పెరిగాయి.
ఏడు దశాబ్దాల్లో జరిగిన కృషి కన్నా కేవలం రెండేళ్ల కాలంలో ఎక్కువ కృషి జరిగిందని ప్రధానమంత్రి చెప్పారు. దేశంలో నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లోని ప్రతీ ఒక్క పౌరుడు జల సంరక్షణకు మరింత కృషి చేయాలని ఆయన అభ్యర్థించారు. అలవాట్లు కూడా మార్చుకోవాలని ఆయన వారికి పిలుపు ఇచ్చారు.
దేశంలో కుమార్తెల ఆరోగ్యం, భద్రత కోసం తీసుకున్న చర్యలను ప్రధానమంత్రి వివరించారు. ప్రతీ ఇంటిలోను, పాఠశాలలోను మరుగుదొడ్డి ఏర్పాటు; అందుబాటు ధరల్లో శానిటరీ పాడ్ ల సరఫరా, గర్భిణులకు పోషకాహార మద్దతు, టీకాల కార్యక్రమం "మాత్రాశక్తి"ని పటిష్ఠం చేశాయని ఆయన తెలియచేశారు.
మహిళల పేరుతో గ్రామాల్లో 2.5 కోట్లకి పైగా ఇళ్ల నిర్మాణం జరిగిందని, ఉజ్వల పథకంతో మహిళలకు పొగ నుంచి విముక్తి లభించిందని ఆయన తెలిపారు. మహిళలను స్వయంసహాయక బృందాల ద్వారా ఆత్మ నిర్భరతతో సంఘటితం చేస్తున్నట్టు తెలియచేస్తూ ఈ బృందాల సంఖ్య గత ఏడేళ్ల కాలంలో మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. 2014 సంవత్సరం కన్నా ముందు నాటితో పోల్చితే గత ఏడేళ్ల కాలంలో జాతీయ జీవనోపాధి కార్యక్రమం కింద మహిళలకు మద్దతు 13 రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు.
पूज्य बापू और लाल बहादुर शास्त्री जी इन दोनों महान व्यक्तित्वों के हृदय में भारत के गांव ही बसे थे।
— PMO India (@PMOIndia) October 2, 2021
मुझे खुशी है कि आज के दिन देशभर के लाखों गांवों के लोग ‘ग्राम सभाओं’ के रूप में जल जीवन संवाद कर रहे हैं: PM @narendramodi
जल जीवन मिशन का विजन, सिर्फ लोगों तक पानी पहुंचाने का ही नहीं है।
— PMO India (@PMOIndia) October 2, 2021
ये Decentralisation का- विकेंद्रीकरण का भी बहुत बड़ा Movement है।
ये Village Driven- Women Driven Movement है।
इसका मुख्य आधार, जनआंदोलन और जनभागीदारी है: PM @narendramodi
गांधी जी कहते थे कि ग्राम स्वराज का वास्तविक अर्थ आत्मबल से परिपूर्ण होना है।
— PMO India (@PMOIndia) October 2, 2021
इसलिए मेरा निरंतर प्रयास रहा है कि ग्राम स्वराज की ये सोच, सिद्धियों की तरफ आगे बढ़े: PM @narendramodi
लेकिन बहुत कम ही लोगों के मन में ये सवाल उठता है कि आखिर इन लोगों को हर रोज किसी नदी या तालाब तक क्यों जाना पड़ता है, आखिर क्यों नहीं पानी इन लोगों तक पहुंचता?
— PMO India (@PMOIndia) October 2, 2021
मैं समझता हूं, जिन लोगों पर लंबे समय तक नीति-निर्धारण की जिम्मेदारी थी, उन्हें ये सवाल खुद से जरूर पूछना चाहिए था: PM
मैं तो गुजरात जैसा राज्य से हूं जहां अधिकतर सूखे की स्थिति मैंने देखी है। मैंने ये भी देखा है कि पानी की एक-एक बूंद का कितना महत्व होता है।
— PMO India (@PMOIndia) October 2, 2021
इसलिए गुजरात का मुख्यमंत्री रहते हुए, लोगों तक जल पहुंचाना और जल संरक्षण, मेरी प्राथमिकताओं में रहे: PM @narendramodi
आज देश के लगभग 80 जिलों के करीब सवा लाख गांवों के हर घर में नल से जल पहुंच रहा है।
— PMO India (@PMOIndia) October 2, 2021
यानि पिछले 7 दशकों में जो काम हुआ था, आज के भारत ने सिर्फ 2 साल में उससे ज्यादा काम करके दिखाया है: PM @narendramodi
मैं देश के हर उस नागरिक से कहूंगा जो पानी की प्रचुरता में रहते हैं, कि आपको पानी बचाने के ज्यादा प्रयास करने चाहिए।
— PMO India (@PMOIndia) October 2, 2021
और निश्चित तौर पर इसके लिए लोगों को अपनी आदतें भी बदलनी ही होंगी: PM @narendramodi
बीते वर्षों में बेटियों के स्वास्थ्य और सुरक्षा पर विशेष ध्यान दिया गया है।
— PMO India (@PMOIndia) October 2, 2021
घर और स्कूल में टॉयलेट्स, सस्ते सैनिटेरी पैड्स से लेकर,
गर्भावस्था के दौरान पोषण के लिए हज़ारों रुपए की मदद
और टीकाकरण अभियान से मातृशक्ति और मजबूत हुई है: PM @narendramodi