5490 కోట్ల రూపాయలవ్యయం తో అభివృద్ధి చేయనున్న 247 కిలోమీటర్ల జాతీయ రహదారులప్రాజెక్టు కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి
“ప్రపంచంలోనేఅత్యధునాతన ఎక్స్ప్రెస్ వే లలో ఢిల్లీ ముంబాయి ఎక్స్ప్రెస్ వే ఒకటి.
అభివృద్ధిచెందుతున్న ఇండియా అద్భుత దృశ్యానికి ఇది అద్దంపడుతుంది’’ ‘‘గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంమౌలిక సదుపాయాల రంగంలో నిరంతరాయంగా భారీ పెట్టుబడులు పెడుతోంది’’
“మౌలికసదుపాయాల రంగానికి ఈ బడ్జెట్ లో 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2014 కేటాయింపులతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ.
‘‘గత కొద్దిసంవత్సరాలలో రాజస్థాన్ జాతీయ రహదారులకు 50 వేల కోట్ల రూపాయలు అందుకుంది’’
‘‘దేశ పురోగతి, రాజస్థాన్ పురోగతికి ఢిల్లీ – ముంబాయి ఎక్స్ప్రెస్ వే, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్ లు రెండూ , రెండు బలమైన స్తంభాలుగా ఉండనున్నాయి.’’
‘‘రాజస్థాన్అభివృద్ధి, దేశ అభివృద్ధికి సంబంధించి సబ్కా సాథ్, సబ్ కా వికాస్ అనేది మా మంత్రం.ఈ మంత్రాన్ని అనుసరించి, మేం సమర్ధమైన, సుసంపన్నమైన, భారతదేశాన్ని నిర్మిస్తున్నాం’’
అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న భారతదేశానికి సంబంధించి అద్భుత చిత్రాన్ని ఈ అత్యంత అధునాతన ఎక్స్ ప్రెస్ వే కళ్లకు కడుతున్నదని ప్రధానమంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 246 కిలోమీటర్ల పొడవుగల ఢిల్లీ ముంబాయి ఎక్స్ప్రెస్ వే కు చెందిన ఢిల్లీ –దౌసా– లాల్ సాట్ సెక్షన్ను జాతి కి ఈ రోజు న అంకితం చేశారు. అలాగే సుమారు 5490 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న 247 కిలోమీటర్ల పొడవుగల జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

అద్భుత రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అభివృద్ధికి,ప్రగతికి చిహ్నమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అలాగే నవ భారతదేశం ప్రపంచ శ్రేణి ఎక్సప్రెస్ వేలను దేశవ్యాప్తంగా నిర్మిస్తుండడం ద్వారా అనుసంధానత సాకారమవుతున్నదని ప్రధానమంత్రి అన్నారు..ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఢిల్లీ –ముంబాయి ఎక్స్ప్రెస్ వే తొలి దశ ను జాతికి అంకితం చేయడం గర్వకారణమన్నారు.అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న భారతదేశానికి సంబంధించి అద్భుత చిత్రాన్ని ఈ అత్యంత అధునాతన ఎక్స్ ప్రెస్ వే కళ్లకు కడుతున్నదని ప్రధానమంత్రి అన్నారు.

ఇలాంటి అధునాతన రోడ్లు , రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు , మెట్రో , ఎయిర్ పోర్టులు నిర్మితమైతే దేశ అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ప్రధానమంత్రి అన్నారు.
మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి బహుళ ప్రభావవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. “గత 9 సంవత్సరాలలో ,కేంద్ర ప్రభుత్వం
మౌలిక సదుపాయాల రంగంలో భారీ పెట్టుబడులు పెడుతూ వస్తున్నది.”అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. రాజస్థాన్లో జాతీయ రహదారుల నిర్మాణానికి
50 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టినట్టు తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాయాల రంగానికి ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు
కేటాయించిందని, ఇది 2014 కేటాయింపుల కంటే 5 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఈ పెట్టుబడులనుంచి రాజస్థాన్ కు చెందిన పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ లబ్ధి పొందుతారని ప్రధానమంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల వల్ల ఆర్ధిక వ్యవస్థకు కలిగే ప్రయోజనాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇది ఉపాధి, అనుసంధానతను కల్పిస్తుందని ఆయన అన్నారు.

జాతీయ రహదారులు, రైల్వేలు , పోర్టులు, విమానాశ్రయాలు, ఆప్టికల్ ఫైబర్ లు, డిజిటల్ అనుసంధానత, పక్కా గృహాల నిర్మాణం, కళాశాలల నిర్మాణం వంటి వాటి వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ సాధికారత పొందుతారని ప్రధానమంత్రి అన్నారు. మౌలిక సదుపాయాల కు సంబంధించిన ఇతర ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఆర్ధిక కార్యకలాపాలకు ఊతం వస్తుందని అన్నారు. ఢిల్లీ–దౌసా– లాల్సాట్ జాతీయరహదారి తో ఢిల్లీ – జైపూర్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధానమంత్రి చెప్పారు.
జాతీయ రహదారి వెంట గ్రామీణ హాత్ లను ఏర్పాటు చేయనున్నామని, ఇవి స్థానిక రైతులకు, హస్తకళాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
ఢిల్లీ ముంబాయి ఎక్స్ ప్రెస్ వే ఢిల్లీ , హర్యానా, గుజరాత్ మహారాష్ట్రతోపాటు రాజస్థాన్ ప్రయోజనం పొందుతుందని అన్నారు. “ పర్యాటక ప్రాంతాలైన సరిస్కా, కియో లడో నేషనల్ పార్క్, రణథంబోర్, జైపూర్ లు ఈ జాతీయ రహదారి ద్వారా భారీగా ప్రయోజనం పొందుతాయ ” ని ప్రధానమంత్రి చెప్పారు.

మరో మూడు ఇతర ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఇందులో ఒకటి ఎక్స్ ప్రెస్ వే తో జైపూర్ కు నేరుగా అనుసంధానత కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
రెండో ప్రాజెక్టు ఎక్స్ ప్రెస్ వే ను అల్వార్ సమీపంలోని అంబాలా– కొట్పుత్లి కారిడార్ తో కలుపుతుందని చెప్పారు.
దీనివల్ల హర్యానా, పంజాబ్, హిమాచల్ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ నుంచి వచ్చే వాహనాలు పంజాబ్, గుజరాత్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు సులభంగా వెళ్లడానికి వీలు కల్పిస్తుందని అన్నారు.లాల్సాట్ కరోలి రోడ్ కూడా ఈ ప్రాంతాన్ని ఎక్స్ప్రెస్ వేతో అనుసంధానం చేస్తుందని చెప్పారు. ఢిల్లీ , ముంబాయి ఎక్స్ప్రెస్ వే, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు రాజస్థాన్ ప్రగతికి, దేశ ప్రగతికి బలమైన స్తంభాలుగా ఉండనున్నాయన్నారు. ఇది రాగల రోజులలో మొత్తం దేశ పరివర్తనకు , రాజస్థాన్ పరివర్తనకు దోహదపడుతుందని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ముంబాయి– ఢిల్లీ ఎకనమిక్ కారిడార్ ను బలోపేతం చేస్తాయనిక, రోడ్డు, సరకు రవాణా కారిడార్ రాజస్థాన్ , హర్యానా, పశ్చిమ భారత దేశంలోని ఎన్నో ప్రాంతాలను పోర్టులతో అనుసంధానం చేస్తుందని అన్నారు. ఇది లాజిస్టిక్స్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ ఇతర పరిశ్రమలకు నూతన అవకాశాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు.

ఢిల్లీ – ముంబాయి ఎక్స్ ప్రెస్ వే ని ప్రధానమంత్రి గతి శక్తి మాస్టర్ ప్లాన్ మద్దతుతో చేపట్టారని చెప్పారు. ఆప్టికల్ ఫైబర్, విద్యుత్ లైన్లు,
గ్యాస్ పైప్ లైన్లు, వేయడానికి తగిన వీలు కల్పించారని , ఇంకా మిగిలిన స్థలనాన్ని వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు, సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనున్నట్టు చెప్పారు.
“ఈ కృషి వల్ల భవిష్యత్తులో దేశం ఎంతో డబ్బును ఆదాచేయనున్నదని” ప్రధానమంత్రి చెప్పారు.
ఉపన్యాసాన్ని ముగిస్తూ ప్రధానమంత్రి, దేశానికి, రాజస్థాన్ కు సంబంధించి సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రం గురించి ప్రస్తావించారు. సమర్ధవంతమైన, సుసంపన్నమైన, పోటీకి నిలిచే భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ప్రధానమంత్రి చెప్పారు. కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి, కేంద్ర జలశక్తి, మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్,కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ కైలాశ్ చౌదరి, రాజస్థాన్ ప్రభుత్వ ప్రజా పనుల శాఖ మంత్రి,శ్రీ భజన్ లాల్ జాతవ్, పార్లమెంటు సభ్యులు , ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం:

ఢిల్లీ – ముంబాయి ఎక్స్ప్రెస్ వే కి చెందిన 246 కిలోమీటర్ల పొడవు గల ఢిల్లీ – దౌసా – లాల్ సాట్ సెక్షన్ను 12,150 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేశారు.

ఈ సెక్షన్ ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఢిల్లీ – జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి 3.5 గంటలకు తగ్గుతుంది.
ఇది ఈ ప్రాంతం మొత్తం ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడనుంది.

ఢిల్లీ – ముంబాయి ఎక్స్ప్రెస్ వే భారత దేశపు అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే. దీని పొడవు 1,386 కిలోమీటర్లు.
దీని వల్ల ఢిల్లీ – ముంబాయి మధ్య దూరం 1424 కిలోమీటర్ల నుంచి 1242 కిలోమీటర్లకు అంటే 12 శాతం తగ్గుతుంది.
ప్రయాణ సమయం 24 గంటల నుంచి 12 గంటలకు తగ్గుతుంది. ఇది ఆరు రాష్ట్రాల మీదుగా అంటే ఢిల్లీ, హర్యానా,
రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ల మీదుగా కోటా, ఇండో , జైపూర్, భోపాల్ ,వడోదర్, సూరత్ లన కలుపుతూ వెళుతుంది.
ఈ ఎక్స్ ప్రెస్ వే 93 గతి శక్తి ఎకనమిక్ నోడ్స్ను, 13 పోర్టులు, 8 ప్రధాన విమానాశ్రయాలు, 8 మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు,(ఎంఎంఎల్పిఎస్) లకు ఉపయోగకరంగా ఉంటుంది.
అలాగే జెవార్ ఎయిర్ పోర్టు, నవీ ముంబాయి ఎయిర్ పోర్టు, జె ఎన్ పి టి పోర్టులకు ఉపకరిస్తుంది. ఈ ఎక్స్ ప్రెస్ వే ఇరుగు పొరుగున ఉన్న అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదకారి అవుతుంది.
ఇది దేశ ఆర్థిక పరివర్తనకు ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి 247 కిలోమీటర్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. వీటిని 5,940 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తారు. ఇందులో 67 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల స్పర్ రోడ్డు, కూడా ఉంది. ఇది బండి కుయి నుంచి జైపూర్ వరకు ఉంటుంది. దీనిని 2000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు. కోట్ పుత్లి నుంచి బరోవా దనియో వరకు ఆరు లేన్ల స్పర్ రోడ్డును 3 వేలా 775 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు. లాల్ సాట్ – కరోలి సెక్షనన్ షోల్డర్ టూ లేన్ ను 150 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones