ఈ ప్రాజెక్టు లు ఆ ప్రాంతం లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు అండగా నిలవడం తో పాటు స్థానిక రైతుల ఆదాయాన్ని మరియు పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని వృద్ధి చేయడం లో తోడ్పడుతాయి
‘‘ఎఫ్ పిఒ స్ ద్వారా చిన్న రైతులు ఫూడ్ ప్రోసెసింగ్ తో, విలువ తో ముడిపడినఎగుమతుల తో మరియు సప్లయ్ చైన్ తో జతపడుతున్నారు’’
‘‘రైతుల కు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల ను సృష్టించాలన్న వ్యూహం సఫలం అవుతోంది’’

వేయి కోట్ల రూపాయల పై చిలుకు విలువ కలిగిన అనేక ప్రాజెక్టుల కు గుజరాత్ లోని సాబర్ కాంఠా లో గల గఢోడా చౌకీ లో నెలకొన్న సాబర్ డెయరి లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభోత్సవం/శంకుస్థాపన లు జరిపారు. ఈ ప్రాజెక్టు లు స్థానిక రైతుల కు మరియు పాల ఉత్పత్తిదారుల కు సాధికారిత ను కల్పించడం తో పాటు వారి ఆదాయం వృద్ధి చెందడం లో దోహదం చేయనున్నాయి. అంతేకాక ఇది ఆ ప్రాంతం లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు ఒక ఊతాన్ని కూడా అందించనుంది. ప్రధాన మంత్రి ఈ సందర్భం లో సుకన్య సమృద్ధి పథకం లబ్ధిదారుల ను మరియు పాల ఉత్పత్తి లో అగ్రగాములు గా నిలచిన మహిళల ను సత్కరించారు. ఈ కార్యక్రమాని కి హాజరైన వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయీ పటేల్ కూడా ఉన్నారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘‘ఈ రోజున సాబర్ డెయరి సామర్థ్యం విస్తరిస్తున్నది. వందల కోట్ల రూపాయల విలువ కలిగిన కొత్త ప్రాజెక్టుల ను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన ఒక పాలపొడి ప్లాంటు ను అదనం గా ఏర్పాటు చేయడం వల్ల, అలాగే అసెప్టిక్ ప్యాకింగ్ సెక్షన్ లో మరొక లైను ను జోడించడం వల్ల సాబర్ డెయరి యొక్క సామర్థ్యం మరింత గా వృద్ధి చెందనుంది’’ అని వివరించారు. సాబర్ డెయరి వ్యవస్థాపకుల లో ఒకరైన శ్రీ భూడాభాయీ పటేల్ ను కూడా ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. ఈ ప్రాంతం తో, స్థానిక ప్రజల తో తన కు గల సుదీర్ఘ అనుబంధాన్ని సైతం ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు.

రెండు దశాబ్దాల కిందట దుర్భిక్షం మరియు ఎద్దడి స్థితి నెలకొనడాన్ని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ముఖ్యమంత్రి గా తాను ప్రజల సహకారాన్ని అర్థించిన విషయాన్ని, ఈ ప్రాంతం లో స్థితి ని మెరుగు పరచడానికి చేసిన ప్రయాసల ను గురించి ఆయన ప్రస్తావించారు. పశువుల పెంపకం మరియు పాడి రంగం ఆ ప్రయాసల లో మహత్వపూర్ణమైనవి గా మారాయి అని ఆయన అన్నారు. పశు దాణా, మందులు మరియు పశువుల కు ఆయుర్వేద చికిత్స ను ప్రోత్సహించడం వంటి వాటి ద్వారా పశు సంవర్థనాన్ని ప్రోత్సహించడం జరిగింది అని కూడా ఆయన అన్నారు. గుజరాత్ జ్యోతిగ్రామ్ పథకం అభివృద్ధి కి ఒక ఉత్ప్రేరకం గా నిలచింది అని ఆయన ప్రస్తావించారు.

గడచిన రెండు దశాబ్దాల లో చేపట్టిన చర్యల కారణం గా గుజరాత్ లో పాడి బజారు ఒక లక్ష కోట్ల రూపాయల కు చేరుకొంది అని ప్రధాన మంత్రి సగర్వం గా వెల్లడించారు. 2007వ సంవత్సరం లోను, 2011వ సంవత్సరం లోను తాను ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పటి సంగతుల ను ఆయన తెలియజేస్తూ, మహిళల ప్రాతినిధ్యం అధికం కావాలని అప్పట్లో తాను అభ్యర్థించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం చాలా వరకు సంఘాల లో మహిళల కు చక్కనైన ప్రాతినిధ్యం ఉందని ఆయన అన్నారు. పాల కు చేసే చెల్లింపులు ఎక్కువ గా మహిళల కే దక్కుతున్నాయి అని ఆయన అన్నారు.

ఈ ప్రయోగాల ను ఇతర ప్రాంతాల లో కూడా ఆచరణ లోకి తీసుకువస్తున్నారు అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ఫార్మర్ ప్రొడ్యూసర్ అసోసియేశన్స్ (ఎఫ్ పిఒ స్) ను 10,000 సంఖ్య లో ఏర్పాటు చేసేందుకు కృషి పూర్తి స్థాయి లో జరుగుతోంది అని ఆయన అన్నారు. ఈ ఎఫ్ పిఒ స్ ద్వారా చిన్న రైతులు ఫూడ్ ప్రోసెసింగ్, సప్లయ్ చైన్ లతో పాటు విలువ ముడిపెట్టిన ఎగుమతుల తో ప్రత్యక్ష సంధానాన్ని కలిగి ఉండటం సాధ్యపడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. దీని వల్ల గుజరాత్ రైతులు కూడాను ఎంతో ప్రయోజనాన్ని పొందుతారు అని ఆయన అన్నారు.

రైతుల కు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల ను ఇప్పించేటటువంటి వ్యూహం ఫలప్రదం అవుతోందని ప్రధాన మంత్రి అన్నారు. తోట పంట లు, చేపల పెంపకం, తేనె ఉత్పత్తి రైతుల కు చక్కటి ఆదాయాన్ని అందిస్తున్నాయి అని ఆయన అన్నారు. ఖాదీ మరియు గ్రామోద్యోగ్ ల టర్నోవర్ మొట్టమొదటిసారి గా ఒక లక్ష కోట్ల రూపాయల కు మించింది అని ఆయన చెప్పారు. ఈ రంగం లో 1.5 కోట్ల కు పైగా కొత్త ఉద్యోగాలు గ్రామాల లో లభించాయి అని వివరించారు. పెట్రోలు లో ఇథెనాల్ ను కలపడాన్ని పెంచడం వంటి చర్యలు రైతుల కు కొత్త అవకాశాల ను కల్పిస్తున్నాయి అని తెలిపారు. ‘‘2014వ సంవత్సరం వరకు చూసుకొంటే, 400 మిలియన్ లీటర్ ల కన్నా తక్కువ ఇథెనాల్ ను దేశం లో మిశ్రణం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది ఇంచుమించు 400 కోట్ల లీటర్ లకు చేరుకొంటున్నది. గడచిన రెండు సంవత్సరాల కాలం లో ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా 3 కోట్ల పై చిలుకు రైతుల కు కిసాన్ క్రెడిట్ కార్డుల ను కూడా మా ప్రభుత్వం ఇచ్చింది’’ అని ఆయన అన్నారు.

యూరియా కు వేప పూత ను పూయడం, మూతపడ్డ ఎరువుల తయారీ కర్మాగారాల ను తెరవడం, నానో ఫర్టిలైజర్స్ ను ప్రోత్సహించడం, ప్రపంచవ్యాప్తం గా ధరల పెరుగుదల చోటు చేసుకొన్నప్పటికీ తక్కువ ధరల కే యూరియా లభ్యం అయ్యేటట్లు చూడటం వంటి చర్యలు దేశం లోను, గుజరాత్ లోను రైతుల కు లబ్ధి ని చేకూర్చాయి అని ప్రధాన మంత్రి అన్నారు. సుజలాం సుఫలాం పథకం సాబర్ కాంఠా జిల్లా లో అనేక తహసీళ్ళ లో నీరు అందేటట్లు చూసింది. అదేవిధం గా జిల్లా లో, సమీప ప్రాంతాల లో సంధానాన్ని ఇదివరకు ఎన్నడు లేనంత గా పెంచడం జరిగింది. రైల్ వే ప్రాజెక్టు లు, ఇంకా హై వే ప్రాజెక్టు లు ఈ ప్రాంతం లో సంధానాన్ని మెరుగుపరచాయి. ఈ సంధానం పర్యటన రంగాని కి సహాయకారి కావడం తో పాటు యువత కు కొలువులు దొరికేటట్లు కూడా చూస్తున్నది అని ఆయన అన్నారు.

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, స్థానిక ఆదివాసీ నాయకుల త్యాగాన్ని స్మరించుకొన్నారు. నవంబర్ 15వ తేదీ నాడు వచ్చే భగవాన్ బిర్ సా ముండా గారి జయంతి ని ‘జన్ జాతీయ గౌరవ్ దివస్’ గా పాటించాలని ప్రభుత్వం ప్రకటించిందని ప్రధాన మంత్రి తెలిపారు. ‘‘దేశవ్యాప్తం గా ఉన్నటువంటి ఆదివాసి స్వాతంత్య్ర యోధుల స్మృతి లో ఒక ప్రత్యేక సంగ్రహాలయాన్ని కూడా మా ప్రభుత్వం నిర్మిస్తున్నది’’ అని ఆయన అన్నారు. ‘‘మొట్టమొదటి సారి గా దేశ పుత్రిక ఒకరు- ఎవరైతే ఆదివాసీ సముదాయం నుంచి వచ్చారో- భారతదేశం లో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవి కి చేరుకొన్నారు. శ్రీమతి ద్రౌపదీ ముర్మూ గారి ని దేశం తన రాష్ట్రపతి గా చేసింది. నూట ముప్ఫయ్ కోట్ల మంది కి పైగా ఉన్న భారతీయుల కు ఇది ఒక గొప్ప కారణమైనటువంటి ఘడియ’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

హర్ ఘర్ తిరంగా అభియాన్ (ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమం) లో ఉత్సాహం తో పాల్గొనండంటూ దేశ ప్రజల కు ప్రధాన మంత్రి వినతి చేశారు.

ప్రాజెక్టు ల వివరాలు:

సాబర్ డెయరి లో దాదాపు గా రోజుకు 120 మిలియన్ టన్నుల (ఎమ్ టిపిడి) సామర్థ్యాన్ని కలిగి ఉండే ఒక పౌడర్ ప్లాంటు ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 300 కోట్ల రూపాయల కు పైనే ఉంటుంది. ఈ ప్లాంటు యొక్క లే అవుట్ ప్రపంచ ఆహార భద్రత ప్రమాణాల కు తుల తూగుతుంది. ఇది దాదాపు గా సున్నా స్థాయి ఉద్గారం తో కూడి ఉండి, శక్తి ని చాలావరకు ఆదా చేస్తుంది కూడాను. ఈ ప్లాంటు లో అత్యధునాతనమైనటువంటి మరియు పూర్తి గా యంత్రాల పై ఆధారపడి పని చేసేటటువంటి బల్క్ ప్యాకింగ్ లైను ను సమకూర్చడం జరిగింది

సాబర్ డెయరి లో అసెప్టిక్ మిల్క్ ప్యాకేజింగ్ ప్లాంటు ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఒక రోజు లో 3 లక్షల లీటర్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ ప్లాంటు అత్యాధునికమైనటువంటి ప్లాంటు అని చెప్పాలి. దాదాపు గా 125 కోట్ల రూపాయల మొత్తం వ్యయం తో ఈ ప్రాజెక్టు ను రూపుదిద్దడమైంది. ఈ ప్లాంటు లో శక్తి ని అధిక స్థాయి లో ఆదా చేసేటటువంటి మరియు పర్యావరణ హితకరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం జతపడ్డ అతి ఆధునికమైన ఆటోమేశన్ సిస్టమ్ ఉంది. పాల ఉత్పత్తిదారుల కు మెరుగైన ప్రతిఫలం అందేటట్లు చూడటం లో ఈ ప్రాజెక్టు సహాయకారి కానుంది.

సాబర్ జున్ను మరియు పాల విరుగుడు తేట ను ఎండబెట్టే ప్లాంటు ప్రాజెక్టు నిర్మాణాని కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కు అయ్యే వ్యయం దాదాపు గా 600 కోట్ల రూపాయలు అని అంచనా వేయడమైంది. ఈ ప్లాంటు చెడర్ చీజ్ (దీని సామర్థ్యం 20 ఎమ్ టిపిడి), మొజెరెలా చీజ్ (దీని సామర్థ్యం 10 ఎమ్ టిపిడి) లతో పాటు ప్రోసెస్ డ్ చీజ్ (దీని సామర్థ్యం 16 ఎమ్ టిపిడి) ను సైతం ఉత్పత్తి చేస్తుంది. జున్ను ను తయారు చేసే ప్రక్రియ లో వెలికి వచ్చే పాల విరుగుడు తేట ను వే డ్రయింగ్ ప్లాంటు లో ఎండబెట్టడం జరుగుతుంది; వే డ్రయింగ్ ప్లాంటు 40 ఎమ్ టిపిడి సామర్థ్యాన్ని కలిగివుంటుంది.

సాబర్ డెయరి అనేది గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేశన్ (జిసిఎమ్ఎమ్ఎఫ్) లో ఒక భాగం గా ఉంది; ఇది అమూల్ బ్రాండ్ లో భాగం గా పాల ను మరియు పూర్తి శ్రేణి పాల ఉత్పత్తుల ను తయారు చేయడమే కాక విక్రయిస్తుంది కూడా.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi