డిజిటల్ హెల్థ్ ఇకో సిస్టమ్పరిధి లో ఇంటర్ ఆపరబిలిటీ కి వీలు కల్పించే ఒక నిరంతరాయ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిశన్ అందిస్తుంది
జెఎఎమ్ త్రయాన్నిగురించి ప్రస్తావిస్తూ, అంత భారీ స్థాయిలో సంధానం అయినటువంటి మౌలిక సదుపాయాలు ప్రపంచం లో మరెక్కడా లేవన్న ప్రధాన మంత్రి
‘‘ ‘ఆహార పదార్థాల నుంచి పరిపాలన’ వరకు ప్రతి ఒక్క సేవ ను భారతదేశం లో సామాన్యుల కు వేగం గా, పారదర్శకమైన పద్ధతి లో అందిస్తున్న డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్
‘‘టెలి మెడిసిన్ కూడా ఇదివరకు ఎన్నడు ఎరుగని విధం గావిస్తరించింది’’
‘‘ఆయుష్మాన్ భారత్-పిఎమ్ జెఎవై పేదల జీవితాల లో ఒకముఖ్యమైన సమస్య ను పరిష్కరించింది. ఇంతవరకు 2 కోట్ల మంది దేశవాసులు ఈ పథకం లో భాగం గా ఉచిత చికిత్స సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు; వారిలో సగం మంది మహిళలే’’
‘‘ఆసుపత్రుల తాలూకు డిజిటల్ హెల్థ్ సొల్యూశన్స్ ను ఇక దేశ వ్యాప్తం గా పరస్పరం జోడించివేయనున్న ఆయుష్మాన్భారత్-డిజిటల్ మిశన్’’
‘‘ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆరోగ్య సంరక్షణ సంబంధి సేవలు దేశాని కి వర్తమాన కాలం తో పాటు భవిష్యత్తులో కూడా ఒక పెద్ద పెట్టుబడి గా ఉంటాయి’’
‘‘మన ఆరోగ్య సంరక్షణ సంబంధి మౌలిక సదుపాయాల ను ఒక చోటుకు చేర్చినప్పుడు, వాటిని పటిష్ట పరచినప్పుడు అవి పర్యటన రంగాన్నికూడా మెరుగుపరుస్తాయి’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిట్ మిశన్ ను ఈ రోజు న ఒక వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సదుపాయాల ను పటిష్ట పరచేందుకు గత ఏడు సంవత్సరాలు గా సాగుతున్న ఉద్యమం ఈ రోజు న ఒక కొత్త దశ లో ప్రవేశిస్తోందన్నారు. ‘‘భారతదేశం లో ఆరోగ్య సదుపాయాల లో ఒక క్రాంతికారి మార్పు ను తీసుకు వచ్చే సత్తా కలిగినటువంటి ఒక మిశన్ ను మనం ఈ రోజు న ప్రారంభించుకొంటున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

130 కోట్ల ఆధార్ సంఖ్య లు, 118 కోట్ల మంది మొబైల్ చందాదారులు, దాదాపు 80 కోట్ల మంది ఇంటర్ నెట్ వినియోగదారులు, సుమారు 43 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతా లు.. ఇంతగా సంధానం అయినటువంటి మౌలిక సదుపాయాల వ్యవస్థ ప్రపంచం లో ఎక్కడా కూడా లేదు అనేది యథార్థం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆహార పదార్థాలు మొదలుకొని పాలన యంత్రాంగం వరకు ప్రతి దాని ని భారతదేశం లోని సామాన్యుల చెంత కు వేగం గాను, పారదర్శకమైన పద్ధతి లోను చేర్చుతోంది అని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం పరిపాలన సంబంధి సంస్కరణల లో సాంకేతిక విజ్ఞానాన్ని మోహరిస్తున్న తీరు ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని విధంగా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

కరోనా సంక్రమణ విస్తరణ ను అడ్డుకోవడం లో ‘ఆరోగ్య సేతు ఏప్’ ఎంతగానో తోడ్పడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశం సుమారు 90 కోట్ల వ్యాక్సీన్ డోజుల ను ఇప్పించి, ఒక రికార్డు ను నెలకొల్పడం లో ‘కో-విన్’ (Co-WIN) పోషించిన పాత్ర ను ఆయన ప్రశంసించారు.

టెలిమెడిసిన్ సేవలు కూడా కరోనా కాలం లో అపూర్వమైన రీతి లో విస్తరించాయి. ఇంతవరకు ఇ-సంజీవని ద్వారా దాదాపు గా 125 కోట్ల రిమోట్ కన్ సల్టేశన్స్ పూర్తి అయ్యాయి అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ సదుపాయం దేశం లోని దూర, సుదూర ప్రాంతాల లో నివసిస్తున్నటువంటి వేల కొద్దీ దేశ వాసుల ను వారి ఇళ్ల లో నుంచే నగరాల లో పెద్ద పెద్ద ఆసుపత్రుల వైద్యుల తో జోడిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆయుష్మాన్ భారత్-పిఎంజెఎవై పేదల జీవితాల లో ఒక ప్రధానమైన సమస్య ను తీర్చింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఇంతవరకు 2 కోట్ల మంది కి పైగా దేశవాసులు ఈ పథకం లో భాగం గా ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని వినియోగించుకున్నారని, వారిలో సగం మంది మహిళలే అని ఆయన తెలిపారు. కుటుంబాలు పేదరికం విషవలయం లో చిక్కుకోవడానికి కీలకమైన ఒక కారణం ఏదీ అంటే, అది వ్యాధులు; కుటుంబాల లోని మహిళలు వారి ఆరోగ్య సమస్యల ను ఉపేక్షిస్తూ తీవ్ర బాధితులు గా మిగిలిపోతున్నారు అని ఆయన అన్నారు. ఆయుష్మాన్ తాలూకు లబ్ధిదారుల లో కొంత మంది తో స్వయం గా భేటీ అయ్యేందుకు తాను చొరవ తీసుకొన్నట్లు, ఆ భేటీ లలో ఈ పథకం తాలూకు ప్రయోజనాల ను గురించి తాను గ్రహించగలిగినట్లు ఆయన చెప్పారు. ‘‘ఈ ఆరోగ్య సంరక్షణ సంబంధి పరిష్కారాలు దేశాని కి వర్తమానం లోను, భవిష్యత్తు లోను ఒక పెద్ద పెట్టుబడి గా నిలుస్తాయి’’ అని ఆయన అన్నారు.

ఆయుష్మాన్ భారత్-డిజిటల్ మిశన్ ఇక మీదట దేశవ్యాప్తం గా ఆసుపత్రుల లోని డిజిటల్ హెల్థ్ సల్యూశన్స్ ను ఒకదానితో మరొకదానిని జోడిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ మిశన్ ఆసుపత్రుల లో ప్రక్రియల ను సులభతరం గా మార్చివేయడం ఒక్కటే కాకుండా జీవించడం లో సౌలభ్యాన్ని కూడా పెంచుతుంది అని ఆయన తెలిపారు. దీని లో భాగం గా, దేశం లోని ప్రతి ఒక్కరు ఇకపై ఒక డిజిటల్ హెల్థ్ ఐడి ని అందుకొంటారని, మరి వారి హెల్థ్ రికార్డు ను డిజిటల్ మాధ్యమం లో భద్రపరచడం జరుగుతుందని ప్రధాన మంత్రి వివరించారు.

భారతదేశం సమగ్రమైన, అందరి ని కలుపుకొని పోయేటటువంటి ఒక హెల్థ్ మాడల్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ మాడల్ నివారణ ప్రధానమైనటువంటి ఆరోగ్య సంరక్షణ కు పెద్ద పీట వేస్తుంది. అదే కాలం లో వ్యాధి బారిన పడిన పక్షం లో, సులభమైనటువంటి తక్కువ ఖర్చు తో కూడినటువంటి ఇట్టే అందుబాటు లో ఉండేటటువంటి వైద్య చికిత్స కు కూడా దీనిలో ప్రాధాన్యం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సంబంధి విద్య లో ఇదివరకు ఎరుగనటువంటి సంస్కరణల ను గురించి కూడా ఆయన చర్చించారు. గడచిన 7-8 సంవత్సరాల తో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం లో మరింత ఎక్కువ సంఖ్య లో డాక్టర్ లను, పారా మెడికల్ మేన్ పవర్ ను తీర్చిదిద్దడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ఒక సమగ్రమైనటువంటి ఎఐఐఎమ్ఎస్ తో పాటు, ఇతర ఆధునిక ఆరోగ్య సంస్థల నెట్ వర్క్ ను దేశం లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతి మూడు లోక్ సభ నియోజక వర్గాల పరిధి లో ఒక వైద్య కళాశాల చొప్పున స్థాపించేందుకు కృషి జరుగుతోంది అని ఆయన చెప్పారు. గ్రామాల లో ఆరోగ్య సదుపాయాల ను పటిష్ట పరచడం గురించి కూడా ఆయన వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నెట్ వర్క్ లను, వెల్ నెస్ సెంటర్ లను బలోపేతం చేయడం జరుగుతోందన్నారు. ఆ తరహా కేంద్రాల ను 80,000 కు పైగా ఇప్పటికే పని చేయించడం ప్రారంభించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ నాటి కార్యక్రమాన్ని ప్రపంచ పర్యటన దినం నాడు నిర్వహించుకోవడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి ప్రస్తావించి, పర్యటన కు ఆరోగ్యం తో చాలా బలమైన సంబంధం ఉంది అన్నారు. ఇలా ఎందుకంటే, ఎప్పుడైతే మన ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను ఏకీకరించడం, బలపరచడం జరుగుతుందో అప్పుడు అది పర్యటన రంగాని కి కూడా మెరుగులు దిద్దుతుంది అని ఆయన చెప్పారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage