జార్ఖండ్ రాష్ట్రంలోని ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోగల గుమ్లా సమితిలో మహిళా వికాస్ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశానికి 15,000 మంది మహిళలు హాజరు కావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు ఖుంటి లోక్‌సభ స్థానం పరిధిలోగల పాల్‌కోట్ (గుమ్లా) సమితిలో నిర్వహించిన మహిళా వికాస్ మండల్ వార్షిక సర్వసభ్య సమావేశంలో 15,000 మంది మహిళలు పాల్గొన్నారంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ-
ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఇదెంతో అభినందించదగిన ప్రయత్నం. మహిళల భాగస్వామ్యం పెరగడం వారి సాధికారతకు, అభివృద్ధికి ఒక సంకేతం” అని పేర్కొన్నారు.
बहुत प्रशंसनीय प्रयास। महिलाओं की बढ़ती भागीदारी उनके सशक्तिकरण और विकास का द्योतक है। https://t.co/BuBC5PLMO2
— Narendra Modi (@narendramodi) February 26, 2023