ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో నీటి సంరక్షణ, భూగర్భ జలమట్టాలను పెంపొందించడం కోసం ప్రజల భాగస్వామ్యం ద్వారా చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ ఉదాత్తమైన పనిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ శ్రీ మోదీ అభినందించారు.
నియోజకవర్గంలో అంతరించిపోతున్న నదుల పునరుజ్జీవనం, వివిధ అమృత్ సరోవర్ల నిర్మాణం గురించి ఝాన్సీ పార్లమెంటు సభ్యులు "ఎక్స్" సామాజిక మాధ్యమం ద్వారా చేసిన సందేశానికి ప్రధానమంత్రి "ఎక్స్" సామాజిక మాధ్యమం ద్వారా ప్రతిస్పందిస్తూ;
“ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో నీటి సంరక్షణ, భూగర్భజలాల స్థాయిని పెంచడం కోసం చేపట్టిన ప్రజా భాగస్వామ్య ప్రయత్నాల ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి, దేశం మొత్తానికి ఇది ఒక ఉదాహరణ. ఈ ఉదాత్తమైన పనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు! ” అని పేర్కొన్నారు.
उत्तर प्रदेश के झांसी में जल संरक्षण और भूजल स्तर को बढ़ाने के लिए जनभागीदारी से हो रहे इन प्रयासों के परिणाम बेहद उत्साहवर्धक होने के साथ ही देशभर के लिए एक मिसाल हैं। इस नेक कार्य से जुड़े हर किसी को मेरी बहुत-बहुत बधाई! https://t.co/sJobCxLMda
— Narendra Modi (@narendramodi) September 5, 2023