కేన్సర్ ను నయం చేసేందుకు సంబంధించిన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసం జరుగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.
శ్రమ మరియు ఉపాధి ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ‘X’ లో ఒక పోస్టు ను పెడుతూ, అందులో ఇఎస్ఐ కార్పొరేశన్ యొక్క 191 వ సమావేశం జరిగిన సందర్భం లో భారతదేశం అంతటా విస్తరించి ఉన్న 30 ఇఎస్ఐసి ఆసుపత్రుల లో కీమో థెరపి సేవల ను ప్రారంభించడమైంది అని తెలియ జేశారు.
దీనికి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘కేన్సర్ ను నయం చేయడం కోసం ఉద్దేశించినటువంటి మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచడం కోసం చేపట్టినటువంటి అభినందనీయమైన ప్రయాస. దీనితో దేశవ్యాప్తం గా అనేక మంది ప్రజల కు మేలు కలుగుతుంది.’’ అని పేర్కొన్నారు.
Commendable effort to strengthen the infrastructure to cure cancer. It will benefit several people across the nation. https://t.co/De7cthea9J
— Narendra Modi (@narendramodi) September 1, 2023