జమ్ముకశ్మీర్ పరిధిలో చీనాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైలు వంతెన కమాను నిర్మాణాన్ని పూర్తి చేయడంపై భారత రైల్వేశాఖను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశ ప్రజల సామర్థ్యం, ఆత్మవిశ్వాసాలు కొన్ని సజీవ ఉదాహరణలను ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయని శ్రీ మోదీ అందులో పేర్కొన్నారు. ఆధునిక ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం దినదిన ప్రవర్ధమానం కావడాన్ని ఈ నిర్మాణం ఘనంగా చాటుతున్నదని వివరించారు. అంతేకాకుండా ‘‘సంకల్పంతో లక్ష్యసిద్ధి’’ నియమం స్ఫూర్తితో మారుతున్న పని సంస్కృతికీ ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు.
देश के जन-जन का सामर्थ्य और विश्वास आज दुनिया के सामने एक मिसाल पेश कर रहा है। यह निर्माण कार्य न केवल अत्याधुनिक इंजीनियरिंग और टेक्नोलॉजी के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित करता है, बल्कि संकल्प से सिद्धि की देश की बदली हुई कार्य संस्कृति का भी उदाहरण है। https://t.co/Hup2RByHYM
— Narendra Modi (@narendramodi) April 5, 2021