సీఆర్పీఎఫ్ సిబ్బంది తోటల పెంపకం కార్యక్రమం చేపట్టడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. విశ్వనాథ క్షేత్రం, జ్ఞానవాపి భద్రత కోసం నియమితులైన సీఆర్పీఎఫ్ బృందం 75,000 మొక్కలు నాటడం యావద్దేశానికీ స్ఫూర్తినిస్తుంద ప్రధాని పేర్కొన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రదర్శించిన చొరవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది. భద్రతకు కాపలాదారుగానే కాకుండా పర్యావరణ పరిరక్షణ దిశగానూ వారి కృషి యావద్దేశానికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది... @crpfindia” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
सीआरपीएफ जवानों की यह पहल हर किसी को प्रेरित करने वाली है। सुरक्षा प्रहरी के रूप में पर्यावरण संरक्षण का उनका यह प्रयास देशभर के लिए एक मिसाल है। @crpfindia https://t.co/TcQYOigoO2
— Narendra Modi (@narendramodi) October 29, 2022