జమ్ముకశ్మీర్‌లో వైద్య విద్య నవ శకారంభంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా ఇక్కడి 20 జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రులలో 265 ‘డిఎన్‌బి’ పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్య సీట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని కూడా ఆయన అభినందించారు. యువతకు సాధికారత కల్పన, జమ్ముకశ్మీర్‌లో వైద్య మౌలిక సదుపాయాల పెంపు లక్ష్యంగా చేపట్టిన కృషిలో ఇదొక కీలక ప్రయత్నమని ప్రధాని పేర్కొన్నారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి శ్రీ మన్‌సుఖ్ మాండవ్య ట్వీట్‌పై స్పందిస్తూ ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇది జమ్ముకశ్మీర్‌లో యువతకు సాధికారత కల్పించడంతోపాటు వైద్య మౌలిక సదుపాయాల పెంపునకు ఉద్దేశించిన కీలక ప్రయత్నం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
This is an important effort aimed at empowering the youth and furthering medical infrastructure in Jammu and Kashmir! https://t.co/kPJY1PgAh4
— Narendra Modi (@narendramodi) November 8, 2022