భారతదేశంలోని కోళికోడ్, గ్వాలియర్ సాహిత్య/సంగీత నగరాలుగా యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో స్థానం సంపాదించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అద్భుత ప్రతిష్ట పొందిన కోళికోడ్, గ్వాలియర్ నగరాల ప్రజలకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.
కోళికోడ్ నగరానికిగల గొప్ప సాహిత్య వారసత్వం ద్వారా భారత సాంస్కృతిక చైతన్యం ప్రపంచ వేదికపై వెలుగుజిలుగులు విరజిమ్ముతున్నదని ఆయన కొనియాడారు. అదేవిధంగా తన సంగీత వారసత్వ పరిరక్షణతోపాటు దాన్ని మరింత సుసంపన్నం చేయడంలో గ్వాలియర్ నిబద్ధత ప్రశంసనీయమని, అది ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ అంశంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశాన్ని ఉటంకిస్తూ పంపిన తన సందేశంలో:
“ఘనమైన కోళికోడ్ సాహితీ వారసత్వం, గ్వాలియర్ మధుర సంగీత వారసత్వం నేడు గౌరవనీయ యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో భాగమైంది. తద్వారా భారత సాంస్కృతిక వైభవం జగజ్జేగీయమానం కాగలదు. ఈ అద్భుత ప్రతిష్టను సొంతం చేసుకున్న కోళికోడ్, గ్వాలియర్ నగరాల ప్రజలకు నా అభినందనలు! ఈ అంతర్జాతీయ గుర్తింపుతో మనం హర్షిస్తున్న నేపథ్యంలో మన విభిన్న సంస్కృతీసంప్రదాయాల పరిరక్షణ, ప్రోత్సాహం దిశగా దేశం తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. ఈ ప్రశంసలు మన ప్రత్యేక సాంస్కృతిక గాథలను మరింతగా పంచుకోవడానికి అంకితమైన ప్రతి వ్యక్తి చేసే కృషినీ ప్రతిబింబిస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే ‘‘సాహిత్యంపై కోళికోడ్ అభిరుచి యునెస్కో 'సిటీ ఆఫ్ లిటరేచర్' పురస్కారంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. శక్తిమంతమైన సాహితీ సంప్రదాయంతో ఈ నగరం కథా సంవిధానంలో తన ప్రత్యేకతను చాటుకుంది. కోళికోడ్‌కు సాహిత్యంపైగల ప్రగాఢ ప్రేమానురాగాలు విశ్వవ్యాప్త రచయితలు, పాఠకులకు స్ఫూర్తినిస్తాయి’’ అని కోళికోడ్ నగరాన్ని, అక్కడి ప్రజలను, రచయితలను ప్రధాని ప్రశంసించారు.
అదేవిధంగా- ‘‘గ్వాలియర్ నగరానికి, సంగీతంతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో యునెస్కో నుంచి అత్యున్నత గౌరవం లభించడం గర్వించదగిన ఘనత. గ్వాలియర్ తన సంగీత వారసత్వాన్ని సంరక్షించుకుంటూ, సుసంపన్నం చేయడంలో చూపిన నిబద్ధత నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ఈ నగర సంగీత సంప్రదాయం, దానిపై ప్రజలకుగల అనురక్తి, ఉత్సాహం మరింత పెరిగి, భవిష్యత్తరాలు దీన్నుంచి స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
India's cultural vibrancy shines brighter on the global stage with Kozhikode's rich literary legacy and Gwalior's melodious heritage now joining the esteemed UNESCO Creative Cities Network.
— Narendra Modi (@narendramodi) November 1, 2023
Congratulations to the people of Kozhikode and Gwalior on this remarkable achievement!… https://t.co/JgxRIDp20w
“യുനെസ്കോയുടെ 'സാഹിത്യ നഗരം' ബഹുമതി ലഭിച്ചതോടെ സാഹിത്യ കലയോടുള്ള കോഴിക്കോടിന്റെ അഭിനിവേശം ആഗോളതലത്തിൽ ഇടം നേടിയിരിക്കുന്നു. ഊർജ്ജസ്വലമായ സാഹിത്യ പാരമ്പര്യമുള്ള ഈ നഗരം പഠനത്തെയും കഥാകഥനത്തെയും പ്രതിനിധാനം ചെയ്യുന്നു. സാഹിത്യത്തോടുള്ള കോഴിക്കോടിന്റെ അഗാധമായ സ്നേഹം ലോകമെമ്പാടുമുള്ള എഴുത്തുകാരെയും വായനക്കാരെയും പ്രചോദിപ്പിക്കുന്നത് തുടരട്ടെ.”
യുനെസ്കോയുടെ 'സാഹിത്യ നഗരം' ബഹുമതി ലഭിച്ചതോടെ സാഹിത്യ കലയോടുള്ള കോഴിക്കോടിന്റെ അഭിനിവേശം ആഗോളതലത്തിൽ ഇടം നേടിയിരിക്കുന്നു. ഊർജ്ജസ്വലമായ സാഹിത്യ പാരമ്പര്യമുള്ള ഈ നഗരം പഠനത്തെയും കഥാകഥനത്തെയും പ്രതിനിധാനം ചെയ്യുന്നു. സാഹിത്യത്തോടുള്ള കോഴിക്കോടിന്റെ അഗാധമായ സ്നേഹം… https://t.co/JgxRIDouaY
— Narendra Modi (@narendramodi) November 1, 2023
“ग्वालियर और संगीत का बहुत खास रिश्ता है। UNESCO से इसे सबसे बड़ा सम्मान मिलना बहुत गर्व की बात है। ग्वालियर ने जिस प्रतिबद्धता के साथ संगीत की विरासत को संजोया और समृद्ध किया है, उसकी गूंज दुनियाभर में सुनाई दे रही है। मेरी कामना है कि इस शहर की संगीत परंपरा और उसे लेकर लोगों का उत्साह और बढ़े, ताकि आने वाली पीढ़ियों को इससे प्रेरणा मिलती रहे।”
ग्वालियर और संगीत का बहुत खास रिश्ता है। UNESCO से इसे सबसे बड़ा सम्मान मिलना बहुत गर्व की बात है। ग्वालियर ने जिस प्रतिबद्धता के साथ संगीत की विरासत को संजोया और समृद्ध किया है, उसकी गूंज दुनियाभर में सुनाई दे रही है। मेरी कामना है कि इस शहर की संगीत परंपरा और उसे लेकर लोगों का… https://t.co/JgxRIDouaY
— Narendra Modi (@narendramodi) November 1, 2023